Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మాస్టర్ పీస్
నవ్వుతున్న వాసు పక్కన కూర్చుని తను కూడా నవ్వడం మొదలు పెట్టాడు అనంత్ "అసలు నీకు హాట్స్ ఆఫ్ బాస్ ఇంతకువరకు మూడు జిల్లాల్లో ఇలాగే చాలా మంది నీ చంపాను కానీ ఎవరూ నా తీగ కూడా పట్టుకోలేక పోయారు కానీ నువ్వు ఎవడివి రా నా వరకు కాకుండా నా గేమ్ సైట్ వరకు వచ్చావు నేను ఇన్ని రోజులు నను నేను మాస్టర్ మైండ్ అనుకుంటు బ్రతికా కానీ నువ్వు మాస్టర్ పీస్ " అని అంటూ గన్ లోడ్ చేశాడు అనంత్, " తప్పు చేసి క్లూ నీ నాశనం చేయకుండా వెళ్లే నీ అలవాటే నిన్ను నా దగ్గరికి లాకు వచ్చింది దానికి తోడు నువ్వు ఈ సారి టచ్ చేసింది వాసు గాడి property నా ప్లేట్ లో ఉన్న ఆమ్లెట్ నీ తీసుకుంది అనే నా చెల్లి  నీ కొట్టాను అలాంటిది నా పిల్ల జోలికి వస్తే వదులుతాన అనంత్ కుమార్ ఈ అనంతం నీకు సొంతం కావచ్చు కానీ నేను వసంతకుమార్ కాలానికి కింగ్ నీ నీది ఏమైన కావచ్చు కానీ టైమ్ ఎప్పుడు నాది " అన్నాడు.


దాంతో అనంత్ నవ్వుతూ " నీకు నాకూ పెద్ద తేడా లేదు బాస్ చిన్నప్పటి నుంచి మా నాన్న కలెక్టర్ ఎప్పుడు ఇంట్లో ఉండడు అమ్మ చిన్నప్పుడే చనిపోయింది ఎప్పుడు నా కోసం టైమ్ ఉండదు నా బాబు కీ కాలేజ్ ఇళ్లు, మళ్లీ ఇంటికి రాగానే ట్యూషన్ నేను ఆయన లాగే సివిల్స్ చేయాలి ఐఏఎస్, ఐపిఎస్ అవ్వాలి అని ఎప్పుడూ నన్ను ఫోర్స్ చేశాడు ఒంటరితనం, కోపం, అసహనం, చిరాకు ఇన్ని ఉన్న పైకి నవ్వుతూ బ్రతికుతున్న నను నా బలహీనత నీ సాకు గా తీసుకొని ప్రతి ఒక్కరూ నను హేళన చేసే వాళ్లు ఫ్రెండ్స్ లేరు బాధ పంచుకోవడానికి ఎవ్వరూ లేరు అందుకే క్లాస్ లో నను ఎవరూ అయితే ఇబ్బంది పెట్టాడో అందరికీ అమ్మాయి రాస్తున్నటు నేను లవ్ లెటర్ రాసి వాళ్లలో వాళ్లే కొట్టుకున్నేలా చేసి ప్రతి ఒక్కడిని తెలివి తో చంపి నా కోపం తీర్చుకున్నా ఆ తర్వాత నా జీవితంలో నా సంధ్య వచ్చింది దానికి నేను అంటే ఇష్టం కానీ నాకూ తన మీద ప్రేమ చూపించడం తెలియలేదు ఒక రోజు ఒక డ్రగ్స్ కేసులో ఒక అమ్మాయి నీ అరెస్ట్ చేసే టైమ్ లో చనిపోయింది ఆ తర్వాత ఇంటికి వెళ్లితే సంధ్య తో తెలియకుండా చాలా సరదాగా గా మాట్లాడుతూన్న అప్పుడు అర్థం అయ్యింది నా ప్రేమ నాకూ కావాలి అంటే ఇంకో అమ్మాయి చావాలి అందుకే forensic లో ఉండే నా ఫ్రెండ్ తో కలిసి ఒక గేమ్ తయారు చేసి అందులో డిప్రెషన్ లో ఉన్న అమ్మాయిలను వెతికి వాళ్ళని వాళ్లే సుసైడ్ చేసుకున్నేలా torture పెట్టి చంపా దాంతో నాకూ అమ్మాయి తో మాట్లాడే భయం పొయ్యి నా సంధ్య తో సంతోషంగా గడిపా నా జోలికి వస్తే ఎవ్వడిని వదిలి పెట్టలేదు నా బాబు తో సహా (ఒక రోజు మార్క్స్ తక్కువ వచ్చాయి అని కాలేజ్ లో అందరి ముందు కొట్టాడు దాంతో కోపం వచ్చి వాళ్ల నాన్న asthma స్ప్రే దాచి ఊపిరి ఆడకుండా చంపేసాడు) కానీ నువ్వు నాకూ నచ్చావు "అని నవ్వుతూ గన్ తో తనను తానే కాల్చుకొని చనిపోయాడు.

ఆ తరువాత వాసు తన బటన్ కెమెరా తీసి అక్కడికి వచ్చిన సెక్యూరిటీ అధికారి లకు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతు "నిన్ను చంపాలి అని కోపం తో వచ్చా నీది నాది ఒక్కటే కథ నేస్తం కాకపోతే నాకూ ఉన్న ధైర్యం నీకు లేదు అది ఒక్కటే తేడా నీ భయం తో నువ్వు లోపలే రగిలిపోతు ఒక మారణకాండ రచించావు కనీసం నువ్వు ప్రేమించిన అమ్మాయి తో నీ బాధ పంచుకున్న నువ్వు సంతోషంగ ఉండే వాడివి చావు ముందు అయిన మనస్పూర్తి గా నవ్వుకొన్ని చనిపోయావు బ్రతికి ఉంటే నాకూ ఒక మంచి స్నేహితుడు దొరికే వాడు కానీ నీ బాధ పంచుకున్నావు "The person whom you share pain with is a reflection of who you are" అని Shakespeare ఎప్పుడో చెప్పాడు దాని అర్థం ఈ రోజు నాకూ అర్థం అయ్యింది "అని తనలో తాను అనంత్ నీ స్నేహితున్ని గా అంగీకరించి వెళ్లిపోయాడు వాసు.

The End 
[+] 5 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: మాస్టర్ పీస్ - by lovenature - 05-04-2020, 09:56 AM
RE: మాస్టర్ పీస్ - by Uday - 06-04-2020, 04:53 PM
RE: మాస్టర్ పీస్ - by lovenature - 07-04-2020, 11:17 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 17-04-2020, 10:58 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 20-04-2020, 11:13 AM
RE: మాస్టర్ పీస్ - by lovenature - 23-04-2020, 09:57 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 23-04-2020, 11:44 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 24-04-2020, 02:56 PM
RE: మాస్టర్ పీస్ - by Vickyking02 - 26-04-2020, 09:08 AM



Users browsing this thread: 11 Guest(s)