Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మాస్టర్ పీస్
తన ఫోన్ కీ "NERVOUS" గేమ్ నుంచి మెసేజ్ రావడం తో షాక్ అయిన అనంత్ మొదటి టాస్క్ ఏంటి అంటే తన స్టేషన్ కీ వచ్చిన ఒక పార్శిల్ తీసుకొని దాని లో ఉన్న రైన్ కోట్ వేసుకొని రోడ్డు మీదకు రావాలి అని టాస్క్ వచ్చింది ఏంటి చేసేది అని ఫోన్ పక్కన పడేశాడు అప్పుడు తన ముందు ఉన్న కానిస్టేబుల్ ఫోన్ కీ ఒక వీడియో వచ్చింది అది చూసి వెంటనే అనంత్ కీ చూపించాడు అందులో అనంత్ తను లంచం తీసుకున్న వీడియో ఉంది అది చూసి ఇన్ని రోజులు తను సంపాదించిన పేరు మొత్తం బురదలో పోసిన పన్నీరు అవుతుంది అని భయపడిన అనంత్ వెంటనే స్టేషన్ కీ వెళ్లమని చెప్పాడు.


(వాసు ఫ్లాట్ లో)

అనంత్ వెళ్లిపోగానే విద్య బయటికి వచ్చింది అప్పుడు వాసు విద్య తో తన చెల్లి దివ్య కళ్లు తెరిచింది అని చెప్పాడు దాంతో విద్య ఏడుస్తూ వెంటనే కింద ఫ్లోర్ లో ఉన్న ప్రియాంక ఫ్లాట్ లోకి వెళ్లింది ఆ తరువాత ప్రియాంక బెడ్ రూమ్ లో దాచి ఉంచిన తన కవల చెల్లి నీ చూసి సంతోషం తో వెళ్లి కౌగిలించుకుంది ఆనందం తో తన కళ్ల అంబటి సంతోషం తో నీరు కారింది అప్పుడే వచ్చిన వాసు విద్య నీ చూసి నవ్వుతూ తన తల పై నీమురుతు ఓదారుస్తు ఉన్నాడు దాంతో ప్రియాంక వచ్చి విద్య "తనకి ఇప్పుడు రెస్ట్ కావాలి నువ్వు ఇక్కడే ఉంటే emotional అవ్వుతావు నాతోరా" అనీ కిచెన్ లోకి తీసుకొని వెళ్లి ఇద్దరు కాఫీ చేస్తున్నారు అప్పుడు ప్రియాంక విద్య తో "వాసు నీ మొదటి సారి ఎప్పుడు చూశావు" అని అడిగింది 

"ఆ రోజు నేను ఇంటర్వ్యూ కోసం అని కాలేజీ కీ వచ్చి హడావిడి గా ప్రిన్సిపల్ రూమ్ వైపు వెళ్లుతున్న అప్పుడే వాసు స్టైల్ గా ఒక merunred జాకెట్ వేసుకొని చేతిలో బైక్ కీ తిప్పుతూ ఆ కీ ఒకడికి విసిరితే ఇంకొకడు వచ్చి వాసు జాకెట్ తీసి షర్ట్ వేసి దాని స్టైల్ గా మడత పెట్టి టక్ చేసి బుక్ తిప్పుతూ క్లాస్ లోకి వెళ్లుతు నను ఒక చూపు చూశాడు ఆ చూపు గుండెల్లో దిగింది ఆ తర్వాత మరుసటి రోజు నేను లైబ్రరీ లో బుక్స్ సర్దుతు ఉంటే కాలు జారి కింద పడుతుంటే పట్టుకున్నాడు అప్పుడు తన మొదటి టచ్ పైగా తన కళ్లలో కళ్లు పెట్టి చూస్తే నను నేను మై మరిచి పోయా అలా రోజు తనతో పాటు నా పరిచయం కాస్తా ప్రేమగ మారింది తనకి చెప్పాను తనకు ఈ ప్రేమ పెళ్లి మీద నమకం లేదు అని చెప్పాడు దాంతో మెల్లగ స్నేహం అయిన మిగిలింది అని అతనితో ఉన్నా ఒక రోజు కాలేజీ లో ఫంక్షన్ కీ చీర కట్టుకుని వచ్చాను ఆ రోజు నను చూసి పడిపోయాడు ఆ తర్వాత తను తన ప్రేమ గురించి చెప్పాడు, తరువాత నీ గురించి చెప్పాడు అలా ఆ రోజు రాత్రి తనతో సరదాగా గడపాలి అని అనుకున్న అప్పుడే ఊరి నుంచి వచ్చిన నా చెల్లి సరదాగా వాసు నీ ఆట పట్టిదాం అని ఇద్దరం ఒక్కటే చీర కట్టుకుని తన కోసం చూస్తూంటే కరెంట్ పోయింది అని నేను క్యాండిల్ కోసం లోపలికి వెళ్లా అప్పుడు కాలింగ్ బెల్ సౌండ్ విని వెళ్లి డోర్ తీసింది దివ్య వాడు నను చంపడానికి వచ్చి దాని పొడిచి " వెళ్లాడు అని ఏడుస్తు ఉంటే ప్రియాంక కౌగిలించుకున్ని ఓదార్చింది.

(సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో)

అనంత్ తనకు వచ్చిన పార్శిల్ తీసుకొని అది వేసుకొని రోడ్డు మీదకు వెళ్లి నిలబడాడు అప్పుడు సడన్ గా వర్షం పడింది దాంతో ఆ రైన్ కోట్ కీ ఉన్న కలర్ పోయి అది అనంత్ నీ అందరి ముందు నగ్నంగా నిలబెట్టింది అప్పుడు అందరూ ఆ ఫోటో లు తీసి viral చేశారు దాంతో అనంత్ ఇంటికి వెళ్లుతుంటే దారిలో వాసు పేరు రాసి ఉంది సుసైడ్ చేసుకున్న అమ్మాయి ఎవరో అబ్బాయి తో బైక్ మీద వెళుతు కనిపించింది దాంతో అనంత్ ఇంటికి వెళ్లి తన పర్సనల్ రూమ్ లోకి వెళ్లాడు తన కంప్యూటర్ లో తీసి చూస్తే "your game site has been hacked" అని వచ్చింది ఎవరూ hack చేసి ఉంటారు అని రివర్స్ hack చేస్తే అది ఎక్కెడెక్కడో చూపిస్తూ వచ్చింది ఆ లింక్ లకి చిన్న బాక్స్ icon వచ్చింది అవి అని కలిపి చూస్తే అందులో వాసు ఫోటో వచ్చింది అది చూసి షాక్ అయ్యాడు అనంత్, ఇన్నాళ్లు తను ఎంతో కష్టపడి తయారు చేసుకున్న చీకటి సామ్రాజ్యం నీ వాసు ఎలా కనిపెట్టాడో అనంత్ కీ అర్థం కాలేదు.

(ఆ NERVOUS గేమ్ తయారు చేసింది అనంతే) 
[+] 4 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: మాస్టర్ పీస్ - by lovenature - 05-04-2020, 09:56 AM
RE: మాస్టర్ పీస్ - by Uday - 06-04-2020, 04:53 PM
RE: మాస్టర్ పీస్ - by lovenature - 07-04-2020, 11:17 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 17-04-2020, 10:58 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 20-04-2020, 11:13 AM
RE: మాస్టర్ పీస్ - by Vickyking02 - 23-04-2020, 09:15 AM
RE: మాస్టర్ పీస్ - by lovenature - 23-04-2020, 09:57 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 23-04-2020, 11:44 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 24-04-2020, 02:56 PM



Users browsing this thread: 1 Guest(s)