Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మొత్తం వందల ఎకరాలు కానీ వేలం మాత్రం లక్షా ఒక్కరూపాయి , లక్షా రెండు రూపాయలు ..........ఇలా తమాషా చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు . 

ఒక్కసారిగా కోపం సర్రున నెత్తికి ప్రాకింది . చూద్దాము ఎంతవరకూ వెళుతుందోనని రెండు లక్షలా ఒక రూపాయి అని పడ్డాను . 

ఎవడ్రా వాడు ఒకేసారి లక్ష పాడింది అని వెనక్కు తిరిగి చూసి రేయ్ ఎవడ్రా నువ్వు పాడటానికి అని నామీదకు వచ్చాడు . 

నేను లేచి కొట్టేలోపు కృష్ణగాడు చెవి నుండి రక్తం కారేలా ఒక్క దెబ్బ బలంగా వేయడంతో అంతే కిందపడినవాడి నుండి ఉలుకూ లేదు పలుకూ లేదు . 

అధిచూసి మరొక ఇద్దరు రావడంతో లేచి ఇద్దరమూ ఒక్కొక్క దెబ్బ అంతే ......... వాళ్ళ పరిస్థితి కూడా అంతే ,

పెద్దయ్య పెదాలపై చిరునవ్వు , పూజారి గారు అయితే ఏకంగా చప్పట్లు , విజిల్ వేశారు . 

పూజారి గారు మీలో ఈ యాంగిల్ కూడా ఉందా ఎంజాయ్ అని ఉత్సాహపరిచాము .

 ఈసారి ఏకంగా నలుగురు వస్తుంటే , రేయ్ మీలా ..............

రేయ్ మామా please రా , నీకెందుకు శ్రమ తమరు మా ఊరంతటికీ బుజ్జిదేవుడు హాయిగా అలకూర్చోండి మేంఉన్నాము కదా అని నవ్వి , రేయ్ మీలా మేము మామూలు ఫుడ్ తిన్నవాళ్ళం కాదు , తొమ్మిదేళ్లు జైల్ ఫుడ్ తిన్నవాళ్ళము . ఊరందరూ ఎంత బాధపడుతున్నారో తెలిసే ఇక్కడ కాలిపోయి ఉన్నాము . ఎవడు అడుగువేస్తాడో వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే అని చూపించడంతో , తమ్ముడూ అంటూ లేచివచ్చి కండలను వొత్తి దైర్యంగా వెనుక నిలబడ్డారు . 



ఆఫీసర్స్ వేలం మొదలెడతారా .......... మీకు కూడా ఏమైనా కోటింగ్ కావాలా అని కృష్ణగాడు చెప్పాడు . 

ఏంటి ఈ దౌర్జన్యం అని మొబైల్ తీసి ఎవరికో కాల్ చేశారు . చుట్టూ కొలతలు తీసుకుంటున్న వాళ్ళు , అప్పటివరకూ ఎక్కడో కారులో రెస్ట్ తీసుకుంటున్న MP వచ్చాడు . 

ఎవడ్రా ......... నువ్వు మధ్యలో వచ్చి extraa లు చూస్తున్నావు అని కృష్ణగాడిని అడిగాడు . 

మహేష్ పేరు గుర్తుందా అని ప్రక్కకు తప్పుకున్నాడు . 

ఆ పిల్లలా మీరు 14 సంవత్సరాలు కదా అప్పుడే ఎలా వచ్చారు .

నీ దౌర్జన్యాన్ని ఆపడానికి ఆ అమ్మవారు సరైన సమయానికి మమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చారు .

మీరన్నది నలుగురు మావాళ్లను చూసావా ఎంతమందిమి ఉన్నామో ,

అన్నయ్య గట్టిగా నవ్వి , ఏయ్ మాజీ MP ............ తొమ్మిదేళ్ల కింద నా తమ్ముళ్ల కోసం వచ్చిన ఒకటి , రెండు ఊళ్ల జనాలను చూసికూడా ఇలా మాట్లాడుతున్నావా ..........., 

ఒకే ఒక్క కాల్ చేశానంటే మీ ఒక్క పార్ట్ కూడా ఈ పొలాల నుండి బయటకు వెల్లదు . చెయ్యమంటారా ............అని మొబైల్ తియ్యగానే , 

వాడి వొళ్ళంతా చెమటలు పట్టేసాయి . 

అన్నయ్యా .......... నువ్వు సూపర్ అంటూ కృష్ణగాడు కౌగిలించుకున్నాడు . 



చూడు మాజీ MP వేలం నిర్వహిస్తావా ......... మాకు ok ఏ గొడవలూ లేకుండా మేము పాల్గొంటాము . లేదు మాకు గొడవలు కావాలంటే చెప్పి క్షణాల్లో ఊరి జనాన్ని పిలిచేస్తాను నువ్వో మేమో బస్తీమే సవాలు అని కృష్ణగాడు ఉత్సాహంతో తొడలు కొట్టాడు . 

భయపడిపోయి వేలం మొదలెట్టండి అని అధికారులకు సైగ చేసాడు . 

సర్ ............

రేయ్ ఊరి జనంతో ఒక్కరూపాయి లేదు , వీళ్ళిద్దరూ ఇప్పుడే జైల్ నుండి వచ్చారు . 10 లక్షలు దాటిందంటే వాళ్లే భయపడి వెళ్ళిపోతారు అని ప్రక్కవాడికి చెప్పడంతో , సూపర్ సర్ మీరు అని సంతోషంతో yes అవును వేల మొదలెట్టండి అనిచెప్పారు . 



సరే సర్ అని మహేష్ గారి పాట 2 లక్షలా ఒక్క రూపాయి ........

10 లక్షలు ఒక్క రూపాయి అని ఒకేసారి పెంచేశాడు MP ............

నేను పాడబోతుంటే , కృష్ణగాడు బుంగమూతిపెట్టుకోవడం చూసి లవ్ యు లవ్ యు రా ............అని బుగ్గపై ముద్దుపెట్టి సరే నువ్వే పాడు అనిచెప్పాను .

లవ్ యు రా మామా ........... నువ్వు జస్ట్ వేళ్ళతో చూపించు అంతే అని ఉత్సాహంతో నా వేళ్ళ వైపే చూస్తుంటే , 

నవ్వుకుని ఒక వేలిని చూపించాను . 

లక్షా .......కాదా , వేలా....... కాదా , వందలా ......కాదా , ok ok ఒక్క రూపాయి .......

కృష్ణ : 10 లక్షలా ఒక్క రూపాయి .

ఎంపీ : 20 లక్షలు ..........

కృష్ణ : ఒకే వేలిని చూసి 20 లక్షలా ఒక్క రూపాయి అని ఉత్సాహంతో చెప్పాడు .

ఎంపీ : 30 లక్షలు .........

కృష్ణ : ఒకే వేలేగా చూడాల్సిన పనిలేదు , 30 లక్షలా ఒక్క రూపాయి .

ఎంపీ: 40 లక్షలు ........

కృష్ణ : 40 లక్షలా ఒక్కరూపాయి ..........

బాబు మహేష్ అంత డబ్బు , అవును మహేష్ అంత డబ్బు అని అంకుల్ కూడా అడిగి ఆశ్చర్యపోతున్నారు . 

పెద్దయ్యా , అంకుల్ .......... కూల్ అని అన్నయ్య ద్వారా వాటర్ తెప్పించి వాళ్లకు అందించాను .

ఎంపీ: ఆశ్చర్యపోయి ఇదే లాస్ట్ రా ........... 50 లక్షలు అని మెల్లగా పాడాడు .

ఏంటన్నా మీరు భయపడుతున్నారా ..........

లేదురా మనం వాళ్లకు ఇచ్చిందే 50 లక్షలలోపు వడ్డీ , చక్రవడ్డీ వేసి కొండంత చేసాము. నెక్స్ట్ 60 అన్నామంటే ఆ డబ్బుతో అసలు తీర్చేసి వడ్డీ తరువాత నెమ్మదిగా ఇస్తామని కోర్ట్ లో కేస్ వేశారంటే , మన మోసం బయటకువచ్చి ఇక నేను జీవితంలో ఎలక్షన్ లో పోటీ చేయలేను .

కృష్ణ : ఏంటి ఎంపీ నెమ్మదిగా పాడావు ........., రేయ్ మామా ఒక్కరూపాయే కదా 50 లక్షలా ఒక్కరూపాయి అని పొలాలు మొత్తం వినిపించేలా అరిచాడు .



ఎంపీ మౌనంగా అయిపోవడంతో అధికారులు మూడు సార్లు పాట పాడి పొలాలు మొత్తం 50 లక్షలా ఒక్కరూపాయికి మహేష్ పరం అయ్యాయి అని గట్టిగా బెల్ కొట్టారు . ఫైల్ తెచ్చి నాకు అందించారు . రేయ్ మామా చెల్లికి ఇచ్చి సరిచూడమని చెప్పు అన్నాను . 

వాడు పరుగునవెళ్లి చెల్లికి అందించి వచ్చాడు .

రేయ్ కట్టరా ........... 50 లక్షలా ఒక్కరూపాయి కట్టరా ........., సాయంత్రం లోపు కట్టకపోతే వేలం పాట క్యాన్సిల్ అయ్యి పొలాలన్నీ ఫ్రీగా మాకే చెందుతాయి అని సవాల్ విసిరారు . 

రేయ్ మామా .......... మన ముగ్గురితో కలిపి ఉన్నది 20 లక్షల లోపే ఇప్పుడేలారా అని కంగారుపడుతున్నాడు . వాడితోపాటు పెద్దయ్య , అంకుల్ , అన్నయ్యలు కూడా .............

కూల్ రా మామా ........... అంకుల్ లాయర్ కు కాల్ చెయ్యండి అని చెప్పాను .

కాల్ చేసి నాకు అందించారు . అలా నడుచుకుంటూ వెళుతూ సర్ నేను మహేష్ మాట్లాడుతున్నాను .

మహేష్ .......... చెప్పు , 

సర్ నాకు 18 ఏళ్ళు నిండి 4 నెలలు అయ్యింది . అమ్మ రాసిచ్చిన ఆస్తులు నేను అమ్ముకోవచ్చా .......... అని అడిగాను . 

అమ్ముకోవచ్చు మహేష్ ......... ఎవరికి అమ్ముతున్నావు మహేష్ , ఇంకా ఎవరికీ అమ్మలేదు కదా ........... , ఒక NRI ......... ఫారిన్ లో బాగా సంపాదించి ప్రశాంతమైన పల్లెలో సెటిల్ అవ్వాలనుకున్నారు . రీసెంట్ గా మీ రెండు పల్లెల మధ్యలో కంపచెట్లతో నిండిపోయిన పాతిక ఎకరాలు కొన్నారు దానిని చదును చేసి పంటలు పండించాలని అనుకున్నారు , నీవల్లనే కదా సమృద్ధి అయిన నీరు పారుతోంది . వస్తూ వస్తూ మీ ఇంటిని చూసి ఫిదా అయిపోయారు . కోటి అయినా తీసుకోవడానికి రెడీగా ఉన్నారు . 

థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ , అర గంటలో అమ్మవారి గుడి దగ్గరకు ఆయనను డబ్బుతో పాటు పిలుచుకునివస్తే 75 లక్షలకే ఇంటితోపాటు పొలాన్ని కూడా ఇచ్చేస్తాను సర్ అనిచెప్పగానే , 

మహేష్ 20 నిమిషాల్లో అక్కడ ఉంటాను అనిచెప్పారు . 

థాంక్యూ సర్ వేచి చూస్తుంటాను అని అందరమూ అమ్మవారి గుడిదగ్గరకు చేరుకుని , అమ్మా ............ తొమ్మిదేళ్ల తరువాత కోరిక కోరుతున్నాను , అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేలా చూడు తల్లీ .......... 

నా చుట్టూ అందరూ టెన్షన్ పడుతూనే ఉన్నారు.



చెల్లి కారులోనుండి వచ్చి రే........ కృష్ణా అప్పు తీసుకున్నది లక్ష అయితే నెలకు వడ్డీ ఎలాపడితే అలా 10 , 15 రూపాయలు వేసి అమాంతం పెద్ద అమౌంట్ అయ్యేలా చేసేసారు . 

కృష్ణ వాడు టెన్షన్ లో ఉన్నాడు . ఇప్పటికిప్పుడు 50 లక్షలు కావాలి . 

కృష్ణా ............ నాదగ్గర డబ్బు మరియు నగలూ ఉన్నాయికదా అని వెహికల్ వైపు పరిగెత్తి బ్యాగులోనుండి తీసి వెనుకకు తిరుగగానే , 

కళ్ళల్లో ఆనందబాస్పాలతో చెల్లీ ......... అని అమాంతం కౌగిలించుకుని , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , చెల్లీ ఎండ ఎక్కువగా ఉంది లోపల కూర్చోమని కూర్చోబెట్టాను . 

అన్నయ్యా .......... నగలు , డబ్బు ........ 

చెల్లీ హృదయాన్ని కదిలించావు . వద్దు చెల్లీ ......... డబ్బు వచ్చేస్తోంది . ప్రాణం పోయినా అమ్మ నగలను మన నుండి వేరుకానివ్వను లవ్ యు చెల్లీ ........., అని ఫైల్ అందుకొని చూసి , కోపంతో మొబైల్ తీసి నేరుగా జడ్జిగారికి కాల్ చేసి పరిస్థితి మొత్తం వివరించాను . 



మహేష్ థాంక్యూ sooooo మచ్ నాకు కాల్ చేసినందుకు ఇలాగైనా నీకు సహాయం చేసి నేను చేసిన తప్పుని సరిచేసుకుంటాను , ఏ ఊరు అన్నావు ....... ok నువ్వు నిశ్చింతగా ఉండు నేను చూసుకుంటాను అని కట్ చేశారు . 



లాయర్ గారు చెప్పినట్లుగానే అర గంటలోపు వచ్చి డబ్బు చూపించారు . 

థాంక్యూ sooooo మచ్ సర్ ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పండి పెట్టేస్తాను అని పూర్తిచేసి , బిల్డింగ్ తోట ఇక మీకే సొంతం సర్ , అవసరానికి సహాయం చేసారు థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని చేతులు కలిపాను .

 పెద్దగా నోరుతెరిచి షాక్ లో ఉన్న కృష్ణ గాడికి , రేయ్ మామా అందులోనుండి 25 వేరుచేసి పెద్దయ్యకు ఇవ్వు , ఒక రూపాయి add చేసి అక్కడ ఇచ్చేసి పొలాల పత్రాలన్నీ తీసుకొచ్చేయ్ అనిచెప్పాను . 

మహేష్ మాకోసం ఇంటిని , పొలాన్ని అమ్మేశావా ............, మన బాగు కోసం పెద్దయ్యా .........., అక్కయ్య ఉన్నా ఇలానే చేసేవారు . 

బాబు నువ్వు నిజంగా మాకోసమే పుట్టిన , ఆ అమ్మవారే స్వయంగా పంపించిన దేవుడివి అని పూజారి గారు కన్నీళ్లను తుడుచుకున్నారు .



కృష్ణగాడు , అన్నయ్య ......... డబ్బుతోపాటు వెళ్లి వచ్చి రేయ్ మామా వడ్డీ కూడా ఇస్తేనే పొలం మరియు ఇంటి పత్రాలు ఇస్తాడంట , రేయ్ మామా ......... వాడు డబ్బు తీసుకుని వెళ్లిపోతున్నాడురా ..........

రేయ్ మామా మహా అయితే టౌన్ లోని వాడి ఇంటికి వెళతాడు . మ్యాటర్ చాలాదూరం వెళ్ళిపోయింది అని అంటుండగానే , వరుసగా govt వెహికల్స్ వచ్చి నిలబడ్డాయి . 

చాలా మంది ఆఫీసర్స్ , సెక్యూరిటీ ఆఫీసర్లతోపాటువచ్చి మహేష్ ఎవరు ఇక్కడ అని అడిగారు . 

నేనే సర్ అని సెక్యూరిటీ అధికారి కు బదులివ్వడంతో , మహేష్ అంటే చిన్నపిల్లాడా ......... జడ్జిగారు నీగురించి చాలా చెప్పారు అని ఒక ఆఫీసర్ చేతిని ముందుకు చాపారు .

జడ్జిగారికి మాపై అంత అభినానం సర్ , మీరు ..........

అంకుల్ చెవిదగ్గరకువచ్చి మన జిల్లా కలెక్టర్ మహేష్ అని గుసగుసలాడారు .

క్షమించండి సర్ ......... అని రెండు చేతులతో నమస్కరించి , ఈరోజు ఉదయమే జైల్ నుండి ............

మహేష్ నాకు జడ్జిగారు మొత్తం చెప్పారు . ఇక్కడ సమస్య ఏంటి అని ఎండలోనే అడిగారు . 



సర్ ఎండ ఎక్కువ ఉంది అలా నీడలోకి వెళదాము అని చెట్టుని చూపించాను .

థాంక్స్ మహేష్ ఇంప్రెస్సెడ్ అని నా భుజం చుట్టూ చేతినివేసి తీసుకెళ్లారు . 

పెద్దయ్యా , పూజారి గారు ......... అలా షాక్ లో ఉండిపోయారు .

సర్ సమస్య ఏంటంటే అంటూ వడ్డీ గిరించి , పొలాలు , ఇంటి పాత్రల గురించి వివరించి ఫైల్ చూపించాను . 

What ......... ఇంత ఘోరమా ? , సర్ అంటూ పెద్ద సెక్యూరిటీ అధికారి ను పిలిచి 15 నిమిషాల్లో వాడు పత్రాలతోపాటు ఇక్కడ ఉండాలి . 

సర్ వారు మాజీ ఎంపీ అని మరొక సెక్యూరిటీ అధికారి చెప్పారు . 

ఇంత ఫ్రాడ్ చేస్తూ ఇంకా గౌరవం ఏంటి , రైతులను మోసం చేసినవాడికి గింజ కూడా దొరకదు 15 మినిట్స్ thats it అని ఆర్డర్ వేశారు . 

వెంటనే ఎంపీ కి కాల్ చేసి విషయం చెప్పి కలెక్టర్ గారి ఆర్డర్ 15 నిమిషాల్లో అన్నింటితోపాటు ఇక్కడ ఉండాలి లేకపోతే మేము రంగం లోకి దిగాల్సివస్తుంది అని వార్నింగ్ ఇచ్చారు .



సర్ బంగారం లాంటి పంటలు పండే పంటలు సర్ , సంవత్సరానికి మూడు పంటలు అత్యధిక దిగుబడిని ఇస్తాయి . ఇప్పటివరకూ సేంద్రియ ఎరువుల తప్ప వేరేవి వాడనేలేదు . అలాంటి పంట పొలాలను బీడు భూములుగా చిత్రీకరించి ఫ్యాక్టరీ కోసం పర్మిషన్ తీసుకున్నారు . అదేకనుక జరిగితే ఈ ఊరు మాత్రమే కాదు సర్ చుట్టుప్రక్కల సేంద్రీయ భూములన్నీ రసాయనాలతో సేద్యానికి పనికిరాకుండా పోతాయి సర్ , ఇక తరువాత పరిస్థితులు అందరికీ తెలిసినవే ......

కేవలం మాకోసం , మేము జైల్లో కష్టపడుతున్నామని మా ఊరి జనమంతా సంతోషమైన జీవితాన్ని వదిలి టౌన్ లో చిన్న చిన్న పనులతో కూలీలుగా బ్రతుకుతున్నారు సర్ , ఈ విషయం నాతో దాచారు లేకపోతే ఇలా జరగనిచ్చేవాన్ని కాదు సర్ అని ఉద్వేగానికి లోనయ్యి ,

ఈ అప్పుని కట్టడానికి వీళ్లకు సంవత్సరం సమయం చాలు సర్ .........కావాలంటే మూడు నెలల తరువాత వచ్చి చూడండి సర్ ఎంత పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటాయో ఈ పొలాలు అని ఎలా ఉండేవో వివరించాను . 



మహేష్ నేను కూడా ఒక రైతు కొడుకునే , వాళ్ళ కష్టాలు నాకు తెలుసు ఇన్స్పెక్టర్ ఇచ్చిన సమయం అయ్యిందా ..........

సర్ two మినిట్స్ సర్ అనేంతలో ఒక వెహికల్ వచ్చి అందులోనుండి ఇద్దరు దిగి పత్రాలన్నింటినీ తీసుకొచ్చి ఇచ్చేసారు . 

ఎంపీ ఎక్కడయ్యా .......... అని అడిగారు సెక్యూరిటీ అధికారి సర్ .......

సర్ ఏమో సర్ తెలియదు సర్ అని వణుకుతూ బదులిచ్చాడు .

పిరికిపంద ఎక్కడికీ పోతాడు ఇన్స్పెక్టర్ వెళ్లి అరెస్ట్ చెయ్యండి , మరొకసారి ఈ ఊరివైపు చూస్తే ఏమిచెయ్యాలో మీకు తెలుసుకదా అని ఆర్డర్స్ జారీ చేశారు . 

Yes సర్ అంటూ ఉత్సాహంతో బదులిచ్చారు . 



మహేష్ ......... నేను చూసుకుంటాను , ఈ ఫ్యాక్టరీ క్యాన్సిల్ చేయిస్తాను మీరు దున్నడం స్టార్ట్ చేసేయ్యండి అనిచెప్పి వెళ్లిపోతోంతే ,

సర్ మాకోసం ఇంతదూరం వచ్చినందుకు థాంక్యూ sooooo మచ్ సర్ అని చేతులెత్తి నమస్కరించాము .

మహేష్ నా డ్యూటీ చేసేలా చేసావు . నేనే నీకు థాంక్స్ చెప్పాలి అని వెళ్లిపోబోతుంటే ,

సర్ మరొక కోరిక , మీ చేతులతో మా గ్రామ దేవత గుడి తలుపులు తెరిస్తే మేమంతా చాలా సంతోషం అని గౌరవంగా పిలిచాము . 



అంతకన్నా అదృష్టమా .........., మహేష్ బయట ఉండే మనుషులు చెడ్డపేరు సంపాదించుకుంటున్నారు . నువ్వు జైల్లో ఉండి ఎంతోమంది పెద్దపెద్ద వాళ్ళ అభిమానం సంపాదించావు వెల్ డన్ అని భుజం చుట్టూ చేతులను వేసి గుడిదగ్గరకు నడిచాము . 

సర్ మా అందరి మంచి కోరే ఊరి పెద్దయ్య , అమ్మవారి గుడి పూజారి గారు , టౌన్ లో govt ఆఫీస్ లో జాబ్ చేస్తున్న అంకుల్ అని పరిచయం చేశాను .

ముగ్గురి చేతులు కలపడంతో వారి ఆనందానికి అవధులు లేవు .

గుడి తలుపుల దగ్గరికి చేరుకుని పూజారి గారు ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నట్లున్నారు ..............

కలెక్టర్ సర్ ......... మహేష్ ను మా ఊరంతా దేవుడు అంటారు . తన ద్వారానే తలుపులు తెరిపించాలనేదే ఊరందరి కోరిక అని నెమ్మదిగా చెప్పి , తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అని రెండు చేతులనూ జోడించారు .

పూజారి గారు ఆ అమ్మవారి ఆశీస్సులు మాకు అందించే మద్యులు మీరు అని ఆపి మీ కోరిక ప్రకారమే కానిద్దాము మహేష్ కానివ్వు అని మనఃస్ఫూర్తిగా చెప్పారు .

సర్ మీరుకూడా అంటూ ఇద్దరమూ తాళం తీసి తలుపులు తెరవగానే అప్పటివరకూ సెగలు కక్కుతున్న సూర్యుడు మబ్బుల్లో మాయమై చల్లటి గాలులతో వర్షం పడటంతో, కలెక్టర్ గారితోపాటు అందరూ మైమరిచిపోయారు .

మహేష్ పూజారి గారి మాటలు ఇప్పుడు నమ్ముతున్నాను . సంవత్సరం నుండీ వర్షాలు పడక జిల్లా మొత్తం రైతులు పూజలు చేస్తున్నారు .........., ఎన్నో విజ్ఞప్తులు వస్తున్నాయి , చివరికి అమ్మవారి అనుగ్రహం వలన వర్షం పడింది అని క్లర్క్ గొడుగు తెచ్చి సర్ పైన ఉంచబోతే ఆపి మాతోపాటు ఉత్సాహంతో తడిచారు . 



మహేష్ ఈ ఆనంద సమయంలో ఒక సెల్ఫీ అని సర్ అడగడంతో , మాలో మరింత ఉత్సాహం వచ్చి పరుగునవెళ్లి వెహికల్లోని చెల్లిని , అమ్మావాళ్లను పిలుచుకొనివచ్చి సర్ my సిస్టర్ కృష్ణవేణి ఫ్యూచర్ డాక్టర్ , వాడు నా ప్రాణమైన ఫ్రెండ్ ఫ్యూచర్ IPS , మా అమ్మలు అని పరిచయం చేశాను . నమస్కరించి అందరమూ సర్ మొబైల్లో , మా మొబైల్లో గ్రూప్ సెల్ఫీ తీసుకున్నాము . 

మహేష్ నీ గోల్ ఏంటి అని అడిగారు . నా ప్రాణమైన వాళ్ళ కోరిక నేను గొప్ప ఆర్కిటెక్ట్ అవ్వడం సర్ .......... ఆ గోల్ సాధించి , ఈ ఊరికి నా సొంత ఊరికి వచ్చేసి చుట్టూ ప్రాణమైన వాళ్ళతో అని ఎదురుగా ఉన్నవాళ్లను చూపించి ( మా అమ్మా అక్కయ్యాలతో అని మనసులో ) వ్యవసాయం చేస్తూ ప్రశాంతమైన జీవితం గడిపేస్తాను సర్ అని బదులిచ్చాను . 

లవ్లీ లవ్లీ ......... మహేష్ all the best ముగ్గురికీ అని కౌగిలించుకుని వెళ్ళొస్తాను అనిచెప్పి వెళ్లిపోతూ , పెద్దయ్యా మరియు మీరు ఏ ఆఫీస్ లో పనిచేస్తారు అని అంకుల్ గురించి తెలుసుకుని మహేష్ కు ఏమి అవసరం వచ్చినా నాకు కాల్ చెయ్యండి అని చిరునవ్వులతో వెళ్లిపోయారు .

రేయ్ మామా , అన్నయ్యా ......... అంటూ ఇద్దరూ నన్ను చెరొకవైపు హత్తుకొని వర్షంలో సంతోషంతో చిందులు వేస్తుంటే , పెద్దయ్య పూజారి గారు ఆనందబాస్పాలతో దండం పెట్టబోతే ఆపి , పెద్దయ్యా ........... పత్రాలను ఊరంతటికీ పంచెయ్యండి . ఆ 25 లక్షలతో రేపే పొలం పనులు ప్రారంభించండి , త్వరలోనే అక్కయ్యతోపాటు ఊరిలో అడుగుపెడతాము అనిచెప్పాను .

మహేష్ మనవాళ్ళు ............

తెలుసు పెద్దయ్యా ............, అక్కయ్య లేకుండా ........అంటూ వర్షంలో కన్నీటిని కారుస్తూ కృష్ణగాడు , చెల్లెమ్మను కౌగిలించుకుని వెళ్ళొస్తాము పెద్దయ్యా ........., అంకుల్ , అమ్మా వెళదాము అని కృష్ణగాడి ఫ్యామిలీతోపాటు టౌన్ కు బయలుదేరాము .



రేయ్ మామా .......... కనీసం ఒకసారి అక్కయ్య తిరిగిన ఇంటికి .........., 

వద్దురా ......... ఇంటిని చూశానంటే చాలా ఎమోషనల్ అయిపోయి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అని వాడి భుజం పై వాలిపోయాను . 

అన్నయ్యా .......... అంటూ ఉద్వేగంతో చెల్లి నా గుండెలపై వాలిపోయింది . వర్షం అంతకంతకూ పెరుగుతూనే ఉంది . టౌన్ లో ఎటుచూసినా పిల్లలు పెద్దలు చాన్నాళ్ల తరువాత బయటకు వచ్చి వర్షంలో ఎంజాయ్ చెయ్యడం గమనించాము .

ఇంటికి చేరుకోగానే మహేష్ వెంటనే వంట చేసేస్తాము మీరు బట్టలు మార్చుకోండి అనిచెప్పి అమ్మలిద్దరూ వంట గదిలోకి వెళ్లారు . 

అంకుల్ నెక్స్ట్ బస్ ఎప్పుడు ఉంటే అప్పుడు హైద్రాబాద్ వెళ్లిపోతాము బుక్ చెయ్యండి అని చెల్లి కార్డ్ అందించబోతే ,

మహేష్ .........నేను చూసుకుంటాను అని కార్డ్ వెనక్కు ఇచ్చేసి ముందు మీరు లోపలికివెళ్లి బట్టలు మార్చుకోండి అనిచెప్పారు . 

కృష్ణగాడు అన్నయ్య లగేజీ మొత్తం ఇంటిలోపలికి తీసుకురావడంతో ఒకరి తరువాత ఒకరము ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని సోఫాలో కూర్చుని అక్కయ్య గురించే ఆలోచిస్తున్నాను . 

అన్నయ్యా ............ అక్కయ్యను తొందరలోనే చేరుకుంటాము అనిచెప్పి అమ్మావాళ్లకు హెల్ప్ చెయ్యడం కోసం వంట గదిలోకి వెళ్ళింది . 



మహేష్ లంచ్ చేసి బయలుదేరితే హైద్రాబాద్ అర్ధరాత్రికి చేరుకుంటారు . అక్కడ కష్టం అవుతుంది కాబట్టి నైట్ టికెట్స్ బుక్ చేస్తాను డిన్నర్ చేసి బయలుదేరితే  ఉదయానికల్లా చేరిపోవచ్చు అని కన్విన్స్ చేశారు . 

అలాగే అంకుల్ అని బదులిచ్చి వంట పూర్తయ్యాక , వెహికల్ డ్రైవర్ ను భోజనానికి లోపలకు పిలిచాము .

 అమ్మలిద్దరూ చెల్లి ప్రేమతో తినిపించడంతో తింటుంటే ,

బాబు .........కాదు కాదు సర్ మీరేనా అక్కడ మొత్తం ధడదడలాడించి ఇక్కడ మాత్రం బుజ్జాయిలాగా తినిపిస్తున్నారు అని ఆశ్చర్యపోయాడు .  

అందరూ నవ్వుకుని , అవును బయట ఎలా ఉన్నా ........ మాకు మాత్రం మా బుజ్జి దేవుడు అని ప్రాణంలా తినిపించారు .



చెల్లి సహాయం చెయ్యబోతున్నా తల్లీ మేంఉన్నాము కదా అని అమ్మలిద్దరూ చెల్లిని ప్రాణంలా చూలుకోవడం చూసి మురిసిపోతూ , కృష్ణగాడు సిగ్గుపడుతుండటం చూసి నవ్వుకుని అంకులిద్దరితో మాట్లాడుతోంటే , డ్రైవర్ గుమ్మం దగ్గరికి పరుగునవచ్చి మహేష్ ........ అంత వర్షంలోనూ ట్రాక్టర్లలో వందలమంది జనాలు వచ్చారు అనిచెప్పడంతో , 

పెద్దయ్యా ..........అని లేచి పరుగున బయటకువెళ్ళిచూస్తే ఊరిజనమంతా అమ్మావాళ్ళతో సహా ట్రాక్టర్లలో పూర్తిగా తడిచిపోయి ఇంకా దిగుతూనే ఉండటం చూసి , పెద్దయ్యా ........... చెప్పాను కదా , వర్షం కూడా ఎలాపడుతోందో చూడండి అని చెప్పాను . 



నువ్వుచెప్పినట్లుగానే ఎవరి పత్రాలు వాళ్లకు ఇవ్వడానికి వెళ్ళాను . ఏమాత్రం ఆలోచించకుండా పెద్దయ్యా ......... మన మహేష్ వల్లనే కదా , మనకోసం మన బాధల్ని తీర్చడానికి వచ్చాడు కదూ , పెద్దయ్యా .........మీకు రెండుచేతులు జోడించి దండం పెడుతున్నాము ఇప్పుడే మా అందరినీ మహేష్ దగ్గరికి తీసుకెళ్లు అని బాధపడటంతో తప్పలేదు మహేష్ ...........

వాళ్ళ అభిమానానికి అందరికీ చేతులెత్తి నమస్కరించి , అమ్మా .......... ఇంత వర్షంలో మిమ్మల్ని ఇబ్బందిపెట్టాను అని పాదాలకు నమస్కరించాను . 

 ఆనందబాస్పాలతో లేపి మా బిడ్డను , మా బుజ్జి దేవుణ్ణి .......... చూడటానికి ఎంత దూరమైనా , ఎంత కష్టంలోనైనా వస్తాము . అక్కా చెల్లీ ఇక మన మహేష్ బుజ్జిదేవుడు ఏమాత్రం కాదు చూడు ఎంత ఎత్తు ఎదిగాడు తలెత్తి చూడాల్సివస్తోంది అని సంతోషంతో నవ్వుకున్నారు .



మహేష్ .......... మాకోసం , మేము డబ్బుకు ఆశపడటం వలన నీ ప్రాణానికి ప్రాణమైన ఇంటిని , పొలాన్ని వధులుకున్నావా అని బాధతో చెప్పారు . 

ఎవరికోసం అమ్మా ........... నా మనుషుల కోసమే కదా , నాకు చాలా చాలా సంతోషన్గా ఉంది మీరు బాధపడకండి అమ్మవారు ఎలా ఆడిస్తే అలా ఆడే బొమ్మలం మనము అని వర్షంలో కారుస్తున్న కన్నీళ్లను తుడిచాను .

మహేష్ మీ అమ్మలందరినీ వర్షంలోనే నిలబెట్టేస్తావా ........... అక్కా చెల్లీ లోపలకు రండి అని అమ్మ అందరినీ లోపలికి పిలుచుకొనివెళ్లి తల తుడుచుకోవడానికి చెల్లి సహాయంతో ఏర్పాట్లుచేశారు . 

అక్కా , చెల్లీ ......... నీకొడుకు మహేష్ కు తోడుగా ఉన్నాడు చూడు ముందు నీకు చేతులెత్తి నమస్కరించాలి అని కృష్ణ అమ్మను హత్తుకొని ఆకాశానికి ఎత్తేశారు . 



ఏమండోయ్ శ్రీవారు అనిపిలిచి పాలు తీసుకురమ్మని చెప్పడంతో కారులో 10 నిమిషాలలో తీసుకురావడంతో అమ్మలిద్దరూ , చెల్లి టీ చేసి అందరికీ అందించారు .

చెల్లిని అందరి అమ్మలకు నాకోడలు అదే అదే మన ఊరి కోడలు , ఈ 9 సంవత్సరాలు తన ప్రియుడికి , తన అన్నయ్యకు అనుక్షణం తోడుగా ఉంది బాధను దరిచేయనీకుండా ప్రాణంలా చూసుకుంది కృష్ణవేణి అని గర్వపడుతూ అమ్మ చెప్పడంతో ,

 మన కృష్ణ చాలా చాలా అదృష్టవంతుడు కృష్ణ - కృష్ణవేణి ........., చల్లగా ఉండు తల్లీ అని మనసారా దీవించారు . 

నన్ను ఆశీర్వదించండి అమ్మా అని పాదాలకు నమస్కరించబోతే తల్లీ అని ప్రాణంలా కౌగిలించుకొన్నారు .



 బయట బాబు మహేష్ ........... పెద్దయ్య అంతా చెప్పారు . మా దేవత వాసంతి అతి త్వరలోనే నిన్ను చేరుకుని అంతే త్వరలోనే మన ఊరికి రావాలని మనసారా మన అమ్మవారిని ప్రార్థిస్తూనే ఉంటాము . అక్కడ మా అవసరం అనిపిస్తే ఒక్క కాల్ చెయ్యి మహేష్ ఉదయానికల్లా నీముందు వాలిపోతాము జాగ్రత్త మహేష్ అని అందరూ నా భుజం పై చేతులువేశారు . 

మీ ప్రేమ ఉంటే చాలు అన్నయ్యా .......... ఏదైనా సాధిస్తాను అని అందరినీ ఒకేసారి కౌగిలించుకున్నాను . 

కృష్ణ ........... రాప్పా అలా దూరం ఉండిపోయావు , మన మహేష్ కు తోడుగా ఉన్న నిన్ను ముందు అభినందించాలి అని పిలిచారు . 

పెద్దయ్యా ........ ఇంకా చూస్తారేంటి ఎత్తండి అని ఇద్దరమూ ఒకచెయ్యివేయ్యగానే అందరూ అంతులేని సంతోషంతో పైకెత్తి సంబరాలు చేసుకున్నాము . 

చెల్లితోపాటు అమ్మలంతా గుమ్మం దగ్గర నిలబడి ఒకరిపై మరొకరు చూస్తూ సంతోషించారు . 



 అర గంట అయినా అలాగే ఉండటంతో అమ్మలిద్దరూ వర్షం నిలిచాక వెలుదురంట అని ఎంత చెబుతున్నా వినకుండా బయటకువచ్చి , అక్కా చెల్లీ మహేష్ వాళ్ళు వెళ్లే సమయానికి మళ్లీ వచ్చేస్తాము కదా ......... , అందరికీ ఒక ముఖ్యమైన పని ఉంది ఖచ్చితంగా వెళ్ళాలి అనిచెప్పారు . నేను ఆపడానికి ప్రయత్నించబోతే నువ్వుండేదే మరికొన్ని గంటలే అయినా వెళుతున్నాము అంటే అర్థం చేసుకో మహేష్ .......... అని నేను మాట్లాడకుండా చేసేసి వెళ్ళాలి అని ఊరిజనమంతా వెళ్లిపోయారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 29-04-2020, 05:46 AM



Users browsing this thread: 180 Guest(s)