17-02-2019, 12:01 PM
తెల్లవారేసరికి రాజభటులు శిశునాగుడిని వెతుకుతూ వచ్చి కోటకు తీసుకువెళ్తారు. తల్లి చంద్రమతీ దేవి అతనిలోని మార్పుని గుర్తిస్తుంది. శిశునాగుడిని తీసుకువచ్చిన పరిచారకులలో ఒకడిని పిల్చి రాత్రి శిశునాగుడు ఎక్కడికి వెళ్ళాడని ఆరా తీస్తుంది. ఆ పరిచారకుడి పేరు చిత్రశిఖండి. అతను అది మహానగరానికి దూరంగా నాలుగు స్మశానాల మధ్యలో వున్న ప్రదేశమనీ అక్కడ పది పొదలున్నాయనీ, అవేమిటో తనకి అర్థం కాలేదనీ, పగటివేళ వెళ్ళి మళ్ళీ పరీక్షించాలనుకుంటున్నాననీ చెప్తాడు. నిజానికి అవి పొదలు కావనీ, దుబ్బులు అనీ, వృక్షాల గురించి బాగా తెలిసిన తనకే అవి ఏమిటో అర్థం కాలేదనీ అంటాడు. అలాగే అక్కడ యువరాజువి కాక మరొక మనిషి కాలిగుర్తులు, నక్క కాలిగుర్తులు కూడా కనిపించాయని చెప్తాడు. అవి నక్క కాలిగుర్తులన్న విషయం అందరూ గుర్తించలేరనీ ఏదో భయంకర జంతువు కాలిగుర్తుల్లా ఉన్నాయనీ అంటాడు.
వృద్ధరాజు, అంటే శిశునాగుడి తండ్రి ఆరోజునుంచీ మంచాన పడతాడు. తండ్రి దగ్గరకు వెళ్ళి పలకరించమనీ, మాట్లాడమనీ చంద్రమతీ దేవి వత్తిడి చేస్తే శిశునాగుడు ఆయన దగ్గరగా వెళ్ళి మొహంలో మొహం పెట్టి మాట్లాడతాడు. అపుడు రాజు మొహం లోకి కొత్త ప్రకాశం వస్తుంది. శిశునాగుడి మాటలని ఆయన ముక్కుతో పీలుస్తున్నాడా అనిపిస్తుంది. ఒక్కసారిగా ఏదో శక్తి వచ్చినట్లుగా కనిపిస్తాడు “యువరాజా, నా పని అయిపోయింది. నీ రాజ్యం నువ్వు స్వీకరించు. నీ శత్రువులని దండించు. ప్రతీకారం తీర్చుకో.” అంటాడు.
రాణి ఆశ్చర్యపోతుంది. ప్రతీకారం ఎవరిమీదో ఆమెకు అర్థం కాదు. వేదమరీచి మీదా! మగధ రాజ్యం మీదా? ఎందుకు? ఆమె ఇలా అనుకుంటుంది. “ఈ కాశీ మహాక్షేత్రము యొక్క పవిత్రత వల్ల, శక్తి వల్ల వేదమరీచి యొక్క జీవుడు పరిశుద్ధుడవుతాడనీ, మగధ రాజ్య పాలనాపటిష్టుడవుతాడనీ వేదధర్మ ్రతిష్టాపనాచార్యుడవుతాడనీ అనుకుని వేదమరీచిని ఇక్కడికి తెచ్చాను. ఈ మగధ రాజ్యం కర్మమేమిటో! వాళ్ళెప్పుడూ శ్రీకృష్ణ విరోధులే. ప్రద్యోతనుడి కూతురు పద్మావతిని పాండవుల వంశంలోని ఉదయనుడికి యిచ్చినా ఆ సంబంధం అక్కడితోనే అయిపోయింది. ఆ తర్వాత ఈ నూట ముప్పై ఆరేళ్ళ నుంచీ శ్రీకృష్ణ విరోధమే నడుస్తోంది. బార్హద్రథవంశం వున్నన్నాళ్ళు చండీ పూజ పరంపరగా సాగింది. ప్రద్యోతనులు అది కూడా మానేశారు. నందివర్ధనుడు శూన్యవాది. ఇక ముందు ఏమవుతుంది? నందివర్ధనుడి తర్వాత ప్రద్యోత వంశం అంతరించి మరొక వంశం మగధని ఆక్రమిస్తుందని వదంతి వుంది. కానీ మగధ మీద దండెత్త గలిగినంత పెద్ద రాజ్యం ఇంకొకటి లేదు. తర్వాత ఏమవుతుంది? శిశునాగుడికి ప్రతీకారం ఎందుకు? దాన్ని అతను ఎలా తీర్చుకుంటాడు?” ఇలాంటి సందేహాలన్నీ కలిగి రాణి రాజు దగ్గరకు వెళ్ళి ఆయన్ని మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. “శిశునాగుడు ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో చెప్తారా?” అని అడుగుతుంది.
“అతడు రాజైన తర్వాత నేను ఆ ప్రతీకార మార్గాన్ని బోధిస్తాను.” అంటాడు రాజు. రాణి నివ్వెరపోతుంది. ఒక హఠాత్స్ఫురణగా తనకే తెలియకుండా అనాలోచితంగా “నువ్వెవరు?” అని ప్రశ్నిస్తుంది. “నేను జయద్రథుడిని” అంటాడు రాజు. అంతే. ఆ జవాబు తర్వాత ఇంక రాణి ఎన్ని ప్రశ్నలు వేసినా జవాబు చెప్పడు. నగరంలో పరాశరరావు అనే వృద్ధ పండితుడు ఉంటాడు. నిత్య తపస్వి. యోగానిష్టాపరుడు. జ్యోతిష్యము, సాముద్రికము తెలిసిన వాడు. చిత్రశిఖండి ఆ పరాశరరావుని కలిసి, ఆయన్ని తీసుకుని తాను శిశునాగుడిని చూసిన ప్రదేశానికి తీసుకువెళ్తాడు. ఆయన ఆ ప్రదేశాన్ని పరీక్షిస్తాడు. ఆ దుబ్బులలో ఏదో రహస్యముందని గ్రహిస్తాడు. అక్కడ వున్న నాలుగు దుబ్బులను త్రవ్వించి, రోటిలో రుబ్బించి ఆ పిండిని గంగానదిలో కలిపిస్తాడు. రాణి కూడా ఆయనతో సంప్రదిస్తుంది. రాజుని జయద్రథుడు ఆవహించాడని అర్థం చేసుకుంటారు.
ఆంధ్రరాజు కుమార్తెతో శిశునాగుడి వివాహం చేయాలనుకుంటారు. కాశీనగరం నుంచి ఆంధ్రదేశం వెళ్ళి మాట్లాడి రావడానికి ఒక నెల రోజుల పైనే పడుతుందనీ, అయినా తను వెళ్ళి మాట్లాడి వస్తాననీ అంటాడు పరాశర రావు. ఆ తర్వాత ఆయన జపంలో కూర్చుంటే వింధ్య పర్వత శ్రేణుల్లో ఇదంతా మొదలయిందని అర్థమవుతుంది. అక్కడ కూడా అలాంటి దుబ్బులు వుండడం, వాటి క్రింద వున్న కాష్ఠములను చేత బూని నల్లని దుస్తులు ధరించిన ఒక పురుషుడు అక్కడినుంచి ఏదో దూరదేశానికి ప్రయాణించడం, అక్కడ ఒక రాజసౌధం, తోట, తోటలో రాకుమారి కనిపిస్తారు. ఆమె శిశునాగుడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్న ఆంధ్ర రాజదుహిత అనీ అర్ధమవుతుంది. ఆమె తోటలో నిద్రిస్తుండడం, ఆ పురుషుడు తన చేతిలోని కాష్ఠములకు నిప్పు ముట్టించి, ఆ పొగ అంతా ఆమె చేత ఒక వేయిసార్లు పీల్పించడం కనిపిస్తుంది. అదంతా నిద్రలో వున్న ఆమెకు తెలియకుండానే జరుగుతుంది. ఆ ఆంధ్ర రాజకుమార్తె పేరు వంకజాబిల్లి. అమిత సౌందర్యవతి.