27-03-2020, 10:19 PM
Will గారు చెప్పింది నిజమే. ఒకవేళ కథ సరిగ్గా రాయడం కుదరక పోతే రాసినంత వరకు రాసి ఎదురుచూస్తున్నా ప్రేక్షకులకు ఒక మాటగా చెప్పాలి. ఇక్లాడితో ఈ కథను కొనసాగించలేను అని. కనీసం అలా అయినా క్లారిటీ ఇస్తే నిరీక్షిస్తున్న ప్రేక్షకులకు ఊరట ఇచ్చినట్టు అవుతుంది. ఇంకోవిషయం ఏంటంటే ముగింపు లేనిది అంటూ ఏది ఉండదు. ఎందుకో తెలీదు నేను చాలా కథలు చూసాను మధ్యలో ఆపేసారు. వాళ్లకు వీలు దొరకక లేక రాయడం ఇష్టం లేక లేదంటే ఎవరైనా వాళ్ళను హర్ట్ చేసి ఉంటారేమో. అలాంటిది కాకుండా కథను ఎలా ముగింపు ఇవ్వాలో అర్ధం కాకుండా కూడా ఆపేసి వాళ్ళు ఉంటారు. అందులో నేను ఉండను. ముగింపును ఆలోచించకుండా కథను మొదలుపెట్టాను. ఎందుకంటే మనకు బ్రహ్మ ఎలానో మన కథలకు మనమే బ్రహ్మ. మనకు నచ్చిన విధంగా మనం మలుపులు తిప్పొచు అని నా అభిప్రాయం.