Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
26/11
#4
కొన్ని రోజుల తర్వాత, ఉదయం 10 గంటలకు, జేజే ఆసుపత్రి బైకులాలో
అజ్మల్ కసబ్ భారత నిఘా సంస్థ విచారణలో వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. ఎక్కడా ఆగలేదు. అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబితే అరెస్టు చేసిన అతని సహచరులతో కలిసే అవకాశం కల్పిస్తామని కసబ్‌కు చెప్పడమే దానికి కారణం.
చివరికి ఆ రోజు కూడా రానే వచ్చింది. ఆ రోజు అజ్మల్ కసబ్‌ను సెక్యూరిటీ ఆఫీసర్ల బృందం గేట్ వే ఆఫ్ ఇండియా, తాజ్ ప్యాలస్ హోటల్ వైపు నుంచి తీసుకువెళుతూ చివరికి అతన్ని బైకులాలో ఉన్న జేజే ఆసుపత్రికి తరలించారు.
తనతో పాటు ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లతో మాట్లాడుతూ 'నాతోటి మిత్రులు తీవ్రంగా గాయపడ్డారా?' అని అజ్మల్ కసబ్ అడిగితే, నీ కళ్ళతో నువ్వే చూసుకో అని ఓ పొలీసు అధికారి సమాధానమిచ్చారు.
ఆ తర్వాత కసబ్‌ను ఓ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ స్టెయిన్‌లెస్ స్టీలుతో చేసిన 9 ట్రేలు ఉన్నాయి. అందులో దాడికి పాల్పడిన వారి శవాలు ఉన్నాయి. తాజ్ ప్యాలెస్‌లో చనిపోయిన ఈ శవాలు గుర్తుపట్టే స్థితిలో కూడా లేవు.
అజ్మల్ కసబ్ ఆ శవాలను చూసిన వెంటనే గట్టిగా అరుస్తూ 'నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లండి' అని అన్నాడు. ఆ తర్వాత అతన్ని జైలుకు తీసుకొచ్చారు. అక్కడ ఓ సెక్యూరిటీ ఆఫీసర్ అధికారి అజ్మల్ కసబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
అజ్మల్ కసబ్‌ను చూసి ఆ పొలీసు అధికారి 'అజ్మల్ గారు, వారి ముఖాలపై ఉన్న కాంతిని మీరు చూశారా? వారి శరీరం నుంచి గుబాళిస్తున్న గులాబీ సువాసన చూశారా ? అని ప్రశ్నించారు.
ఇది విన్న తర్వాత అజ్మల్ కసబ్ వెక్కి వెక్కి ఏడ్చాడు.
(అజ్మల్ కసబ్ ఛార్జ్‌షీట్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ మాజీ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ బ్రిగేడియర్ గోవింద్ సింగ్ సిసోడియా, అనేకమంది ప్రత్యక్ష సాక్షుల వాదనల ఆధారంగా)
Like Reply


Messages In This Thread
26/11 - by అన్నెపు - 26-11-2018, 11:43 AM
RE: అన్ని తెలుగు స్టోరీ త్రెడ్స్ ల... - by అన్నెపు - 26-11-2018, 11:46 AM



Users browsing this thread: 1 Guest(s)