Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
26/11
#2
26 నవంబరు, రాత్రి 9గంటల 48నిముషాలు, తాజ్ ప్యాలస్ హోటల్
షోయబ్, నజీర్‌ని లియోపాల్డ్ కేఫ్ దగ్గర ఉంచి, అబ్దుల్ రెహమాన్ బడా, అబూ అలీ ఇద్దరూ కలిసి తాజ్ ప్యాలస్ హోటల్ ఎదురుగా తమ ట్యాక్సీని ఆపారు. అక్కడ దిగి వారు హోటల్ వెనుక భాగంలో ఉన్న గోకుల్ రెస్టారెంట్ ప్రాంగణంలో ఓ టైం బాంబు సెట్ చేశారు.
టైల్స్ పడేసి ఉన్న చోట సెక్యూరిటీ అధికారి అవుట్‌పోస్టు ఉంది. అక్కడ కూడా వారు మరో బాంబు పెట్టారు. హోటల్ లోపలికి వెళ్లేముందు అక్కడున్న డిటెక్టివ్ డాగ్‌ను కూడా వారు కాల్చి చంపేశారు.
మెయిన్ డోర్ నుంచి వారు హోటల్ లోపలికి వచ్చారు. తాజ్ ప్యాలస్ విశిష్టతను చూసి వారు మంత్రముగ్ధులయ్యారు. కొన్ని సెకండ్లపాటు అలాగే చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ఎర్రటి టీ షర్టులో ఒకతను కుడివైపున్న 'హార్బర్ బార్' వైపు వెళ్ళాడు.
పసుపు రంగు టీ షర్టులో ఉన్నతను 'షామియానా' వైపు వెళ్ళాడు. ఎక్కడికెళ్లాలో వారికి ముందే తెలుసు. వారు ఒకే సమయంలో తమ తమ బ్యాగులను కింద పెట్టి అందులో నుంచి ఏకే 47 గన్స్ తీశారు.
26 నవంబరు, రాత్రి 11గంటల 50నిముషాలు, రంగ్ భవన్ లైన్
ఇంతలో ముంబాయి జాయింట్ కమిషనర్ హేమంత్ కర్కరే, అదనపు కమిషనర్ (ఈస్ట్) అశోక్ కామ్టే రంగంలోకి దిగారు. ఇన్స్‌పెక్టర్ సలాస్కర్‌తో కలిసి ఓ జీపులో కూర్చొని రంగ్ భవన్ లైన్ వద్దకు వెళ్లారు. కానీ అప్పటికే కసబ్, ఇస్మాయిల్ కామా ఆసుపత్రి నుంచి పరారయ్యారు.
ఇన్స్‌పెక్టర్ సలాస్కర్ అప్పుడు కాల్పులు జరుపుతున్నారు. అశోక్ కామ్టే ఆయన పక్కన ఉన్నారు. హేమంత్ కర్కరే సీటు మధ్యలో కూర్చున్నారు. వెనుక సీట్లో డ్రైవర్, క్రైం బ్రాంచ్ అధికారి అరుణ్ జాదవ్, ఇంకా ముగ్గురు సెక్యూరిటీ ఆఫీసర్ అధికారులు కూర్చొని ఉన్నారు.
అకస్మాత్తుగా ఒక పొడవైన వ్యక్తి, ఓ తక్కువ ఎత్తున్న వ్యక్తి ముందు నుంచి వచ్చి హేమంత్ కర్కరే బండిపై కాల్పులు జరిపారు. కాల్పులను చూస్తే వారు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు కనిపించింది.
ఒక్క బులెట్ కూడా వారు వృధా చేయలేదు. వారు అక్కడకొచ్చి ఆ బండి డోర్ తెరిచి ముందు సీట్లో ఉన్న వారిని కిందకు తోసేశారు. ఇస్మాయిల్ స్టీరింగ్ పట్టుకుంటే కసబ్ అతని పక్కనే కూర్చున్నాడు.
కాస్త దూరం వెళ్లిన తర్వాత టైరు పంక్చర్ అయ్యింది. ఇస్మాయిల్, కసబ్ వెనువెంటనే ఏమీ ఆలోచించకుండా కిందకు దిగి అక్కడి నుంచి వెళుతున్న ఓ స్కోడా కారును ఆపారు. డ్రైవర్‌ని బలవంతంగా కిందకు దించి బండి నడుపుకుంటూ వెళ్లిపోయారు.
27 నవంబరు, అర్థరాత్రి 12గంటల 40నిముషాలు, మెరీన్ డ్రైవ్
సెక్యూరిటీ అధికారి వైర్‌లెస్ ఫోనుకు ఓ సందేశం వచ్చింది. 'స్కొడా కార్ 02 JP 1276, సిల్వర్ కలర్, హైజాక్డ్ బై టెర్రరిస్ట్.' దాని సారాంశం.
ఐడియల్ కేఫ్ ముందు సిల్వర్ కలర్‌లో ఉన్న ఓ స్కోడా కారు సెక్యూరిటీ ఆఫీసర్లకు కనిపించింది. వారు కారును ఆపాలని సైగ చేశారు. బేరియర్‌కి కాస్త ముందు కారు ఆగింది. కానీ బయటి నుంచి చూసేవారికి తామెవరో గుర్తుపట్టకుండా ఉండడానికి డ్రైవర్ వైండ్ స్క్రీన్‌పై నీళ్లు పోసి వైపర్ ఆన్ చేశాడు.
ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు కారుకు ఎడమవైపు వెళ్లారు. అప్పుడే ఎవరో కారు వెనుక సీటు వైపున్న కిటికీపై కాల్పులు జరిపారు. ఇస్మాయిల్ చేతులు పైకెత్తాలని కసబ్‌కు చెప్పాడు. అప్పుడే ఇస్మాయిల్ తన వైపు వస్తున్న సెక్యూరిటీ ఆఫీసర్లపై కాల్పులు జరిపాడు. సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా ఎదురు కాల్పులు జరిపారు.
ఇస్మాయిల్ సీట్ నుంచి కింద పొడిపోవడం కసబ్ చూశాడు. అతని మెడలో బులెట్ తగిలింది. అప్పుడే కసబ్ రెండు డోర్లను తెరిచి తన ఏకే 47 తీసుకునే ప్రయత్నం చేశాడు. తన వేలును ట్రిగ్గర్‌పై పెట్టి సెక్యూరిటీ అధికారి ఇన్స్‌పెక్టర్ తుకారాం ఓంబాలే కడుపులో బుల్లెట్లు దింపేశాడు.
కానీ తుకారాం ఓంబాలే ఏకే 47 గన్ ముందు భాగాన్ని పట్టుకొని చివరిదాకా వదల్లేదు. అప్పుడే చాలామంది సెక్యూరిటీ ఆఫీసర్లు అక్కడకు వచ్చి కసబ్ చుట్టూ చేరి అతన్ని కొట్టడం మొదలు పెట్టారు.
అప్పుడే ఎవరో అరుస్తూ అన్నారు. ''ఆగండి, ఆగండి, అతను మాకు ప్రాణాలతో కావాలి'' అని. కసబ్‌ కాళ్ళు, చేతులు కట్టేసి ఓ అంబులెన్స్‌లో అతన్ని తరలించారు. అతను వేసుకున్న కొత్త టెన్నిస్ బూట్లు అక్కడే వదిలేసి ఉన్నాయి.
Like Reply


Messages In This Thread
26/11 - by అన్నెపు - 26-11-2018, 11:43 AM
RE: అన్ని తెలుగు స్టోరీ త్రెడ్స్ ల... - by అన్నెపు - 26-11-2018, 11:44 AM



Users browsing this thread: 1 Guest(s)