Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
26/11
#1
ముష్కర మూక దాడులకు  దశాబ్ద  కాలం 


26/11 ముంబయి దాడులకు పదేళ్లు: ‘ఆ రోజు ఓ సైన్యమే యుద్ధానికి దిగినట్టు అనిపించింది

వాళ్ల దగ్గరున్న బ్యాగుల్లో 10 ఏకే-47, 10 పిస్తోళ్లు, 80 గ్రెనేడ్లు, 2000 తూటాలు, 24 మ్యాగజైన్లు, 10 మొబైల్ ఫోన్లు, ఇతర పేలుడు పదార్థాలు, టైమర్లు, తినడం కోసం బాదం పలుకులు, కిస్మిస్ వంటివి ఉన్నాయి. ప్రపంచంలో నాలుగో పెద్ద నగరాన్ని దెబ్బతీయడానికి ఇవి సరిపోతాయని ఏ మాత్రం అనిపించలేదు.
వారికి తమ బాస్ పదే పదే చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. "వాళ్లను ఆశ్చర్యంలో ముంచెత్తడమే మీ అతి పెద్ద ఆయుధం". రాత్రి పూట బోటును తీరానికి చేర్చడం కోసం వారు చాలా రోజులు ప్రాక్టీస్ చేశారు.
ట్యాక్సీల్లో టైంబాంబు ఎలా పెట్టాలో కూడా వారికి ముందే నేర్పించారు. అలా అవి వేర్వేరు సమయాల్లో పేలిపోయి, తద్వారా ముంబయిపై ఏదో పెద్ద సైన్యమే యుద్ధానికి దిగినట్టు అనిపించేలా చేయడం కోసం వారు ముందే సిద్ధమై వచ్చారు.
రాత్రి సరిగ్గా 8 గంటల 20 నిమిషాలకు వారికి తీరం కనిపించింది. ఆయుధాలున్న రక్‌సాక్‌ (వీపుపై వేసుకునే బ్యాగ్)ను భుజంపై వేసుకునేటప్పుడు అజ్మల్ కసబ్‌కు తన బాస్ మాటలు మళ్లీ గుర్తొచ్చాయి - 'నీ ముఖంపై చంద్రుడిని పోలిన వెలుగు విరజిమ్ముతుంది. నీ శరీరం నుంచి గులాబీ పరిమళాలు వెలువడుతాయి. నీవు నేరుగా స్వర్గానికి చేరుకుంటావు.' అని.

26 నవంబర్, రాత్రి 9 గంటల 43 నిమిషాలు, లియోపాల్డ్ కెఫే
ముంబయిలోని కోలాబా కాజ్‌వే చాలా వరకు లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్‌ను పోలి ఉంటుంది. సన్నగా ఉండే రోడ్డుకు ఇరు పక్కలా వరుసగా దుకాణాలూ, రెస్టారెంట్లుంటాయి.
రాత్రి 9 గంటల సమయంలో నలుగురు తీవ్రవాదులు మచ్ఛీమార్ నగర్, బుధ్‌వార్ పార్కు నుంచి ఒక ట్యాక్సీ మాట్లాడుకున్నారు. తాజ్ హోటల్‌కు వెళ్లాలని డ్రైవరుకు చెప్పారు. వారిలో ఒక వ్యక్తి నెమ్మదిగా ట్యాక్సీ వెనుక సీటుపై టైంబాంబును అమర్చాడు.
రీగల్ సినిమా సమీపంలో ట్యాక్సీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంది. అయితే ఎలాగోలా డ్రైవర్ వారిని లియోపాల్డ్ కెఫే దగ్గరకు చేర్చాడు. అక్కడ ఇద్దరు తీవ్రవాదులు షుయెబ్, నజీర్‌లు తమ బ్యాగులు, ఆయుధాలతో దిగిపోయారు. మిగిలిన ఇద్దరు తాజ్ వైపు ముందుకు సాగారు.
డ్రైవర్ కిశోర్‌బంద్ ఫూల్‌చంద్ వారిని తాజ్ సమీపంలో దించేసి మరోవైపు వెళ్లిపోయాడు. మజ్‌గాంకు చేరుకున్న తర్వాత కారులో పేలుడు జరగగా ఆయనా, ఆయనతో పాటు జరీనా షేఖ్, రీమా షేఖ్ అనే ఇద్దరు మహిళలు మృతి చెందారు.
షుయెబ్, నజీర్‌లిద్దరూ కొద్దినిమిషాల పాటు లియోపాల్డ్ ఎదుట నిలబడ్డారు. ఆ తర్వాత వారిలో ఒక వ్యక్తి మరొకతనితో 'ఓ భాయ్, బిస్మిల్లా చేద్దాం' అని అన్నాడు. అతడు లియోపాల్డ్ లోపలికి వెళ్లనే లేదు.
వారిద్దరూ రోడ్డు మీది నుంచే ఏకే-47 రైఫిల్‌లతో కాల్పులు ప్రారంభించారు. అక్కడున్న వాళ్లంతా భయంతో వెనుక భాగంలో ఉన్న గేటు వైపు పరిగెత్తారు. షుయెబ్, నజీర్‌లు ఫైరింగ్ చేస్తూనే ఒక ద్వారం నుంచి జొరబడి మరో ద్వారం నుంచి బైటికి వచ్చారు.
మొత్తం ఆపరేషన్‌కు ఒక్క నిమిషంకన్నా ఎక్కువ సమయం పట్టలేదు. అక్కడ మొత్తం 9 మంది మరణించారు. వాళ్లు రెస్టారెంట్ నుంచి మళ్లీ రోడ్డు మీదకు వచ్చిన తర్వాత కూడా ఫైరింగ్ చేస్తూనే ఉన్నారు.
అక్కడికి కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న కోలాబా సెక్యూరిటీ అధికారి స్టేషన్‌లో డ్యూటీలో ఉన్న ఇన్‌స్పెక్టర్‌కు ఏకే-47 తుపాకీ మోతలు వినిపించాయి. వెంటనే ఆయన లియోపాల్డ్ వైపు పరుగెత్తారు.
ఆయనకు మొదట అక్కడ బాంబు పేలినట్టు అనిపించింది. అక్కడ శవాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. వెంటనే ఆయన తన సహచరుడి దగ్గరున్న వాకీటాకీ తీసుకొని సౌత్ కంట్రోల్‌కు మొదటి సందేశం ఫ్లాష్ చేశారు - "21.48, కొలాబా 1ని లియోపాల్డ్ హోటల్‌కు పంపించండి." అని.


26 నవంబర్, రాత్రి 9 గంటల 45 నిమిషాలు, ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్
బోటుపై కూర్చోవడానికి ముందు కుబేర్ నావలో ఉన్నప్పుడే ఇస్మాయిల్ ఖాన్ వారందరికీ పసుపు, ఎరుపు రంగుల్లో ఉన్న 10 ఇమామీ జామిన్‌లు (చేతికి కట్టుకునే వస్త్రాలు) ఇచ్చాడు. వీటిని కుడి చేతికి కట్టుకోవాలని వారికి సూచించాడు.
ఇస్మాయిల్ ఖాన్, కసబ్‌లిద్దరూ బుధ్‌వార్ పార్క్ వద్ద పడవ దిగిన తర్వాత కొద్దిసేపు అక్కడే ఆగారు. ఎందుకంటే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవచ్చని వారు సందేహించారు. ఆ తర్వాత వారొక క్యాబ్‌ను ఆపారు. దాని నెంబర్ ఎంహెచ్-01-జీ779.
ఇస్మాయిల్ ఖాన్ ముందువైపు డోర్ తెరిచి డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. కారును వీటీ స్టేషన్ పోనివ్వమని అతడు డ్రైవర్‌ను ఆదేశించాడు. ఆ తర్వాత డ్రైవర్‌తో మాటలు కలిపాడు. డ్రైవర్‌ను మాటల్లో పెట్టడం అతని పని. తద్వారా వెనుక సీటులో కూర్చున్న కసబ్‌కు డ్రైవర్ సీటు కింద టైంబాంబు అమర్చేందుకు వీలు కలిగించాలి.
సీఎస్‌టీ దగ్గర దిగిన తర్వాత కసబ్ తన ఆయుధాల్ని బైటికి తీయడం కోసం పక్కనే ఉన్న ఓ టాయిలెట్‌ లోపలికి వెళ్లాడు. వీరిద్దరూ రెండో తరగతి ప్రయాణికులు ఉండే విశాలమైన వెయిటింగ్ రూంకు వెళ్లారు. అక్కడే టికెట్ కొనుక్కోవడానికి ప్రయాణికులు పొడవాటి క్యూలో నిల్చుని ఉన్నారు. వారిపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు.
కసబ్ ఫైరింగ్ చేస్తుంటే ఇస్మాయిల్ మాత్రం తనను ఎవరూ చూడకుండా ఉండే ఒక ప్రాంతంలో దాక్కున్నాడు. నిరాయుధ ప్రజలపై గ్రెనేడ్లు విసిరి వీలైనంత ఎక్కువ ప్రాణనష్టం జరిగేలా చూడడం అతడి పని.
తుపాకీ తుటాలు తగిలి జనాలు పిట్టలా రాలిపోయారు. కాల్పుల శబ్దం వినగానే రైల్వే అనౌన్సర్ విష్ణు జేండే ప్రయాణికులు వీలైనంత త్వరగా స్టేషన్ నుంచి బైటికి వెళ్లిపోవాలని లౌడ్ స్పీకర్‌లో ప్రకటించసాగాడు.
ఈ హెచ్చరిక ఫలితంగా చాలా మంది ప్రాణాలు దక్కాయి. అయినప్పటికీ ఈ ఫైరింగ్‌లో మొత్తం 58 మంది చనిపోయారు.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
26/11 - by అన్నెపు - 26-11-2018, 11:43 AM



Users browsing this thread: 1 Guest(s)