Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఒసేయ్ ఏంటే బాహుబలి సెట్టింగ్స్ లా మీ ఇంటిని మార్చేశావు అని సునీతక్క కాంచన అక్క లోపలికివచ్చి లోపల పూల decoration చూసి wow అంటూ నోరుతెరిచి కన్నార్పకుండా అలా చూస్తుండిపోయారు .



సినీ , కాంచన ...........అంటూ అమితమైన ఆనందంతో కేకలువేస్తూ పరుగునవెళ్లి ఇద్దరినీ అమాంతం కౌగిలించుకుని , వస్తారనుకున్నాను కానీ ఇంత త్వరగా వస్తారనుకోలేదు అని సంతోషంలో తడబడుతున్న మాటతో తియ్యదనంతో వణుకుతూ అడిగింది .

ఊరికే హీరో అయిన బుజ్జి తమ్ముడికి నేను సెకండ్ ఇది తరువాత థర్డ్ రాఖీ కట్టాలని నిన్నటి నుండే ఫోన్లో మాట్లాడుకుని తను ఇటు నుండి నేను అటు నుండి వచ్చి బస్ స్టాప్ లో కలిసి వచ్చేసాము . ఇంతకీ మా బుజ్జి హీరో ఎక్కడ అమ్మ దగ్గర ఉన్నాడా అని అడిగారు .

ఇంతలో అమ్మ ఒక్కటే వంట గదిలోనుండి వచ్చి అక్కయ్యలను ప్రేమతో పలకరించి కూర్చుని మాట్లాడుతూ ఉండండి కాఫీ తీసుకొస్తాను అనిచెప్పింది .

కాఫీ టీ లు తరువాత అమ్మా ...........ముందు పండుగ హీరో ఎక్కడ మమ్మల్ని చూడగానే లోపలే దాచేసారా .........అని తియ్యని కోపంతో అడిగారు. 



అమ్మ ముసిముసినవ్వులతో వంట గదిలోకి వెళ్ళిపోయింది .

ఒసేయ్ తమ్ముడు ఎక్కడే అని అడిగారు .

ష్ ష్ ........... నిన్న మొన్న రెండు రోజులు ఉదయం నుండి సాయంత్రం వరకూ ఆటలు ఆడి పూర్తి అలసిపోవడం వలన ఇంకా నిద్రపోతున్నాడు అని చెప్పింది అక్కయ్య .



ఒహ్..........sorry sorry ........అని సౌండ్ తగ్గించేసి ఎక్కడ పైనేనా అని హ్యాండ్ బ్యాగులు సోఫాలలో ఉంచేసి పైకి పరుగులుపెట్టారు . ఒసేయ్ నెమ్మదే అంటూ అక్కయ్య కూడా లంగాను చేతులతో పట్టుకుని పైకి పరిగెత్తింది .



సునీతక్క కాంచన అక్కయ్య బెడ్ మీద చెరొకవైపున చేరి ఉమ్మా..........మా బుజ్జి బుజ్జి తమ్ముడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడో అని బుగ్గపై ముద్దులుపెట్టబోయి ఏకంగా కొరికేసారు .



ఒక్కసారిగా నిద్రమత్తు ఎగిరిపోయినట్లు కెవ్వుమంటూ అరిచి లేచి కూర్చుని బుగ్గలను రుద్దుకుంటున్నాను . 

ఒసేయ్ మిమ్మల్ని అంటూ మొట్టికాయలు వేసి మధ్యలో కూర్చుని లేదులే తమ్ముడూ లేదులే అని బుగ్గలపై ముద్దులుపెట్టి ప్రాణంలా గుండెలపై హత్తుకుంది . 

ఏమిచెయ్యమంటావే చూసి రెండు రోజులు పైనే అవుతోంది . చూడగానే ఆ బుగ్గలను కొరుక్కుని తినేయ్యాలనిపించింది అని చిలిపినవ్వుతో బదులిచ్చారు .



 అక్కయ్యను గట్టిగా హత్తుకొని కళ్ళుతెరిచి అక్కయ్య ముఖాన్ని కనులారా తిలకించి రాఖీ శుభాకాంక్షలు అక్కయ్యా..........అని తియ్యని నవ్వుతో చెప్పాను .

ఈ మాట వినడానికి ఎన్ని సంవత్సరాలు వేచి చూసానో తమ్ముడూ ........నీవలన తీరింది అని ఆనందబాస్పాలతో బుగ్గలపై ముద్దులుపెట్టి , నా బుజ్జి తమ్ముడికి రాఖీ శుభాకాంక్షలు అనిచెప్పి పరవశించిపోతూ నుదుటిపై పెదాలను తాకించి ఏకమయ్యేలా హత్తుకుంది .



అక్కయ్య ఆనందాన్ని చూసి అక్కయ్యలిద్దరూ కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని , అక్కయ్య చేతులపై ముద్దులుపెట్టి ఒకేసారి రాఖీ శుభాకాంక్షలు తమ్ముడూ అని ఇద్దరూ చెప్పారు . 

రాఖీ శుభాకాంక్షలు సునీతక్కా , కాంచన అక్కయ్యా ..........అని బదులిచ్చాను . 

మీ అక్కయ్యకు మాత్రమేనా హగ్ మాకు లేదా అని చిరు అలకతో అడిగారు .



తమ్ముడూ పర్లేదు ఇవ్వు అని చెవిలో అక్కయ్య గుసగుసలాడటంతో అక్కయ్యలిద్దరినీ హత్తుకున్నాను . తమ్ముడూ ఈరోజు మొత్తం మీ అక్కయ్య ఆనందానికి అవధులు ఉండవు అనిచెప్పారు . 

అక్కయ్య ఆనందాన్ని చూసి చాలా చాలా మురిసిపోయాను .



నాన్నా .........లేచావా అని కాఫీ అక్కయ్యలిద్దరికీ అందించి , బెడ్ పై నుండి లేచివచ్చిన నన్ను అమాంతం హత్తుకొని రాఖీ పండుగ శుభాకాంక్షలు నాన్నా ....... మీ అక్కయ్యలిద్దరే కాదు కింద ఇంకా అక్కయ్యలు ఒకరి వెనుక మరొకరు వస్తూనే ఉన్నారు నీకు రాఖీ కట్టడం కోసం త్వరగా స్నానం చూయిస్తాను పదా అని వొంగి నుదుటిపై ముద్దుపెట్టింది .

అవునా అమ్మా.........అని అక్కయ్య రూమ్ బయటకువెళ్లి కిందకు చూసి ఊరి ఫ్రెండ్స్ అందరూ వచ్చి decoration ని ఆశ్చర్యపోయి చూస్తుండటం చూసి పొంగిపోయి hi hi hi ........అని పలకరించి అందరూ కాఫీ తాగుతూ కూర్చోండి వచ్చేస్తాను అనిచెప్పి లోపలికివచ్చింది .



అమ్మా ........రోజూ మీరే స్నానం చేయిస్తారు కదూ ఈరోజుకి మాత్రం మేము స్నానం చేయిస్తాము అని సునీతక్క అడిగింది . 

అమ్మా వద్దు నాకు సిగ్గు అని అక్కయ్యను సైడ్ నుండి చుట్టేసాను . 

ఒసేయ్ కొత్త బట్టలు వేసుకొచ్చారు తడిచిపోతాయి వద్దు కిందకు వెళ్లి అందరితో మాట్లాడుతూ ఉండండి అని అక్కయ్య వారించింది . 

డ్రెస్ తడిచిపోయినా పర్లేదు , మాసిపోయినా పర్లేదు మా హీరోకి స్నానం చేయించే తీరుతాము ఊ .........అన్నారు . 

ఊహూ .......... అని అక్కయ్య , ఊ ........అని అక్కయ్యలు మాట్లాడుతుంటే , 



నెమ్మదిగా అమ్మదగ్గరికివెళ్లి టవల్ కొత్తబట్టలు తీసుకుని సైగలు చేసుకుని ఇద్దరమూ బాత్రూమ్లోకి దూరిపోయి లోపలినుండి గొళ్ళెం పెట్టేసాము .

ఆ చప్పుడుకు తిరిగి చూసి అమ్మో .........జాదు అని తలుపు దగ్గరికివెళ్లి తమ్ముడూ తమ్ముడూ please please........ అని ప్రాధేయపడుతుంటే ,

అక్కయ్య నవ్వుకుని అయ్యిందా ..........రండి కిందకు వెళదాము అని బిగిపెట్టుకున్నా లాక్కొని వెళ్ళిపోయింది.



అమ్మ తలంటు స్నానం చేయించి డోర్ నెమ్మదిగా తెరిచి చూసి లేరు నాన్నా ........ అని బయటకువచ్చి బెడ్ పై కూర్చుంది . 10 నిమిషాలలో కొత్తబట్టలు వేసుకుని బయటకువచ్చి అమ్మా ఎలా ఉన్నాను అని స్టీల్ ఇస్తూ అడిగాను .

నా బంగారుకొండ బుజ్జి హీరోలా ఉన్నాడు అని హత్తుకొని నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి దువ్వెన పౌడర్ స్ప్రే అందుకొని రెడీ చేసింది . 



తమ్ముడూ ..........wow అంటూ అక్కయ్యలు వచ్చి సూపర్ అంటూ ఒకేసారి అక్కయ్య నుదుటిపై అక్కయ్యలిద్దరూ బుగ్గలపై కొరకబోయి అక్కయ్య చేతులను చూసి ముద్దులు మాత్రమే పెట్టారు .



కాంచన అక్కయ్య చేతిలోని ప్లేట్ ముందుకు తెచ్చి ముగ్గురు అక్కయ్యలూ ప్రేమతో తినిపించారు . అక్కయ్యలూ మీరు తినండి అని చెప్పాను . 

తమ్ముడూ మేము ఇందాకనే తిన్నాము . మీ అక్కయ్య నువ్వు తినకుండా తింటుందా అని అక్కయ్యకు కూడా తినిపించారు . 

అక్కయ్య గుండెలపై వాలిపోయి కడుపునిండా తిన్నాను . 

ఇంతలో కృష్ణగాడు పరుగునవచ్చి డోర్ దగ్గర ఆగిపోయి చిరునవ్వులు చిందిస్తూ నిలబడ్డాడు . 

రేయ్ రారా........అని పిలిచాను . 

ఇంట్లో తినేసి వచ్చానురా అని వద్దన్నాడు .

అక్కయ్య లేచివెళ్లి పిలుచుకొనివచ్చి నా ప్రక్కనే కూర్చోబెట్టి నీ ప్రాణ స్నేహితుడితోపాటు కొద్దిగా తిను అని తినిపించింది . 



తమ్ముడూ నీ ప్రాణ స్నేహితుణ్ణి మాకు పరిచయం చెయ్యవా .........అని చిరుకోపంతో అడిగారు . 

అక్కయ్యలూ వీడు కృష్ణ నా ఫ్రెండ్ అంటూ భుజం చుట్టూ చేతినివేశాను , రేయ్ కృష్ణ సునీతక్క కాంచన అక్క అని పరిచయం చేశాను .

కృష్ణ మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి అని చెప్పారు . 

అలాగే అక్కయ్యా .........అని బదులిచ్చాడు .



కడుపు నిండిపోవడంతో అక్కయ్యలూ ఇక చాలు వీడికి తినిపించండి అని చెప్పాను. రేయ్ నాకు డబల్ నిండిపోయింది అని లేచి నిలబడ్డాడు . 

కృష్ణ నీళ్లు తాగు అని మారిద్దరికీ తాగించారు . 

రేయ్ నీకు రాఖీ కట్టడానికి ఊరిలో ఉన్న అక్కాచెల్లెళ్ళందరూ వచ్చారురా , మన ఊరి నుండి మాత్రమే కాదు ప్రక్క ఊరి నుండి చైర్మన్ గారి కూతురంట తనతోపాటు కొంతమంది అక్కయ్యలు కూడా వచ్చారు అనిచెప్పాడు .



కవితక్క .........కవిత వచ్చిందా అని ఇద్దరమూ ఒకరినొకరు చూసుకుని సంతోషించాము . ఒసేయ్ కాంచన వదిలేసి వచ్చేసావా .........అని బుగ్గపై ప్రేమతో కొట్టి మెట్ల దగ్గరికివెళ్లి కవితా పైకి వచ్చెయ్ అని అక్కయ్య పిలవడంతో నవ్వుకుని పైకివచ్చి మన ఊళ్ల బుజ్జి దేవుడు పైన రెడీ అవుతున్నాడా అని రూంలోకి వచ్చి ముందుగా రాఖీ శుభాకాంక్షలు తెలిపింది . తరువాత అమ్మను సునీతక్కను పరిచయం చేసింది . అందరూ సంతోషంతో చిరునవ్వులు చిందిస్తుండటం చూసి అమ్మ మురిసిపోయి తల్లి , సునీత ............ సెలబ్రేట్ చేసుకునే సమయం అని చెప్పింది . 



అంతే అమితమైన సంతోషంతో అక్కయ్య హృదయవేగం పెరిగి పరవశించిపోయి తమ్ముడూ అని ప్రాణంలా హత్తుకుంది . అమ్మ మా ఇద్దరి తలలపై ముద్దులుపెట్టి సునీత మీ తమ్ముణ్ణి పిలుచుకొని రండి కింద అన్ని ఏర్పాట్లు చేస్తాను అని వడివడిగా వెళ్ళిపోయింది .



అక్కయ్యలు నాచెరొక చేతులను అందుకొని ప్రేమతో ముద్దులుపెట్టి , అక్కయ్య మరొక చేతితో కృష్ణ గాడి చేతిని పట్టుకుని వెనుక కాంచన కవిత అక్కయ్యలతోపాటు కిందకు వచ్చాము . సుమారు 15 మందికి పైగా అక్కయ్యలు పరుగున నన్ను చుట్టేసి రాఖీ విష్ చేశారు . సంతోషంతో అందరినీ విష్ చేసాను . తన తమ్ముడి కోసం ఇంతమంది రావడం చూసి అక్కయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . 



ఒసేయ్ వాసంతి మొదట మా బుజ్జి దేవుడికి నువ్వు రాఖీ కట్టేసావంటే మేము కూడా కడతాము . నీది ఆలస్యం అయితే చెప్పు ముందు మేమే కట్టేస్తాము అని అక్కయ్య ఊరి ఫ్రెండ్స్ ముసిముసినవ్వులతో చెప్పారు . 



అక్కయ్య సంతోషంతో నవ్వుకుని అమ్మా ..........అని కేకవేసింది . 

తల్లి వచ్చేస్తున్నాను అని రాఖీ , కుంకుమ , అక్షింతలు , స్వీట్ అన్నింటినీ హారతి పళ్ళెంలో తీసుకొచ్చింది . 



 Decoration చూసి మురిసిపోతున్న నన్ను చూసి సంతోషంతో తమ్ముడూ .........అని చేతిపై ముద్దుపెట్టి  పూలతో అలంకరించిన దగ్గరకు తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది . 



కెమెరా మ్యాన్ తనపని తాను చేసుకుపోతున్నాడు . 

అక్కయ్యలందరూ చుట్టూ చేరి మాటల్లో వర్ణించలేని ఆనందంతో జలదరిస్తున్న అక్కయ్యను చూసి వాసంతి కానివ్వు అని సంతోషంతో భుజాలపై చేతులువేసి చెప్పారు . 

నేను దిక్కులు చూస్తుండటం చూసి , అమ్మా .........అని అక్కయ్య అమ్మ చెయ్యి అందుకొని ప్రక్కకు పిలుచుకుంది . 

నా ఆనందం చూసి పళ్ళెం లోని రాఖీని ఇష్టంతో అందుకొని తమ్ముడూ హ్యాపీ రక్షాబంధన్ అని చేతిని అందుకొని కట్టింది . 

హ్యాపీ రక్షాబంధన్ అక్కయ్యా .........లవ్ యు sooooo మచ్ అక్కయ్యా ....... అని ఆనందబాస్పాలతో అక్కయ్యను ప్రాణంలా హత్తుకున్నాను .

లవ్ యు soooooo మచ్ తమ్ముడూ అని అంతే ఆనందబాస్పాలతో నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టింది.



తల్లి అంటూ అమ్మ అక్కయ్యకు హారతి పళ్ళెం అందించడంతో , తియ్యని చిరునవ్వుతో అందుకొని నుదుటిపై కుంకుమ పెట్టి హారతిని పట్టి అక్షింతలతో తలపై ఆశీర్వదించి చిరునవ్వులు చిందిస్తూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి స్వీట్ తినిపించింది . 



అంతే అందరూ చప్పట్లతో అక్కయ్యను మూడువైపులా హత్తుకొని ఆనందాన్ని పంచుకున్నారు . 



నెక్స్ట్ నా ప్రక్కనే కూర్చున్న కృష్ణ గాడికి కూడా అక్కయ్య రాఖీ కట్టి హారతి ఇచ్చి స్వీట్ తినిపించింది .



వాసంతి ఏ ఇంటిలో ఏ అక్కా చెయ్యలేనివిధంగా ఘనంగా నీ ప్రాణమైన తమ్ముడికి రాఖీ కట్టావు . మరి నువ్వే ప్రాణమైన నీ తమ్ముడు ఏ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు అని వెనుక నుండి ఎవరో మాట్లాడారు . 



అక్కయ్య కోపంతో వెనక్కు తిరిగి నా తమ్ముడే నాకు ప్రపంచంలోనే అత్యంత విలువైన గిఫ్ట్ అని బదులిచ్చింది . 

అది ఆచారం కదా కనీసం వంద రూపాయలైనా ఇవ్వకపోతే ఎలా , మహేష్ పది రూపాయలైనా పర్లేదు ఎందుకంటే మీ అక్కయ్య జీవితంలో తొలి రాఖీ పండుగ నువ్విచ్చేది చిన్నదైనా జీవితాంతం దాచుకోవాలి కదా అని మళ్ళీ మాటలు వినిపించడంతో అందరూ ఎవరా అని ఒకరినొకరు చూసుకున్నారు .



 అంతే అక్కయ్య కళ్ళల్లో చెమ్మచేరి అమ్మా..........అని సైగ చేసేంతలో , అమ్మ తన చీర కొంగులో దాచుకున్న రెండు కట్టల డబ్బులు తీసి నాకు అందించబోయింది . 



అమ్మా .......... ఒక్క నిమిషం అని ఆపి అక్కయ్య చేతిని అందుకొని మా ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టి , కన్నీళ్లను తుడిచి చేతిని చుట్టేసి మా అక్కయ్య ప్రేమని ఇంతా అంతా అని కొలవలేము . నీ బుజ్జి తమ్ముడు మీకోసం ఒక అమూల్యమైన గిఫ్ట్ తీసుకొచ్చాడు అని కృష్ణ గాడివైపు సైగ చేసాను . వాడు అమ్మా అని గట్టిగా కేకవేశాడు . 

ఇదిగో మహేష్ ..........అని అమ్మ వడివడిగా వచ్చి గిఫ్ట్ బాక్స్ అందించింది . 

మా అక్కయ్యకోసం ఈ ఇద్దరు తమ్ముళ్లు కలిసి ప్రేమతో ఇస్తున్న గిఫ్ట్ అని అందించాము .



అంతే అక్కయ్య కళ్ళల్లో అంతులేని ఆనందబాస్పాలతో లవ్ యు తమ్ముడూ అని ప్రాణమైన ముద్దులుపెట్టి గిఫ్ట్ ను గుండెలకు హత్తుకుంది . 



అమ్మ కూడా తన కన్నీళ్లను తుడుచుకుని మా బంగారం అని బుగ్గలను స్పృశించి మురిసిపోతోంది .

గిఫ్ట్ లో ఏముందో మేమంతా చూడాలనుకుంటున్నాము వాసంతి అని అక్కయ్య ఫ్రెండ్స్ అడగడంతో , 

ఆనందంతో పొంగిపోతూ తెరవనా తమ్ముడూ .........అని కళ్ళతోనే అడిగింది . 

దైర్యంగా అక్కయ్యా ..........అని కృష్ణగాడు నేను సంతోషంతో హైఫై కొట్టుకున్నాము.



నా తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్ కవర్ కూడా నాకు అమూల్యమే అన్నట్లు అక్కయ్య నెమ్మదిగా కవర్ వేరుచేసి white బాక్స్ ఓపెన్ చేసింది . 

ఒక ప్రక్క కళ్ళమందిర్ కవర్ మరొక ప్రక్క జ్యూవెలరీ బాక్స్ లను అందరూ తొంగి తొంగి చూసి wow .........అని ఆశ్చర్యపోతుంటే మొదట జ్యూవెలరీ బాక్స్ లను అక్కయ్య ఒక్కొక్కటే తియ్యబోతుంటే ,



One............. గోల్డ్ బ్యాంగిల్స్ ,

Two ............డైమండ్ రింగ్ wow బ్యూటిఫుల్ ,

Third ............ear రింగ్స్ లవ్లీ , 

అండ్ fourth .........పట్టీలు ............అంటూ ఆనందంతో ఒకరిపై మరొకరు పడి మరీ చూసి తమ్ముడూ మీ అక్కయ్యను ఎవరెస్టు శిఖరం ఎక్కించేశావు అని అక్కయ్యను సునీతక్క , కాంచనక్క వెనుక నుండి హత్తుకొని నన్నాయితే ఆకాశానికి ఎత్తేశారు .



Wait wait wait ...........మరొకటి కూడా ఉందికదా అది ఖచ్చితంగా చీరనే అయి ఉంటుంది . మామూలు చీరనా పట్టుచీరనా .............please please please కాస్త తొందరగా తీసి చూపించవే ఇక్కడ టెన్షన్ లో మా గుండెలు ఆగిపోయేలా ఉన్నాయి అని కోరడంతో ,



అక్కయ్య ఆనందానికి అంతే లేనట్లు కొద్దిగా బాక్స్ ఓపెన్ చేసిందో లేదో పట్టుచీర ............అని సంతోషంతో గట్టిగా కేకలు వేశారు . అక్కయ్య చీరను తీసి కళ్ళల్లో చెమ్మతో అమ్మకు చూపించింది . సంతోషంలో అమ్మ నోటివెంట మాట రానంతలా మైమరిచిపోతోంది . 

ఒసేయ్ వాసంతి this is the best gift ever given by brother to sister , నీ అంత luckiest ఈ భువిపై ఎవ్వరూ లేరు అని అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టారు.

తమ్ముడూ మహేష్ .............పిచ్చెక్కించావు . మీ అక్కయ్యలో ఈ ఆనందం చూడటానికే వచ్చాము . నీవలన చూసేసాము అంటూ నా బుగ్గలను ఏకంగా కొరికేశారు .



తల్లి తొందరగా వెళ్లి నా బుజ్జి తండ్రి ప్రేమతో ఇచ్చిన చీరను కట్టుకుని రా అని చెప్పింది . 

Yes yes yes ...........అంటూ అమితానందంతో తల ఊపడం చూసి , 

తమ్ముడూ నీకు కూడా నన్ను ఈ పట్టుచీరలో చూడాలని ఉందా అని నా బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి కొద్దిసేపు wait చెయ్యి అని లేచి అమ్మ చేతిని అందుకొని పైన రూంలోకి వెళ్ళింది.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 14-02-2020, 10:36 AM



Users browsing this thread: 194 Guest(s)