09-02-2019, 01:39 PM
MV Blue Star .......
మైకల్ రిజ్వీ....... షిప్ కాప్టన్.....
తన క్యాబిన్లో ఆలోచనలతో సతమత మౌతూ..... ముందు గ్లాసు లో స్కాచ్ ఆన్ ది రాక్స్ ....... ఈ మద్య మందు కాస్త ఎక్కువైయింది..... అంతేకాదు చిరాకుకూడా ఎక్కువైయింది..... పాకిస్తాన్ లో ఆ నాలుదు కంటైనర్ లు లోడ్ అయినప్పటినుండి మనిషి తరహా నే మారిపొయ్యింది ప్రతి చిన్న చిన్న విషయాలకి మండిపడడంలాంటివి మొదలయ్యాయి .....ఈరోజు కాస్త ఎక్కువ....
కారణం......
సుమారు 1250 nm దూరం జిభూటి నుండి
మొగదీసు (సోమలియ) ఓడరేవు కు.......
జిభూటి నుండి మడగాస్కర్ కి సుమారు 3000 నాటికల్ మైల్లు ........ పోతు పోతు మద్యలో మొగదీసు లో ఎంటర్ అయ్యి ఆ నాలుగు కంటేనర్ లు ఆ ఉడన్ క్రేట్ అన్ లోడ్ చేసి వెల్లవచ్చు ఒక రోజు పని
కాని మడగాస్కర్ కు వెల్లి తిరగి వచ్చే సమయంలో అన్ లోడ్ చేస్తే చాలు అని సందేశం పంపారు షీప్పింగ్ కంపెని.....
మడగాస్కర్ లో షిప్ మేయిన్ టెనెన్స్ కొరకు ఎంటర్ అవుతుంది వారం రోజుల రొటిన్ మేయిన్ టేనెన్స్ దానికి ఒక రోజు లేట్ అయినా పరువాలేదు.....
తనకి ఈ కంటేనర్ల పీడ తొందరగా వదిలించు
కోవాలని ఉంది.......ఊఃహు, కంపెని కి చీమకుట్టినట్లుకూడాలేదు ...... కస్టమ్స్ చెక్ చేస్తే ...... మొదట తను జైలుకు వెల్లేది....
తన కారియర్ అంతటితో గోవిందా...
రిజ్వీ టెన్సన్ లో ఉన్నాడు.
రిజ్వీ కి పూర్తిగా నమ్మకం ఆ కంటేనర్లు
టేర్రరిస్ట్ లకు కావలసిన ఆయుదాలతో నిండి ఉన్నాయని.....
కాని నిజానికి రెండు కంటేనర్ లలో మందులు
బట్టలు భక్ష్య పదార్థాలు మొదలైనవి........ రెడ్ క్రాస్ కొరకు .......
మిగత రెండు కంటేనర్లలో
రిజ్వీ అనుకొన్నట్టే..... ఆయుదాలు...... రష్యన్ మేడ్ AK47 అసల్ట్ రైఫల్స్,...... గ్రేనేడ్ లాంచర్స్...... రాకెట్ లాంచర్స్... ప్లస్ వాటికి కావలసిన ammunition
మరి ఆ ఉడన్ క్రేట్లో ............?
..........
SI నర్సిములు జఫర్ భాయ్ నిఅతని అనుచరులను జీపు లో ఎక్కించి పోలిస్ స్టేషన్ వైపు పోసాగడు 15 ని.దూరమే కాని తలలో ఆలోచించడానికి రకరకాల ప్రశ్నలు ....
ఇంత వరకు RAW ఏజెంట్లు అని విన్నాడే కాని ఇదే మొదటి సారి చూడడం అదీ డెప్యూటి డైరెక్టర్ ని...... ఈ నా కొడుకులకు తెలువదు ఎవ్వరితో పంగా తీసుకొన్నారో.....
ఆలోచిస్తుంటేనే వళ్లు గగుర్పొడుస్తుంది....
ఓ.... వీల్లను నాలుగు పీకి వదలమన్నాడు కాబట్టి దొరికిన కాడికి దండుకొని ఇడుస్దాం
అనుకొన్నాడు.......
అదే 15 నిమిసాలు....
జఫర్ భాయ్ కి ఈ పదేళ్ల లో ఈలాంటి షాక్ తగలడం మొదటి సారి....
మొదట్లో చిన్న చిన్న గొడువలు చేసినప్పుడు కూడా పోలిస్ స్టేషన్ కి వెల్లలేదు నల్లకుంట,ముషీరాబాద్ పోలిస్ స్టేషన్ లలో తన పేరిట దంగాలు చేసిన 2, 3 కేసులు ఉండేవి కాని ఈ మద్య ఈ కొత్త ఆపరేషన్ మొదలయ్యాకా ఆ స్టేషన్ S.I లకు డబ్బులు పోసి ఆ పేపర్లు F.I.R లు గయబ్ చేపిచ్చిండు
ఇప్పుడు తన పై కేసులు కాని పోలిస్ రికార్డలలో తన పేరు కాని లేదు. అలా ఉండకూడదు అని హై కమాండ్ ఆజ్ఞ.....
మరి ఇప్పుడో....... ఒక చిన్న కేసు ......గిల్లితే పొయ్యేదాన్ని.....గోకి గోకి రాచపుండు చేసుకొన్నాడు. ఈ సంగతి హైకమాండ్ కు
తెలిస్తే...... చాలా డెంజర్ మనుసులు.... తన గతి ఇక అంతే.... భయంతో శరీరం ఒకసారి వణికింది
ఇప్పటివరకు జఫర్ భాయ్ కి అర్థం కానిది ఈ సిద్దు గాడు ఎవడు....... ఒక సాసార్ ముక్కతో తనను తన అయిదుగురు మనుస్యులను కొట్టిందేకాకా పదే పది నిమిసాలలో తనని పోలిస్ స్టేషన్ కు పంపాడు ..... ఇక అయ్యింది ఎదో అయ్యింది ఇక పై జాగ్రతగా ఉండాలి
దీన్ని ఇక్కడే క్లోస్ చెయ్యాలి అనుకొంటూ
" SI సాబ్ " భాయ్
"ఆ... ఏమిట్ది రా.." SI
"నేనెవ్వరో తెలుసా" భాయ్
" పాత బస్తి జఫర్ బాయ్ వే గదా ,నల్లకుంట పోలిస్ స్టేషన్ ల దంగా కేసు ఉన్నది గదా నీ పేర్ల ఎట్ల మరుస్త అనుకొన్నవ్ భే " SI
"మీకెట్ల తెలుసు సార్ ,సాన పాతది ఆ కేసు"
" నా ట్రేనింగ్ నల్లకుంటలనే చేసిన" SI
"ఇప్పుడు ఆ కేసులు గిట్ల ఏం లేవు సార్...
ఇప్పుడు శరీఫ్ దందల్ చేసి బతుకుతున్నం సార్"
" ఔరా సాలే, ఇదే గదా నీ షరీఫ్ దందా"SI
"ఎం చెయ్యమంటవ్ సార్, పొయిన వారం కాలేజ్లా నా చెల్లెల్ కొడుకును ఊకనే కొట్టిండు ఆ సిద్దు అనెటోడు ..... మా పోరగాడు ఇంకా దవఖానలనే ఉన్నడు ఒక హఫ్త ICU ల ఉండే
గా సంగతి అడగనికె పొయిన సార్" భాయ్
"గదేం తెలువదు గాని మీరు గలత్ ఆద్మీలతోటి పంగ తీసుకొన్నార్రా "SI
"ఆడు మమ్ములను కొట్టే ఇగ మీరే సూడు సాబ్ ఇబ్రాహిం గాని చెయ్యి పూర ఖూన్ ఖూన్ జేసిండు " తన చెయ్యి కట్ అయిన అనుచరున్ని చూయిస్తూ భాయ్
"ఇప్పుడు నివ్వనేది ఎమిట్ది గది చెప్పు బే"
SI కి బేరం జరగబోతుంది అని అర్థం అయ్యింది
" సార్ ఆడు మమ్లను కొట్టే...... ఆడు పాయ్
ఇగ నివ్వేమో మా మీన కేస్ అంటున్నవు, ఇగ మమ్ములన్ కూడ ఇడువుండి ఇగ కిద్మత్ ఎమ్మన్న చెయ్యమంటె చేస్తం" భాయ్
"పంద్రా హజార్ ఎమంటవ్" SI
జఫర భాయ్ ఎగిరి గంతేసినంత పని చేసాడు
అయినా అది చూయించకుండా.....
" సాన ఎక్కువ సాబ్, గింత చిన్న కేసు కు..... మనిషికి హజార్ రూపే సాబ్" భాయ్
" కేసు చిన్నదే గాని పెట్టుకున్నది పెద్దోనితోటి తెలుసా........RAW తో..... ఱా అంటే తెలుసా
తీసుకు పొయ్యి ఎన్ కౌంటర్ చేసి పడేస్తరు"
SI మండిపడ్డాడు
జఫర్ భాయ్ గుండే గతుక్కుమంది తను అనవసరంగా RAW కళ్ళలో పడ్డాడని హై కమాండ్ కి తెలిస్తే మల్లీ వణుకు పుట్టింది
అయినా మేకపోతు గాంభీర్యంతో " దస్ ఫైనల్ సాబ్ బండి గా హోటల్ ముంగల ఆపుండ్రి పైసల్ ఇంతజామ్ చేస్త " SI
నర్సిములు "దస్ నాకు దో ఈ ఇద్దరు కానిస్టేబుల్లకు" బండి సైడ్కు ఒక హోటల్ ముందు ఆపుతూ అన్నాడు
"ఠీక్ హై సాబ్, " అంటూ జఫర్ బాయ్ హోటల్లోకి నడిచాడు హోటల్ కౌంటర్ లో కూర్చున్న అతనితో "సర్దార్ మియా సలాంవాలేకుం"
"వాలేకుం సలాం భాయ్ ఎంటి ఈ వైపు...?అశ్చర్యంగా అడిగాడు సర్దార్
" కుచ్ నహి మియా....చిన్న పని ఉండి ఇటు వైపు వచ్చా ఒక పన్నెండు వేలు అవసరం ఉంది ,రెండు గంటల్లో తిరిగి పంపిస్తా" భాయ్
"అదేం మాట భాయ్ తొందరేమి లేదు మెల్లిగ
పంపండి " అంటు డబ్బు లెక్క పెట్టి భాయ్ చేతిలో పెట్టాడు
" శుఖిరియా సర్దార్ మియా శామ్ తక్ పంపిస్తా" అంటూ భయటకు నడిచాడు
అక్కడే రోడు మీద నర్సిములు చేతిలో డబ్బు పెడుతూ" బారా హజార్, గిన్ లో" అన్నాడు.
"అవసరం లేదు భాయ్ ,అంటూ అందరిని దింపేసి జీపు స్టార్ట్ చేసి తన స్టేషన్ వైపు వెల్లి పొయాడు........
అది చూస్తూ జఫర్ భాయ్ ఒక దీర్గ నిశ్వాసం వదిలాడు పెద్ద గండంనుండి బయట పడ్డందుకు "యా అల్లా, యా ఖుదా" అనుకుంటూ

mm గిరీశం