Thread Rating:
  • 6 Vote(s) - 2.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భర్త కథ-విజయ్
ఎదురుగా ఉన్న పెద్దాయన నవ్వుతూ కంగారు పడకు... నీకు ఏం కాలేదు నీకు సరిపోయే బట్టలు ఇక్కడ లేవు అందుకే నా నిక్కర్ నీకు వేయమని చెప్పాను...అది కొంచెం లూజుగా ఉంటుందని చెప్తున్నాను అంతేనయ్య సుబ్బారావు.... అలా అనగానే విజయ్ ఆ పెద్దాయన వైపు అయోమయంగా చూస్తున్నాడు మళ్లీ ఆ పెద్దాయనే నవ్వుతూ నువ్వు ఆపకుండా మాట్లాడుతుంటే సరికి అలా అన్నాను అంతే నీకు ఏం కాలేదు అని చెప్తున్నాను కదా నీకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత నీ బాడీ యాక్టివ్ గానే ఉంది ..కానీ మైండ్ మాత్రం ట్రీట్మెంట్ కు సహకరించలేదు అందుకే ఇన్ని రోజులు నిద్రలో గడిపెసావ్ దీన్ని కోమాలో ఉండడం అంటారు అనుకుంటా నువ్వు దాదాపు నెల రోజులు నిద్ర పోయావు కాదు కాదు.... అలా నిద్ర పోయేలా చేసింది నీ మనసు అన్నాడు...
 విజయ్ కి అది కూడా అర్థం కాక చూస్తూ ఉంటే ఆయన అవునయ్యా కుటుంబరావు నీ మనసే నిన్ను ఇన్ని రోజులు ఇలా కోమాలో ఉండేలా చేసింది లేకపోతే నీకు తగిలిన దెబ్బలకు ఏ రెండు మూడు రోజుల్లోనే సృహవచ్చి ఉండేది... కానీ నీ మనసు మాత్రం చావాలని బలంగా మంకు పట్టు పట్టుకుని కూర్చుంది దాదాపు నెల రోజులు నీతో ఆమరణ నిద్రాహార దీక్ష చేయించింది....మరి ఇప్పుడు ఏమనుకుందో ఏమో దీక్ష విరమించినట్టుంది.... ఇప్పుడు ఇంకేం భయం లేదు ఇది నా క్లినిక్కే  నువ్వు కొద్దిసేపు రెస్ట్ తీసుకో సాయంత్రం అన్ని వివరంగా మాట్లాడుకుందాం అని అంటూ వెళ్ళబోతూ ఉంటే విజయ్ మళ్లీ అది కాదు సార్ అని ఏదో అడగబోయే లోగా ఆయన వెనక్కు తిరిగి చెప్పాను కదా సాయంత్రం అన్ని మాట్లాడుకుందాం అని నువ్వు కంగారు పడకయ్య క్రిష్ణా రావు అని చెప్పి వెళ్ళిపోయాడు....

విజయ్ కి అంతా విచిత్రంగా అనిపిస్తోంది ఆయన వయసు కి మాట్లాడే మాటలకి అసలు సంబంధమే లేదు చాలా హుందాగా కనిపిస్తున్నాడు... కానీ చలాకీగా మాట్లాడుతున్నాడు సొంత మనిషిలా కలిసిపోతూ పిలవడం కూడా బాగానే ఉంది కానీ ఆయన కొత్త కొత్త పేర్లు అన్నీ తనకు నామకరణం చేస్తుంటే నవ్వొస్తోంది అతనికి.....కొద్దిసేపు అలాగే మంచంపై వాలి తన ఇంట్లో వాళ్లు ఎలా ఉన్నారో ....
‌అసలు రమ్య ఎలా ఉందో అని ఆలోచిస్తూ నేనసలు ఎక్కడున్నాను ఇది.... ఆయన ఏమో దీన్ని క్లినిక్ అంటున్నాడు కానీ నాకు అలా అనిపించడంలేదు హాస్పిటల్ లో ఉండే వస్తువులు ఒక్కటి కూడా లేవు ఏదో పాతకాలంనాటి భవంతి లా ఉంది అని చాలాసేపు వరకు మంచం మీద దొర్లి నిద్రపట్టక లేచి నడుస్తూ బయటికి వచ్చి చూడగానే చుట్టూ పూర్తిగా అడవి బంగ్లా కి వెనకవైపు అంతా నీళ్లే బహుశా అది నది కాలువ అనుకుంటా దూరంగా పెద్ద సెలయేరు కనిపిస్తుంది....అలా మెల్లి మెల్లిగా నడుచుకుంటూ పూర్తిగా బంగ్లా బయటికి వచ్చి ఎదురుగా నిల్చుని దాన్ని పరిశీలించ సాగాడు.... అది బ్రిటిష్ కాలంలో కట్టిన బంగ్లా పూర్తిగా యూరోపియన్ ఆర్కిటెక్చర్ భవనం పాత పడింది కానీ కానీ ఇంకా దృఢంగానే ఉంది... చుట్టూ అసలు జన సంచారమే లేదు ఇలాంటి అడవి మధ్యలో ఈ బంగ్లా ఎందుకు కట్టించినట్టు అర్థం కాలేదు....
ఇంతలో తన కోసం విజయ్ రూంలోకి వెళ్లి తను లేకపోవడంతో బయటకు వచ్చి బయట కాంపౌండ్ లో ఉన్న విజయ్ ని చూస్తూ మళ్ళీ ఆ పిల్లవాడే సార్ మీరు ఇక్కడ ఉన్నారా అబ్బు మిమ్మల్ని టీ తాగడానికి రమ్మని పిలవ మన్నాడు అని చెప్పాడు...
 మీ భాయిజాన్   Namaskar
[+] 11 users Like bhaijaan's post
Like Reply


Messages In This Thread
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 19-12-2019, 09:37 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 09-01-2020, 12:29 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by bhaijaan - 09-02-2020, 03:55 PM



Users browsing this thread: