09-02-2020, 03:42 PM
Chapter 2
అజ్ఞాతవాసి
Episode:Semi finale
నీలగిరి అడవుల్లో తమిళ నాడు కేరళ సరిహద్దు ప్రాంతం:
బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన మానసిక రోగుల ఆసుపత్రి .అప్పట్లో దానిని వారికి ఎదురు తిరిగిన వారిని చిత్రహింసలు పెట్టడానికి వాడేవారు... కాలక్రమంలో అది మరుగున పడిపోయింది... కథలా మిగిలిపోయింది.. కాలం దాన్ని మరిచిపోయింది...కానీ ఇప్పుడు అందులోని ఒక గదిలో........
అదొక విశాలమైన గది ..మధ్యలో పాతకాలంనాటి బర్మ్మా టేక్ మంచం ఆ మంచాన్ని పూర్తిగా ఆక్రమించేసిన ఒక 40 ఏళ్ల మగ కాయం. రోజు వారి అలవాట్లులో భాగంగా ఆ గదిలోకి వచ్చిన ఒక వ్యక్తి ఏలోకంలోఆలోచిస్తూ నడుస్తున్నానాడో...తన చేతిలోని ప్లేటు జారీ కింద పడిపోయి పెద్ద శబ్దం చేశాక గానీ ఈ లోకం లోకి రాలేదు... అదే శబ్దానికి ధడేల్ మని అక్కడ పడుకున్న వ్యక్తికి కలలోతనకు జరిగిన యాక్సిడెంట్ గుర్తుకు వచ్చినట్టు ఒక్కసారిగా హ...... అంటూ లేచి కూర్చున్నాడు..ఎదురుగా నిలబడ్డ వ్యక్తి ఆనందంతోపాటు ఆశ్చర్యపడుతూ అబ్బూ అబ్బూ అంటూ గదిలో నుండి బయటకు పరిగెత్తాడు. అతని ఆనందానికి కారణం నెలరోజులు నుండి ఆ మంచంపై పడి ఉన్న వ్యక్తి లేచి నందుకు అలాగే ఆశ్చర్యానికి కారణం నెల రోజుల నుండి కనీసం చిటికెన వేలు కూడా కదిలించకుండా పడిపోయి ఉన్న వ్యక్తి అలా సరాసరి లేచి కూర్చుని సరికి ఆశ్చర్య పడి పరిగెత్తాడు..ఇప్పటికే చదివే మీరందరికీ అర్థం అయిపోయి ఉంటుంది అక్కడ కూర్చున్న వ్యక్తి మన కథ నాయకుడు అని....యావత్Xossipy ప్రపంచం చనిపోయాడు ఏమో అని ఆలోచిస్తూ బాధపడుతూ కోల్పోయిన నీ ప్రేమను దక్కించుకోవడానికి మళ్ళీ పుడతావ్ రా భైరవ......సారీ విజయ్ అని మనసులో గట్టిగా కోరుకుంటున్న మన టిపికల్ కమర్షియల్ సౌత్ ఇండియన్ హీరో విజయ్....
కానీ మన రైటర్ మాత్రం ప్రేమ కంటే ఎక్కువగా ఇంకేదో బలంగా కోరుకుంటున్నట్టు ఉన్నాడు.. అందుకే విజయ్ ను నెలరోజులు బెడ్ మీద పడుకోబెట్టాడు ఇంకా ఎన్ని రోజులు మనల్ని వెయిట్ చేయిస్తాడో..... మళ్లీ ఆ గదిలోకి మన కథలోకి వెళ్దాం.... విజయ్ లేచి కూర్చుని గాఢంగా శ్వాస తీసుకొని మెల్లగా చుట్టూ చూస్తూ తాను ఇంకా బతికే ఉన్నానని నిర్ధారించుకొన్నాడు....
చావుకు కూడా తను లోకువైపోయాడు అని అనిపించింది ఒకసారి తనని తాను పూర్తిగా చూసుకున్నాడు ఒంటిమీద తెల్లని జుబ్బా మరియు నిక్కరు కొంచెం లూజుగా ఉంది వాటిని ఒకప్పుడు సోడే లాగులు అనేవారు.. ఒంటి మీద గాయాలు దాదాపుగా మానిపోయాయి..కొన్ని గాయాలు మరకల్లా మాయమైడానికి దగ్గర్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి తన గుండెల్లో రేగిన గాయం తప్ప మిగతా గాయాలన్ని నయమై పోయినట్టే...మళ్ళీ ఒకసారి తలెత్తి గదిని పరిశీలించి చూస్తున్నాడు...అప్పుడు తనకు అర్థం అయింది తను ఇప్పుడు వేరే ప్రదేశం లో ఉన్నాడు అని .అది హాస్పిటల్ కాదు అని తెలుస్తూనే ఉంది... కానీ గదినిండా గోడలపై ఉన్న పెయింటింగులు గదిలో ఒక పక్కకు గోడ మొత్తం నిండిపోయేలా ఉన్న పుస్తకాలు పక్కకు చూస్తే పెద్ద పెద్ద సీసాల నిండా ఉన్న చెట్ల బెరడు ఆకులు మూలికలు ఇలాంటివి చూసి అసలు ఎక్కడ ఉన్నాడు అర్థం చేసుకోలేక పోతున్నాడు అలా కాసేపు ఆలోచించాక లేచి బయటికి వద్దాం అని కిందికి దిగుతూ జారీ పడ బోగా అప్పుడే అక్కడికి వచ్చిన వ్యక్తి విజయ్ ని పడకుండా పట్టుకుంటాడు ఆయన సహాయంతో లేచి నిల్చున్న విజయ్ అతని వైపు చూడగానే కొంచెం పెద్దాయన వయసు ఒక డెబ్బై ఏళ్ళు ఉండొచ్చు కానీ ఇప్పుడు అతని శరీరం తనకు తాకుతూ ఉన్నది కాబట్టి విజయ్ కి అతని శరీరానికి ఇంకా 70 ఏళ్లు రాలేదని అర్థం అయింది చాలా దృఢంగా కండలు తిరిగిన శరీరంతో ఒక విధంగా మన కట్టప్ప సత్య రాజ్ లాగా ఉన్నాడు విజయ్ ని మెల్లగా మంచం మీద కూర్చోబెట్టి నిల్చొని విజయ్ ని పూర్తిగా పరిశీలిస్తున్నాడు కొద్దిసేపటి తర్వాత విజయ్ అతన్ని చూస్తూ ఎవరు మీరు?? అసలు నేను ఎక్కడున్నాను?? ఇక్కడికి ఎలా వచ్చాను?? నాకు యాక్సిడెంట్ జరిగి నేను చనిపోలేదా?? లేదంటే ఎవరైనా వచ్చి కాపాడి ఇక్కడికి తీసుకు వచ్చారా ??లేక మా వాళ్లే నన్ను వెతికి ఇక్కడికి తీసుకు వచ్చారా?? అసలు మా వాళ్ళు ఎక్కడ ??అందరూ ఎలా ఉన్నారు ?? అసలు ఎన్ని రోజులు నుంచి ఇలా ఉన్న....నా ఒంటి మీద గాయాలన్నీ మాయమై పోయాయి అసలు నేను ఎన్ని రోజులనుండి ఇలా ఉన్నాను అని గుక్క తిప్పుకోకుండా అడుగుతూనే ఉండేసరికి ఎదురుగా ఉన్న పెద్దాయన దగ్గరికి వస్తూ ఆగు ఆగు ఎందుకు ఆవేశ పడుతున్నావ్ నీకు వచ్చిన భయం ఏం లేదు నువ్వు చాలా సురక్షితంగా ఉన్నావ్.. కాకపోతే నీ కాళ్లు... అనగానే భయం భయంగా ఏమైంది నా కాళ్లకు అంటూ తన కాళ్లలో చూసుకుంటూ మళ్లీ నిలబడి నడవ బోయాడు.....
మీ భాయిజాన్
