Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తెలుగు సామెతలు
#13
ఒక ఈరిలో రైతులు కష్టపడి పండించిన గుమ్మడికాయలను ఎవరో దొంగ రోజు దొంగలించేవాడు. ఆ రోజులలో గుమ్మడికాయలు ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి కావు. అవి పండించడానికి రైతులు చాలా కష్టపడేవారు.


గుమ్మడికాయ దొంగ ఊర్లోనే ఎవరో అయ్యుంటారని రైతుల నమ్మకం.దొంగ ఎవరో కనిపెట్టడం ఎలా? అందుకే రైతులంతా కలిసి ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళారు.

రైతుల సమస్య విని "ఓస్ !ఇంతేనా గుమ్మడికాయ దొంగని పట్టుకోవడం చాలా సులువు. ఆ దొంగకి ఏ భుజం మీదైతే గుమ్మడికాయ మోసుకుని వెళ్ళడం అలవాటో, ఆ భుజం మీద గుమ్మడికాయ అంత సొట్ట వుంటుంది” అన్నాడు.

ఈ మాట విన్న వెంటనే రైతులలో ఒకడు తన కుడి భుజం తడుముకుని సొట్ట వుందో లేదో అని పరిశీలించుకున్నాడు.

పెద్దాయన వెంటనే ఇది గమనించి, “దొంగ ఇతనే!” అని అందరికి చెప్పారు. “మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనకి తప్పు చేసామన్న భావం మనసులో వుంటుంది. అందుకనే ఎవరేమన్నా మనల్నే అంటున్నారేమో అని అపోహ పడతాము” అని వివరించారు.
[+] 1 user Likes Cool Boy's post
Reply


Messages In This Thread
RE: కొన్ని సామెతలు! - by Cool Boy - 30-11-2018, 10:03 AM
RE: తెలుగు సామెతలు - by Cool Boy - 30-11-2018, 10:01 AM
RE: తెలుగు సామెతలు - by Cool Boy - 30-11-2018, 10:10 AM
RE: తెలుగు సామెతలు - by Cool Boy - 09-02-2019, 12:37 PM



Users browsing this thread: 1 Guest(s)