14-02-2020, 10:30 AM
ఉదయం ఉదయమే పొలాల్లో వినసొంపుగా పల్లె పాటలు పాడుకుంటూ పనిచేసుకుంటున్న అందరూ మమ్మల్ని చూసి సంతోషంతో దగ్గరికివచ్చి మరీ బాబు పొలాలు చూడటానికి వచ్చావా .........., ఈ పచ్చదనం అంతా మా బుజ్జి దేవుడి వల్లనే అని పరవశించిపోయి మహేష్ ఒక్కసారి ఒకే ఒక్క సారి మా పొలాలలో అడుగుపెట్టి పావనం చెయ్యి అని ప్రేమతో అడిగారు . అందులో కృష్ణగాడి తల్లిదండ్రులు కూడా ఉన్నారు.
ఆ అదృష్టం నాది అమ్మా ..........పెద్దయ్యను కలిసి వస్తాను , సాయంత్రం వరకూ ఇక్కడే ఉంటాను అని చెప్పడంతో ,
చాలా సంతోషం బాబు అని మగవాళ్ళు మాత్రమే నావెనుక వచ్చారు .
అమ్మవారి పొలం ప్రక్కనే ఉన్న తన పొలంలో ఉత్సాహంతో పనిచేస్తున్న పెద్దయ్య దగ్గరికివెలుతోంటే ,
చూసి ఆనందంతో బాబు అక్కడే ఉండు బురద ఉంది అని ఆ వయసులో కూడా పరుగున వచ్చి , నీవలన ప్రాణం పోసుకున్న పచ్చటి పొలాలను వీక్షించడానికి వచ్చావా అని అడిగారు .
లేదు పెద్దయ్యా .........అని చెబుతూనే వీపు వెనుక ఉన్న బ్యాగుని కిందకు వదిలేసి ప్యాంటుని మోకాళ్ళవరకూ పైకెత్తి అమాంతం బురదలోకి ఎగిరి జారబోయి పెద్దయ్య చేతులను పట్టుకుని నిలబడ్డాను .
నేను కృష్ణగాడివైపు చూసి చిరునవ్వులు చిందిస్తోంటే ........, పెద్దయ్యతోపాటు నావెనుకే వచ్చిన వారంతా హమ్మయ్యా అని గుండెలపై చేతులువేసుకుని సంతోషన్గా నవ్వి , బాబు జాగ్రత్త అని నా చుట్టూ బురదలోకి దిగి నేనెక్కడ పడిపోతానో అని చేతులను ఆక్టివ్ గా ఉంచుకున్నారు .
రేయ్ కృష్ణ అంటూ నా ప్రక్కనే కృష్ణగాడు దిగాడు .
పెద్దయ్యా ..........ఒక కూలీ పొలంలో ఒకరోజంతా పనిచేస్తే ఎంత కూలీ ఇస్తారు అని అడిగాను .
బాబు ఆ వ్యక్తి పనితనాన్ని బట్టి 200 నుండి 300 వందల వరకూ ఇస్తారు అని బదులిచ్చారు .
రెండు రోజులకు 400 /- అక్కయ్యకోసం ఒక మంచి గిఫ్ట్ కొనవచ్చు అని కృష్ణగాడివైపు చూసి నవ్వాను .
పెద్దయ్యా .........నేను పొలాలు చూడటానికి రాలేదు , సోమవారానికి నాకు ఆ డబ్బు చాలా చాలా అవసరం అందుకే రెండు రోజుల పాటు కూలీ పనిచెయ్యడానికివచ్చాను . ఎటువంటి పనైనా సరే ఎంత కష్టమైనా సరే సంతోషన్గా చేస్తాను . మీరే ఎలాగైనా నన్ను కూలీగా చేర్చుకోవాలి అని అడిగాను .
అంతే పెద్దయ్య కళ్ళల్లో కన్నీళ్ళతో వెంటనే నన్ను కృష్ణగాన్ని నెమ్మదిగా బురదలోనుండి పైకెత్తి గట్టుపై నిలబెట్టి , నాముందు మోకాళ్లపై కూర్చొని బాబు ఆ మాట ఎప్పటికీ నీ నోటి నుండి రాకూడదు , నువ్వు మాకు దేవుడితో సమానం . మేమేమైనా తప్పు చేసుంటే మమ్మల్ని క్షమించు అని రెండుచేతులు జోడించారు .
పెద్దయ్యా .........అని దగ్గరికి వచ్చేలోపు మిగతావాళ్ళంతా కూడా పెద్దయ్య చుట్టూ చేరి అలాగే చేసారు . పెద్దయ్యా .........అంటూ వెళ్లి చేతులను విడదీసి మీరు ఎటువంటి తప్పూ చెయ్యలేదు , నాకు ఆ డబ్బు అవసరం అని చెప్పాను .
బాబు అంటూ లేచి ఈ పొలాల్లో పండినదంతా నీవల్లనే , ఒక్క మాట చెప్పు వాటిని అమ్మగా వచ్చిన ఆదాయం మొత్తం నీపాదాల ముందు ఉంచుతాము ........, సోమవారం కావాలంటున్నావు కాబట్టి మాఇంటిలో ఉన్నదంతా మా బుజ్జిదేవుడికి సంతోషంతో ఇస్తాము ........ అవును బాబు అని అందరూ గర్వపడుతూ చెప్పారు .
ఆనందంతో పొంగిపోయి పెద్దయ్యను హత్తుకొని , నేను మీ బుజ్జిదేవుణ్ణి కదా .......
అవును బాబు ..........
నా ఆజ్ఞను పాటిస్తారు కదూ ..........
ఆజ్ఞ బాబు ఏమి చెయ్యాలో చెప్పు అంటూ పెద్దయ్యతోపాటు అందరూ లేచి కళ్ళల్లో కన్నీళ్లను తుడుచుకుని చుట్టూ చేరారు .
మాటతప్పకూడదు ...........
మా బుజ్జి దేవుడి ఆజ్ఞను శిరసావహించకపోతే మా ప్రాణాలు ఉన్నా లేనట్లే లెక్క అని బదులిచ్చారు .
ప్రామిస్ ..........అంటూ చేతిని చాపాను .
వాళ్లకు అటువంటివన్నీ తెలియక ఒకరి ముఖాలు మరొకరు అయోమయంగా చూసుకుంటుంటే .........
పెద్దయ్యా ..........మీ బుజ్జిదేవుడి చేతిలో చేయివేసి ప్రామిస్ చెయ్యాలి అని కృష్ణగాడు ఇలా అని చూపించడంతో ,
ప్రామిస్ బాబు అంటూ అందరూ మాచేతుల్లో చేతినివేసి ప్రామిస్ అన్నారు.
కృష్ణగాడితోపాటు నవ్వుకుని , పెద్దయ్యా ఇదే నా ఆజ్ఞ మీరు నన్ను రెండు రోజులపాటు పనిలో చేర్చుకోవాలి అంతే అని చిరునవ్వులు చిందిస్తూ చెప్పాను .
బాబు ..........
పెద్దయ్యా ........ప్రామిస్ చేశారు , మీ బుజ్జి దేవుని ఆజ్ఞ తప్పకూడదు అని చెప్పాను.
వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ ఇప్పుడెలా అని ఆలోచిస్తోంటే ........
పెద్దయ్యా ........... మీరు బాధపడకండి , ఆడబ్బు ఎందుకంటే సోమవారం రాఖీ పండుగ అని మీకు కూడా తెలుసుకదా , వాసంతి అక్క రాఖీ కడుతుంది కదా , మన మహేష్ తను ఇష్టంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక చిన్న బహుమతి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు అంతే , ఈ విషయం మీకు తెలిస్తే మీరు ముఖ్యన్గా వాసంతి అక్కయ్య బాధపడతారని ఏదేదో చెబుతున్నాడు .
అంతే కదా మహేష్ ...........చిన్న బహుమతి ఏంటి అమూల్యమైన బహుమతిని ఇవ్వాల్సిందే పదా మా ఇంట్లో ఉన్న డబ్బంతా ఇస్తాను అని నన్ను అమాంతం సంతోషంతో ఎత్తుకోబోయి , వెంటనే ఆగిపోయి నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇవ్వాలని ఆశపడుతున్నావు కదూ , మాకు ఎంత కష్టం తీసుకొచ్చావు బాబు అని ఆలోచించి ,
అయితే పదా .............ఏమాత్రం కష్టం లేని పని ఉంది , కొద్దిసేపు అంటే కొద్దిసేపు చేసేయ్ నువ్వు కొరినట్లుగానే కూలీ ఇచ్చేస్తాను అని సంతోషంతో పరవశించిపోతూ చెప్పారు .
పెద్దయ్యా .........ఏదీ ఒకసారి తిరగండి అని మిగతావాళ్ళంతా చెప్పారు .
దొరికిపోయాను అంటూ తిరిగి సంతోషాన్ని లోలోపలే దాచేసుకొని బయటకు మాత్రం ఏమి రా అని అడిగారు .
నాపొలంలో అంతకన్నా సులభమైన పని ఉంది , మా బుజ్జి దేవుణ్ణి మా పొలం లోకి తీసుకెళ్లి అడుగుపెట్టించి పునీతులమౌతాము . కూలీ కూడా రెండింతలు ఇస్తాను అని ఒక అంకుల్ చెప్పారు .
రేయ్ సుబ్బా ..........అంతలేదు నా పొలంలో అంతకన్నా సులభమైన పని మహేష్ తీగలాంటి పేరుని అలా తీసి ఇలా ఉంచడం అంతే .........మా బుజ్జి దేవుడి పాద స్పర్శ వలన నా పొలం పులకించిపోవాలి , కూలీ మూడింతలు ఇస్తాను ......
అలా అలా ఊరి జనమంతా మా పొలం అంటే మా పొలం అని ప్రేమతో వాదులాడుకుంటుంటే .......కృష్ణగాడి నాన్న ఏకంగా ఐదింతలు అనడం ప్రక్కనే ఆరింతలు ..........పదింతల దాకా వెళ్లిపోతోంది .
మహేష్ .............నేను నీ ప్రాణ స్నిహితుడైనందుకు నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరురా అని అమాంతం నన్ను కౌగిలించుకొన్నారు .
పెద్దయ్యా , అంకుల్ అంకుల్ ...........ఆగండి సెలక్షన్ నాది , మీలో ఎవరు నేనుకాకుండా ఇలాగే ఒక కూలీ పనికోసం వస్తే ఇచ్చే పనిని ఇస్తారో వాళ్ళ పొలంలోనే కష్టపడి మీలా చెమట పెట్టేలా పనిచేసి దానికి తగ్గట్లు కూలీ తీసుకుంటాను అనిచెప్పాను .
మా బుజ్జి దేవుడిని కష్టపెట్టడమా అంత సాహసం మేము ముమ్మాటికీ చేయలేము అని చేతులు కట్టుకుని తలదించుకొని నిలబడ్డారు .
అయితే మాటలకు మాత్రమేనా నన్ను బుజ్జి దేవుడు బుజ్జి దేవుడు అని ఆకాశానికి ఎత్తేసి , ఆజ్ఞ ఆజ్ఞ అని పాటించకుండా ముఖం చాటేస్తున్నారు . రేయ్ కృష్ణా ఇక్కడ మనకు పని దొరికేలా లేదు పక్కూరికి వెళదాము వాళ్ళు కూడా దేవుడు దేవుడు అని ఇలాగే మోసం చేస్తే దాని పైన ఉన్న మరో ఊరికి వెళదాము అని చేతులు కలిపి బ్యాగు అందుకొని ముందుకు నడిచామో లేదో ........
బాబు మహేష్ అని మొదట పెద్దయ్య .........ఆ వెంటనే ఒకరి తరువాత మరొకరు నేను నేను అంటూ మాచుట్టూ చేరి మళ్ళీ వాదులాడుకోవడం మొదలెట్టారు .
పెద్దయ్యా ......నాన్న గారు మళ్లీ మొదలెట్టారా ఇలా అయితే కష్టం మేము వెళ్లిపోతాము .........
అంతే రా కృష్ణా వీళ్ళు మారేలా లేరు అని ముందుకు నడవబోతున్నట్లు నటించాము.
బాబు మహేష్ ఒక్క నిమిషం ఆగు అనిచెప్పి పెద్దయ్యా చెప్పినట్లు అందరూ గుమికూడి దాదాపు 10 నినిషాలపాటు చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చినట్లు , అందరూ చేతులు కలిపి సంతోషంతో నవ్వుతూ మాదగ్గరికి వచ్చి , వినయంగా బాబు నువ్వు మా ప్రాణం కంటే ఎక్కువ , నీ మాటే మాకు శాసనం మీరు చెప్పినట్లుగానే పని ఇవ్వాలని అందరూ నిర్ణయించుకున్నాము .
థాంక్స్ పెద్దయ్యా థాంక్స్ అంకుల్ థాంక్యూ sooooo మచ్ అని కృష్ణగాడిని సంతోషంతో కౌగిలించుకుని , ఎవరి పొలంలో పనిచేయాలి పెద్దయ్యా మీపొలంలోనా , అంకుల్ మీ పొలంలోనా లేకపోతే ఈ అంకుల్ పొలంలోనా ...........త్వరగా చెప్పండి, నాకు ఇష్టమైన మీ అందరితోపాటు సంతోషంతో మీరు చేసే పనినే చేసేస్తాను అని ఉత్సాహం చూపాను .
బాబు మహేష్ ఎవరికివారు మాది మాది అని తగ్గకపోవడంతో అందరి పొలాల్లో పనిచేసేలా నిర్ణయానికి వచ్చాము .
అందరి పొలాల్లోనా ........... ఒకేసారి ఎలా పెద్దయ్యా అని తల గోక్కుంటూ అడిగాను.
రెండు రోజులు కాబట్టి ప్రతి పొలంలో కొద్దికొద్దిసేపు నీ ఇష్టం అలా సాయంత్రం లోపు సగం పొలాలు , మిగిలిన సగం పొలాలు రేపు ..........మా బుజ్జి దేవుడికి ఓపిక శక్తి ఉంటేనే అని బుగ్గలను ప్రాణంలా స్పృశిస్తూ నా సమాధానం కోసం ఆతృతగా ఎదురుచూస్తూ అడిగారు .
మా ఊరి జనాల ఇష్టమే నా ఇష్టం కానీ అందరూ కలిసి ఒకరోజు కూలీని మాత్రమే ఇవ్వాలి అనిచెప్పాను .
దానికి సమాధానంగా ఊ అనలేదు ఆ అనలేదు .
పెద్దయ్యా నేను రెడీ ముందు ఎవరిపోలంలో అని అడిగాను .
మా అందరి ప్రాణమైన బుజ్జిదేవుడివి కాబట్టి మొదట మన ఊరి దైవమైన గ్రామదేవత పొలం నుండే పని మొదలెడదాము అని చెప్పారు .
పెద్దయ్యా ..........ఇంత అదృష్టాన్ని మాకు అందిస్తున్నందుకు మీకు నాజీవితాంతం ఋణపడి ఉంటాను అని గుడివైపు తిరిగి అమ్మవారికి రెండుచేతులతో నమస్కరించాను . నాతోపాటు కృష్ణగాడు పెద్దయ్య మరియు ఊరి జనాలు సంతోషన్గా ప్రార్థించి ,
బాబు మా తరతరాలు మా బుజ్జి దేవుడికే ఋణపడిపోయాము అని ఇద్దరినీ ఎత్తుకుని భుజాలపై కూర్చోబెట్టుకొని అమ్మవారి పొలం వైపు నడిచాము.
అమ్మా సాయంత్రం వరకూ కష్టపడేలా శక్తినివ్వు అని ప్రార్థించి కృష్ణగాడి చేతినిపట్టుకొని ఒక్కఉదుటున పొలంలోకి జంప్ చేసాము .
బాబు జాగ్రత్త అని పెద్దయ్యతోపాటు ఊరి జనాలు కూడా దిగి ఏమిచెయ్యాలో ఎలాచెయ్యాలో చూపించారు .
కృష్ణగాడు వాళ్ళ పొలంలో ఇంతకుముందే చేసిన అనుభవం ఉండటం వలన అందరితోపాటు మొదలెట్టేసాడు .
కొద్దిసేపు అందరూ చేస్తుండటాన్ని పరిశీలించి రంగం లోకి దిగి మొదట కాస్త ఇబ్బందిపడినా చేస్తూ చేస్తూ అందరితోపాటు పాటల శృతి కలిపి వాలతోపాటు ముందుకుసాగుతూ పెద్దయ్యా రేయ్ కృష్ణా నాకు కూడా వచ్చేసింది అని ఉత్సాహంతో వెనుతిరిగిచూడకుండా ఇష్టంతో పనిచేస్తున్నాను .
నాలో ఉత్సాహం చూసి చుట్టూ అందరూ భక్తితో అమ్మవారి పొలంలో ఇద్దరు ఒకరోజు చేసేపనిని మొత్తం కేవలం ఒకేఒక గంటలో పూర్తిచేయ్యడం చూసి పూజారిగారు సంతోషించి పూజ జరిపారు .
ప్రసాదం తీసుకుని బాబు ఇప్పుడు మనసుకు ఎంత ఉల్లాసంగా ఉందొ తెలుసా అమ్మవారి అనుగ్రహం లభించినట్లుంది , ఉత్సాహం రెట్టింపైంది , మళ్లీ మళ్లీ మా బుజ్జిదేవునికి ఋణపడిపోతూనే ఉన్నాము . మాకు ఈ అనుగ్రహం రోజూ కావాలి , ఈరోజు నుండి ప్రతిరోజూ ఒక గంట అమ్మవారి పొలాలలో పనిచేస్తామని ప్రమాణం చేశారు .
పూజారిగారు మరింత సంతోషంతో వచ్చి నాదేవతే నిన్ను మాకోసం మరియు తనకోసం మా ఊరికి రప్పించుకుంది బాబు చల్లగా ఉండు బాబు అని దీవెనలు అందించారు .
పూజారి గారు ఈ దీవెనలన్నీ మా అక్కయ్యకు మరియు ఊరిలో చదువుకుంటున్న అందరూ అక్కయ్యలు అన్నయ్యలకు చేరేలా దీవించండి అనిచెప్పాను .
బాబు మహేష్ వాళ్ళల్లో నా కూతురు కూడా ఉంది . చాలా చాలా సంతోషం నాయనా అని ఆనందబాస్పాలతో వడివడిగా అమ్మవారిదగ్గరకువెళ్లి ఘనంగా పూజ జరిపించారు .
పూజారి గారు మళ్లీ పూజ జరిపించారు కదా మళ్లీ ప్రసాదం అని అడిగాను .
మా బుజ్జి దేవుడు మాకోసం కష్టపడ్డాడు , ఆకలి వేస్తున్నట్లు ఉంది , ఒక్క నిమిషం అని సాయంత్రం వరకూ గుడికొచ్చే భక్తులందరికోసం తయారుచేయించిన అమ్మవారి ప్రసాదం మొత్తాన్ని తీసుకురాబోయి వల్లకాక పెద్దయ్యని పిలవడంతో ఇద్దరువెళ్లి పెద్ద పాత్రను తీసుకొచ్చి అందరూ స్వీకరించండి అని సంతోషన్గా చెప్పారు .
పూజారి గారు మరి అమ్మవారికి నైవేద్యం అని పెద్దయ్య అడిగారు .
అమ్మవారికి మొదట నైవేద్యం ఉంచేసాను , తొలిపూజ చాలా బాగా జరిగినప్పుడే ఇలాంటిదాన్ని ఊహించాను . స్వయంగా మన ఊరి బుజ్జి దేవుడే వచ్చి అడగడం కంటే అదృష్టం ఇంకేముంది అని బదులిచ్చారు .
పూజారి గారు మా అమ్మలు అందరూ కూడా శ్రమిస్తున్నారు ............వాళ్లకు అనేంతలో ,
అంతా నీఇష్టం బాబు మొత్తం మీకోసమే కడుపునిండా స్వీకరించండి అని నా తలపై ఆశీర్వదించి లోపలకు వెళ్లిపోయారు .
పెద్దయ్యా ...........అమ్మావాళ్ళ దగ్గరికి అనిచెప్పడంతో ..........
రేయ్ చూస్తారేంటి ఎత్తండి అని ఏకంగా మమ్మల్ని మరియు ప్రసాదాన్ని ఎత్తుకుని అమ్మావాళ్ళ దగ్గరికి చేరుకుని పంపు నీళ్లతో శుభ్రన్గా కాళ్ళుచేతులు కడుక్కుని విషయం చెప్పి మొదట అమ్మలందరికీ వడ్డించారు .
చల్లగా ఉండు నాయనా అని దీవించి తమతోపాటు పిలుచుకునివచ్చిన చిన్న చిన్న పిల్లలకు తినిపించబోతుంటే ............వద్దు వద్దు బ్రెడ్ కావాలి అని మారాము చేస్తుంటే , వెంటనే కృష్ణగాడితోపాటు పరుగున వెళ్లి గుడి పొలం దగ్గర ఉంచిన బ్యాగుని తీసుకొచ్చి అక్కయ్య ఉంచిన కేక్ , చాక్లెట్ లు , స్నాక్స్ , కూల్ డ్రింక్ లను పిల్లలందరికీ పంచడంతో చిరునవ్వులు చిందించి తిన్నారు .
అంతే అమ్మలు కళ్ళల్లో చెమ్మతో రెండు చేతులను జోడించారు .
నేను మాట్లాడేలోపు ...........
ఒసేయ్ అమ్మా వీడికి కాదు అందరూ వాసంతి అక్క చల్లగా ఉండాలని దీవించండి , అంతేకదరా ..............అని నావైపు సంతోషంతో చెప్పాడు .
లవ్ యు రా కృష్ణ అని గట్టిగా కౌగిలించుకున్నాను .
పెద్దయ్య మాకు అరటి ఆకులో వడ్డించి ఇచ్చారు .
అమ్మవారి ప్రసాదం అక్కయ్య అమ్మ స్వీకరిస్తే మంచి జరుగుతుంది అని గుర్తుకురావడంతో , రేయ్ నువ్వు ఇక్కడే ఉండు ప్రసాదాన్ని అక్కయ్యకు ఇచ్చేసివస్తాను అని పరుగుతీస్తోంటే ...........
మహేష్ ............మేంఉన్నాము కదా ఆజ్ఞ వెయ్యి అని పెద్దయ్య తన బుల్లెట్ తీసుకొచ్చి నన్ను వెనుక కూర్చోబెట్టుకొని . రేయ్ మరొక ఆకు నిండా ఇవ్వండి అని చెప్పడంతో , నేను పెట్టుకుంటాను అని కృష్ణగాడు ఎక్కి అందుకొని కూర్చున్నాడు .
పెద్దయ్యా ............అందరినీ తినెయ్యమని చెప్పండి అనిచెప్పాను .
మనం చెప్పినా వాళ్ళ బుజ్జి దేవుడు వచ్చేన్తవరకూ తాకనుకూడా తాకరు అని ఊరిలోకి పోనిచ్చారు.
ఇంటికి చేరుకుని ఒక్క నిమిషం పెద్దయ్యా అనిచెప్పి కృష్ణగాడితోపాటు గేట్ తీసుకుని అక్కయ్యా అక్కయ్యా ..........అని పరుగున లోపలికివెళ్లాము .
వంట గదిలోని అక్కయ్య అప్పటికే స్నానం చేసినట్లు తమ్ముడూ వచ్చేసావా .........అని పరుగునవచ్చి మోకాళ్లపై కూర్చుని అమాంతం నన్ను గుండెలపై హత్తుకొని నిన్ను చూడకుండా ఉండటం నావల్ల కాలేదు అని ముఖమంతా ముద్దులు కురిపించింది .
అమ్మకూడా వంట గదిలోనుండి వచ్చి నాన్నా ..........స్నానం చేసి కిందకు వచ్చిందోలేదో అమ్మా సాయంత్రం ఎప్పుడు అవుతుంది సాయంత్రం ఎప్పుడు అవుతుంది అని ఒకటే అడుగుతూనే ఉంది , ఇందాక నువ్వు మీ అక్కయ్యను పిలిచే ముందువరకూ కూడా నన్ను వంట చెయ్యనీయకుండా అడుగుతూనే ఉందనుకో ...............
అక్కయ్యా .............మళ్లీ వెళ్ళాలి అని అక్కయ్య ఎక్కడ బాధపడుతుందో అని నెమ్మదిగా చెప్పి అక్కయ్యను ప్రాణంలా హత్తుకున్నాను . అక్కయ్యా .........అన్నీ సక్రమంగా జరగాలని అమ్మవారి గుడిలో పూజ జరిపించడం జరిగింది . ప్రత్యేకంగా మా అక్కయ్య పేరు పైన కూడా పూజ జరిపించాను . ఇదిగో ప్రసాదం ఇచ్చి వెళదామని వచ్చాను . అలాగే మా అక్కయ్యను ఒకసారి చూసినట్లు ఉంటుంది అని వచ్చేసాను అనిచెప్పడంతో ,
లవ్ యు లవ్ యు తమ్ముడూ అని బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , నేనెక్కడ బాధపడతానో ఆగిపోతానేమో అని వెనువెంటనే కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని పైకి నవ్వింది .
మా బుజ్జి నాన్న బంగారుకొండ అని అక్కయ్యతోపాటు ప్రసాదం ఓపెన్ చేసి కళ్ళకు హత్తుకొని చెరొకముద్ద నాకు తినిపించారు . అక్కయ్యా అమ్మా మీరు తినండి అని చెప్పాను . ఆనందబాస్పాలతో తిన్నారు .
లవ్ యు అక్కయ్యా అని హత్తుకొని బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి అక్కడ అందరూ మాకోసం వేచిచూస్తున్నారు వెళ్ల............ నా అని తలదించుకున్నాను .
తల్లి సంతోషన్గా పంపించు విజయంతో తిరిగొస్తాడు అని అమ్మ మా ఇద్దరి తలలపై ముద్దులుపెట్టి చెప్పింది .
అక్కయ్య తియ్యని చిరునవ్వుతో వెళ్ళిరా తమ్ముడూ అని నుదుటిపై ముద్దుపెట్టి , టిఫిన్ అయ్యింది చేసివెల్లు అని చెప్పింది .
అక్కయ్యా ..........మీరు చూడలేదు కదూ అక్కడ పెద్ద పాత్ర నిండా ప్రసాదం చేయించారు . అవును అక్కయ్యా .........వీడు వస్తే కానీ అక్కడ ఎవ్వరూ తినరు , అంత ప్రాణం వీడంటే అని కృష్ణగాడు కూడా చెప్పడంతో ,
అక్కయ్య మురిసిపోయి ఇద్దరూ జాగ్రత్త అని ముద్దులుపెట్టి గేట్ వరకూ వచ్చింది . మేము పెద్దయ్య బండిలో వెళ్లడం చూసి హమ్మయ్యా ......... కంగారుపడకుండా సాయంత్రం వరకూ ఉండవచ్చు అని చేతిని ఊపింది.
పొలం దగ్గరకు చేరుకునేసరికి అమ్మలంతా తినేసి , ఊరి జనమంతా మాకోసమే ఎదురుచూస్తున్నారు .
ఆలస్యం అయ్యింది అని sorry చెప్పాను .
మా బుజ్జి దేవుడి రాక కోసం సాయంత్రం వరకైనా సంతోషన్గా వేచి చూసేవాళ్ళము రా బాబు అని మొదటి నాకు వెంటనే అరటి ఆకుల్లో అమ్మలు వాళ్ళ వాళ్ళ వాళ్లకు వడ్డించారు .
ఒసేయ్ అమ్మా ...........మీ బుజ్జి దేవుడికి తినిపించాలని తెలుసుకదా అప్పుడే మరిచిపోయారా అని చిరుకోపంతో చెప్పాడు .
అయ్యో రామా మరిచేపోయాము ..........అంతకన్నా అదృష్టమా అని ఒకరికి మించి మరొకరు పోటీపడుతూ చేతులను శుభ్రన్గా కడుక్కుని వచ్చి తలా ఒకముద్ద తినిపించారు .
థాంక్స్ అమ్మా చాలా రుచిగా ఉంది అని మామూలుకంటే ఎక్కువే తినేసాను . అమ్మా ఇక చాలు కడుపు నిండిపోయింది అని నీళ్లు తాగి పెద్దయ్యా .........నెక్స్ట్ మీ పొలంలోనే కదా..........పదండి ఒళ్ళు వొంచి పనిచేద్దాము అని ప్యాంటుని మోకాళ్ళవరకూ మడిచాను.