Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భర్త కథ-విజయ్
CHAPTER 2
EPISODE 3
అప్పటికే విద్య అక్కడ ఉన్న వాళ్ల సాయంతో రమ్యను కారు దగ్గరికి తీసుకొచ్చి ముందు సీట్ లో కూర్చోబెట్టింది... అప్పుడే పక్కనే ఉన్న ఇంకో వ్యక్తి నీళ్ల బాటిల్ అందించి తాగించు మని విద్యకు చెప్పగానే... విద్య ముందు కొన్ని నీళ్లు చేతిలోకి తీసుకొని ముఖంపై చల్లుతూ భుజం తడుముతూ లేపుతుంది...తనని అక్క అని లేపబోయి మళ్లీ మౌనంగా ఉండిపోయింది....నోట్లో నుండి అక్క అనే మాట రావడానికి కూడా ఇష్టం లేదు తనకు...  ముఖంపై నీళ్లు చల్లగానే నీరసంగా లేచిన రమ్య  ఒకసారి చుట్టూ చూసింది..మళ్లీ తను జరిగింది గుర్తొచ్చి కార్ లో నుండి బయటకు పరిగెత్తుతూ విజయ్ కారు ఉన్న దగ్గరికి వస్తూ ఏమండీ.... ఏమండీ.....అంటూ బిగ్గరగా పిచ్చి పట్టినట్టు అరుస్తూ ఏడుస్తుంది... చుట్టూ ఉన్న జనం అంతా ఆమె వైపు జాలిగా చూస్తున్నారు.కారు పక్కనే ఉన్న హారిక గాల్లోకి చూస్తూ ఉంది... అసలు ఇక్కడి లోకం  లోలేదు ఏదో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు దీనంగా ఉంది.... రమ్య కార్ దగ్గరికి  రాగానే ఎదురుగా వస్తున్న అజయ్ అప్పటి వరకు ఆపుకున్న ఏడుపు కోపాన్ని ఒక్కసారిగా బయటికి కక్కి స్తూ ఇంకా ఎందుకు ఈ దొంగ ఏడుపులు?? ఎవరిని నమ్మించడానికి ??అంతా నువ్వు అనుకున్నట్టే జరిగింది కదా.... పక్క ప్లాన్ తోనే నా అన్నను వేరే వాళ్ల ముందు చేతగాని వాడిలా నిలబెట్టి నీకు నచ్చినట్టు చేయాలని అనుకున్నావ్ నువ్వేం చేసినా నీ మీద ఉన్న ప్రేమ వల్ల  నిన్ను ఏమీ అనలేక పోయేవాడు..... నేను కూడా నా అన్న గురించి కుటుంబం పరువు గురించి ఆలోచించి నీతో...... ఛీ.. అంతే తప్ప నీకున్న వందమంది మొగుళ్ల లో నేను ఒకడిని అని తెలీదు ఇంక నీకు లైన్ క్లియర్ అయిపోయింది.నిన్ను ఆపేవాడు లేడు మురళి గాడితో పోతావో లేక వాడి బాబుతో పోతావో నీ ఇష్టం నీకు ఎవ్వడైనా ఒకటే గా అంటూ రమ్య పై అరుస్తుంటే గౌతమ్ అజయ్ ని ఆపి అందరూ చూస్తున్నారు.. ఇక్కడ బాగోదు ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద..... అంటూ అజయ్ ని లాక్కొచ్చేశాడు.... రమ్య కు ఏడ్చి ఏడ్చి గొంతు తడారిపోయింది.... అజయ్ అన్న ప్రతి మాట తన చెవుల కు తూట్లు పడేలా చేశాయి.తన పెళ్లి అయిన ఈ పదిహేను సంవత్సరాల్లో తనేంటో ఎలాంటి మనిషి అనేది అజయ్ కి తెలుసు అయినా కూడా ఇలా ఎలా మాట్లాడ గలిగాడు అని బాధపడుతూ మళ్లీ తనే అజయ్ కంటే కూడా తన భర్తకు తన గురించి పూర్తిగా తెలుసు అలాంటిది అతనే వదిలేసి వెళ్ళిపోగా లేనిది వీడు ఇలా మాట్లాడటం లో వింత ఏముంది అని అనుకుంటూ ఏడుస్తుంది.. ఇక గౌతమ్ అజయ్ ని సముదాయిస్తూ ఉంటే అక్కడికి హారిక రాగానే సెక్యూరిటీ ఆఫీసర్లు చెప్పింది మొత్తం హారికకు చెప్పి నువ్వు విద్యని రమ్యను తీసుకొని ఇంటికి వెళ్ళు...నేను అజయ్ చుట్టుపక్కల ఉన్న ఊళ్లో వెళ్లి వెతుకుతాం అనగానే హారిక నేను కూడా వస్తా అనగానే చెప్తే అర్థం చేసుకోకుండా మాట్లాడకు....
వెళ్ళేది అమెరికాకు... ఆస్ట్రేలియాకు కాదు చుట్టుపక్కల మొత్తం అడవి ఇంకా కొద్ది సేపట్లో చీకటి పడిందంటే మనం ఉండడానికి కూడా కుదరదు..
 సెక్యూరిటీ ఆఫీసర్లు మొత్తం అడవిని గాలిస్తున్నారు మేము దగ్గర్లో ఉండే హాస్పటల్లో కనుక్కొని వస్తాం అని చెప్పగానే అజయ్ కూడా అవునన్నట్టు తలూపాడు.. అప్పుడే అక్కడికి వచ్చి గౌతమ్ చెప్పినదంతా విన్న విద్య కూడా హారిక తో అవునక్కా బావ చెప్పింది కరెక్టే అని ఏడుస్తున్న హారిక ను తీసుకొని కార్ దగ్గర దాకా నడిపించుకు వెళ్లి లోపల కూర్చోబెట్టి రమ్య కోసం చుట్టూ వెతుకుతూ కనపడేసరికి దూరంనుండి గౌతమ్ ను పిలిచి తనను తీసుకు రమ్మని సైగ చేసింది... గౌతమ్  రమ్యదగ్గరికి వెళ్లి మొత్తం విషయం చెప్పి వెళ్ళమని చెప్పిన వెెంటనే రమ్య ఏడుస్తూ ఏం వినిపించుకోకుండా ఉండేసరికి చెప్పింది విను రమ్య చిన్న పిల్లాడితో ఇక్కడ ఉండలేవు..విజయ్ గురించి తెలియగానే నీకు చెప్తాం అని చెబుతూ అజయ్ చాలాసేపటినుండి పిలుస్తుండటం తో వెళ్ళిపోగానే రమ్య బాబు కోసం చూడగా కార్ దగ్గర ఉన్న విద్య చేతిలో కనపడగానే ఏం మాట్లాడకుండా బాబు ను తీసుకుని కార్లో హారిక పక్కనేకూర్చుంది విద్య కూడా సైలెంట్ గా కారులో కూర్చుని స్టార్ట్ చేసి ఇంటికి పోనిచ్చింది.....
 రమ్య మనసులో నా భర్తకు ఏమి జరిగి ఉండదు ఎక్కడున్నా మళ్లీ నా దగ్గరికి ఖచ్చితంగా వస్తాడు అని గట్టిగా అనుకుంది పక్కనే ఉన్న హారిక కూడా సేమ్ టు సేమ్ అలాగే అనుకుని విజయ్ కోసం దేవున్ని ప్రార్థిస్తుంది అలా ఇంటికి వెళ్లి పోయిన ముగ్గురు సాయంత్రం దాకా ఎదురుచూసిన వీళ్లు రాకపోవడంతో అలాగే నిద్ర పోయారు జరిగిన విషయం మొత్తం అంటే విజయ్ కనిపించకుండా పోవడం మాత్రమే విద్య వాళ్ళ అత్తగారికి ఫోన్ చేసి చెప్పగానే రమ్య మరియు విజయ్ వాళ్ళ కుటుంబాలు తెల్లారేసరికల్లా ఏలూరు నుండి చెన్నై బయలుదేరాయి.... అలా రెండు రోజులు బాగా తిరిగిన తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లకు మరియు అజయ్ వాళ్లకు కూడా ఇక లాభం లేదు అనిపించేసరికి ఇంటికి వచ్చేశారు 

రావడంతోనే వల్ల అమ్మ నాన్న విజయ్ గురించి అడగగానే పట్టలేనంత దుఃఖంతో అన్నయ్య మనకిక లేనట్టే అని చెప్ప గానే ఇల్లంతా ఏడుపు తో నిండి పోయింది.... అలా ఒక నెల గడిచిపోయింది ఈ నెలలో చాలా నాటకీయ పరిణామాలు జరగడంతో  (అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం ) రమ్య ఒంటరి అయిపోయింది.....
 మీ భాయిజాన్   Namaskar
[+] 16 users Like bhaijaan's post
Like Reply


Messages In This Thread
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 19-12-2019, 09:37 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 09-01-2020, 12:29 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by bhaijaan - 01-02-2020, 08:53 PM



Users browsing this thread: