28-01-2020, 03:02 PM
(04-03-2019, 10:42 PM)Vikatakavi02 Wrote: వంశీ
మా పసలపూడి కథలు
వంశీ చెప్పిన మా పసలపూడి కథలు సాహిత్య రచనగానూ, సామజిక పరివర్తనను నమోదు చేస్తున్న విలువైన చారిత్రిక పత్రంగాను కుడా నాకు కనిపించింది. ఈ కథలు తూర్పు గోదావరి జిల్లలో సంభవిస్తూ వచ్చిన వివిధ సామజిక - ఆర్ధిక - సాంస్కృతిక పరిణామాల్ని నిశితంగా, సున్నితంగా పట్టుకున్నాయి. దాదాపు ఒకటిన్నర శతాబ్ద కాలంలో సంభవించిన పరివర్తనను మనతో తిరిగి పంచుకోవడంలోచలచిత్రకారుడైన వంశీ సాహిత్యకారుడుగా రూపొందాడు.
తనకి కనిపిస్తున్న దృశ్యాలని తను ఊహించుకున్న దృశ్యాలని కూడా నాలుగైదు వాక్యాలతో నీతిరంగుల చిత్రాలుగా మన ముందుంచాడు. కావడానికి ఈ కథలకి పసలపూడి కేంద్ర బిందువే అయినప్పటికీ కథా స్థలం అనేక వృత్తాలుగా విస్తరిస్తూ పోయింది. ఈ వృత్తాలన్ని ఒకదానికొకటి మానవ సంబంధాలతో సజీవ సంవేదనలతో అనుసంధానించి ఉన్నాయి. ఈ సంబంధాలలో ఎక్కడ ఏ ప్రకంపనం తలెత్తినా, దాని చప్పుళ్ళని పసలపుడిలో పసిగట్టాడు రచయిత. అలాగే పసలపుడిలో ఏ సంచలనం తలెత్తినా, ఆ ప్రకంపనాలు ఈ వ్రుత్తాలన్నింటి పొడుగునా సుదూరానికి ప్రవహించడం కూడా చూపించాడు.
ఇందులో మొత్తము 72 కథలున్నాయి. వరుసగా అవి.
1.శ్రీశ్రీశ్రీ పూసపాటి రాజావారు
2.రామభద్రం చాలా మంఛోడు
3.వాళ్ళ బంధం
4.కోరిరావులుగారి బస్‍కండక్టర్
5.జక్కం వీరన్న
6.డా.గుంటూరురావు
7.మృత్యువు అక్కడుంది
8.దారుణం కదా!
9.దేవాంగుల మణి
10.నల్లమిల్లి పెదభామిరెడ్డిగారి తీర్పు
11.మలబార్ కాఫీ హోటల్
12తామరపల్లి సత్యంగారి తమ్ముడు రామం
13.అసలు కథ
14.రామశేషారెడ్డిగారి ఇంద్రభవనం
15.కోరిక,16.ఉంచుకున్న మనిషి
17.గుత్తినాగేశ్వరరావు భళే అదృష్టవంతుడు
18.గొల్లపాలెం గురువుగారు
19.భద్రాచలం యాత్ర-వాళ్లక్క కథ
20.బళ్ళనారాయణరెడ్డి
21.ఎర్రనూకరాజుగారి జంక్షన్
22.పిచ్చివీర్రాజు
23.పాముల నాగేశ్వరరావు
24.మునగచెట్టు
25.ఆరని పొయ్యి
26.నవూతూ వెళ్ళిపోయిందా మనిషి
27.బసివేశ్వరుడి గుడిమీద బూతుబొమ్మలు
28.బలంతగ్గింది మరి
29సత్యాన్ని పలికే స్వరాజ్యరెడ్డిగారు
30.మేరీ కమల
31.తూర్పుపేటలో పుత్రయ్య
32.బురకమ్మ కర్రీరెడ్డి
33.పోతంశెట్తి గనిరాజుగారు
34.అల్లుడు మావగిత్తలు
35.కుమ్మరి కోటయ్య
36.వెలగలగోపాలంగారి చిట్టిరెడ్డి
37.దూళ్ళ బుల్లియ్య
38.సుక్యది-రామచంద్రపురం
39.నల్లుంకి తూము
40.ఇది కలిదిండి రాజుగారి కథ
41.నాగభూషణం గారి సీత
42.తెలుకుల రవణ
43.మున్సబుగారూ గుర్రబ్బండి
44.అచ్యుతానిది అమృతహస్తం
45.గవళ్ళ అబ్బులు గాడి అల్లుడి చావు
46.గాలిమేడ
47.సాయం
48.పాస్టర్ ఏసుపాదం
49.చంటమ్మ సంపాదన
50.కుమారి మావూరొచ్చింది.
51.అమ్మాజీ జాతకం
52.నల్లమిల్లిసుబ్బారెడ్డి కథ
53.గొల్లభామరేవు
54.పిచ్చికల్లంకలో రవణరాజు
55.వాస్తు గవరాజు
56.మండసోమిరెడ్డి సమాధి
57.గుడ్డోడు
58.తూరుపోళ్ళు
59.మేట్టారు సుబ్బారావు
60.హోటల్ రాజు కథ
61.మాచెల్లాయత్తమ్మ మొగుడు
62.పొట్టిసూరయమ్మ
63.బ్రాహ్మాణరెడ్దిగారి తమ్ముడు సుబ్బారెడ్దిగారు
64.మాణుక్యం మళ్ళీ కనిపించలేదు
65.దత్తుడుగారల్లుడు తమ్మిరెడ్డి
66.ప్రేమించింది ఎందుకంటే
67.చంటి నాన్నగారి కళ్ళు మనకెలాగొస్తాయి
68.సినిమా షూటింగోళ్లొచ్చారు
69.చెట్టెమ్మ కాసే చేపలపులుసు
70.దీపాలవేళ దాటేకా వెళ్ళిపోయింది
71.నావ ఎప్పటకీ తిరిగిరాలేదు
72.పొలిమేరదాటి వెళ్ళిపోయింది
>>> డౌన్లోడు లంకె <<<
some of the links are not working..along with this link too. is there any chance of re uploading them or f you know any other place from where i can get, that would be really great. Apologies if it creates any inconvenience..