Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సమాహారం [కన్నవి, విన్నవి, కనుగొన్నవి]
#1
Eenadu Dt:2018 Nov 23 Wrote:ఏడో తరగతి పిల్లాడు...ఇంజినీర్లకు మాస్టారు!  

ఉదయం బడికి వెళ్లే విద్యార్థి...
సాయంత్రం కాగానే టీచర్‌ అయిపోతాడు...
తన కన్నా పెద్దవాళ్లకు పాఠాలు చెప్పేస్తాడు...
ఎవరా పిల్లాడు? ఏంటా సంగతులు?

మహ్మద్‌ హసన్‌ అలీ Wrote:
హాయ్‌ ఫ్రెండ్స్‌! నా పేరు మహ్మద్‌ హసన్‌ అలీ.
నా వయసు పదకొండేళ్లు.
ఉండేది హైదరాబాద్‌లోని మలక్‌పేటలో.
ఇంటిగ్రల్‌ ఫౌండేషన్‌ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నా.

[Image: atm5r9v.jpg]

మీకులానే నాకూ ఫోన్‌తో గడపడమంటే చాలా ఇష్టం. ఏడాది క్రితం ఓసారి వీడియోలు చూస్తున్నా. అనుకోకుండా ఓ వీడియో కనిపించింది.
అందులో పెద్దపెద్ద చదువులు చదువుకొని కూడా విదేశాల్లో చిన్న పనులు చేసుకుంటున్న మన దేశస్థుల గురించి ఉంది. చూస్తే చాలా బాధేసింది.

‘ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? మన ఇంజినీర్లలో ఉన్న లోపం ఏంటి?’ అని ఆలోచించా. టెక్నికల్‌, కమ్యూనికేషన్‌
నైపుణ్యాలపై సరైన అవగాహన లేకపోవడం వల్లే పెద్ద చదువులు చదివినా మంచి ఉద్యోగాలు రావడం లేదేమో అనే సందేహం వచ్చింది.

వెంటనే ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అవసరమయ్యే డిజైనింగ్‌, సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్ని ఇంటర్నెట్‌ ద్వారానే నేర్చుకోవడం మొదలుపెట్టా.
వాటిని ఇంజినీరింగ్‌ విద్యార్థులకు చెప్పాలనుకున్నా. ఇదే విషయం మా నాన్నతో చెప్పా. అది విని ఆయన మాకు తెలిసిన
ఇంజినీరింగు విద్యార్థుల్ని పిలిచి వాళ్ల ముందు నాతో పాఠాలు చెప్పించారు. ఆ అన్నయ్యలూ మెచ్చు కోవడంతో వేరే వాళ్లకి
పాఠాలు చెప్పడానికి మా నాన్న కూడా సరే అన్నారు.

నాన్న సాయంతో మా ఇంటికి దగ్గర్లోనే ‘స్కిల్‌ ఇండియా లర్న్‌ క్రియేట్‌ అండ్‌ ఎడ్యుకేట్‌’ పేరుతో ఇన్‌స్టిట్యూట్‌ పెట్టా.
ఉచితంగానే శిక్షణ ఇద్దామనుకున్నా. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థుల నైపుణ్యాలు పెంచే కోర్సుల
అంశాలతో చిన్న ప్రకటన ఇచ్చా. అది చూసి కొంతమంది వచ్చారు. నెమ్మదిగా వారి సంఖ్య 30కి పెరిగింది.
అప్పట్నించి పాఠాలు చెప్పడం ప్రారంభించా. నేర్చుకున్న కోర్సుల గురించి ప్రత్యేకంగా నోట్స్‌ తయారు చేసుకుంటా.
ఎలాంటి సందేహం వచ్చినా ఇంటర్నెట్‌లో వెతికి తెలుసుకుంటా. వాటినే విద్యార్థులకు చెబుతుంటా.


[Image: NgauHus.jpg]

ఇదంతా బాగానే ఉంది కానీ ‘మరి స్కూలో?’ అంటారా?
రోజూ పొద్దున్నే 8.30 నుంచి మధ్యాహ్నం 3 వరకు స్కూలు.
ఇంటికొచ్చాక సాయంత్రం 5 గంటల వరకు హోంవర్క్‌ చేసేసుకుంటా.
ఆ తర్వాత ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్తా. రాత్రి 8.30 గంటల వరకు పాఠాలు చెబుతా.

సెలవులొచ్చినప్పుడు, సమయం దొరికినప్పుడు ఆడుకుంటా.

ఈ ఏడాదిలో ఇంచుమించు వెయ్యి మందికి పాఠాలు చెప్పా.
2020 కల్లా లక్షమందికి పాఠాలు చెప్పాలనేది నా కోరిక.
గొప్ప ఇంజినీర్‌ అవ్వాలనేది నా లక్ష్యం.


[Eenadu Dt:2018 Nov 23]

మనం చాలా కాలంగా ఇంటర్నెటులో స్వేచ్చా విహారం చేస్తున్నాం కదూ.

ఇంతకీ ఈ ఇంటర్నెటుతో మనం చేస్తున్నదేమిటి !?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
సమాహారం [కన్నవి, విన్నవి, కనుగొన్నవి] - by ~rp - 23-11-2018, 08:59 PM



Users browsing this thread: 1 Guest(s)