23-01-2020, 10:08 AM
(23-01-2020, 01:07 AM)pvsraju Wrote: ఆమని గారు చాలా రోజుల తర్వాత కొంచెం ఖాళీ దొరకడంతో మీ కోడలు పిల్ల కథ చదవడం జరిగింది. అద్భుతంగా ఉంది. సంభాషణలు చాలా ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా గీతా మరియు వర్మ ల మధ్య మాటలు చాలా బాగున్నాయి. కొంచెం గ్యాప్ తీసుకుంటానని చెప్పారు. కానీ ఈ కథను కూడా కంటిన్యూ చేయమని నా మనవి. అందరి పాఠకులలాగా నేను కూడా ఇలా అడగడం భావ్యం కాదని నాకు తెలుసు. ఎందుకంటే కథ రాయడం ఎంతో కష్టంతో కూడుకున్న పనో నాకు తెలుసు. కానీ మీ రచనా శైలి అంత అద్భుతంగా ఉంది మరి. కానీ నైట్ షిఫ్ట్ కథకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోండి. ఎందుకంటే ఆ కథలో చాలా డైమన్షన్స్ ఉన్నాయి. ఆ కథ చాలాకాలం నడిపించగలిగే కథ. చాలా రకాల మలుపులు తీసుకోగలిగే కధ. మీ కష్టం మా భాగ్యం. ధన్యవాదములు.![]()
![]()
![]()
చాలా సంతోషంగా ఉంది కథ చదివి మీ ఒపీనియన్ చెప్పినందుకు రాజుగారు. మీరు చెప్పింది నిజం. ఒక కథ రాయాలంటే ఎంత కష్టమో కథలు రాసేవారికే అర్ధమవుతుంది. నేను కథ మాత్రమే రాద్దామని అనుకుని ఇప్పటికి 5 కథలవరకు రాస్తున్నాను. ఒక్కదానికే చాలనుకున్నాను. కానీ మీ అభిమానం చూసి ఒకదాని తర్వాత ఒకటి మొదలుపెట్టాను. ఇలా ఒకేసారి రెండు మూడు కథలు ఉండటంతో కొద్దిగా అటుఇటుగా అప్డేట్ ఇవ్వడంలో లేట్ అవుతుంది. మీరన్నట్టు నైట్ షిఫ్ట్ చాలా మలుపులతో కూడుకున్న కథ. అది చాలా పెద్దగా రాయొచ్చు. అలాగే రాయాలనుకుంటున్నాను.
కోడలుపిల్ల కూడా చాలాబాగా రాయొచ్చు. చూద్దాం సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి ముందుకు తీసుకెళ్తాను.