Thread Rating:
  • 6 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
విక్రమవర్మ : ఏమిటి మీరనేది….

రమణయ్య : అవును మహారాజా….విజయసింహుల వారు సింహాసనాన్ని అధిష్టించడానికి ఆయన తన సమ్మతి తెలపడం లేదు….అందుకనే స్వర్ణమంజరి గారు మీ మద్దతు కోసం మిమ్మల్ని కలవడానికి నన్ను పంపించారు….
విక్రమవర్మ : మిమ్మల్ని మా సోదరితో ఎప్పుడూ చూడలేదు….మీ మాటలు ఎలా నమ్మడం….
రమణయ్య : మీరు మీ సోదరిని కలిసే ఎన్నో ఏండ్లు గడిచింది మహారాజా….
విక్రమవర్మ : సరె…మేము మా వేగులను పంపి విషయం తెలిసిన తరువాత నిర్ణయం తీసుకుంటాను….
రమణయ్య : ఇప్పుడు అంత సమయం లేదు మహారాజా….మీ వేగులు మా రాజ్యానికి వెళ్ళి విషయం తెలుసుకుని వచ్చి మీకు చెప్పేసరికి అక్కడ అంతా పూర్తి అయిపోతుంది మహారాజా….ఇక అప్పుడు మీరు నిర్ణయం తీసుకుని కూడా ఉపయోగం లేదు….
విక్రమవర్మ : మీరు చెప్పింది నిజమే…కాని కేవలం మీ మాటల ఆధారంగా నేను చర్యలు తీసుకోలేను కదా…పైగా మీకు మా రాజ్యం గురించి తెలిసిందే కదా…మాకు అవంతీపురం మీద దాడి చేసే సామర్ద్యం లేదని మీకు తెసుకు కదా…
రమణయ్య : ఆ విషయం నాక్కూడా తెలుసు మహారాజా….కాని మీరు నా మీద ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు…మీకు సాక్ష్యం కావాలంటే మీ సోదరి స్వర్ణమంజరి గారి లేఖను చూడండి….దీని మీద ఆమె రాజముద్రిక కూడా ఉన్నది….(అంటూ తన దుస్తుల్లో దాచిన లేఖని తీసి విక్రమవర్మకి ఇచ్చాడు.)
విక్రమవర్మ లేఖను తీసుకుని పూర్తిగా చదివాడు….కింద స్వర్ణమంజరి ముద్రిక కూడా ఉండటంతో సగం నమ్మకం వచ్చేసింది.
విక్రమసింహుడు : కాని ఈ లేఖలో మమ్మల్ని తనకు సహాయం చేయమన్నట్టుగా ఉన్నది…కాని మా సోదరికి ఏ విధంగా సహాయం చేయగలము…మా సైనిక శక్తి అవంతిపుర సైనికశక్తితో పోల్చుకుంటే చాలా తక్కువ….
రమణయ్య : ఆ విషయం నాకు తెలుసు మహారాజా…అందుకు తగిన పధకం కూడా స్వర్ణమంజరి గారు ఆలోచించి పంపించారు….
విక్రమసింహుడు : ఏమిటా పధకం….
రమణయ్య : ఏం లేదు మహారాజా….ఇంతకు పధకం ఏంటంటే….(అంటూ పధకం ప్రకారం విక్రమవర్మ చేయవలిసిన పని చెప్పాడు.)
అంతా విన్న తరువాత విక్రమసింహుడు…
విక్రమసింహుడు : మీరు చెప్పిన దాని ప్రకారం ఈ పధకం చాలా ప్రమాదకరమైనది రమణయ్యా….
రమణయ్య : మరి చక్రవర్తి సింహాసనం అంత తేలిగ్గా దొరకదు ప్రభూ…అందులోనూ మీ బావగారు చక్రవర్తి కావాలంటే మీరు ఈ మాత్రం సహాయం చేయకపోతే ఎలా…..
విక్రమసింహుడు : కాని ఎందుకో నా మనసు దీనికి అంగీకరించడం లేదు రమణయ్యా…..
రమణయ్య : (చిన్నగా నవ్వుతూ) ప్రభువుల వారి మనసులో ఇంకా సందేహం తొలగినట్టు లేదు…
విక్రమసింహుడు : అవును రమణయ్యా…ఇంత తీవ్రమైన పరిస్థితిలో మా సోదరి నుండి వచ్చిన ఈ లేఖ చూసి… (అంటూ రమణయ్య వైపు చూస్తూ) మా సోదరి ఏమైనా సంకేతం లాంటిది చెప్పిందా….
రమణయ్యకు వెంటనే విక్రమవర్మ దేని గురించి అడుగుతున్నాడో బాగా అర్ధమయింది.
రమణయ్య : ప్రభువుల వారికి నా మీద ఇంకా నమ్మకం కలగలేనట్టున్నది…
విక్రమవర్మ : అలాంటిదేం లేదు రమణయ్యా…మీరు ఈ లేఖ తీసుకురాగానే మీరు మా సోదరి స్వర్ణమంజరి గూఢచారి అని అర్ధం అయింది….కాని…..
రమణయ్య : సరె…మీ సంతృప్తి కోసం కేవలం మీకు మీ సోదరికి మాత్రమే తెలిసిన సంకేతాన్ని తెలియపరిస్తే మీకు సమ్మతమే కదా…..
విక్రమవర్మ : తప్పకుండా….మీరు ఆ సంకేతాన్ని తెలియపరిస్తే మేము నిస్సందేహంగా మీరు చెప్పింది నిజమని నమ్మి మా సోదరి ఈ లేఖలో చెప్పిన విధంగా…అదే మీ పధకానికి అణుగుణంగా మా సైన్యాన్ని తరలిస్తాను….
రమణయ్య : సరె…చెబుతున్నా వినండి…మీ సోదరి చెప్పిన సంకేతం ప్రకారం…”మహాభారతంలొ శకుని పాండవులకు ఆప్తమిత్రుడు”….స్వర్ణమంజరి గారు నాకు చెప్పిన సంకేతం ఇదే….
ఆ సంకేతం వినగానే విక్రమసింహుడు సంతోషంగా రమణయ్య వైపు చూస్తూ….
విక్రమవర్మ : ఈ సంకేతం చెప్పగానే మా మనసులో ఉన్న శంకలన్నీ దూరమైపోయాయి రమణయ్య గారు….ఇక నేను ముందుండి నా సైన్యాన్ని మన పధకానికి అనుకూలంగా తరలిస్తాను….
విక్రమవర్మ అలా అనగానే రమణయ్య కూడా చాలా సంతోషపడిపోయాడు.
తను వచ్చిన కార్యం ఇంత తేలిగ్గా అయిపోయినందుకు మనసులోనే మంజులకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు.
రమణయ్య : సరె ప్రభూ…ఇక నేను సెలవు తీసుకుంటాను….
విక్రమవర్మ : అప్పుడేనా రమణయ్యా….ఇప్పటికే సాయంకాలం అయిపోయింది….రేపు ఉదయం బయలుదేరి వెళ్దురు గాని….అప్పటి వరకు మీరు మా అతిధిగృహంలో విశ్రాంతి తీసుకోండి….
రమణయ్య అలాగే అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
**********
రమణయ్య వెళ్ళిపోగానే విక్రమవర్మ తన మంత్రి గణాన్ని, సేనాపతితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసాడు.
అందరు రాగానే మంత్రులు, సేనాపతులు, దండ నాయకులు తమ తమ ఆసనాల్లో కూర్చున్నారు.
విక్రమవర్మ గంభీరంగా ఉండటంతో అతని ప్రధాన మంత్రికి విషయం ఏంటో గంభీరమైనదని అర్ధం అయింది.
దానికి తోడు అవంతీపురం నుండి గూఢచారి వచ్చాడనే సరికి ఆయనకు విషయం చూచాయగా తెలిసిపోయింది.
మంత్రి : (విక్రమవర్మ వైపు చూస్తూ) ప్రభువుల వారు చాలా గంభీరంగా ఉన్నారు….విషయం ఏంటి ప్రభూ….
విక్రమవర్మ : (ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకుని) అవును మంత్రిగారు…విషయం చాలా గంభీరమైనదే….ఎలా పరిష్కరించాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాను….
మంత్రి : ముందు సమస్య ఏంటో తెలియపరిస్తే దానికి మాక్కూడా తోచినంత సలహా ఇస్తాము కదా ప్రభూ…..
I Am Prasad. Are You Interested trade in index options. Capital require 30k...Join My FREE TELIGRAM GROUP with 90% accuracy...
.
https://' niftybankniftyteam
.
or
.
Follow this link to join my WhatsApp group:
https://.,./CvDpU1sVofsIery1UzWeWD
[+] 8 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 22-01-2020, 01:29 PM



Users browsing this thread: 4 Guest(s)