Thread Rating:
  • 9 Vote(s) - 2.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
పూర్ణయ్య : నువ్వు నా పట్ల చూపిస్తున్న గౌరవానికి నాకు చాలా సంతోషంగా ఉన్నది ఆదిత్యా….ఇక వస్తాను…(అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.)

మహామంత్రి పూర్ణయ్యని సాగనంపిన తరువాత ఆదిత్యసింహుడు మళ్ళీ తన ఆసనంలో కూర్చుని తన దండనాయకుల వైపు చూస్తూ….
ఆదిత్యసింహుడు : జరుగుతున్న పన్నాగం అదీ….ఇప్పుడు చెప్పండి….మీ అభిప్రాయాలు ఎంటో….
దండనాయకుడు : అదేంటి ప్రభూ….మహామంత్రి పూర్ణయ్య గారు మీకు పూర్తి మద్దతు ఇస్తున్నారు కదా….ఆయన వెళ్ళిన తరువాత మళ్ళీ సమావేశం ఏంటి ప్రభూ….
ఆదిత్యసింహుడు : ఎవరి గౌరవం వాళ్ళకు ఇవ్వాలి దండనాయకా….కొన్ని కొన్ని మనం ఎవరికీ తెలియకుండా చేయాలి ….మనం చేసే పనులు వాళ్లకు నచ్చొచ్చు లేక నచ్చక పోవచ్చు….
దండనాయకుడు : అలా అయితే మనం మీ వదిన స్వర్ణమంజరి దేవి గారిని అంతఃపుర బందీని చేస్తే చక్రవర్తి అవడానికి మీకు అడ్డేమున్నది ప్రభూ….
ఆదిత్యసింహుడు : అలా చేయడం వలన ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది….నాకు అలా చేయడం ఏమాత్రం ఇష్టం లేదు….
దండనాయకుడు : అదేంటి ప్రభూ…ప్రజల గురించి ఆలోచించేదేమున్నది….నాలుగు రోజులు కోప్పడతారు….మళ్ళీ వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోతారు….
ఆదిత్యసింహుడు : కాని వాళ్ల మనసుల్లో మాత్రం మనం శాశ్వతంగా తిరుగుబాటు చేసి సింహాసనం దక్కించుకున్నామనే అపవాదు మాత్రం ఉండిపోతుంది….తరువాత మనం ఎంత జనరంజకంగా పాలన సాగించినా ఆ మచ్చ అలాగే ఉండి పోతుంది….
దండనాయకుడు : అది కాదు ప్రభూ….
ఆదిత్యసింహుడు : మనం సింహాసనానికి చాలా దగ్గరలో ఉన్నాం దండనాయకా…ఇప్పుడు మనం చేస్తున్నది కేవలం మన దారిలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులు తొలగించడమే…దారిలో ఉన్న చిన్న చిన్న ముళ్ళను తొలగించడానికి అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోనవసరం లేదు…నాకు మాత్రం ప్రజల మద్దతుతో సింహాసనాన్ని అధిష్టించాలి…అంతే…
దండనాయకుడు : అయితే ఇప్పుడు ఏం చేద్దాం ప్రభూ…..
ఆదిత్యసింహుడు : మనం వనవిహారానికి వెళ్ళే ముందు కొన్ని పనులు చేయాలి….అవి ఏవేంటో చెబుతాను వినండి….
(అంటూ తన దగ్గర స్వర్ణమంజరి దండనాయకుల వివరాలు ఇచ్చి తన దండనాయకులకు ఏమేం చేయాలో చెప్పాడు.)
ఆదిత్యసింహుడు చెప్పంది అంతా విన్న తరువాత దండనాయకులు అక్కడ నుండి వెళ్ళిపోయారు.
ఆదిత్యసింహుడు తన ఆసనంలో కూర్చుని వనవిహారంలో చేయబోయే పనుల గురించి ఆలోచిస్తున్నాడు.
***********
అవంతీపుర సామ్రాజ్యం నుండి బయలుదేరిన రమణయ్య తన దళంతో పరాశిక రాజ్యానికి చేరుకున్నాడు.
అక్కడ రమణయ్య రాజభవనం లోకి వెళ్ళి స్వర్ణమంజరి అన్నగారైన విక్రమవర్మకు తన రాక గురించి తెలిపి అతన్ని కలవడానికి అనుమతి కోరాడు.
కొద్దిసేపటికి విక్రమవర్మ రాజ్యసభలోకి రమణయ్యకు అనుమతినిచ్చాడు.
రమణయ్య రాజసభలోకి రాగానే విక్రమవర్మకి అభివాదం చేసి….
రమణయ్య : ప్రభూ…నేను అవంతీపుర సామ్రాజ్యం నుంచి వస్తున్నాను….
విక్రమవర్మ : మిమ్మల్ని ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉన్నది రమణయ్య గారు…అక్కడ అందరూ బాగానే ఉన్నారు కదా…..
రమణయ్య : దేవుడి దయ వలన అంతా బాగానే ఉన్నారు ప్రభూ….మీకు విషయం తెలిసే ఉంటుంది…రత్నసింహుల వారు తన సింహాసనానికి వారసులు ప్రకటించబోతున్నారు…
విక్రమవర్మ : అవును….మా వేగుల ద్వారా ఆ విషయం తెలిసింది…
రమణయ్య : నేను మీతో ఏకాంతంగా సమావేశం జరపాలి ప్రభూ….మీ సోదరి స్వర్ణమంజరి గారి దగ్గర నుండి సందేశం తెచ్చాను….అది మీకు అత్యవసరంగా మీకు విన్నవించమని మీ సోదరి గారు మరీ మరీ చెప్పమన్నారు….
విక్రమవర్మ : తప్పకుండా….మిమ్మల్ని మా అంతరంగిక మందిరంలో తప్పకుండా సమావేశం అవుదాము…(అంటూ అక్కడ సేవకుడితో) రమణయ్య గారిని మా అంతరంగిక మందరంలో కూర్చోబెట్టు….(అంటూ రాజసభ సభ్యుల వైపు చూస్తూ) ఇక ఈ సమావేశం ఇంతటితో ముగిస్తున్నాం….
విక్రమవర్మ అలా అనగానే అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయారు.
కొద్దిసేపటి తరువాత విక్రమవర్మ అంతరంగిక మందిరం లోకి వచ్చాడు.
అప్పటికే ఆ మందిరంలో విక్రమవర్మ కోసం ఎదురుచూస్తున్న రమణయ్య అతన్ని చూడగానే లేచి అభివాదం చేసాడు.
విక్రమవర్మ తన ఆసనంలో కూర్చుంటూ….
విక్రమవర్మ : ఇప్పుడు చెప్పండి రమణయ్యా….అంత అత్యవసరంగా సమావేశం అవాల్సిన అవసరం ఏమొచ్చింది….
రమణయ్య : మీ తెలియని విషయం ఏమున్నది ప్రభూ….అవంతీపుర సింహాసనం ఎవరు అధిష్టించాలనేది అక్కడ సమస్యగా ఉన్నది….
విక్రమవర్మ : ఇందులో సమస్య ఏమున్నది రమణయ్యా…రత్నసింహ చక్రవర్తి కుమారుల్లో మా బావగారు విజయసింహుల వారే కదా పెద్ద కొడుకు…ఆయనే సింహాసనాకి అర్హులు కదా….
రమణయ్య : మీరన్నది సబబుగానే ఉన్నది మహారాజా…కాని మీ బావగారు సింహాసనాన్ని అధిష్టించడానికి వీరసింహుల వారు అభ్యంతరం ఏమీ పెట్టలేదు….కాని…..
విక్రమవర్మ : మళ్ళీ ఈ కాని ఏంటి రమణయ్యా….ఇక ఇందులో సమస్య ఏమున్నది….
రమణయ్య : రత్నసింహుల వారి మూడో కొడుకు ఆదిత్యసింహుడు గురించి మీకు తెలిసిందే కదా….
విక్రమవర్మ : అవును రమణయ్యా….ఆదిత్యసింహుడి రాజకీయ చతురత గురించి మేముకూడా చాలా విన్నాము…
రమణయ్య : ఇప్పుడు ఆయనే మీ బావగారు సింహాసనాన్ని అధిష్టించడానికి అడ్డంగా ఉన్నారు….
[+] 10 users Like prasad_rao16's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 22-01-2020, 01:27 PM



Users browsing this thread: 15 Guest(s)