Thread Rating:
  • 12 Vote(s) - 2.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కథలు మధ్యలోనే ఎందుకు ఆపేస్తారంటే....
#20
(17-01-2020, 07:07 PM)sarit11 Wrote: మిత్రులారా
అలాగే నాది మరొక సందేహం ,
ఇక్కడ కొద్ది మంది మిత్రులు/మిత్రురాళ్ళు (రచయితలు/రచయిత్రులు) ఉత్సాహంతో దారం తెరుస్తారు కొంచెం కథ వ్రాస్తారు, దారాన్ని డిలీట్ చేస్తారు.
మళ్ళీ కొన్ని రోజులకు మరొక దారం తెరుస్తారు కొన్ని సార్లు అదే కథను వ్రాస్తారు లేదా మరొక కథను మొదలుపెడతారు, మళ్ళీ డిలీట్ చేస్తారు.
అలా ఎందుకు చేస్తారో నాకు అర్ధం కాలేదు.
ఈ ప్రశ్నకు సమాధానం తెలిసికూడా చెప్పక పోతే మీకు రోజుకు ఒకసారి మాత్రమే రతిసుఖం దక్కు గాక.

హాయ్ సరిత్ గారు మీకు నేను గుర్తు వున్నా అనుకుంటా. 

అయినా సరే ఒకసారి పరిచయం చేస్తా 
నేను మీ డామ్ నిక్ టర్రెంటో..
ఇక మీరు అడిగిన విషయానికి వస్తె
ఈ విషయం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది
అయినా మా మాటల్లో వినాలని అంటున్నారు కాబట్టి నేను  నాకు అనిపించింది చెప్తాను *తప్పుగా చెప్తే క్షమించండి*
నాకు తెలిసినంతవరకు రచయితలు
(మామూలుగా ఒకటి రెండు updates ఇచ్చి వదిలేసే వాళ్ళు)
మొదట ఎక్కడో ఏదో సన్నివేశం లో తళుక్కున మెరిసిన ఒక చిన్న ఆలోచనను మనసులో తలుచుకుంటూ దానికి కొంత రూపం పోసి దాన్ని (ఇక్కడ మనకు ఈ ప్లాట్ ఫామ్ ఉంది కాబట్టి) ఇక్కడ దారం తెరిచి అందులో మనసులో ఉన్న ఆ ఆలోచన లను కథ గా తయారు చేసి పోస్ట్ చేస్తారు తరువాత  నెక్స్ట్ స్టోరీ ఎపిసోడ్ ఇవ్వకుండా పక్కన పెడతారు ఎందుకు అంటే ఆ రచయిత ఆ కథను అంత వరకే ఆలోచించాడు కాబట్టి.
 ఇతను మళ్లీ మొదలుపెట్టే అవకాశం కూడా ఉంది ఎప్పుడో ఒకసారి ఏదో కథను చదివే సమయం లో పుడుతుంది ఇంకో ఆలోచన అది మొదట రాసిన కథకు దగ్గరగా ఉంటే రెండవ ఆలోచనను రెండవ ఎపిసోడ్ కింద మలిచి పోస్ట్ చేస్తాడు అదే మొదటి కథకు సంబంధం లేదనుకోండి వెంటనే ఇంకో దారం పుట్టిస్తాడు. 
ఇక్కడ దారాలు ఎందుకు delete చేయడం అనే విషయానికి వస్తే (ఇది నాకు బాగా వర్తించే విషయం)
ఫస్ట్ స్టోరీ రాస్తాం అది అప్పటికి బాగా అనిపిస్తుంది కానీ మనం మళ్లీ వేరే మూడ్ లోకి వెళ్లి నప్పుడు ఈ స్టోరీ గుర్తొస్తే చీ చీ నేనా ఇది రాసింది అని తనని తానే తిట్టుకుని ఆ స్టోరీ ని delete చేస్తాడు  
ఎందుకు అలా అనిపిస్తుందో చిన్న ఉదాహరణ తీసుకుంటే మన వాయిస్ మనం రికార్డ్ చేసి తిరిగి మన వాయిస్ వింటుంటే ఆ వాయిస్ మనకు నచ్చడు. అలాగే మనం రాసింది మనకు నచ్చడు even vere వాళ్లకు నచ్చినా కూడా అది మనం వినడానికి ఇష్టపడం అలా అన్నమాట
తెందుకు నా ఓల్డ్ స్టోరీస్ లో అంతా అమ్మ గురించి తప్పుగా రాశా అంటే స్టోరీ కోసం అనుకోండి, అది అప్పటికి నాకు ఉద్రేకం కలిగించింది కానీ ఆ ఉద్రేకం చల్లారాక నాకే అనిపించింది ఎంటి నేను అమ్మ గురించి ఇంత తప్పుగా రాశానా అని ఎన్నో సార్లు గిల్టీ ఫీలింగ్ వచ్చేది ఇలాంటి కథ ఎలా రాశా అసలు నిజ జీవితం లో ఇలాంటి వాన్నా నేను ? అని. అందుకే చాలా సార్లు delete చేసా మళ్లీ అది ప్రేక్షకుల కోసం రికవర్ చేయించాను అనుకోండి అది వేరే విషయం, (ఎక్కువ చెప్తున్నా అనుకుంటా కొంచెం ఓపిక చేసుకుని చదవండి సోదెల ఫీల్ కాకుండా )

ఇది కేవలం నా వైపు నుండి మాత్రమే ఆలోచించి చెప్పింది బహుశా ఎవరికి వారికి వేరు వేరు కారణాలు వుండొచ్చు ఇక నాకు ఇంకో బలమైన కారణం అనిపించింది ఏంటంటే చాలా కథలు మన సైట్ లో  దొంగలించి వాళ్ళ పెయిడ్ సైట్స్ లో పోస్ట్ చేసుకుంటున్నారు నాకు అది నచ్చలేదు ఎంతో ఓపికగా కథ రాసి పోస్ట్ చేస్తుంటే వాళ్ళు దొంగలించి వాళ్ళ సైట్ లో పెట్టుకుంటున్నారు అది నాకు సమస్య కాదు కానీ ఆ సైట్ వాళ్ళు మనం ఫ్రీ గా రాసిన కథలను తీసుకుని రీడర్స్ కు ఫ్రీ గా ఇవ్వకుండా డబ్బులు చేసుకుంటున్నారు నాకేదో డబ్బులు ఇవ్వలేదు అని కాదు , వాళ్ళు కూడా కథను ఫ్రీ గా పెడితే బాగుంటుంది అని నా ఫీలింగ్ ఎలాగో సైట్ ట్రాఫిక్ ఆడ్స్ వల్ల డబ్బు వస్తుంది కదా, 
 వీళ్ళని మనం ఏం చేయలేం అనుకోండి, ఎందుకో ఈ సైట్స్ ఇలా చేశాక నాకు రాయడం మీద ఇంట్రెస్ట్ పోయింది పైగా పనులు ఉంటాయి కదా అందుకే నేను ఇప్పుడు రన్ చేస్తున్న కథను కూడా  కొద్దిగా ఆపేసా రాయడం. 
 ఈ పెయిడ్ సైట్స్ ని చూస్తుంటే నాకు కొంచెం భాధగా ఉంటుంది అందుకే ఎలాగో చెప్పకపోయినా కాపీ కొడతారుగా అందుకే మన సైట్ లో ఆల్రెడీ delete చేసిన నా కథను ఒక పేయిడ్ సైట్ ఓనర్ కు అమ్మేసా ఆ తరువాత అనిపించింది కాపీ కొడితే కొట్టనీ అమ్మడం ఎందుకు అని ఇలా మన మూడ్ ఒక్కోసారి ఒక్కో లాగా ఉంటుంది 
 అలా మూడ్ బాగున్నప్పుడు కథ రాస్తాం మూడ్ మారితే కథ delete చేస్తాం లేదా అవకాశం ఉంటే ఇంకేదైనా చేస్తాం 
 అంతెందుకు ఒకసారి మిమ్మల్ని నేను కొపగించుకున్నా కూడా ఎందుకు అంటే అంతే అది మన మూడ్ మీద ఆధార పడిన విషయం అలాగని అన్నీ విషయాలలో అలా వుండం లెండి 
 ఏదో కొన్ని విషయాలలో ఇలా జరుగుతూ ఉంటాయి 
 ఇప్పటికే ఒక మినీ ఎపిసోడ్ లాగా అయ్యింది,
 చాలా ఎక్కువ చెప్పా అనుకుంటా 
 ఏమైనా మీ ప్రశ్నకు సమాధానం దొరికింది అని అనుకుంటున్నా 
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
[+] 6 users Like dom nic torrento's post
Like Reply


Messages In This Thread
RE: కథలు మధ్యలోనే ఎందుకు ఆపేస్తారంటే.... - by dom nic torrento - 22-01-2020, 01:18 PM



Users browsing this thread: 2 Guest(s)