Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శివప్రియాల సంగమం
#22
అప్డేట్ 4
ప్రియ కూడా ఆ రోజు కాలేజీలో శివ గురించి ఆలోచిస్తూ ఉత్సాహంగా గడిపింది.
అలేఖ్య ఇంకా గీత వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారు.
శివతో ప్రియకి రోజు రోజుకి సాన్నిహిత్యం ఎక్కువ అవుతుంది. కాలేజీ వెళ్ళినప్పటి నుండి అందరు శివ గురించి ఫీల్ అవుతున్నారు.
శివ చాల మందికి కాలేజీ ఫి కట్టడానికి డబ్బులకి హెల్ప్ చేస్తుంటాడని ఎవరో ఒక సీనియర్ అమ్మాయి చెపుతుంటే ప్రియ వాళ్ళ చెవిలో పడ్డాయి ఆ మాటలు.  రోజు  ఫోన్ లో  చాటింగ్ చేస్తూ ఉండడం వళ్ళ  ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఏర్పడింది.
ఇంకో ఆరు రోజుల్లో శివ మీద ఉన్న  సస్పెన్షన్ పోతుంది, శివ  అందరితో పాటు కాలేజీ కి రావచ్చు.
 
గీత తన అందచందాలతో సీనియర్ అబ్బాయిలను కూడా వెంట తిప్పుకుంటూ వాళ్లతో ఫ్రెండ్లీ రిలేషన్ మైం టైన్ చేస్తుంది.
అలేఖ్య విషయానికి వస్తే తను మొదట్లో ఉన్నట్టు లేదు. కొంచం చేంజ్ అయినట్లు  కనిపిస్తుంది. కాలేజీ డేస్ అందరిని మారుస్తాయి.
గీతకి సీనియర్లు కాంటాక్ట్ ఉండడం వల్ల శివ గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి.  తనకు తెలిసిన విషయాలు తన ఫ్రెండ్స్ కి షేర్ చేయాలని పరుగుతో ప్రియ దగ్గరకు వస్తుంది.
"ఒసేయ్ ప్రియ నీకు ఓ విషయం చెప్పాలి".
"ఏంటి అంత కొంపలు మునిగిపోయే విషయం".
"నీ వెంటపడే శివ ఉన్నా డుగా వాడి గురించి".
(అప్పటికి గీతకి తెలీదు శివతో ప్రియ చాట్ చేస్తుంది వాళ్ళ మధ్య డెవలప్ అవుతున్న రిలేషన్).
 
"హా చెప్పవే ఎం తెలిసింది శివ గురించి"  అంది ఆత్రంగా
"నీకు మన ల్యాబ్ టెక్నీషియన్ రుహినా మేడం తెలుసుగా"
"హా,అదే తెల్లగా స్లిమ్  గా  ఉంటుంది తనేగా"
"వాళ్ళ ఇద్దరికి ఎఫైర్ ఉందట"
(ప్రియ షాక్)
"ఏమిటే ఎం మాట్లాడుతున్నావ్ , నీకు ఎవరు చెప్పారు"
"సీనియర్లు ఇద్దరు నాతో చెప్పారు".
ప్రియ ఆ రోజు కాలేజీలో మొత్తం అదే ఆలోచిస్తూ ఉంది.
కాలేజీ అయిపోయాకా గీత , అలేఖ్య మరియు  ప్రియ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు.
ఇంటికి వెళ్ళాకా ప్రియ బెడ్ మీద పడుకోని చేతిలో మొబైల్ తో శివకి మెసేజ్ చేయాలా  వద్ద అనీ ఆలోచిస్తుంది,ఒక వైపు గీత చెప్పింది గుర్తు వస్తు ఇంకో వైపు ఈ రోజుల్లో ఇలాంటివి సాధారణం అనుకుంటుంది.
[+] 4 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: శివప్రియాల సంగమం - by siva_reddy32 - 21-01-2020, 03:13 PM



Users browsing this thread: 2 Guest(s)