Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బ్రహ్మ జ్ఞానం
శని మకరరాశి ప్రవేశం.

ఆత్మకారకుడు సూర్యుడు మకరరాశిలోనికి ప్రవేశమునును ఉత్తరాయణ పుణ్యకాల మకరసంక్రమణ పర్వదినంగా ఆనందంగా జరుపుకున్నాం.
త్వరలో అనగా ఈ నెల 23 వ తేదీన మకరరాశిలోకి సూర్యపుత్రుడు శని దేవుడు తన స్వరాశిలోకి అడుగు పెడుతున్నాడు. మహాశివుని యొక్క కరుణాకటాక్షవీక్షణాలు కల శని దేవుడు కాలపురుష చక్రంలో పదవరాశి లో కర్మకు అధిపతిగా ఫలితాలను ఇస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యభగవానుడు అక్కడ ఉండగా అధిపతి శని అతనితో కలవడం శుభ ఫలితాలను ఇస్తుంది. సూర్య శనుల యుతి వలన సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. కష్టజీవులకు అండగా ఉంటారు.
ఎవరికైనా ఫలితాలు రావడం ఆలస్యం కావచ్చు కానీ అసలు రాకపోవడం అనేది ఉండదు. ఆత్మవిశ్వాసం మానవునికి కావలసిన ముఖ్యమైన ఆయుధం. పెద్దవారి ఆశీస్సులతో నిజాయితీగా మీ కర్మ ను/ విధులు నిర్వర్తిస్తే ఎటువంటి ఓటమి దరిచేరదు. రవి, చంద్రులు ఉన్న ఉత్తరాషాఢ నక్షత్రం మీద శని కూడా ప్రవేశిస్తున్నారు. బుధుడు కూడా అదే రాశిలో ఉన్నాడు. కనుక మంచినే ఆశించగలము.
అదేవిధంగా త్వరలో అతిచారం వలన గురుడు కూడా మకరరాశిలోకి అడుగు పెడుతున్నాడు. ధర్మకర్మ అధిపతులు ఒకే చోట కలిసి ఉంటున్నారు. ఇక్కడ కేతు గ్రహం నుండి విడిపడి ఉంటారు గనుక తప్పక మంచి ఫలితాలను ఇస్తారు అని ఆశించవచ్చును. మార్పు అనివార్యం. అది మంచి వైపు గా ఉండేలా ప్రణాళికలు వేసుకోవడం మానవ ధర్మం. దాదాపుగా ఇరవై సంవత్సరాలకు పైబడి ఒకసారి వారి స్వంత రాశుల లోనే ఈ ధర్మ కర్మ అధిపతులు కలవడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు స్పష్టమైన మార్పులు ప్రపంచవ్యాప్తంగా గోచరిస్తూ ఉంటాయి.
మకరరాశి లో గల ఉత్తరాషాడ , శ్రవణం మరియు ధనిష్ట నక్షత్రముల వారికి..ఏలినాటి శని ప్రారంభం.. రాబోయే రోజులలో వారి జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి మార్పులు సంభవించవచ్చును. నిత్య జీవన సరళిలో మార్పులను అంగీకరించడం కష్టంగా అనిపిస్తుంది కానీ, ఆ మార్పులు ఒక సానుకూల దృక్పథాన్ని, అనుకూల వాతావరణాన్ని కలిగిస్తాయి.
అంతా మహాదేవుని దయ అనుకునే వారికి తప్పకుండా కలిసి వచ్చే కాలం. తిరిగి ఆశించకుండా సమాజానికి మనం ఏమివ్వగలము అనే ఆలోచనతో ఉన్న వారికి తప్పకుండా ఇది శుభకాలం అని చెప్పుకోగలము.
మకరరాశిలో శని ఎక్కువ కాలం వర్గొత్తమ శని కూడా అవడం వలన..( 24 జనవరి నుండి 24 ఫిబ్రవరి) ..వస్తూనే తప్పక యోగ ఫలితాలు ఇస్తాడు. కనుక దైవబలం తోడుగా తీసుకొనే స్థిరమైన నిర్ణయాలు మీ జీవితాన్ని ఆనందమయం చేస్తాయి.

క్లుప్తంగా ద్వాదశ రాశుల వారికి శని గోచార ప్రభావం..
*మేష రాశి వారికి వృత్తిలో అభివృద్ధి. ప్రయాణాలు..స్థిర సంపాదన.
*వృషభరాశి వారికి అత్యంత అదృష్ట మైన కాలం.
*రాబోయే కొద్దిరోజులలో మిధునరాశి వారికి శని దృష్టి తొలగి మంచి ఆలోచనసరళి కలిగి ఉంటారు.జీవన సరళిలో స్పష్టమైన ఆకస్మిక మార్పులను అష్టమశని వలన గమనిస్తారు. నివారణలు తప్పకపాటించండి.
*కర్కాటక రాశి వారికి సప్తమంలో శని ..
భాగస్వామి ఆరోగ్యం పై దృష్టి పెట్టాలి. వైవాహిక, వృత్తి సంబంధాలు బాగానే కలసి వస్తాయి.
*సింహరాశి వారికి షష్టమస్థానమున శని ప్రవేశం..మంచిది. బాధ్యతలు,శ్రమ ఉన్నా మీకు అడ్డంకులు లేకుండా చేసుకోగలరు. అభివృద్ధి వుంటుంది.
*కన్యారాశి వారికి పంచమంలో శని..అనుకూల ఫలితాలు కలుగుతాయి.
*తుల రాశి వారికి చతుర్ధ భావం లో శని..
తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సంపద మొదలగు ఇతర విషయాలు కలసి వస్తాయి.
*అదేవిధంగా వృశ్చికరాశి వారికి ఏలినాటి శనిదోషం పూర్తిగా తొలగిపోతుంది..మీలోని శక్తిని పూర్తిగా వెలుగులోకి తీసుకు రావడానికి ప్రయత్నం చేయండి.
(వృషభరాశి వారికి అష్టమశని ,కన్యారాశి వారికి అర్థాష్టమశని కూడా తొలగిపోతుంది).
*ధనురాశి వారికి ఏలినాటి శని తొలగిపోదు కానీ , ధనభావం లోకి ఆ భావాధిపతి ప్రవేశించడం వలన మనశ్శాంతి కలుగుతుంది. మీ సంపాదన జాగ్రత్త పరుచుకోండి. అనవసర ఖర్చులు చేయకండి.
*మకరరాశి వారికి ఆ రాస్యాధిపతి రావడం వలన ఏలినాటి శని లో ఉన్నను, స్థిరమైన వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికరమైన ఫలితాలు సాధించగలరు. శని దేవుడు కర్మ కారకుడు కనుక కర్మ ఫలితాలను అనుభవింపచేస్తూనే వాస్తవమైన పరిస్థితులను చూడగలిగేలా చేయగలడు.
*కుంభ రాశి వారు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండండి. ధన సంబంధమైన విషయాలలో అనవసరమైన వ్యయ్యాన్ని నియంత్రించండి . సహనంతో ఉండండి. మంచి కాలం ముందునే ఉంది. గమనించి అవకాశాలను అందుకోండి. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతోంది. అవసరమైన నివారణలు చేసుకోండి.
*మీన రాశి వారికి లాభ స్థానంలో శని ఉండి మీన రాశి పై దృష్టి పెట్టి ఉన్నాడు. సంపద విషయంలో అనుకూలంగా ఫలితాలు ఇస్తాడు. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.
******************
వీరందరూ కూడా త్వరలో మంచి ప్రణాళికలను ఏర్పరుచుకుని విద్య మొదలగు విషయాలలో లక్ష్యం చేరుకోగలరు. దానధర్మాలు చేస్తూ,
రుద్రాభిషేకాలు మొదలగునవి ఆచరిస్తూ, హనుమాన్ చాలీసా మనస్ఫూర్తిగా చదువుకుంటూ అన్ని రాశులవారు శివుని అనుగ్రహం, హనుమంతుని ఆశీస్సులు పొందగలిగితే ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా తమ తమ కర్మలను నిర్వర్తించగలరు.
ఎక్కడైతే నిజాయితీ క్రమశిక్షణ కర్తవ్య నిర్వహణ అంతఃకరణ శుద్ధి తో నెరవేరుస్తారో అక్కడ శని మహా దేవుడు శుభ ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. దాదాపు 5 1/2 సం..పాటు మకర ,కుంభ రాశులు లో శని మహాదేవుడు వుంటాడు. అవి రెండూ ఆతని సొంత రాశులు కావడం గమనార్హం. అయినప్పటికీ మకర రాశి పృద్వితత్వాన్ని ,కుంభ రాశి వాయుతత్వాన్ని కలిగి ఉండడం వలన ఆయా లక్షణాలకు అనుగుణంగా శని ఫలితాలను ఊహించగలము.
**గమనిక: అదేవిధంగా , ఈ రాశుల లోకి వచ్చే ఇతర గ్రహముల తో కలసి ఇచ్చే ప్రభావములను కూడా పరిగణలోకి తీసుకొనివలెను. జాతకుని వ్యక్తిగత జాతకంలో గ్రహ రాశులు స్థితులు మరియు జరుగుతున్న దశ అంతర్దశలను బట్టి వ్యక్తిగతంగా ఫలితాలు ఉంటాయి..
ఋణములు చేయకుండా ఉండండి. మహా శివుని అనుగ్రహం కల శనిదేవుని గురించి అనవసరమైన భయాలు ఆందోళనలు లేకుండా కర్మాధిపతికి నిజాయితీగా ఆహ్వానం పలుకుదాం.
" ఓం నమశ్శివాయ"
[+] 1 user Likes dev369's post
Like Reply


Messages In This Thread
బ్రహ్మ జ్ఞానం - by dev369 - 08-11-2019, 02:35 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:43 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 05:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:44 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:46 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:50 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:52 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:02 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:03 PM
RE: Astrology Books - by karthikeya7 - 19-05-2023, 06:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:04 PM
RE: Astrology Books - by k3vv3 - 09-11-2019, 01:57 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 04:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:20 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:23 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:40 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:48 PM
RE: Astrology Books - by kamal kishan - 10-11-2019, 06:02 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:01 AM
RE: Astrology Books - by Greenlove143 - 27-12-2021, 05:17 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:05 AM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:35 AM
RE: Astrology Books - by k3vv3 - 12-11-2019, 07:25 AM
RE: బ్రహ్మ జ్ఞానం - by dev369 - 20-01-2020, 08:15 PM



Users browsing this thread: 6 Guest(s)