Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సరసము కథలు
#15
“ఏంటి... ఫస్ట్ పరిచయంలోనే నా బాధలన్నీ ఏకరువు పెట్టి, నా తెలివి తేటలన్ని మీ మీద ప్రయోగించానని అనుకుంటున్నారా?” కారులో అతని పక్కనే కూచొని, అతని తొడమీద చేయివేసి అంది.

అతని శరీరంలో చిన్నషాక్... ప్లగ్లో వేలు పెట్టినట్టు.

“అదేం లేదు... మీకో దారి చూపించాలని ఆలోచిస్తున్నాను…” అతనన్నాడు.

“రియల్లీ... ఓహ్... థ్యాంక్యూ...” అంది అతని బుగ్గమీద ముద్దు పెట్టుకొని.

ఇప్పుడూ షాక్ కొట్టింది. హై ఓల్టేజితో. ఆ తర్వాత అలాంటి షాక్లు అలవాటయి పోయాయి అతనికి.

***

ఆమె ఫ్రెండింట్లో నుంచి అనుదీప్ గెస్ట్ హౌస్ లోకి షిఫ్ట్ అయ్యింది. జీవితంలో మోరల్ వేల్యూస్ గురించి ఆమె పట్టించుకోలేదు. తనకో మోరల్ సపోర్ట్ కావాలి.... అదీ ఫైనాన్షియల్గా వెల్ బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్ళయితేనే... అనుదీప్ గెస్ట్ హౌస్ ఆమె స్వంతమైంది. అనుదీప్ తెలివైనవాడు. అందులోనూ ఉమనైజర్. ఆమె అందాలు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు.

ఆమెను తన గెస్ట్ హౌస్లోకి తెస్తూనే... ఆ రోజంతా అతను ఆమెతో యుద్ధానికి సిద్ధమయ్యాడు.

గెస్ట్ హౌస్ లో పనిచేసే వాళ్లందరికీ సెలవిచ్చేసాడు ఆ రాత్రికి.

***

ఆ రాత్రి గెస్ట్ హౌస్లో ఉన్న ఎ.సి. బెడ్రూంలో అతను సర్వ సుఖాలు, స్వర్గసుఖాలూ చవిచూసాడు. ఆమె అందించే ప్రతీ అనుభవం అతనికి కొత్తగానే ఉంది.

అసలామెలో ఇన్ని టాలెంట్లు వున్నాయా? అన్న ఆశ్చర్యం కలగకపోలేదు.

వాత్సాయనుడు ఆమె చూపించే థ్రిల్లింగ్ ఎమోషన్స్ చూస్తే, తానెలా మిస్సయ్యానా? అని బెంగపడేవాడేమో!

ఆ రాత్రంతా అతణ్ణి నిద్ర పోనివ్వలేదు. ఆమె నిద్రపోలేదు. తన శరీర వీణను ఎలా మీటాలో ఆమె చెప్పింది. అతను కొద్ది క్షణాలు సిగ్గుతో బిక్కచచ్చిపోయేడు. ఆమె ముందు అతనికి తీయని శృంగార ఓటమి ఎదురైంది.

ఆరోజే కాదు, ప్రతీరోజు ఆమెతో అతను స్వర్గసుఖాలు అనుభవిస్తూనే వున్నాడు.

ప్రతి మనిషిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన అతనికి, ఆమెను ఎలా ఉపయోగించుకోవాలో తెలిసొచ్చింది.

తను కొత్తగా ప్రారంభించబోయే బిజినెస్కు ముడి సరుకుగా ఓ అమ్మాయి కావాలి... కొన్ని సందర్భాల్లో తను బ్రోకర్గా కూడ మారక తప్పదు. కాంట్రాక్టులు... మంత్రులను ఖుషీ చేయడాలు... అధికారులకు అమ్మాయిల నజరానాలు సమర్పించడాలూ....

అతనికో కొత్త ఆలోచన వచ్చింది.

విరాళిని రంగంలోకి దింపేడు. 'నా బిజినెస్ ను నువ్వే ప్రమోట్ చేయగలవు' అన్నాడు. నీకేం కావాలన్నా ఇస్తానన్నాడు. ఆమె తెలివైంది. అందులోనూ పరిస్థితులను తనకు అనుకూలంగా మరల్చుకోగల నేర్పు కలది.

'సరే'నంది. ఆమె గమనం మారింది. శరీర వ్యాపారమే ఆమె గమ్యమైంది.

అతను ఆమెను అన్ని రకాలుగా వాడుకుంటున్నాడు. అందుకు అతను గిల్టీగా ఫీలవ్వడంలేదు. తన తెలివితేటలకు మురిసిపోతున్నాడు.

అతనిలో కొత్త ఆలోచనలు.

తన బిజినెస్ పెరిగిపోతుంది. దానిక్కారణం బిజినెస్ లో వున్న సిన్సియార్టీ, ప్రోడక్ట్ లో వున్న క్వాలిటీ కాదు. అంతకన్నా అధికారులను బుట్టలో వేసుకునే విధానం, విరాళిని 'చెక్'గా పెట్టి, మంత్రులతో తను ఆడుకునే వ్యాపార చదరంగపు మేళకువలే.

***

ఇప్పుడతనిలో కొత్త ఆలోచన. రాజకీయాలలోకి వెళ్ళాలనుకున్నాడు.

డబ్బు వెదజల్లి పబ్లిసిటీ, విరాళిని ఎరగా పెట్టి పార్టీ టికెట్ సంపాదించాడు.

సరిగ్గా అప్పుడే, తనూ ఓ పావు కదిపింది విరాళి. తనకి పదికోట్లు కావాలని అడిగింది.

లేదంటే, తన ఆఫర్ని కాదంటే, తను అనుదీప్ తో నగ్నంగా వున్న ఫోటోలు, తనెవరెవరి దగ్గర అనుదీప్ కోసం, పడక సుఖాన్ని అందించిందో, వాళ్ళ చరిత్రలూ... పత్రికలకిచ్చి, అతని పొలిటికల్ కెరీర్ స్మాష్ చేస్తానంది. అతని అపోజిషన్ శిబిరంలో పేయింగ్ గెస్ట్ గా చేరతానంది.

అతను బిత్తరపోయేడు. బిగుసుకు పోయాడు. బిక్కచచ్చి పోయాడు. తెలివి తనసొత్తే అనుకున్నాడు.

***

“యూ... చీట్... బట్టలు విప్పి... ఈ రాత్రి ఇంత సుఖాన్ని అందించి, ఇలా బ్లాక్ మెయిల్ చేస్తావా? డేర్ డెవిల్...” కోపంగా మరోసారి అన్నాడు.

“చెప్పాగా...బేర్ డెవిల్ ని అని కూడా... ఆడదాని బట్టలు విప్పి, సుఖాన్ని అందించి, ఓ గుడ్డముక్క అందిస్తే తృప్తి పడుతుందనుకున్నావా? నన్ను అడ్డంగా పెట్టి, నువ్వు కోట్లు సంపాదించేవు. మరి నిన్ను అడ్డంగా పెట్టి నేను సంపాదించుకోవద్దూ... నా అందం తరిగాక, నన్ను నువ్వు తరిమివేస్తావన్న విషయం నాకూ తెలుసు. ఈ బేర్ అండ్ డెవిల్తో పెట్టుకోకు, సాయంత్రంలోగా క్యాష్.. అక్షరాల పదికోట్లు అందాలి. లేకపోతే... మన బేరీబాడీ ఫొటోలు... గోడలమీద వుంటాయి. పోస్టర్లుగా... మైండిట్.., ఆమె లేచి బట్టలు కట్టుకొని బయటకు నడిచింది.

ఇప్పుడతనికి ఒక్కటే మార్గం. ఆ బేర్ డెవిల్తో రాజీకి రావడం. అయినా ఇద్దరు అవకాశవాదుల మధ్య నైతికా నైతికాలెలా బట్టకట్టి బతుకుతాయి..?

written by
Mucherla Rajani Shakuntala
Like Reply


Messages In This Thread
RE: సరసము కథలు - by అన్నెపు - 23-11-2018, 05:12 PM
RE: సరసము కథలు - by Mnlmnl - 09-01-2020, 02:00 PM



Users browsing this thread: 1 Guest(s)