23-11-2018, 04:55 PM
“థ్యాంక్యూ ఆంటీ... నా లైఫ్లో ఫస్ట్ టైమ్ ఇంత థ్రిల్ ఎంజాయ్ చేసాను. ఏమిచ్చి రుణం తీర్చుకోను” రెండోసారి ఆమెతో శృంగార యుద్ధం చేసాక అలసిపోయి అన్నాడు మన్మధరావు.
“ఛ... ఛ... మన మద్య రుణాలూ, థ్యాంక్స్లూ ఎందుకు... ఆయనకెప్పుడూ డబ్బు యావ... కనీసం నాకు నెక్లెస్ చేయించాలన్న ఆలోచన కూడా రాదు...” అంది నిట్టూరుస్తూ.
అతనికి అర్థమయ్యి అవ్వనట్టు అనిపించింది.
రెండ్రోజుల తర్వాత విలాసిని మెడలో నెక్లెస్ మెరిసిపోయింది.
యిన్నాళ్ళు బుద్దిగా పొదుపు చేసుకున్న బ్యాంకులోని మన్మధరావు డబ్బుకు కాళ్లచ్చాయి. ఆమె కోసం నెక్లెస్ చేయించాడు. మళ్ళీ వస్తాను డాళింగ్, పదిరోజుల టూర్ అయిపోగానే నీ కోసం రెక్కలు కట్టుకుని వాలుతాను, అంటూ ఓ పదిరోజుల పాటు ఆమెను తన యిద్దరి ఫ్రెండ్స్ కు తెలియకుండా అనుభవించి మరీ అన్నాడు.
మన్మధరావు బిజినెస్ పనిమీద మద్రాస్ వెళ్ళాడు.
***
శివరావు బిడియంగానే లోపలికి అడుగుపెట్టాడు. ఆఫీస్ వదిలాక టాంక్ బండ్ దగ్గర అమ్మాయిలకు బీటేసి, ఆనక యింటికొచ్చాడు. సరిగ్గా అప్పుడే విలాసిని ఆంటీ డాబా మీద నుంచి సైగ చేసి పిలిచి చెప్పింది. “బాత్రూం బోల్టు వూడిపోయింది. కాస్త రిపేరు చేసి పెడతారా...”
అడిగింది ఆంటీ. పైగా అంకుల్ లేని సమయంలో… వెంటనే... పుట్టి బుద్దెరిగాక ఎప్పుడూ స్క్రూ డ్రైవర్ కూడా పట్టుకోని శివరావు ప్లంబర్ లెవల్లో పనిముట్లు పక్కింటి వాళ్లని అడుక్కొని మరీ బయల్దేరాడు.
***
తలుపు తీయగానే మాటలు వినిపించాయి.
“తలుపుకు గొళ్లెం పెట్టేసి రండి. మీరు పనిచేస్తూ వుంటే ఏ దొంగ వెధవైనా, సామాన్లు సర్దుకు పోవచ్చు...”
తలుపుకు గొళ్లెం పెట్టి హాలులోకి వచ్చాడు.
“బాత్రూం కుడివైపుకు వుంది” ఆ మాటలు బాత్రూం నుంచి వినిపించినట్టనిపించినా, అది తన భ్రమ కాబోలు అనుకొని, బాత్రూం తలుపు దగ్గరగా వేసి ఉండడంతో, తలుపు నెట్టి షాకుతో అలాగే వుండిపోయాడు.
ఎదురుగా జల్లులా పడుతున్న షవర్ కింద విలాసిని ఆంటీ స్నానం చేస్తూ...
అతని చేతిలోని పనిముట్లు కింద పడ్డాయి.
విలాసిని పొడుగాటి జుట్టు నుండి చుక్కలు చుక్కలుగా నీరు జారి కింద పడుతోంది.
పెదవులు అదురుతున్నాయి. సబ్బు నురగతో ఉన్న ఆమె శరీరం మీగడ పెరుగులా ఉంది. అతనికి ఆగలేదు. ప్రొసీడైపోయాడు. ఒక్కుదుటున వాటేసుకున్నాడు. షవర్ కింద ఇద్దరూ ఎంతసేపు జలకాలాడారో గుర్తులేదు.
***
“నీలాంటి భర్త నాకు దొరికి ఉంటే, లోన్ తీసుకొనీ, అడ్వాన్సు తీసుకొనీ, నాకీపాటికి చేతులకు బంగారు గాజులు చేయించేవాడు...” అంది అతన్ని తన చేతులతో చుట్టేస్తూ...
అంతే... జీవుడు విలవిల్లాడిపోలేదు. ఆనందంతో ఆఫీసుకు పరుగెత్తి పోయాడు.
మరునాటికల్లా... ఆమె చేతికి బంగారు గాజులు... ఇప్పుడు ఆఫీసు వదలగానే టాంక్ బండ్ కు వెళ్లడం లేదు శివరావు... విలాసిని వొళ్ళో సేద తీరుతున్నాడు. ఆఫీసులో వున్న అన్ని లోన్లు ఆమె కోసమే ఖర్చు పెట్టేసాడు.
***
శివరావు సాయంత్రాలు టాంక్ బండ్ దగ్గరకు ఎందుకు రావడం లేదో కనుక్కుందామని కారులో వచ్చిన జగన్నాథ్ కు విలాసిని తారసపడింది.
ఆ తర్వాత వాళ్లు కలుసుకున్నారు. అది యాక్సిడెంటల్గా కాదు, ప్రయత్నపూర్వకంగానే...
ఇప్పుడు రోజూ ఉదయం నుంచి సాయంత్రం అయిదు వరకూ జగన్నాథ్ విలాసం, విలాసిని పడగ్గదే!
సాయంత్రం అయిదు దాటితే “హమ్మో... అంకుల్ వస్తాడేమో... సరదాగా ఎప్పుడైనా అలా టాంక్ బండ్ కు వెళ్లద్దామన్నా కనీసం సెకెండ్ హ్యాండ్ కారు అయినా లేదు...” జగన్నాథ్ మీద ఒరిగిపోతూ, అతడ్ని తన కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి చేస్తూ అంది.
ఆ రోజే తన కారు విలాసినికి ధారాదత్తం చేసేసాడు జగన్నాథ్ తనో సెకెండ్ హ్యాండ్ స్కూటర్ కొనుక్కొని.
అలా ఆంటీ ఓర చూపులకు ముగ్గురు కరిగి, ఆమె కౌగిలిలో చిత్తయి పోయేరు.
***
ఆ రోజు అనుకోకుండా జగన్నాథ్, శివరావు, మన్మథరావు కలుసుకున్నారు.
రాత్రయింది.
ఆరోజు అంకుల్ రాత్రివేళ బయటకు వెళ్లడం చూసి ఎవరికి వారు ఆంటీతో కమిటయిపోవాలని చూస్తున్నారు.
ఆ యింట్లో లైట్లు యింకా వెలుగుతున్నాయి. అప్పటికే విలాసినితో వాళ్ల నాలుగ్గోడల మధ్య సంబంధాలు మొదలై ఆరు నెలలు అయింది.
దాదాపుగా అందరి బ్యాంకు బ్యాలెన్సులూ గల్లంతు అవుతున్నాయి. అయినా వాళ్లింకా విలాసిని ట్రాప్లోనే వున్నారు.
వాళ్ళిప్పుడు వదిలేసిన చెరుకు పిప్పిలాంటి వాళ్ళు! ఎవరికి వారు మిగతా వాళ్లకి ఎలా “మస్కా” కొట్టాలా? అని ఆలోచిస్తున్నారు.
పూర్ ఫెలోస్.
***
విలాసిని భర్త పరశురామ్ వచ్చాడు లారీతో సహా. లారీ బయట ఆగింది. పరుశురామ్ బెడ్రూమ్లోకి నడిచాడు. “సర్దడం అంతా అయ్యిందా?” అడిగాడు విలాసినిని.
“అయ్యింది... పాపం! ఆ కురాళ్ళు చూడండి. మనం ఇల్లు ఖాళీ చేస్తోన్న విషయం తెలియక ఆశగా చూస్తున్నారు” అంది జాలిగా ఎదురింటి మేడమీద గదివైపు చూస్తూ.
“చూడనీ డియర్... వాళ్లతో మనకిప్పుడు పనిలేదు. వాళ్ల దగ్గర బ్యాంకు బ్యాలెన్సులూ అయిపోయాయి. వీళ్లతో లాభం లేదనే, మరో ఏరియాకు వెళ్తున్నాం... అక్కడ కూడా యిలాంటి వీక్ మైండెడ్ స్టుపిడ్స్ దొరక్కపోరు.
సెక్స్ బలహీనత వున్న యిలాంటి వాళ్లు వున్నంత వరకూ మనకే డోకాలేదు డియర్...” అంటూ భార్యని దగ్గరకి లాక్కున్నాడు.
మరో రెండు గంటల్లో...
లారీ సామానుతో కదిలింది. విలాసిని ఇల్లు ఖాళీ చేసింది. అయినా తమ బ్యాంకు బ్యాలెన్స్ని, ఖాళీ అయిన తమ బుర్రలని చూసుకొని, వెర్రి మొహాలేసుకున్నారు. అయినా వాళ్లు మారుతారా?
మరో విలాసిని ఎదురయితే... టెంప్టవ్వకుండా వుంటారా?
హతోస్మి!
story by
Mucherla Rajani Shakuntala