Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఇంకెంత ‘స్మార్ట్‌’ గుంటాదో..!
#11
*         *         *

సెల్‌ఫోన్‌ మీద సాగుతున్న చిత్ర విచిత్ర ఊహాగానాలూ పరిశోధనలను చూస్తుంటే... ఇవ్వాళో రేపో- కాల్‌
వచ్చినప్పుడు మనం ఎక్కడ కూర్చోనుంటే అక్కడికి ఫోను ఎగురుకుంటూ వచ్చేస్తుందేమో, మనసెరిగి తనంతట
తానే జొమాటోకు ఐస్‌క్రీమ్‌ ఆర్డరిచ్చేస్తుందేమో... అనిపించడం లేదూ! రావణుడి పుష్పక విమానానికి రూపమిచ్చిన
మనిషికి... గాంధారి నూటొక్క కుండల పిండాల కథను నిజం చేసిన మనిషికి... ఇదీ ఏమంత కష్టం కాదు.
కాకపోతే, అది ‘ఎంత త్వరగా’ అన్నదే ప్రశ్న!

[Image: 05012020sun-cover1l.jpg]

ఇలాంటిది ఒక్కటుంటే చాలట!

*నిన్ను నిన్నుగా ప్రేమించుటకు... తోడొకరుండిన అదే భాగ్యమూ... అన్నారు సినీకవి. అలా ప్రేమించి మంచి
స్నేహితుడిలా మనని వెన్నంటి ఉండే ఫోన్‌ ఒకటి ఉంటే అదే భాగ్యమూ అని పాడుకునే రోజూ వచ్చేటట్లే ఉంది.
జులియస్‌ టాంగ్‌ అచ్చం అలాంటి ఫోనునే డిజైన్‌ చేశాడు. ‘ద మొడాయ్‌’ అనే ఈ ఫోను మనం లేవగానే
గుడ్‌మార్నింగ్‌ చెబుతుంది. పేపర్లో లీనమైపోతే ఆఫీసుకు టైమవుతోందని హెచ్చరిస్తుంది. ఆలస్యంగా నిద్ర లేస్తే
త్వరగా తెమిలేందుకు షెడ్యూల్‌ని మారుస్తుంది. కొత్త ప్రాంతానికి వెళ్తే అక్కడేం చూడొచ్చో ఏమేం కొనుక్కోవచ్చో
చెబుతుంది. ఉద్యోగజీవితాన్నీ వ్యక్తిగత జీవితాన్నీ విడదీసి ఎక్కడ ఏం చేయాలో అవి మాత్రమే చేసేలా చూస్తుంది. ఒక
మనసైన మిత్రుడు పక్కన ఉంటే మీకెంత భరోసాగా ఉంటుందో ఈ ఫోన్‌ ఉంటే అచ్చం అలాగే ఉంటుందంటాడు
టాంగ్‌. కాకపోతే ఎవరైనా ఈ డిజైన్ని అందిపుచ్చుకుని ఫోన్‌ని తయారుచేయాలి మరి!*
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
RE: ఇంకెంత ‘స్మార్ట్‌’గుంటాదో..! - by sarit11 - 08-01-2020, 08:32 PM



Users browsing this thread: 1 Guest(s)