08-01-2020, 08:28 PM
*మన ఇష్టాల్ని తెలుసుకుని...*
కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాంకేతికతలను ఫోనుల్లో ఇప్పటికే వాడుతున్నాం. అది ఇంకా పెరిగితే
మన ఇష్టాల్నీ అవసరాల్నీ తెలుసుకుని తదనుగుణంగా వ్యవహరించే ఫోను తయారుచేయడం కష్టమేమీ కాదంటున్నారు
నిపుణులు. ఉదాహరణకు ఒక మీటింగ్‌కి వెళ్లారనుకోండి. మీతో పాటు ఆ మీటింగ్‌లో పాల్గొన్నవారి వివరాలన్నీ
కావాలంటే నిర్వాహకుల్ని బతిమాలుకోవాలి. అదే కృత్రిమమేధ సాయం ఉంటే మన ఫోనే అక్కడున్న వారందరి ఫోన్లనుంచి
సమాచారాన్ని సేకరించగలదు. కెమెరా సాయంతో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయగలదు. ఇదంతా మన ప్రమేయం లేకుండా
బ్యాక్‌గ్రౌండ్‌లోనే జరిగిపోతుంది. ఒక వార్తాపత్రిక చదవడం మీకు అలవాటు. కానీ మీకు నచ్చే వార్తల్ని
వెతుక్కుంటూ ఆ పేజీలన్నీ తిప్పాలంటే చిరాకు. మీ ఫోన్ మీకు నచ్చిన వార్తలు మాత్రమే కనపడేలా చేయగలదు.
ఇంకా వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాలిటీలు కూడా ఫోను పనితీరును మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి.