08-01-2020, 08:26 PM
*ఏమో... ఫోన్ ఎగరావచ్చు!*
మనం ఏ కిచెన్‌లోనో బెడ్‌రూమ్‌లోనో పనిచేసుకుంటున్నప్పుడు డ్రాయింగ్‌రూమ్‌లో ఉన్న ఫోన్ మోగితే చేతిలో పని
ఆపి వెళ్లి ఫోన్ చేతిలోకి తీసుకుని మాట్లాడతాం. అలా మన చేతిలో పనికి ఆటంకం కలగకుండా ఫోనే గాల్లో తేలి వచ్చి
మన ఎదురుగా ఎగురుతూ మనం మాట్లాడే పని అయిపోగానే దానంతటదే వెళ్లి టేబుల్‌మీద నిలబడితే..? ఇదేదో
సైన్స్‌ఫిక్షన్ సినిమాలోని దృశ్యం కాదు, అలాంటి ఫోను తయారుచేయాలన్న ఆలోచనా చేశారు. ఎల్జీ యూ ప్లస్
పేరుతో ఇలాంటి డ్రోన్ ఫోను గురించి చక్కగా ఎడిట్ చేసిన వీడియో ఒకటి అభిమానుల్ని అలరిస్తోంది. అందులో
ఫోనుకి వెనక వైపున రెండు ప్రొపెల్లర్లు కూడా కన్పిస్తాయి. ఫోను ఎగరాలంటే ప్రొపెల్లర్లు తిరగాలి. ఆ
శబ్దంలో నిజానికి ఫోను వినపడదు. లాజిక్‌ని పక్కన పెడితే- ఆ ఐడియాని అందిపుచ్చుకుని ఎవరైనా అలా పనిచేసే
ఫోనుని తయారుచేయకపోతారా అన్నది ఈ మోడల్ సృష్టికర్తల ఆలోచన కావచ్చు. లేదా ఆ కంపెనీనే అలాంటి పరిశోధన
ఏమైనా చేస్తూండవచ్చు.