Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఇంకెంత ‘స్మార్ట్‌’ గుంటాదో..!
#8
*ఎండతో ఛార్జింగ్‌..!*

[Image: 05012020sun-cover1i.jpg]


చేతికి ఉన్న బ్రేస్‌లెట్‌ నుంచి పలుచని కాగితంలాంటి దాన్ని బయటకు తీసి ఫోనులా వాడుకుని మళ్లీ లోపలికి
మడిచేసే రోల్‌ అవుట్‌ ఫోను నానోటెక్నాలజీతో పనిచేస్తుందట. దీంతో ఫొటోలు తీసుకోవచ్చు, వీడియోలూ చూడవచ్చు.
ఛార్జింగ్‌ అయిపోతే ఫోనుని కాసేపు ఎండలో పెడితే చాలు, ఛార్జ్‌ అవుతుంది. డిజైనర్‌ అలెక్సాండర్‌ ముకొమెలొప్‌
దాదాపు పదేళ్లక్రితం ఊహించిన ఈ ఫోను ప్రస్తుతానికి ఫొటోల్లోనూ వీడియోల్లోనూ కన్పిస్తోంది. మన చేతికి రావడానికి
ఇంకా కొంతకాలం పట్టొచ్చు. ఇదే కాదు, వేలి ఉంగరంలో నుంచి పనిచేసే రింగ్‌ ఫోను, ఒకేసారి మూడు తెరలపై
మూడు ఆప్‌లతో పనిచేసే ఎన్‌ఈసీ ఫ్లిప్‌ ఫోను, ఎలా పడితే అలా మడతపెట్టడానికి వీలయ్యే అరుబిక్స్‌ పోర్టల్‌
ఫోను, పలుచని బుక్‌మార్క్‌ పేపరులా ఉండే నోకియా 888 ఫోనూ... ఇలా ఎన్నో వెరైటీ ఫోన్ల వీడియోలు
అభిమానుల్లో ఆశల్ని రేకెత్తిస్తున్నాయి.

వాచీలోనో ఉంగరంలోనో ఫోను పరకాయ ప్రవేశం చేస్తే అదొక పద్ధతి. అలా కాకుండా అసలు కన్పించకుండా ఉంటే..!
సీ త్రూ ఫోను అలాంటిదే. ఒట్టి గాజుపలకలా లోపల ఏమీ లేనట్లు కన్పించే ఈ ఫోను మామూలు స్మార్ట్‌ఫోనులానే
పనిచేస్తుందట. ఇక హోలోగ్రఫిక్‌ ఫోను అయితే మరీ హాయి. ఎవరైనా ఎత్తుకుపోతారన్న భయం ఉండదు. ఎందుకంటే
చిన్నగా ఉండే ఈ ఫోనుని వాడేటప్పుడు చేతి మీదో టేబుల్‌ మీదో ఎక్కడ కావాలంటే అక్కడ ఫోను తెర కీబోర్డుతో సహా
కాంతిలా పరుచుకుంటుంది. కొత్త తరం ఫోన్ల జాబితాలో చిప్‌ ఫోను కూడా ఉంది. దీన్ని ఇయర్‌ఫోన్‌లా చెవికి
అమర్చుకుంటే హోలోగ్రామ్‌ లాగా తెర మన కళ్లముందు గాల్లోనే కనిపిస్తుంది. అసలు దాన్ని టచ్‌
చేయనక్కరలేకుండా మాటతోనే ఈ ఫోనుని పనిచేయించవచ్చట.
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
RE: ఇంకెంత ‘స్మార్ట్‌’గుంటాదో..! - by sarit11 - 08-01-2020, 08:23 PM



Users browsing this thread: 5 Guest(s)