08-01-2020, 08:20 PM
కొత్త కొత్తగా...
కొన్ని కంపెనీలు ఇప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్న స్మార్ట్ ఫోన్ మోడల్స్‌కి ప్రచార వీడియోలను విడుదల చేసి
అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.
*శాంసంగ్ గెలాక్సీ జీరో మోడల్‌కి అసలు అంచు అనేది ఉండదు. ఫోను చివర్లు కూడా తెరలాగా కన్పించే దీన్ని
ఇన్‌ఫినిటీ డిస్‌ప్లేగా పేర్కొంటోంది.
* చాంగ్‌హాంగ్ హెచ్2 అనే చైనీస్ ఫోన్ ఏ పదార్థాన్నైనా స్కాన్ చేసి దాని లక్షణాలను చెప్పేస్తుంది. పండులో
షుగర్ ఎంతుందనే కాదు, మన శరీరంలో కొవ్వు ఎంతుందో కూడా స్కాన్ చేసి చెప్పేస్తుందిది.
* మార్కెట్లోకి ముందుగా రావడం కాదు, పర్ఫెక్ట్‌గా రావడం అనేది ఐఫోన్ సిద్ధాంతం. అందుకే వంక పెట్టడానికి
లేనివిధంగా తయారుచేసిన మడత ఫోన్ ‘ఐఫోల్డ్’ని త్వరలోనే తెస్తుందని వేచిచూస్తున్నారు అభిమానులు.
* ఇంగ్లిష్ కంపెనీ ఫ్లెక్స్‌ఎనేబుల్ ఆర్గానిక్ ఫ్లెక్సిబుల్ లిక్విడ్ స్క్రీన్ ఫోన్ కాన్సెప్ట్‌కి
(ఓఎల్సీడీ) ప్రొటోటైప్ తయారుచేసింది. దీన్ని మడతపెట్టడమే కాదు, అవసరాన్ని బట్టి చేతి మణికట్టుకి, కారు
స్టీరింగ్‌కి, కావాలంటే పెన్సిల్‌కి అయినా చుట్టేయొచ్చు.
*ఇప్పటివరకూ మనం వేలి స్పర్శతో ఫోన్‌ని స్క్రోల్ చేస్తున్నాం. ఇకముందు కంటిచూపుతోనే ఆ పనిచేయొచ్చు.
జడ్‌టీఈ హాక్‌ఐ మోడల్ ఫోనుని మనం ఒక్క చేత్తో పట్టుకుని చదువుకుంటున్నప్పుడు రెండో చేతి అవసరం
లేకుండానే మన కంటి చూపును బట్టి తెర జరిగిపోతుంది.
* తడిసినా పాడవని, కింద పడినా పగిలిపోని ఫోన్లు కావాలనుకునేవారి కోసం జపాన్ కంపెనీ ఫుజిత్సు ప్రత్యేకమైన
ఫోన్లను తయారుచేస్తోంది. ఆ ఫోన్ సింక్‌లో పడినా సర్ఫ్‌నీళ్లతో కడుక్కుని వాడుకోవచ్చు. రోడ్డు మీద పడి ఏ
బండో దాని మీదినుంచి వెళ్లిపోయినా తీసి దుమ్ము దులిపేసి జేబులో పెట్టుకోవచ్చు.
* ఫోనుకి ముందూ వెనకా రెండు తెరలుంటే- ఎంచక్కా ఒకే ఫోనులో ఇద్దరూ వేర్వేరు సినిమాలు చూడొచ్చు కదా.
వివోనెక్స్ డ్యూయల్ స్క్రీన్, యోటాఫోన్2 లాంటివి అలాగే ఉంటాయి. చూడటానికే కాదు, వీడియోలూ ఫొటోలూ
తీసుకోడానికీ ఈ రెండు తెరలూ బాగా ఉపయోగపడతాయట.