08-01-2020, 08:05 PM
మొట్టమొదటి సారి సెల్‌ఫోన్ కొనుక్కున్న రోజు మీకు గుర్తుందా!ఫోను చేయగానే అవతలివాళ్లు ‘హలో...
ఎవరూ...’ అనకుండా ‘చెప్పమ్మా....’ అని పేరు పెట్టి పిలిచినప్పుడు అంత దూరాన ఉన్న మనిషీ భుజాన
చెయ్యేసి ఆప్యాయంగా పలకరించినట్లు అనిపించలేదూ..! ఇంట్లోవారికీ బయటివారికీ రకరకాల రింగుటోన్లూ
కాలర్‌ఐడీలూ మార్చుకుంటూ, పాటలు వింటూ, ఎస్సెమ్మెస్‌లు పంపుకుంటూ... ఎంత ఆనందించేవాళ్లమో
కదూ! మెల్లగా ఆ ఫోనులోకి కెమెరా వచ్చింది. కళ్లకి నచ్చిన దృశ్యాలన్నీ క్లిక్కులై గ్యాలరీలో
కొలువుతీరుతున్నాయి. ఇంటర్నెట్ వచ్చింది. షాపింగూ బ్యాంకింగూ టికెట్ బుకింగూ... క్షణాల్లో అయిపోతున్నాయి.