28-12-2019, 08:06 PM
(18-12-2019, 12:32 PM)Vikatakavi02 Wrote:కడిమి చెట్టు(Viswanatha Satyanarayana)
...
పీఠిక
ఇది చరిత్రాత్మక నవల. దక్షిణాపథ పూర్వరాజ చరిత్రలోఁగదంబవంశమని యొకటి కలదు. చారిత్రకులు కదంబవంశమునుగూర్చి వ్రాయుచు నిట్టికథ యొకటి యున్నుదని చెప్పుదురు. ఆ కథ నాధారము చేసికొని యీ నవల వ్రాసితిని.ఇది ప్రత్యేకంగా హైకాలేజీ విద్యార్ధులను మనసులోఁ పెట్టుకుని వ్రాసితిని. మన దేశ చరిత్రయు, దత్సంబంధమైన యుత్సాహమును వారికిఁ గలిగించు నూహతో నీప్రయత్నము చేసితిని.మఱియు నాంధ్రవచనరచన తెలుగు పలుకుబడికి దూరముగా నుండి యెక్కువ భాగము కృతకముగా నుండుచున్నది. మన మహాకావ్యములందుఁగూడ గధాంశము నందుఁ 'బ్రసంగ' సంబంధమునందు, మహాకవులెప్పుడును దెలుఁగు పలుకుబడిని వదిలిపెట్టలేదు. తెలుఁగు పలుకుబడిని వదిలిపెట్టిన కావ్యభాషను జూచి చాలామంది తెలుగువారే భయపడుదురు. ఆ కావ్యభాష నిజమైన భాష యని, తాము దైనందినముగా మాటాడు తెనుఁగుభాష భాష కాదని, చాల మంది యాంగ్లభాషావిశారదులైన తెనుఁగువారు తమకుఁ తెలుఁగు భాష రాదనుకొందురు. ఇది పొరపాటు.ఇట్టి కృతకవచనరచన చదివింపఁబడిన విద్యార్ధులను గలిగియుందురు. ఈ గ్రంధములోని వచనము మనము మాటాడుకొనునట్లే యుండును. శబ్దము చ్యుతసంస్కారము కాకుండ నుండవలయును. అన్వయము మొదలైనవి మనము మాట్లాడుకొనుటలో నున్నవి. ఇట్టి గ్రంధములు విద్యార్థులు చదివినచో వారు తమ మాతృభాషను దామెఱుగుదురు. తమకుఁ దెలిసినభాష, తమకు వచ్చిన భాష నిర్దుష్టముగస వ్రాసినచో నది భాష యగునని, యది యొక వ్యాస మగునని వారికి ధైర్యము సమకూరును. అందుకై యీ ప్రయత్నము.విశ్వనాధ సత్యనారాయణబెజవాడ
28-08-46
»› డౌన్లోడు «‹
Thank you sir
దాదా ఖలందర్


![[Image: IMG-20191218-121056.jpg]](https://i.ibb.co/bs1bbtw/IMG-20191218-121056.jpg)
![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)