Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఒక అద్భుతమైన కథ...!
#1
ఒక అద్భుతమైన కథ...!

ఈశ్వర్ అనే ఒక ప్రఖ్యాత డాక్టర్, వైద్య రంగంలో  తాను చేసిన పరిశోధనలకు, తాను పొందిన ఒక గొప్ప అవార్డును అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు.

రెండు గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక  లోపములు వలన ఆగిపోయింది.

కాన్ఫరెన్సకు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒక కారు అద్దెకు  తీసుకుని ప్రయాణం కొనసాగించాడు. 
మళ్ళి కొంతసేపు ప్రయాణము సాగిన తరువాత, విపరీతమైన గాలివాన,వర్షం మొదలయ్యిoది.

దానితో ఈ వాతావరణం లో 
ముందుకు సాగలేక ఆగిపోయాడు. 

భరించలేని ఆకలి, అలసట, వేళకు తను వెళ్ళలేకపోతున్నాను... 
అనే చికాకుల తో ఉన్నాడు     ఆ డాక్టరు.

కొంత దూరం ముందుకు వెళ్ళాక, అతనికి ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఆ ఇంట్లోకి  వెళ్ళి వారి ఫోను ఉపయోగించుకుందాము అని 
అనుకున్న ఆ డాక్టరుకు 
ఆ ఇంటి తలుపు తీసిన ఒక ముసలామె తన ఇంట్లో కరంటు, ఫోను సౌకర్యాలు  లేవు బాబు అని, బాగా వర్షం లో తడిసిపోయి నందున తన ఇంట్లో కొంత సేపు విశ్రాంతి తీసుకోమని, వెచ్చగా ఉండేందుకు టీ, కొంత ఆహారం టేబుల్ మీద పెట్టి తను పూజ చేసుకోవడానికి వెళ్ళింది.

ఆమె పక్కన ఉన్న ఉయ్యాల లో ఒక పసివాడు ఉన్నాడు. 
ఆమె గురించిన వివరాలు తెలుసుకుందా మనుకున్నాడు.
కాని ఆమె పూజలొ వుంది. ఆమె పూజ ముగించి వచ్చిన తరువాత, ఆమె మంచి మనసుకు, ఆమె పుజలొ  చేసిన విన్నపాలు అన్ని 
ఆ భగవంతుడు వింటాడు అని భరోసా ఇచ్చాడు. 

ఆ ముసలామె చిరునవ్వు నవ్వి, భగవంతుడు నేను కోరిన అన్ని కోరికలూ తీర్చాడు బాబూ. ఆ ఒక్కటి తప్ప... ఎందుకనో, ఈ కోరిక మాత్రం తీర్చడం లేదు అని చెప్పింది.

ఆమెకు అభ్యంతరం లేకపోతే, ఆమెకు తనకు నెరవేరని కోరిక ఏమిటో చెప్పమని, తాను  సాధ్యమైనంత వరకు సహాయ పడతానని చెప్పాడు వైద్యుడు. 

ఆమె ఇలా చెప్పటం ప్రారంభించింది.
"ఈ ఉయ్యాలలో ఉన్నవాడు నా మనుమడు". అతనికి ఒక అరుదైన క్యాన్సర్ వ్యాధి సోకింది. ఎంతో మంది వైద్యులకు చూపించాము. ఎవ్వరూ నయం చేయలేకపోయారు. 

ఒక్క ఈశ్వర్ అన్న వైద్యుడు మాత్రమే ఈ వ్యాధి తగ్గించగలడు, ఆయన ఇక్కడికి చాలా దూరంలో ఉన్నాడు. అందుకే వైద్యం  మీద ఆశ వదిలేసి, 
భగవoతుని ప్రార్ధనలతో జీవితం గడిపేస్తున్నాను అని చెప్పింది. వింటున్న డాక్టరుకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. 
"భగవంతుడు మీ ప్రార్ధనలు వినడమే కాదు, ఆ డాక్టరును మీ వద్దకే తీసుకువచ్చాడు కూడా". విమానం పాడయ్యి
గాలి వానలో చిక్కుకుని
నేను మీ ఇంటికి వచ్చాను. కాదు...కాదు ఈ పరిస్థితి సృష్టించి ఆయనే నన్ను మీ వద్దకు పంపాడు. 
"ఆ డాక్టర్ ఈశ్వర్ ను నేనే." అని బదులిచ్చాడు.

అప్పుడు ఆ క్షణం అతను అందుకోవలసిన అవార్డు అతనికి గుర్తు రాలేదు. పూజించండము లోని మహత్యం అదే. మనం వెళ్ళలేని చోటుకు కూడా దాని శక్తి వెళుతుంది. కావలసినది నమ్మకం అంతే.
1. ఆరాధించడం
2. విన్నవించడము
3. నమ్మడము. ఇవే పూజించడానికి
కావలసిన అంశాలు.
భగవంతుని నమ్మి, మనం ఆరాధించితె
మనకు కావలసినవి ఆయన మనకు తప్పకుండా లభింపచేస్తాడు.

Source:Internet
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
ఒక అద్భుతమైన కథ...! - by Yuvak - 30-01-2019, 08:33 AM



Users browsing this thread: 1 Guest(s)