24-12-2019, 12:22 PM
(17-12-2019, 07:08 PM)Joncena Wrote: చాలా అంటే చాలా బాగుంది మొదటి అప్డేట్. కాని అప్పుడే అయ్యిపోయిందా అనిపించింది. నా గెస్ కరెక్టే అయితే, మన మహేష్ వాసంతి తమ్ముడే అయ్యుండవచ్చు. ఎందుకంటే మీరు చెప్పారుగా, వాసంతికి తన తల్లికీ ఒకేసారి మహేష్‌కి దెబ్బ తగిలితే తన సొంతవాళ్ళకే తగిలినట్టు అనిపించడం. అలాగే వాసంతి తండ్రికి ఇంకొక సంతానం వద్దు అనుకోవడం, పుట్టిన బిడ్డ చనిపోయాడు అని మీరు అన్నారు. Maybe వాసంతి తండ్రికి నచ్చక పిల్లవాణ్ణి వదిలేసి ఉండొచ్చు వీళ్ళకి తెలియకుండా అని నా అభిప్రాయం. అందుకే వాసంతికి తన తల్లికి అంత ప్రాణమయిపోయి ఉండవచ్చు.
ఇది జస్ట్ నా గెస్ మాత్రమే. కథ మీది, అలోచన మీది. కానీ మహేష్ వాసంతి సొంత తమ్ముడు అయితే బాగుండును అని నా మనసుకు అనిపించింది, అందుకే అలా చెప్పాను. తప్పుగా ఎమన్న చెప్పుంటే మన్నించండి.
హృదయపూర్వక చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా.