20-12-2019, 06:34 AM
(This post was last modified: 20-12-2019, 06:37 AM by Kittyboy. Edited 1 time in total. Edited 1 time in total.)
ఇంతలో శివస్వతి నుండి కబురు వచ్చింది ,"మ్లేత్యులు యవనులు పశ్చిమ తీరం పై ఆవరించి ఉన్నారని"
అప్పుడు మహాబలి ఇచ్చిన పుస్తకాన్ని శాతకర్ణి తెరచి చూశాడు
శత్రువుల బలం మనకంటే పెద్దది ,వారివి మూడంతస్తుల యుద్ధ నౌకలు ,మన నౌకా దళం చిన్నది అని తీవ్రంగా ఆలోచించసాగాడు
సింహళ దేశం నుండి నౌకలు రావడానికి రెండు రోజుల సమయం పడుతుంది ఇంతలో వేళ్ళని ఎలా నిలువరించాలి అని సభ ఏర్పాటు చేసాడు
వేగుల ద్వారా వారి సైన్యం పదివేలు నౌకలు అని తెలిసింది ,శాతవాహన బలం వెయ్యి మాత్రమే
తన రహస్య మందిరం లో ఒక వ్యూహం రచించాడు
యుద్ధ నౌకలు తీరాన్ని సమీపిస్తున్నాయి
వెంటనే శాతకర్ణి పాములా పొడవుగా వున్న వంద చిన్న పడవలను రప్పించాడు,అవి మెరుపు వేగం తో కదులుతాయి.
వాటిని బోర్లా పడుకోబెట్టి ఈదుకుంటూ మ్లేత్యుల నౌకలు చుట్టూ అర్ధచంద్రాకారం లాగా ఏర్పరిచారు
శత్రువులకు పాముపడవలు తిరగబడి ఉండటం వలన ఒక తాడులాగా కనిపించాయి
ఇంతలో సింహనాదం వినిపించింది
పడవకు వేలాడదీసిన పీపాకు కట్టిన తాడు కత్తిరించారు ,కత్తులతో వాటి మూతలను తీసేసి వెనక్కి ఈదుకుంటూ వెళ్లిపోయారు గజఈతగాళ్ళు .
వెళ్లే ము కింది అంతస్తులో శత్రునౌకల తెడ్డువేసే వారిని బాణాలతో చంపేశారు
నౌకలు ఎక్కడికక్కడే ఆగి పోయాయి
శత్రువుల కంటికి పీపాలు తేలుతూ కనిపిస్తున్నాయి
ఈటెల వర్షం కురిసింది శత్రు నౌకల నుండి ....
వేలాది డాలులు నీటిపై తేలుతున్నాయి
వాటిని వీపుకు కట్టుకుని ఈదుతూ తప్పించుకున్నారు శాతవాహనులు
సముద్రమంతా నల్లగా తారుతో నిండిపోయింది
ఆకాశం లో కారుమబ్బులు ఆవరించాయి ఇంతలో సముద్రం లో పిడుగు పడింది
మెరుపులు మొదలయ్యాయి
మెర్పుల వెలుతురులో శాతకర్ణి ఆకాశ వీధి లో రధం పై కనిపించాడు
అది పిడుగు కాదు శాతకర్ణి సంధించిన నిప్పుల బాణం
నౌకలు అగ్గి రాజుకున్నాయి ,వెనుక వున్న నౌకలు వెనక్కి తగ్గాయి
ఇంతలో వెనుక నుంచి సింహళ నౌకలు రానే వచ్చాయి .అవి ఐదు అంతస్తుల నౌకలు .అవి మ్లేత్యుల నౌకను చుట్టు ముట్టాయి .
చేసేది లేక యినుప గుండ్లు ప్రయోగించ సాగారు .ఇంతలో ఒక ధ్వజస్తంభం లాంటి దానిని నౌకకు ముందు వుంచి,పదునైన ఇనుప ధ్వజాన్ని
తాడు సాయం తో ఒక్కో నౌక మీద వదిలారు .వెంటనే ఆ దెబ్బకు నౌకలు మునిగి పోయాయి .సుమిత్ర బాలి దీవుల నుండి సువర్ణ వర్మ కూడా సింహళ నావికా బలానికి సాయం వచ్చారు .
మ్లేచ్చులు తమ సైన్య రక్తం సముద్ర నీటి తో ,తారుతో పాటు కలిసిపోవడం చూసి ,యవనులతో సహా ఓటమి అంగీకరించారు.
విజయధ్వానాలు మిన్నుమింటాయి .
ఇంతలో వర్తమానం అందింది నహపాణుడు దండెత్తి రాజ్య వైపు వస్తున్నాడని....
నహపాణుడు ఉత్తర దేశ సైన్యాలన్నీ కలిపి రెండు లక్షల సైన్యం తో యుద్దానికి బయలుదేరారు.
శాతకర్ణి సైన్యం 40 వేలు మాత్రమే .....
శాతకర్ణి మహాబలి ఇచ్చిన పుస్తకం లోనించి బ్రహ్మాండమైన వ్యూహాన్ని రచించాడు .
రాజ్యాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని కోటకు రక్షణ కవచం లా అశ్వాలనూ ,ఏనుగులను నిలబెట్టాడు .
ఏనుగులకు ముళ్ల కవచం ఏర్పాటు చేసాడు
తొండానికి ఇనుప గొలుసుతో ముళ్ల ఇనుప గుండ్లు కట్టారు.ఏనుగు కు చుట్టూ పది అశ్వాలను, ఇరవై మంది సాయుధులను ఉంచారు .ఇలాంటివి వందయేనుగుల వరకు ఉంచారు.
చుట్టూ దీర్ఘచతురస్రాకారం లో సైన్యాన్ని మోహరించారు. ముందు వరుస మధ్యలో ఖాళీ వదిలారు
దీన్ని మండల వ్యూహం అంటారు
ఈ వ్యూహాన్ని పసిగట్టి గరుడ వ్యూహం పన్నాడు నహపాణుడు .
పక్షి ముక్కు ముందు వ్యూహాన్ని చీల్చేలా ,రెక్కలు రెండువైపులా చాచి మండల వ్యూహాన్ని రెండు వైపులా చుట్టుముట్టేలా పధకం వేశారు.
తమకు నాలుగు రెట్లు వున్న శత్రువులను ధైర్యం తో ఎదురు నిలిచారు శాతకర్ణి సైన్యం
ముందుకు దూసుకువచ్చింది పక్షి ముందు భాగం అశ్వదళం తో, వెనుక నుండి బాణాల వర్షం కురిసింది శాతకర్ణి సేన మీదకు .అప్పుడు శాతకర్ణి సైనికులు తయారుచేసిన యుద్ధగజాలను ముందుకు వదిలారు.
తొండాలకు కట్టిన ముళ్ల గుండ్ల తో శత్రు అశ్వాలపై విరుచుకు పడ్డాయి.
ఊహించని పరిణామాలకి హుతాశులయ్యారు నాహాపణ సైన్యం .
గరుడవ్యుహం ముక్కు పగిలిపోయింది
శాతకర్ణి మధ్యలోంచి సింహం పైకి ఎక్కి ఉరిమి కత్తి తో ముందుకు ఉరికాడు
కానీ నాహాపణ సైన్యం చండ ప్రచండం గా ఉన్నది. నిలువరించ లేకపోతున్నారు.
శాతకర్ణి ఎగిరే రధం ఎక్కి భాస్వరం నిండిన గోళాలను ఆకాశంనుండి వదిలాడు.
వాటిని నిప్పు బాణం తో కొట్టాడు.
భయంకరమైన పేలుడు సంభవించి శత్రుసైన్యం చెల్లాచెదురు అయ్యారు.
ఇప్పుడు భగవతి ఆలయం నుండి వచ్చిన వీరులు రంగం లోకి దిగారు .రెండు చేతులతో ఉరిమి ని పట్టి ఒక్క వేటుతో పది మందిని బలితీసుకున్నారు . క్యాలరీ విద్య లో ౧౦౮(108 )రకాలు ఉన్నాయి ,వాటిని మార్చి మార్చి ఉపయోగించారు.దెబ్బకు శత్రు సైన్యం సగమైంది .
అప్పుడు శాతకర్ణి తన సింహం ఎక్కి సైన్యం పై విరుచుకు పడ్డాడు. మహావాలి కి చెందిన హారాన్ని ధరించి రెండు చేతులలో ఉరిమి కత్తులను పట్టి చేతులను చాచి మణికట్టు వద్ద వేగంగా గుండ్రంగా తిప్పాడు , సింహం వేగానికి ఎత్తులు సుడిగాలి గా అగుపించాయి .మధ్య మండలం లో ఉన్న శత్రుసైన్యం తుడిచిపెట్టుకుపోయింది. ఇంతలో గాయపడిన తన సైన్యం వద్దకు వచ్చి సోమవజ్రం తో వారి గాయాలు మానేలా చేసాడు.
గాయపడిన ఏనుగులు శక్తి పుంజుకున్నాయి .ఇంతలో సూర్యాస్తమయం అయ్యింది .
తర్వాతి రోజు యుద్ధం మొదలైంది .
శాతకర్ణి శూల వ్యూహం రచించాడు. తక్కువ సైన్యం తో సూది ని పోలిన వ్యూహాన్ని రచించాడు.
దానికి ధీటుగా రెండు వరుసలలో గోళాకార వ్యూహాన్ని అమలు పరిచాడు నహపాణుడు,విజయం మీద ధీమా తో.
కానీ తన సైన్యాన్నంతా ఒకే చోట పెట్టి తప్పు చేసాడు.
ఇంతలో శత్రు సైన్యానికి కుడి వైపు గండ్ర గొడ్డలి ఉన్న జెండాలు కనిపించాయి ....త్రికోణాకారం లో కిష్కింద నుండి అనిరుద్ధుడు సైన్యం ఆఘమేఘాల మీద గోళాకారం ను చుట్టుముట్టాయి. ఎడమ వైపున మహా బలి ,మహా బలి అని అరుపులు వినిపించాయి ,భగవతి ఆలయం లోని అశ్వదళం మరో త్రికోణం ఆకారం లో ఎడమవైపు గోళాన్ని చుట్టుముట్టాయి .
పైనుంచి రధం లో చూస్తున్న శాతకర్ణి కి మధ్య లో శూలానికి గుచ్చిన గోళం ,గోళం ఇరువైపులా రెండు త్రికోణాల తో గండ్రగొడ్డలి ల వుంది ....దీన్నే గండ్రగొడ్డలి వ్యూహం అంటారు అని మహాబలి ఇచ్చిన పుస్తకం లో వుంది.
నహపాణుడు ఓటమి ఒప్పుకోక తప్పలేదు.
ఇలా శాతకర్ణి ఒక పెద్ద సామ్రాజాన్ని నెలకొల్పాడు జమ్బుద్విపం లో .
యువరాజు ను చక్రవర్తి గ పట్టాభిషక్తుడిని చేసాడు శివస్వతి .
ఇంకా వివాహం చేద్దామన్నంతలో సింహళ రాజు నుండి వర్తమానం అందింది. అందులో ఏమున్నది అంటే శాతకర్ణి పెంపుడు కొడుకు ..కదా ,రాచరిక రక్తం కాదు , దాన్ని నివృత్తి చేసుకోడానికి సింహళ దేశ రాజు వస్తున్నాడని సారాంశం.
శివస్వతి కంగారుపడి ఆంతరంగిక మందిరం లో భార్య ,పిల్లలతో సమావేశమయ్యాడు.
ఇంతలో సింహళ దేశ రాజు వచ్చి తన సందేహం తీర్చమన్నాడు.
రాజభటులు వచ్చి ఒక నాగసాధువు రాజుగారితో అతి రహస్యమైన విషయం చెప్పాలని వచ్చారని చెప్పారు.
తెరలోంచి చూసాడు శివస్వతి ,ఆ సాధువు మొదట శివస్వతి కి శాతకర్ణి కుండలిని గురించి చెప్పినవాడు .వెంటనే శివస్వతి సాధువు వద్దకు వచ్చాడు.
అప్పుడు వెనుక నుండి వచ్చిన గౌతమి దేవి ని చూసి సాధువు ,మహారాణి ,మీ సంతానం గురించి చెప్పండి,అం అడిగాడు .
అప్పుడు మహారాణి భాదపడుతూ చెప్పసాగింది
నాకు పురుటినెప్పులు మొదలైనప్పుడు శత్రుసైన్యం రహస్య సొరంగాలు ద్వారా అంతఃపురం లోకి ప్రవేశించారు. రక్షణ బలగం అంతా కోట రక్షణకు వెళ్లిపోయారు .మహారాజు (శివస్వతి) నన్ను (మహారాణి) ని కొంతమంది సైన్యం తో భూగర్భ మార్గం ద్వారా పక్కన ఉన్న అరణ్యం లోకి పంపారు.
శివస్వతి శత్రువులతో యుద్దానికి బయలు దేరాడు . నన్ను సురక్షిత ప్రాంతానికి తరలించారు .అరణ్యం లో నేను మగబిడ్డ ను ప్రసవించాను. యుద్ధం ముగిసిన తర్వాత శివస్వతి అరణ్యానికి వచ్చారు . ఇంతలో ఒక సింహం గుంపు సైనికులను చంపేసింది. మహారాజు నన్ను సింహాల నుండి కాపాడారు .ఇంతలో ఓ ఆడ సింహం పసిబిడ్డను కరచుకొని పారిపోయింది. ఎంత వెతికినా పసిబిడ్డ కనపడలేదు.
అప్పుడు సాధువు చెప్పాడు " శాతకర్ణి మీ కన్నబిడ్డ ,నేను అరణ్యం లో తాంత్రిక విద్యలు సాధన చేస్తున్నప్పుడు ,సింహం నోట్లో పసిబిడ్డ ని చూసి నా విద్య తో బాలాకుడిని కాపాడాను .పక్కనే మయి అనే తెగ వారికి అప్పచెప్పి హిమాలయాలకు వెళ్ళాను .వారు సింహాలను వేటాడే వారు .నాకున్న శక్తులతో ఇతని భూత ,భవిష్యత్ సమాచారాన్ని తెలుసుకున్నాను. ఇతను మీకు మళ్ళీ అడవిలో దొరుకుతాడని ఇతని జాతకం చెప్పింది.మీకు ఇతని జన్మరహస్యం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇతని వివాహానికి ,వంశ పరంపరకు ఇది అడ్డు కాకూడదని ,త్వరలో శాతకర్ణి చేత రాజసూయ యాగం చేయించమని చెప్పి ,వెళ్ళిపోయాడు .
ఇదిమొత్తం విన్న శివస్వతి ,గౌతమి దేవి పరమానంద భరితులయ్యారు .ఆనందం తో శాతకర్ణి ని హత్తుకొని ఏడ్చారు .
సింహళ రాజు కూడా వివాహం జరిపించాడు.
మహారాణి తోలి రేయి రోజు ధవళ వస్త్రాలతో శయన మందిరం లోకి వచ్చింది .
శాతకర్ణి ఆమెను తొలి కలయిక నాడు జ్ఞాపకాలలోకి తీసుకెళ్లాడు .ఇంతలో ఒక సందేహం వచ్చింది
మహారాణి మీ నామధేయం అని అడిగాడు .
అప్పుడు ఆమె నొచ్చుకొని రాజా మీరు తురీయా స్థితి ని అర్ధం చేసుకున్నంతగా ఆడవారి హృదయాలను అర్ధం చేసుకోగలరా అని
మందిరం లోని కొలను లో కలువ పువ్వును తెచ్చి,పంటి తో కొరికి తన వక్ష స్థలం మీద పెట్టి శాతకర్ణి కి అందించింది తొలి కలయిక లో చేసినట్టుగా . .
శాతకర్ణి కి విషయం అవగతమై "పద్మావతీ దేవి ,మీరు మీ పేరుని ,మీరుండే ప్రదేశం దంతేశ్వర పురం అని ,తొలి చూపు లోనే నన్ను హృదయ ప్రతిష్ట గావించివున్నారని మీ సoఞ్జల ద్వారా చెప్పకనే చెప్పారు ,నేను అవగతం చేసుకోలేక పోయాను . కానీ అది నాకు మంచికే జరిగింది .మిమ్మల్ని అన్వేషించే క్రమం లో నన్ను నేను తెలుసుకున్నాను. నీ వల్ల నా జీవనానికి ఒక అర్ధం వచ్చింది అర్ధాంగి అన్నాడు.