Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller సింహబలుడు(శాతకర్ణి 1)
#2
ఋష్యముఖి పర్వతం కిష్కింధ రాజ్యం వద్ద ఉన్నది.
కిష్కింద రాజ్యాన్ని అనిరుద్ధుడు అనే మహారాజు పాలిస్తున్నాడు. వాలి సంతతికి చెందినవాడు.
రాజ్యం పర్వతాల నడుమ ఉన్నది. చుట్టూ పర్వతాలు గోడల్లా ఉన్నాయి.






రెండు కొండల మధ్య మార్గం ఉన్నది. అది ముఖద్వారం. ఒక్కో కొండపై ఒక వానర వీరుని శిల్పం ఉన్నది. వాళ్ళిద్దరూ మల్లయుద్ధం చేస్తున్నట్టు ఉన్నది. చేతుల రెండూ బాహాబాహీ చేస్తున్నట్టు ఉన్నది, అది ఆ ముఖద్వారానికి తోరణంలా ఉన్నది.

ముఖద్వారం వద్ద వానర వీరులు శాతకర్ణిని ఆగి ఆది విచారించారు. తాను శాలివాహన యువరాజు అని శాతకర్ణి చెప్పాడు.
అరుణాచలంలోని తీవ్ర ఒత్తిడి వల్ల బక్కపలుచగా తయారయ్యాడు శాతకర్ణి.
వానరవీరుడు నువ్వు యువరాజా? అని గేలి చేసి కయ్యానికి కాలుదువ్వారు.
వెంటనే శాతకర్ణి గర్వం అణచాలని చెప్పి వారితో యుద్ధం చేశాడు.
కానీ వానర వీరుల బలం ముందు శాతకర్ణి నిలువలేకపోయాడు. వాళ్ళు ముగ్గురూ కలిసి శాతకర్ణిని మట్టికరిపించారు.
శాతకర్ణిని బంధించాలని చూశారు, అప్పుడు శాతకర్ణి శివుడిని తలచుకుని సోమవజ్రాన్ని బయటకు తీశాడు.
ఆ శక్తికి తాళలేక వానర వీరులు పారిపోయి తమ రాజ్యంలోని సాధువుని తీసుకువచ్చారు.
ఇదేదో మంత్రజాలమని తలచి ఆ సాధువు వచ్చి శాతకర్ణిని చూసి, "నాయనా ఇది సోమవజ్రం, శివుని తేజస్సు గలది. ఇది సామాన్యులకు దొరికేది కాదు. నీవు కారణజన్ముడివి నిన్ను మా గురువుగారి వద్దకు తీసుకువెళతాను" అని తీసుకెళ్ళాడు.
సొరంగ మార్గంలో నుంచి భూగర్భగుడిలోకి ప్రవేశించారు ఇద్దరూ.
ఒళ్ళంతా తెల్లని జుట్టుతో సింహాసనం మీద ఉన్న ఒక యోగిని చూశారు శాతకర్ణి.
ఆ గదిలో వానరులు మల్లయుద్ధం, గదాయుద్ధ శిక్షణ పొందుతున్నారు.
అప్పుడు శాతకర్ణి నమస్కరించి, "యోగిపుంగవా, ఎవరు మీరు? "అని అడిగాడు.
ధ్యానంలో ఉన్న ఆ యోగి, శాతకర్ణి చేతిని చూసి, నాయనా నీవు అచ్చం మీ ముత్తాతలా ఉన్నావు, మీ ముత్తాత కుండలిని కూడా అదే అని అన్నారు.
ఆశ్చర్యంగా చూశాడు శాతకర్ణి
"నా పేరు జాంబవంతుడు. నేను ఈ కిష్కింధ రాజ్యానికి రక్షకుడిని "అని అన్నారు ఆ యోగి.
అప్పుడు జాంబవంతునికి నమస్కరించి శాతకర్ణి, మిమ్ములను కలుసుకోవడంతో నా జన్మ ధన్యమయినది.
"నా ముత్తాత మీకు తెలుసా "అన్నాడు.
అప్పుడు జాంబవంతుడు, “పరశురాముడు సృష్టించిన ఈ దక్షిణ జంబూ ద్వీపంలో తరాల కొద్దీ రాజులను, రాజ్యాలను పరిరక్షించడానికి నియమింపబడిన వారిలో నేను ఒకడిని మా అందరికీ అధినాయకుడు ఒకరు ఉన్నారు. త్వరలో నీకు తెలుస్తుంది. మీ ముత్తాత శ్రీముఖ శాలివాహనుడు. బాలకుడిగా వచ్చిన ఆయనకు బాహుబల సంపన్నునిగా మార్చింది మేమే.
ఆయన గొప్ప వీరుడు ఒక్క కత్తి వేటుతో 15 మందిని చంపిన ఘనుడు. "
అప్పుడు శాతకర్ణి ఆశ్చర్యంతో అది ఎలా సాధ్యం జాంబవంతుల వారు అని అడిగాడు.
మీ ముత్తాత ఆయుధం పేరు ఉరిమి. మూడు కత్తులు ఒక్క పిడితో చేయబడి ఉంటాయి, కత్తులకు వంగే గుణం ఉంది. కత్తిని తాడులా గుండ్రంగా చుట్టి ఒక్క ఉదుటన వదిలేవాడు ,చుట్టూ చక్రంలా తిప్పేవాడు. ఆదృశ్యం ఇప్పటికీ నా ముందు కదలాడుతుంది అని చెప్పాడు.
"నా ముత్తాత గురించి ఇంకా వివరాలు చెప్పండి" అన్నాడు శాతకర్ణి.అప్పుడు జాంబవంతుల వారు, కాలమే నీకు కధగా చెబుతుంది నాయనా అన్నారు.
“ నీవు వచ్చిన కార్యమేమి “ అని అడిగాడు.
“నేను ఈ తాళపత్ర గ్రంధంలోని రెండో వాక్యం కోసం వచ్చాను, నన్ను దక్షిణామూర్తి గారు ఇక్కడికి అరుణాచలం నుండి పంపారు " అని అన్నాడు.
ఆ తాళపత్రం చూశాడు జాంబవంతుడు, అగ్నితో నీటి దీపం వెలిగించవచ్చు అని చదివారు. "నాయనా ఆ జలాలు ఋష్యముఖి పర్వతం మీద ఉన్నాయి, అక్కడ మాతంగ ముని ఆశ్రమం ఉన్నది, ఆ ఆశ్రమ౦లోని కొలనులో ఆ నీరు దొరుకుతాయి.మామూలు వ్యక్తులకు అక్కడ ప్రవేశం నిషిద్దం. ఆ కొలనుకు యక్షులు కాపలాగా ఉంటారు. నీవు శక్తిహీనుడిలాగా ఉన్నావు. కావున నీవు సరైన శిక్షణ నా వద్ద తీసుకోవలసి ఉంటుంది. సాధువు చెప్పారు. “నిన్ను మల్లయుద్ధంలో వానరులు ఓడించారని”. .
నీ కుండలిని బట్టి నీవు ఈ జంబూద్వీపానికి చక్రవర్తిని అవుతావు. అతులిత బలసంపన్నుడివి అవ్వాలి. నేను నీకు శిక్షణ ఇస్తాను.
మొదట నీవు అంజనాద్రి పై ఉన్న మూలికలు తీసుకురావాలి, ఈ సాధువు నీతో పాటు వస్తారు. ఆ మూలికలు స్వయం ప్రకాశాలు, అని చెప్పి పంపించారు."
అంజనాద్రి అక్కడున్న చాలా పెద్ద పర్వతం, నిండా దట్టమైన వృక్షాలు ఉన్నాయి వానరులు చెట్ల మీదనుంచి దూకుతూ వెళుతున్నారు. శాతకర్ణిని నేలమీద నుంచి రమ్మన్నారు.
శాతకర్ణి నవ్వుతూ నా బాల్యమంతా వృక్షాల ఒడిలోనే జరిగింది అని ఒక్క ఉదుటన చెట్టు ఎక్కి ఊడల సాయంతో చెట్లపై దూకుతూ వెళ్ళాడు.
ఆశ్చర్యపోవడం వానరుల వంతయ్యింది. వారం రోజుల తర్వాత అక్కడి మూలికలు, పండ్లు తినడం వల్ల దేహదారుఢ్యం పెరిగింది శతకర్ణికి, ఆఖరికి అంజనాద్రి మీదకు చేరుకున్నారు.
ఇంతలో గాలివానలో వచ్చి శాతకర్ణి తప్పిపోయాడు. అక్కడ ఒక చిన్న గుహలో చేరుకున్నాడు శాతకర్ణి.
ఆ గుహలో వృద్ధదంపతులు ఉన్నారు. "వారి వద్దకు వెళ్ళి నేను మూలికల కోసం వచ్చి తప్పిపోయాను అని చెప్పాడు ",శాతకర్ణి.
తుఫాను తగ్గకపోవడంతో ఆ వృద్ధ దంపతులకు, ఆహారం నీరు సమకూర్చే వాడు.
ఒక రోజు గుహలోకి మొత్తం నీరు వచ్చేసింది ముదుసలి దంపతులు మునిగిపోతున్నారు. అప్పుడు వాయు స్తంభన విద్యతో, తాను మునిగి వారిద్దరినీ పైకి లేపి ఉంచాడు.
తుఫాను తగ్గిన తర్వాత తాత " నాయనా మాకు చాలా సేవ చేశారు. నీ రుణం తీర్చుకోవడానికి ఈ హారం తీసుకో, దారిలో ఉపయోగపడుతుంది అన్నారు.
కానీ ఈహారo ఎవరికీ చూపించకూడదు అన్నారు.
ఈ హారం వాలికి ఆయన తండ్రి ఇంద్రుడు ఇచ్చింది. ఇది ఎవరు పడితే వారు ధరించలేదు. దీని శక్తిని తట్టుకుని నిలబడలేదు. కాబట్టి నీవు కారణజన్ముడిలా ఉన్నావు. నీవు బలశాలిలా ఉన్నావు,తీసుకో "అన్నారు.
శాతకర్ణి హారం వేసుకున్నాడు. కానీ దాని శక్తిని తాళలేక తాతకి ఇచ్చేశాడు. తాత శాతకర్ణితో "అంజనాద్రి చిట్టచివర కొన్ని మూలికలు ఉంటాయి అవి నీకు చూపిస్తాను కానీ నేను అంత ఎత్తు ఎక్కలేను అన్నాడు. "
తాతని భుజం పై వేసుకుని శాతకర్ణి చిట్టచివర పర్వతంపైకి వెళ్ళాడు. అక్కడి చెట్టుకి యక్షులు కాపలా కాస్తున్నారు. అప్పుడు యక్షులతో శాతకర్ణి యుద్ధం చేశాడు. యుద్ధంలో యక్షులు భయంకరంగా పోరాడుతున్నాడు. ఆఖరికి మొలలో ఉన్న సంచిలో ఉన్న సోమవజ్రాన్ని బయటకు తీశాడు. కానీ ఆ కాంతిని తట్టుకుని యక్షులు మళ్ళీ పోరాడసాగారు. వారి యుద్ధ నైపుణ్యం ముందు శాతకర్ణి నిలువలేక పోయాడు. అప్పుడు శాతకర్ణి తాత వద్ద దాచిన హారాన్ని వేసుకున్నాడు. వెంటనే శాతకర్ణి శక్తి పెరిగింది. యక్షులను ఓడించి బంధించాడు.
అప్పుడు ఆ మూలికలను తీసుకుని గుహలోకి వచ్చాడు శాతకర్ణి తాతతో అన్నాడు శాతకర్ణి, ముందు నేను హారాన్ని వేసుకున్నప్పుడు తాళలేక పోయాను, ఇప్పుడు ఎలా భరించగలిగాను అన్నాడు.
అప్పుడు తాత "ముందు నువ్వు సందేహంతో వేసుకున్నావు, నాలో ఆ శక్తి ఉందా అని, “ముందు వానరుల చేతిలో ఓటమి గుర్తుకు వచ్చి”
ఇప్పుడు నువ్వు నేను యక్షులను ఓడిoచాలి అని సన్నద్ధమై ఈ హారాన్ని ధరించావు.
మొదట నీలో అంధకారం పాళ్ళు ఎక్కువ, ఇప్పుడు నీలోని వెలుగు అంధకారాన్ని జయించింది.
ఈ హారం యొక్క శక్తి అదే విజయీభవ అని మూలికతో మీ ప్రాంతానికి వెళ్ళు అన్నారు" తాత.
ఉత్సాహంతో శాతకర్ణి జాంబవంతుని వద్దకు వచ్చాడు.
నాయనా నీకు కావలసిన దేహదారుఢ్యాన్ని, యుద్ధ నైపుణ్యాన్ని కూడగట్టుకున్నావు.
ఈ ములికా రసంతో నా సైన్యాన్ని ఇంకా బలంగా తీర్చిదిద్దుతాను అని అన్నారు.
అప్పుడు మహారాజు అనిరుద్ధుడు వద్దకు జాంబవంతుడు తీసుకెళ్ళాడు.
శాతకర్ణికి నమస్కరించి అనిరుద్ధుడు, మీ తాతగారు మా రాజ్యం కష్టకాలంలో ఉన్నప్పుడూ మాకు చాలా సాయం చేశారు. ఇప్పుడు మీకు ఏమైనా సాయం కావలిస్తే మమ్ములను అడగండి అన్నాడు. అప్పుడు శాతకర్ణి సమయం వచ్చినప్పుడు నేను అడుగుతాను. ఇక్కడ నుండి ఋష్యముఖి పర్వతానికి వెళ్ళాలి అనుమతించండి అని అడిగాడు.
మా సంతతి వారు ఆ పర్వతం పైకి వెళ్ళడం నిషిద్ధం. మహా వాలికి మాతoగ ముని శాపం అది ,కావున మీరు ఒంటరిగా వెళ్ళండి అని చెప్పాడు.
అప్పుడు ఋష్యముఖి పర్వతం పైకి వెళ్ళాడు శాతకర్ణి.
అక్కడ మాతంగ మహర్షి ఆశ్రమం ఉంది. ఆయన వారసులు ఉన్నారు.
అక్కడ ఒక హనుమంతుని గుడి ఉన్నది.
అప్పుడు శాతకర్ణి మునులతో చెప్పారు. “నేను శాలివాహన రాకుమారుడిని దీపంతో నూనె కాకుండా జలంతో వెలగాలి.
దీపాన్ని వెలిగించే జలాన్ని అన్వేషించ వచ్చాను, కాబట్టి మీరు మార్గం చూపించాలి” అని అన్నారు. ఇక్కడి కొలనులోని జలాన్ని శివుని ఆత్మలింగంపై అభిషేకించాలి అప్పుడు ఆనీటికి దీపాన్ని వెలిగించే శక్తి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఒక కొలను చూపించి ఈ జలం తీసుకోండి అన్నారు. కొలనులో నీళ్ళు లేవు. ప్రతీ సంవత్సరం మార్గశిర ఏకాదశి నాడు ఆకాశగంగ ఇక్కడకు వస్తుంది, ఆ ఆకాశగంగని తీసుకోవడానికి పాత్ర మాత్రం తెల్ల ఆవునుండి తయారుచేసినదై ఉండాలి, కానీ ఆ జంతువు రక్తం మాత్రం చిందకూడదు. ఆ రక్తం ఈ ఆశ్రమ భూమిపై చిందితే ఈ ఆశ్రమం శాపం నీకు తగులుతుంది అన్నాడు.
అప్పుడు, శాతకర్ణి బాగా ఆలోచించి ఆవు కొమ్ముతో నీళ్ళు పడదాము అని చెప్పి, కానీ రక్తం రాకుండా వాటిని తీయడమెలా అని ఆలోచించి సోమవజ్రానికి అనంతశక్తి ఉంది. ఆ శక్తిని చిన్న కిరణంలా మారిస్తే అని తలచి ఒక సీసపు పెట్టెలో వజ్రాన్ని పెట్టి మూసాడు. తన ఆత్మ శక్తితో వెలిగించాడు. అందులోనుంచి ఒక కిరణం వచ్చింది. ఆ కిరణం శక్తికి చెట్టు పడిపోయింది మెల్లగా కొమ్మును ఆ కిరణం సాయంతో కత్తిరించాడు.
రక్తం రాకుండా తెగిపోయింది కొమ్ము.
మార్గశిర ఏకాదశి రానేవచ్చింది, ఆ కొమ్ముతో నీరు పట్టి, ప్రమిద వెలిగించాడు శాతకర్ణి.
ఇప్పుడు ఆ దీపాన్ని ఆకాశంలో మూడు వెలుతురులు మధ్య పెట్టాలి అది ఎక్కడ అని ఆలోచించసాగాడు.
అప్పుడు శాతకర్ణి ఆలోచించాడు, పరశురాముడు కేరళ ప్రాంతాన్ని నిర్మించాడు కదా, అక్కడకు వెళ్ళి వెతుకుదాము అని బయలుదేరాడు.
దారిలో ఒక పండితుడు శాతకర్ణికి కనిపించాడు. ఆయన దుర్భిణిలో చుక్కలను చూస్తున్నాడు. అప్పుడు శాతకర్ణి ఆయనకు నమస్కరించి స్వామీ మీరు ఏమి చేస్తున్నారు అన్నాడు. అప్పుడు ఆయన “నా పేరు భట్టు, నేను ఖగోళశాస్త్రాన్ని అభ్యసిస్తున్నాను. అని అతనికి ధృవ నక్షత్రం దుర్భిణిలో చూపించాడు. శాతకర్ణి సంతోషించి, నాకు ఒక సందేహం ఉంది ఆకాశంలో మూడు వెలుగులు ఎక్కడ ఉంటాయి. చుక్కలైతే లెక్కపెట్టలేనన్ని ఉంటాయి కదా అని అన్నాడు.
అప్పుడు భట్టు నాయనా, ఇప్పుడు వచ్చే మాసంలో మకర సంక్రాంతి నాడు ఆకాశంలో శబరిమల పైన మూడు కాంతులు దర్శనమిస్తాయి అని చెప్పారు.
అప్పుడు శాతకర్ణి ఆయనకు నమస్కరించి, సెలవు తీసుకున్నాడు. శబరిమల పైకి ప్రయాణం సాగించాడు.
దారి మధ్యలో హనుమంతుని గుడి ఒకటి ఉన్నది. ఆయన ఆ గుడి వద్ద ఆగారు. అక్కడ ఒక యోగిని చూశాడు. అప్పుడు ఆ యోగి శాతకర్ణిని నాయనా ఎవరు నీవు అని అడిగాడు.
అప్పుడు శాతకర్ణి తన దగ్గర ఉన్న సోమవజ్రాన్ని, నీటిని చూపించాడు. అప్పుడు ఆయన నీవు ఇచ్చటకు వచ్చిన పని ఏమిటి అని అడిగారు.
అప్పుడు శాతకర్ణి ఆకాశంలో మూడు వెలుగుల మధ్య ఈ వెలుగు పెట్టాలి, అని చెప్పాడు.
అప్పుడు ఆ యోగి “నాయనా, మకర కలువు అంటే మూడు వెలుగులు, ఆ
వెలుగులు మకరసంక్రాంతి రోజున కనిపిస్తాయి కానీ ఆ వెలుతురులో ఒక మర్మం ఉన్నది. బ్రహ్మచారి, ఐహిక సుఖాలను వదలి, సాత్వికాహారం భుజించి దీక్షగా దేవుని స్మరించువారికి ఆ మూడు వెలుగులు స్పష్టంగా కనిపిస్తాయి. వెలుగులు క్షణకాలం పాటు ఒక్కొక్కటిగా వస్తాయి.”
“ఆ వెలుగుల నుండి ఒక శక్తి వచ్చి అది చూసిన వారిలో ఒక నూతనోత్తేజం నింపుతుంది.”అని అన్నాడు.
ఆ రోజు మకరసంక్రాంతి
అప్పుడు శబరిమల శిఖరం పైకి ఎక్కి మూడు వెలుగులను చూశాడు. ప్రమిదలో నీరు పోసి, సోమవజ్రాన్ని వెలిగించాడు తన ఆత్మశక్తితో దీపం వెలిగింది. ఒక్కసారిగా పెద్ద వెలుతురు వచ్చి మూడు వెలుగుల నుండి దీపానికి వెలుతురు వచ్చింది. ఆ వెలుతురు కొండ క్రింది ఒక చోట పడింది. అక్కడ ఒక గుర్రం కనబడింది. సోమవజ్రాన్ని తీసుకుని ఆ గుర్రం మీద ఎక్కి వెళ్ళాడు.
క్రిందకు వచ్చి చూస్తే అక్కడ పెద్ద కొలను ఉన్నది.
కొలను చుట్టుప్రక్కల చూశాడు ఏమీ కనబడలేదు.
కొలను లోపలికి దూకాడు శాతకర్ణి లోపల ఒక గుహలాగా ఉంది. దానికి ద్వారం ఉంది వెలుగు ఆ ద్వారం మీద ఉంది. లోపలి తలుపు తీయగా బయట తలుపు మూసుకుపోయింది, లోపల నీళ్ళన్ని బయటకు వెళ్లిపోయాయి. లోపల ఇంకో ద్వారం ఉన్నది. ద్వారం తీయగానే, ఆ వెలుగు లోపల ఉన్న ఒక వ్యక్తిపై పడింది.
ఆ వ్యక్తి సింహాసనంపై కూర్చుని ఉన్నాడు.
అద్బుతమైన ఆ ముఖవర్చస్సు చూసి ఆశ్చర్యపోయిన శాతకర్ణి నమస్కారం చేసి మహానుభావ మీరెవరూ అని అడిగాడు.
అప్పుడు శ్వేతాంబరధారి అయిన ఆయన మేని బంగారు ఛాయతో వన్నెలీనుతోంది. ఆయన వెండిరంగు గెడ్డం,వస్త్రాల అందాన్ని రెట్టింపు చేస్తున్నది.
అప్పుడు ఆయన నవ్వుతూ,"నాయనా నీ సాహసాలు,అంకుఠిత దీక్ష నాకు నచ్చాయి. నిన్ను ఈ (దేశానికి) జంబూ ద్వీపానికి చక్రవర్తిగా చేయడానికి ఘడియలు దగ్గరకు వచ్చాయి అన్నాడు.అప్పుడు ఆయన నీవు అశ్వమేధయాగం,రెండు రాజసూయ యాగాలు చేస్తావు.నీ కంటే ముందు రఘువంశ నందనుడు ఆ మహాత్కార్యం చేసాడు. ఆయన కంటే ముందు నీను ఆ పని చేసాను.నా పేరు మహాబలి చక్రవర్తి అని చెప్పాడు.నేను మహావిష్ణువు ఆజ్ఞానుసారం పాతాళలోకంలో ఉండి సంవత్సరానికి ఒక సారి ఈ భూమి మీదకు వస్తాను.
నేను, నా స్నేహితుడు ఈ జంబూద్వీపానికి పరిరక్షకులము.పూర్వo దక్షిణ జంబూద్వీపం నిత్యం సముద్రుడు ఆధీనంలో ఉంది, ఎప్పుడూ జీవజాతులు సముద్రుని కోపానికి బలి అవుతూ ఉండేవి. దైవ సంపన్నుడు, దివ్యాంశ శంభూతుడు అయిన పరశురాముడు, దుష్ట క్షత్రియ వధ చేసి, రాజ్యాన్ని స్దాపిoచాలనుకున్నారు. కానీ సముద్రుడు వల్ల ఉన్న ముప్పును ముందే పసిగట్టిన భార్గవరాముడు అతనితో యుద్దం చేసి కట్టడి చేసాడు.
సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన భాధ్యతోను తన నెత్తిన వేసుకున్న పరశురాములవారు అగస్త్యమునితో కలసి కొడంగల్లూరులోని భగవతి అమ్మవారిని ప్రతిష్టించారు.ఆదిశక్తి మహిమ వల్ల అక్కడ గురుకులం స్థాపించి అన్ని శాస్త్రాలను అభివృద్ది చేసారు."అని అన్నారు.
అప్పుడు మహాబలి శాతకర్ణిని తీసుకుని ఆలయం క్రింద ఉన్న సొరంగ మార్గంలో ఇంకొక భూగర్గ ఆలయంలోకి తీసుకెళ్లారు. అందులో అందరూ ఒక మర్మకళను అభ్యసిస్తున్నారు. అందులో శిక్షణ చాలా కఠినంగా ఉంది.
అది చూసిన శాతకర్ణి, "రాజోత్తమా,మిమ్ముల్లి కలవడం నా జన్మ అదృష్టం, నేనెంతో పుణ్యం చేసుకున్నాను. మీరు మహా గ్రేసరులు, అంతకు మించి మానవోత్తములు.ఈ యుద్దవిధ్య ఏమిటో సెలవివ్వగలరు" అన్నారు.
దీన్ని పరశురాములు వారు అభివృద్ది చేసారు. అగస్త్యముని, ఎంత ప్రయాసలకొర్చి దీన్ని శిష్యులకు నేర్పించారు.
మేమందరం దీనిని కలరి అని పిలుస్తాము. ఇది మానసిక, శారీరక పరిపూర్ణత పొందిన వారే చేయగలరు. మేము చిన్నవయసు నుండి ఈ యుధ్ధకళను నేర్పిస్తాయి. దాంతో వారు పరిపూర్ణ సైనికులవుతారు. వారిని ఈ మహాభారత సామ్రాజ్యానికి పరిరక్షకులుగా నియమిస్తాము.
ఇందులో కొందరు సంఖ్యాశాస్త్రం, ఆర్ధికశాస్త్రం, శల్యశాస్త్రం, వైద్యశాస్త్రంలో కూడా నిష్ణాతులు మన సామ్రాజ్యానికి పునాది రాళ్ళుగా ఉన్న ఈ విజ్ఞులను ఈ భగవతి ఆలయమే తయారు చేసింది.కాలాలు మారినా ఈ దేశాన్ని రక్షించడానికి కొందరు చిరంజీవులను ఈ ఆలయం ఆదేశించింది.అందులో నేను, నా స్నేహితుడు ముఖ్య భూమిక పోషిస్తాము "అన్నారు.
అప్పుడు శాతకర్ణిని చూసి మహాబలి నాయనా నీ తేజస్సు నిన్ను చూస్తుంటే నీ తాత గారు శ్రీముఖుశాలివాహనుని చూస్తున్నట్లుంది. ఆయన మహా తేజోమంతుడు.
అప్పుడు శాతకర్ణి మహాబలితో," విప్రవర్య, దయచేసి మా తాతగారి గురించి నాకు చెప్పండి "అన్నారు.
మహాబలి అప్పుడు ఇలా అన్నారు ... "ఈ దేశాన్ని విక్రమాధిత్యుడు వేల సంవత్సరాలు పాలించారు. తన తమ్ముడు భట్టితో కలసి
కొంతకాలానికి సైన్యాధ్యక్షులు అధికారదాహం వల్ల సామంత రాజులు రాజ్యాలను కొల్లగొట్ట సాగారు. అలాగే శ్రీముఖుని తండ్రి రాజ్యాన్ని తగుల బెట్టారు.కోపంతో రగిలిపోయిన 10 ఏళ్ళ శ్రీముఖుడు, విక్రమాధిత్యుని ఓడించడానికి లక్షమంది సైన్యాన్ని తయారు చేసాడు."
అప్పుడు శాతకర్ణి ఆశ్చర్యపడి ఇది ఎలా సాధ్యం అన్నారు.
అప్పుడు మహాబలి ఇలా సెలవిచ్చారు "నిజం సైన్యం కాదు, మట్టితో చేసిన బొమ్మలు, అతనిని ఒక నాగా సాధువు తీసుకొచ్చి మా వద్ద వదిలాడు, అతని కుండలినిలో మహారాజయోగం ఉంది అని
అప్పుడు అతనిని అరుణాచలంలో బుద్ది బలాన్ని, రిష్య ముఖ పర్వతాలలో భుజ బలాన్ని పెంపొందించుకునేలా సమగ్ర శిక్షణ ఇప్పించాము.విక్రమార్కుని పై యుద్దానికి శ్రీముఖుని సన్నద్దం చేసాము.
మా మిత్రులు ద్వారా లక్షమంది సైన్యాన్ని సమీకరించాము. కానీ విక్రమార్కుని సైన్యం రెండు లక్షలకు పైగా ఉంటుంది.
అందరికీ నాగాసాధువు లక్షమంది సైన్యం, శ్రీముఖుడు తయారు శ్రీముఖుడు చేసిన మట్టిబొమ్మల నుంచి సృస్టించారని వదంతి వ్యాపింప చేసాం.
యుద్ధ భేరి మ్రోగింది .శ్రీముఖుడు ఉరిమి అనే ఆయుధం తో బరిలోకి దిగాడు .




ఒకే పిడిలో ఉన్న మూడు వంగే కత్తులలో చుట్టూరా గోళాకారంలో తిప్పుడూ రధం పైకి ఎక్కి ముందుకు ఉరికాడు శాలివాహనుడు.
శాలివాహనుడు, యుద్దంలో ఉరిమిలో విజృంభిస్తున్నాడు. సైన్యం ప్రక్కనే ఉన్న అడవిలో తలదాచుకున్నారు
పెద్ద ఎత్తున ఉన్న విక్రమార్కుని సైన్యాని నిలువరించలేక పోతుంది కాబట్టి.
ఒకే ఒక్కడు శాలివాహనుడు బయలుదేరారు. అప్పుడు శాలివాహనుడు, చక్రవ్యూహంలోకి అడుగుపెట్టారు.
వ్యూహం మధ్యలో వెళ్ళగానే కత్తులలో 15 మంది చుట్టుముట్టారు.
ఉరిమిని పైకి లేపి, గుండ్రంగా ఒక వేటు వేసాడు శాలివాహనుడు ఉరిమిలోకి కత్తులు, మెరుపుల్లా పదిహేను మందినీ చంపేసాయి.
తేరుకున్న సైనికులు రెండో వలయంలో 30 మంది బాణాలు సంధించారు.
ఉరిమితో వలయాకారంలో ఉరిమి తిప్పుతూ అతి వేగంగా తన చుట్టూ గోళాకారం లో రక్షణవలయాన్ని స్టాపించాడు.
తన మొలలోనించి ఒక కత్తిని తీసాడు.




నెలవంక ఆకారంలో ఉన్న రెండు కత్తులను రెండు వైపులా విసిరాడు శతవాహనుడు. సుదర్శన చక్రం లా రెండు కత్తులూ తిరుగుతూ 30 మందినీ చంపేశాయి, వెంటనే తన చేతుల్లోకి వచ్చేసాయి.
వెంటనే సైన్యం అంతా చక్రవ్యూహం వైపు వచ్చి చుట్టుముట్టారు.
రధంలోనుంచి దూకి మహాబలి ప్రసాదించిన పరశురాముని గొడ్డలి బయటకు తీసారు శ్రీముఖుడు .
వెంటనే గొడ్డలి వేగంగా తిప్పుతూ గాలిలోకి విసిరారు.
ఆకాశంలో ఆ గొడ్డలి వేగంగా గుండ్రంగా తిరుగుతూ ఎర్రగా సూర్యునిలా వెలుగుతూ నిప్పులు రువ్వసాగింది.
ఆ వెలుగుకు అందరూ కుప్పకూలిపోయారు విక్రమార్కునితో సహా.
వెంటనే అడవిలో ఉన్న సైన్యం, అందరినీ బంధించింది.
విక్రమార్కుడు తప్పించుకున్నాడు.
చండప్రచండంగా ఉన్న ఆ గొడ్డలి మళ్ళీ శాలివాహనుడు చేతిలోకి వచ్చింది.
అలా మీ ముత్తాత శాలివాహనుడు అలా విక్రమార్కుని ఓడించి శాలివాహన శకాన్ని స్థాపించారు .
ఆ గండ్రా గొడ్డలిని హిమాలయలకు తీసుకెళ్ళి అమరనాధునితో నిక్షిప్తం చేసాము.
అప్పుడు మహాబలి నాయన అది మీ ముత్తాత కధ అని చెప్పారు.
మహాబలి "నాయినా నీకు కూడా చక్రవర్తి యోగం ఉంది. ఈ దేశాన్ని బయట శత్తులు ఆక్రమిచడానికి పన్నగాలు పన్నుతున్నాయి. వాటిని నీవు నిలువరించాలి.అలా నిలువరించాలి అంటే నీవు చతురంగ బలాలు, నావికా బలాలలో సుసంపన్నం అవ్వాలి.
నావికా బలం పెంపొందాలంటే మన ప్రక్కన ఉన్న సింహళ రాజ్యాన్ని మనం మిత్రులం చేసుకోవాలి."
జలపాతం పైన సింహళ రాజు కోట ఉంది .అది పర్వత రాజ్యం. హోరుగా ఉన్న జలపాతం ఎక్కి అడవి ని చేరుకున్నాడు .అక్కడ ఒక యువకుడిని పులి దాడి చేసింది .చుట్టూ ఉన్న సైనికులు ఆయన్ను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు ,కానీ ఆ బెబ్బులి ధాటికి తట్టుకోలేక పారిపోయారు.
అప్పుడు శాతకర్ణి పులి పై దూకి దానిని నిలువరించారు .
అప్పుడు ఆ యువకుడు కృతజ్ఞతలు చెప్పి తాను సింహళ దేశ యువరాజు అని చెప్పి రాజ్యానికి తీసుకెళ్లాడు.
సింహళ రాజును కలిశాడు శాతకర్ణి .శాతకర్ణి కి ఘనసత్కారం చేసాడు రాజు.
అప్పుడు శాతకర్ణి తాను శాలివాహన యువరాజు అని చెప్పి తనువచ్చిన కార్యం గురించి చెప్పాడు.
సింహళ రాజు "ఆ మ్లేచ్చుల తో మాకు చిరకాల వైరం ఉంది, మీకు యుద్ధం లో నా నావికా దళం కావాలంటే ,మీరు నాకు ఒక సహాయం చేసిపెట్టాలి."అన్నారు.
"ఈ రాజ్యం దగ్గర లో పిపిరి పర్వత శ్రేణి లో ఒక తెగ వారు నివసిస్తున్నారు .వారు నాగరికులకు దూరం గా ఉంటారు .వారి వద్ద మహాశక్తి ఉందని సమాచారం. ఆ శక్తి వల్ల వారు అతులిత బలధాములలాగా ఉంటారు. ఎంత ప్రయత్నించినా ఆ రహస్యాన్ని నేను ఛేదించలేకపోయాను. సింహళ దేశ బెబ్బులి ని మీరు ఒంటి చేత్తో మట్టికరిపించారు .మీరు మహా యోగి లాగా ప్రకాశవంతం గా ఉన్నారు. . గత కొన్నేళ్లుగా మా దేశం లో ఒక భయంకర మహమ్మారి పీడిస్తుంది, ఆ మహమ్మారికి విరుగుడు వారి వద్ద ఉందని మా రాజ్యగురువు చెప్పారు. ఈ పని చేస్తే మీకు జీవితాంతం రుణ పడి ఉంటాము .ఈ సాయం చేస్తే మీకు నా కుమార్తె ను ఇచ్చి వివాహం చేస్తాను" అని రాజు చెప్పారు .
..........
శాతకర్ణి రాజు వద్ద సెలవు తీసుకుని పిపిరి పర్వతశ్రేణి లోకి పయనమయ్యాడు.
నాగరిక వేషధారణ వదిలేసి శాతకర్ణి ఆ తెగ వద్దకు చేరుకున్నాడు .
సైనికులు ఆ తెగకు కాపలాగా ఉన్నారు.శాతకర్ణి వంటి మీద వస్త్రాలు లేకుండా ఆ తెగ ఉండే చోటు వద్దకు చేరుకున్నాడు. అతనికి అక్కడ దట్టమైన అడవి తప్ప ఏం కనిపించలేదు.తురీయ స్థితి లోనుండి ధ్యానం చేయగా మసక గా ఒక గ్రామం
కనపడింది.ఆ ప్రదేశం ఇంకా స్ప్రష్టంగా కనపడటానికి తురీయాతీత స్థితి కి చేరుకున్నాడు. శాతకర్ణి దివ్య తేజస్సు తో వెలిగిపోతున్నాడు. వేరే కాలప్రమాణం లోఉన్న పిపిరి తెగ వారు శాతకర్ణి తేజస్సు చూసి బాహ్య కాలప్రమాణం లోకి వచ్చి తమ లోకం లోకి తీసుకెళ్లారు.
అప్పుడు అర్ధమైంది శాతకర్ణి కి ఈ రహస్య జీవులు ఎలా మిగిలిన ప్రపంచానికి తెలియకుండా ఉంటున్నారో .....
శాతకర్ణి వారి తెగ నాయకుడైన మాతంగ ధీశుని కలిశారు.
శాతకర్ణి మాతంగా ధీశునితో ఎన్నో సైద్దాంతికపరమైన చర్చలు జరిపారు.
కానీ వారి ఆలయంలోకి మాత్రం రానిచ్చేవారు కాదు.వారి దేవాలయం చాలా విశాలమైనది.ఒక పెద్ద సరస్సులో ఉంది. చాలా పురాతనమైనది. నాలుగు ప్రాకరాలు ఉన్నాయి. చుట్టూ దట్టమైన అడవులు, అడవి నుండి దేవాలయానికి కర్రల వంతెన ఉంది.
ఆ ఆలయంలోకి బయట వారికి ప్రవేశం లేదని మాతంగధీశుడు తెలిపాడు.
కొన్ని రోజులకు శాతకర్ణికి తెలిసింది, ప్రతీ నలభై ఒక్క సంవత్సరాలకు ఒక యోగి ఆ దేవాలయానికి వచ్చి అందరికీ ఉపదేశం చేస్తారని ఆయన సంరక్షణలోనే ఈ తెగ ఉన్నదని, ఈ ప్రజలకు కంటికి రెప్పలా కాపాడేది, ఆ యోగ శక్తి అని చెప్పారు.
ఆ రోజు రానే వచ్చింది.ఆలయం బయట శాతకర్ణి తురీయ స్ధితిలో ఉన్నారు.
యోగి పుంగవుని రాక కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
అంతలో ఒక దివ్యకాంతి పుంజం గుడి బయట ఆవిర్భవించింది.
యోగి పుంగవుడు ఆ కాంతిలోంచి వచ్చారు.ఆయన తురీయాతీత స్ధితిలో ఉన్న శాతకర్ణిని చూసి,అతన్ని యోగ విద్య నుండి లేపి,నాయనా నాతో పాటులోనికి రా అని లోపలికి తీసుకువెళ్ళారు.
యోగితో శాతకర్ణి రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయి,యోగికి నమస్కరించారు.అందరూ తమ తమ సందేహాలను యోగిని అడిగి నివృత్తి చేసుకుంటున్నారు.
దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న యోగిని చూసి శాతకర్ణికి నోట మాట రావటంలేదు.
యోగి పుంగవులు అందరికీ ఒక మంత్రం ఉపదేశం చేసాడు.
యోగి చెబుతూ ఈ మంత్రం మనస్సులో అనుకుంటే నేను వారికి ప్రత్యక్షం అవ్వుతాను.కానీ మంత్రం చదివిన వ్యక్తి నాతో ఆత్మశక్తి పంచుకోగలిగిన వాడై ఉండాలి, లేకపోతే తన్ను తాను తెలుసుకున్నవాడై ఉండాలి అని అన్నారు.
వెంటనే మాతాంగుల వారు, యోగిని అడిగారు,స్వామి, ఇతని పేరు శాతకర్ణి,అన్యులకు సాధ్యం కానీ ఈ ఆలయ ప్రవేశం ఇతని కెలా సాధ్యమయ్యింది అని అన్నారు.
అప్పుడు యోగి,ఇతను మహానుభావుడు,చక్రవర్తి అంశతో పుట్టినవాడు. భగవతీ ఆలయంలో సుశిక్షితుడు.అంతకుమించి తురియ,తురీయాతీత స్ధితిని సాధించినవాడు.అతులిత బల సంపన్నుడు. అత్యంత పవిత్రమైన సోమవజ్రాన్ని కలవాడు.
ఇతను రాజసూయ యాగ యోగo ఉన్నవాడు. మీ ఉపదేశం పూర్తి అయినది. శాతకర్ణి తప్ప మిగిలిన వారు, బయటకు వెళ్ళండి అని యోగి చెప్పారు.
అప్పుడు యోగి ఇలా చెప్పారు,నాయనా నేను హనుమంతుడిని,పరశురాముడు స్ధాపించిన భగవతీ ఆలయ పరిరక్షకుడిని. మన జంబూద్వీపంలో సనాతన ధర్మ పరిరక్షకుడిని అరుణాచలంలో నీకు గాయాలు అయ్యినప్పుడు,నీటిలో మునిగిపోయినప్పుడు నిన్ను కాపాడింది నేనే,దక్షణామూర్తి అనే పండితుడిని నేనే,కిష్కిందలో నువ్వు కాపాడిన వృద్ధుడిని కూడా నేనే,నిన్ను అడుగడుగునా కంటికి రెప్పలా చూసుకున్నాను.
అప్పుడు శాతకర్ణి హనుమంతునికి నమస్కరించి,మీ చేతిలో మలచబడ్డ శిల్పాన్ని నేను అని కన్నీరు పెట్టుకొని ఆ యోగ కాంతికి సాష్టాంగ నమస్కారం చేసారు.
ఈ రహస్యాన్ని చాలా గోప్యంగా ఉంచాలి, మన జంబూద్వీప మనుగడకి పరశురాముని భగవతీ విశ్వవిధ్యాలయం పునాధి. నేను మహాబలి చక్రవర్తి ,జాంబవంతులవారు సరైన నాయకత్వం, పాలన, రాజ్యాభివృద్ధి కలిగేలా చూస్తున్నాము.
ఇది ఎవ్వరికీ తెలియకుండా తరతరాలుగా చేస్తున్నాము.నీవు ఎవ్వరికీ ఈ విధానం చెప్పకూడదు అని చెప్పి.
ఈ భూభాగాన్ని జంబుద్వీపాన్ని పరిరక్షించడానికి ఒక ఆయుధం నీకు ఇస్తాను అని చెప్పి అడవిలోకి తీసుకువెళ్ళారు.
అక్కడ ఒక జలపాతం క్రింద ఒక గుడి ఉంది.అది రావణాసురుని గుడి, శివాలయం కూడా ఉంది. రావణసురుని గొప్పతనానికి మెచ్చి రాముడు ఆయనకు గుడి కట్టించారు.
ఆ గుడి చాలా దట్టమైన అరణ్యంలో ఉంది అక్కడకు వెళ్ళి శాతకర్ణి, హనుమంతులవారు గుడిలో రహస్య మార్గంలోనికి వెళ్ళారు.
ఆ రహస్య మార్గంలో ఇంకొక గుడి ఉంది.ఆ గుడిలోకి వెళ్ళి చూస్తే వజ్ర వైఢూర్యాలతో కూడిన రధం ఉన్నది.ఆ రధం ఎక్కి హనుమంతుల వారు ఆకాశంలోకి ఎగిరారు.పాదరసంలో పనిచేసే ఆ రాధాన్ని హనుమంతుల వారు శాతకర్ణికి ఇచ్చి అది ఎలా ఉపయోగించాలో చెప్పి అంతర్ధానమయ్యారు.
ఆ రధం ఎక్కి శాతకర్ణి సింహళ రాజు వద్దకు వెళ్ళి తెగను ఒక యోగి కాపాడుతున్నారని చెప్పి ఆ రధాన్ని చూపించారు.
ఇంతటి యోగ్యుడికి తన కుమార్తెను పెళ్ళి చేస్తానని చెప్పి, శాతకర్ణికి తన కుమార్తెను చూపించబోయాడు... రాజ్యం స్దిరపరిచిన తర్వాత వస్తానని చెప్పి ఆయన నావికాదళాన్ని తనతో పంపాలని కోరాడు. అల్లుడి కోరికను వెంటనే తీర్చాడు సింహళ రాజు.
..............................
Like Reply


Messages In This Thread
RE: సింహబలుడు(శాతకర్ణి 1) - by Kittyboy - 20-12-2019, 06:28 AM



Users browsing this thread: 1 Guest(s)