Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
తరువాతి రోజు ఆదివారం స్నానం చేసి కిందకువచ్చి అమ్మ అక్కయ్య చేతులలో టిఫిన్ తింటుంటే , బయటి నుండి మహేష్ మహేష్ ...........అంటూ ఒక పిలుపు వినిపించింది .

తమ్ముడూ నువ్వుతిను నేను చూస్తాను అంటూ వెళ్లి నావయసున్న పిల్లాడితో లోపలకువచ్చి , అదిగో నీ ఫ్రెండ్ మహేష్ అని నావైపు చూపించింది .

Hi మహేష్ అంటూ నాదగ్గరకువచ్చాడు .

ఆశ్చర్యపోతూనే hi అని పలకరించి , నవ్వుతున్న అక్కయ్యవైపు చూసాను .

నిన్న ఐస్ క్రీమ్ ఇచ్చి ఫ్రెండ్ అయ్యావు కదా తమ్ముడూ ............

ఐస్ క్రీమ్ సూపర్ మహేష్ , ఫ్రెండ్ కాబట్టి థాంక్స్ చెప్పాను.........నాపేరు కృష్ణ అంటూ చేతిని చాపాడు .

Hi కృష్ణ అంటూ చేతిని కలిపి , అక్కయ్యా.........నా ఫ్రెండ్ కు కూడా టిఫిన్ అనిచెప్పాను .

అయ్యో...........అంటూ తలపై మొట్టికాయ వేసుకుని లోపలకువెళ్లి ప్లేట్ లో తీసుకొచ్చింది . 

అక్కయ్యా........ఇంట్లో తినేసివచ్చాను , కృష్ణ నువ్వు తింటేనే నేను తినేది అని నోటిని మూసేశాను . 

సరే మహేష్ అంటూ అక్కయ్య చేతిలోనుండి అందుకున్నాడు .

నిమిషంలో అయిపోగొట్టేసాడు . 

ఏయ్ కృష్ణ ఆకలి లేదన్నావు , అక్కయ్యా........ఈసారి ఎక్కువ అని చెప్పాను . 

అక్కయ్య నవ్వుకుంటూ వెళ్లి ప్లేట్ నిండా పెట్టుకునివచ్చింది .

టిఫిన్ చాలా tasty గా ఉంది మహేష్ .........

మా అమ్మ చేతివంట రుచి అద్భుతం తిను అంటూ , ఆ ........అని నోరుతెరిచాను .

అమ్మ మురిసిపోయి పెద్ద పెద్ద ముద్దలు తినిపించింది .

ఆ ప్లేట్ కూడా ఖాళీ చేసి , నేను మాట్లాడేంతలో ........... కడుపు నిండిపోయింది , అమ్మా చాలా రుచిగా ఉంది అంటూ వేళ్ళను సైతం నాకేశాడు .

నవ్వుకుని అమ్మా నాకు కూడా చాలు ...........

లాస్ట్ ముద్ద అంటూ ప్రేమతో పెద్దది తినిపించి , నీళ్లు అందించింది .



మహేష్ అందరమూ క్రికెట్ ఆడటానికి వెళుతున్నాము , నిన్నుకూడా పిలుచుకునివేళదామని వచ్చాను రా వెళదాము అని పిలిచాడు .

అక్కయ్యవైపు చూస్తే ........

వెళ్ళిరా తమ్ముడూ కృష్ణతోపాటు అందరూ ఫ్రెండ్స్ అవుతారు అని నుదుటిపై ముద్దుపెట్టు చెప్పి , నా జేబులో 100 రూపాయలు పెట్టి  ఏమైనా తినండి అంటూ తాగడానికి వాటర్ బాటిల్ కూడా అందించింది .

లవ్ యు అక్కయ్యా అంటూ అక్కయ్యను , అమ్మను కౌగిలించుకుని కృష్ణతో మాట్లాడుతూ బయటకు వెళ్ళాము .

అక్కయ్య మెయిన్ గేట్ వరకూ వచ్చి మేము టర్నింగ్ అయ్యేంతవరకూ చూస్తూ నిలబడి సంతోషంతో లోపలకువెళ్లింది .



ఊరి బయట పెద్ద గ్రౌండ్ , ఊరంతా అక్కడే ఉన్నట్లు ఏజ్ కు తగ్గట్లు నలువైపులా ఆడుతున్నారు . కృష్ణ తన టీం దగ్గరకు వెళ్లి రేయ్ మహేష్ అని పరిచయం చేసేలోపల , అవునురా నిన్న ఫంక్షన్ లో చూసాము అంటూ చేతులుకలిపి పేర్లు చెప్పి ఫ్రెండ్స్ అయిపోయాము.

ఫ్రెండ్స్ అంతా సరిసమానంగా డివైడ్ అయ్యి నన్ను కూడా ఒక టీమ్ లో వేసుకున్నారు .

ఫ్రెండ్స్ నాకు క్రికెట్ ఆడటం రాదు , ఇప్పటివరకూ బ్యాటు కూడా పట్టుకోలేదు అనిచెప్పాను .

మహేష్ చూస్తే వచ్చేస్తుంది కష్టమేమీ కాదు మనది బ్యాటింగ్ ఓపెనర్స్ ఆడేది చూడు అంతే , మనం ఆడేది టెన్నిస్ బాల్ కాబట్టి తగిలినా ఏమీకాదు అని చెప్పారు .

సరే అంటూ కృష్ణ ప్రక్కనే కూర్చున్నాను . బౌలింగ్ వెయ్యడం , మా టీమ్ బ్యాటింగ్ ఆడటం చూస్తుంటే , రాము రన్స్ , ఫోర్స్ , సిక్స్ లు , ఔట్ , బోల్డ్ , క్యాచ్ గురించి మొత్తం వివరించడంతో ఈజీ నే అనిపించింది . 

కొడుతున్నారు , ఔట్ అయ్యి వస్తున్నారు , నెక్స్ట్ బ్యాట్స్ మాన్ వెళుతున్నాడు . ఇక చివర మిగిలింది రాము , నేను .

ఔట్ అవ్వడంతో రేయ్ కృష్ణ ఇంకా రెండు over లు ఉన్నాయి కుమ్మేయ్ రా అని పంపించారు . 

అంతే కృష్బ వచ్చిన బాల్ ను వచ్చినట్లు బ్యాటును ఎత్తెత్తి కొడుతున్నాడు .

చివరి ఓవర్ ఫస్ట్ బాల్ కు మరొక ఫ్రెండ్ బౌల్డ్ అవ్వడంతో మహేష్ వచ్చెయ్ అంటూ కృష్ణ కేకవేశాడు . కాస్త కంగారుపడుతూనే వెళ్లి బ్యాటు పట్టుకున్నాను . మహేష్ టచ్ చేసి ఇటువైపు పరిగెత్తేయ్ అనిచెప్పాడు . వెళ్లి వికెట్స్ ముందు బ్యాటు పట్టుకుని నిలబడ్డాను . 

ఫస్ట్ బాల్ డాట్ , సెకండ్ బాల్ డాట్ .............కృష్ణ నాదగ్గరకువచ్చి , చేతి కండలు తాకి మహేష్ నాకంటే బలం ఉంది నీకు బాల్ టైమింగ్ చూసి నీదగ్గరకు రాగానే లాగిపెట్టి కొట్టు అని చెప్పాడు .

నెక్స్ట్ బాల్ వెయ్యగానే నాదగ్గరికి రాకముందే ఎక్కడ తగులుతుందో అని కళ్ళుమూసుకుని బ్యాటును వెనక్కు లాగి కొట్టాను . బాల్ సరిగ్గా తగిలి మాప్రక్కనే ఆడుతున్న మరొక మ్యాచ్ అవతల సిక్స్ దాటేసింది . 

అంతే మహేష్ అంటూ కృష్ణ పరిగెత్తుకుంటూ వచ్చి సంతోషంతో కౌగిలించుకున్నాడు .

నాకు మరింత ఉత్సాహం వచ్చేసింది . అలాగే కొట్టబోయి బౌల్డ్ అయిపోయాను.

బాధపడుతుంటే ఫస్ట్ మ్యాచ్ లోనే సిక్స్ కొట్టావు గ్రేట్ ఇప్పుడు ఫీల్డింగ్ అని నన్ను బౌండరీ దగ్గర నిలబెట్టారు . నా ఘోరమైన ఫీల్డింగ్ వలన , క్యాచ్ లు వదిలెయ్యడం వలన మా సైడ్ మ్యాచ్ ఓడిపోయింది . 



మహేష్ ఏమి పర్లేదు మరొక మ్యాచ్ ఆడదాము , లాస్ట్ లో బానే ఆపావు బ్యాటింగ్ లో సిక్స్ కొట్టావు ఇంకెమికావాలి గెలిచింది కూడా మన ఫ్రెండ్సే కదా అనిచెప్పడంతో ,

అవునుకదా అంటూ గెలిచినవాళ్ళతోపాటు ఎంజాయ్ చేసి , ఫ్రెండ్స్ నన్ను మీ లో చేర్చుకున్నందుకు అందరికీ ఐస్ క్రీమ్స్ నేను ఇప్పిస్తాను అంటూ 100 రూపాయలతో కొనిచ్చాను .

థాంక్స్ మహేష్ అంటూ తినేసి మరింత ఉత్సాహంతో మరొక మ్యాచ్ మొదట మాది ఫీల్డింగ్ . అందరిలానే నాదగ్గరికి వచ్చిన బాల్ ను వధలకూడదు అని నిర్ణయించుకొని దూరం వెళుతున్నా రైల్వే స్టేషన్ లలో ఫ్లాట్ ఫారం లలో ట్రైన్ వస్తోందంటే టిఫిన్ అమ్మడానికి ఎలా పరిగెత్తేవాడినో అలా  పరిగెత్తుకుంటూ వెళ్లి పడిపోయి మరీ ఫోర్ వెళ్లే బంతిని ఆపాను .

నేను ఆపను అనే ధైర్యంతో మరొక రన్ కు పరిగెత్తుతుంటే , బలంకొద్దీ కీపర్ వైపు విసిరాను . కీపర్ అందుకొని ఔట్ చేసి మహేష్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి సూపర్ అంటూ అభినందించారు . ఇక ఉత్సాహం రెట్టింపవ్వడంతో 90% బాల్స్ ఆపి, రెండు క్యాచ్ లు కూడా పట్టాను . 

మహేష్ నువ్వేనా ..........అంటూ ఆశ్చర్యపోయి సంతోషంతో బ్యాటింగ్ మొదలెట్టాము . స్కోర్ chase చేస్తూ వికెట్స్ కూడా రెగులర్ గా పడుతున్నాయి . చివరి ఓవర్లో 12 పరుగులు అవసరం , అంతలో మాంచి ఊపులో ఉన్న కృష్ణ కూడా ఔట్ అయిపోయాడు . రన్నర్ గా అటువైపు ఉన్న ఫ్రెండ్ కు కూడా నాలాగే కొత్త , ఇక ఆ మ్యాచ్ కూడా పోయిందనుకున్నారు . 

కృష్ణ మాత్రం కన్ఫిడెన్స్ కోల్పోక నాదగ్గరికివచ్చి మహేష్ అంతలా పది dive లు చేసినా నీకు ఏమీకాలేదు , అంతే ధైర్యంతో బాల్ తగులుతుంది అన్న భయం వదిలి కళ్ళుతెరిచి కొట్టు చూడు అంటూ నాచాతీపై ఒక గుద్దు గుద్ది నొప్పికాలేదు కదా , బాల్ తగిలినా అంతే అని నాకు తెలుసు నువ్వు కొడతావు అని మరొక దెబ్బవేసి వెళ్ళిపోయి టెన్షన్ టెన్షన్ తో చూస్తూ నిలబడ్డాడు .

మొదటి బాల్ వెయ్యగానే కళ్ళుమూసుకుని బ్యాట్ లేపాను మిస్ అయ్యింది . 

ఇక ఒడిపోయినట్లే అని కృష్ణ తప్ప మిగితావాళ్ళంతా ఆకలౌతోందని వెనుతిరుగుతుంటే , కృష్ణ మాత్రం రెండు చేతులతో నాలో ఉత్సాహం నింపాడు .

నెక్ట్ బాల్ వెయ్యగానే కళ్ళుతెరిచి కొట్టబోయాను నా భుజం పై బలంగా తగిలింది . నొప్పి అనిపించకపోవడంతో ఇక వెయ్యండి అంటూ చిరునవ్వుతో రెడీ అయ్యాను . 

బ్యాట్ పిచ్ పడగానే చూసి కాస్త ముందుకెళ్లి మిడ్ ఆఫ్ లో ఇంటికి వెళుతున్న మా ఫ్రెండ్స్ మీదుగా వాళ్ళ ముందు బాల్ పడింది . 

రేయ్ చెప్పాను కదరా అంటూ కృష్ణ సంతోషంతో ఎగిరి గెంతులేస్తుంటే , బాల్ అందుకొని అందరూ వెనక్కు వచ్చి two బాల్స్ 6 రన్స్ అంటూ టెన్షన్ పడుతూ చూస్తున్నారు .

కృష్ణ వచ్చి సింగిల్ మాత్రం వద్దు 2 or 4 or six వాడికి బ్యాటు కూడా పట్టుకోవడం రాదు అని చెప్పి వెళ్ళాడు . 

నెక్స్ట్ బాల్ కొట్టినా ఫీల్డర్ దగ్గరకు వెళుతుంటే సింగిల్ తిరగకుండా ఆపేసాము .

కృష్ణ చుట్టూ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ టెన్షన్ రెట్టింపైంది . బాల్ వెయ్యబోతుంటే రాముతోపాటు అందరూ మహేష్ కొట్టు మహేష్ కొట్టు please అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు . హాఫ్ మ్యాట్ పిచ్ రావడంతో బలంకొద్దీ మిడ్ ఆన్ వైపు కొట్టినా బంతి బౌండరీకు చాలా దూరంలో ఉన్న ముళ్ళకంపల్లో పడింది .

మహేష్ సిక్స్ అంటూ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి పైకి లేపి ఎంజాయ్ చేశారు . బౌలింగ్ ఫ్రెండ్స్ వచ్చి రేయ్ మాంచి ప్లేయర్ దొరికాడు నెక్స్ట్ వీక్ అన్నయ్యలతో మ్యాచ్ పెట్టుకుందాము అని కాసేపు ఎంజాయ్ చేసి అందరితో ఉన్న కొంత కొంత డబ్బుతో ఐస్ క్రీమ్స్ అందరికీ కొని జుర్రేస్తూ ఎండలో చెమట కారుస్తూ చిరునవ్వులు చిందిస్తూ తింటూ కృష్ణ తోపాటు ఇంటికి చేరుకుని , 



రారా అంటూ చెయ్యిపట్టుకొని లాక్కుని అక్కయ్యా అక్కయ్యా ...........అంటూ సంతోషంతో లోపలకు వెళ్ళాము . వంట గదిలోనుండి వచ్చిన అక్కయ్యను అమితానందంతో హత్తుకొని , అక్కయ్యా అక్కయ్యా .........అంటూ ఆయాసంతో నేను కృష్ణ తోపాటు క్రికెట్ ఆడాను ఒక మ్యాచ్ గెలిచాము అని చెప్పాను .

అమ్మా ఫ్రిడ్జ్ లో చల్లని నీళ్లు తీసుకురా అని కేకవేసి తన కొంగుతో నా చెమటను తుడుస్తుంటే ...........

అవునక్కా ..........మహేష్ వల్లనే గెలిచాము అని కృష్ణ ఆనందంతో చెప్పాడు . 

ఫస్ట్ మ్యాచ్ నావల్లనే కదా రాము ఓడిపోయింది అదికూడా చెప్పు అని చెప్పాను . 

అది నీకు క్రికెట్ గురించి తెలియనప్పుడు అంటూ మొదటి నుండి జరిగిందంతా చెప్పి చివరలో రెండు సిక్స్ లు కొట్టి గెలిపించగానే అందరమూ వెళ్లి మహేష్ ను పైకి ఎత్తేసాము అక్కా అని చెప్పాడు .

అక్కయ్యా .........అంతా కృష్ణ వల్లనే , కృష్ణ లేకపోయుంటే అలా జరిగేది కాదు , నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు , థాంక్స్ రా అంటూ కృష్ణని కౌగిలించుకున్నాను . 

ఉదయం నుండి నిన్ను రా , ఒరేయ్ .........అని పిలుద్దామనుకున్నాను కానీ నువ్వేమనుకుంటావో అని భయపడ్డానురా అంటూ కృష్ణ నన్ను మరింత గట్టిగా కౌగిలించుకున్నాడు .



మా సంతోషాన్ని చూసి అక్కయ్య మురిసిపోయి చేతితో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , తమ్ముడూ అమ్మ నేను కలిసి బిరియాని చేసాము , కృష్ణని పైకి పిలుచుకొనివెళ్లి ఫ్రెష్ అయ్యి రండి తిందాము అనిచెప్పింది .

లవ్ యు అక్కయ్యా అంటూ రెండుచేతులతో చుట్టేసి హత్తుకొని రారా .......అంటూ పైకి పిలుచుకొనివేళ్ళాను.



రేయ్ ఇంటికి వెళతాను లేరా అని కృష్ణగాడి మాటలు విని , కృష్ణా నీ ఫ్రెండ్ కు క్రికెట్ నేర్పించావు ట్రీట్ వద్దా , మీ అన్నయ్యకు కావాలంటే ఫోన్ చేసి చెబుతాను మీరు ముఖం చేతులు కడుక్కుని రండి , తమ్ముడూ తీసుకెళ్లు ........

రేయ్ అక్కయ్య చెప్పిందికదా తినాల్సిందే అంటూ రూంలోకివెళ్లి ఫ్రెష్ అయ్యి కిందకువచ్చాము . 

మాఇద్దరినీ డైనింగ్ టేబుల్ లో కూర్చోబెట్టి కృష్ణకు మొదట వడ్డించి , నాకు అక్కయ్య తినిపించింది .

అక్కయ్యా ............నిన్న హోటల్ లో తిన్న బిరియానీ కంటే అద్భుతంగా ఉంది , అవునురా మహేష్ ఇలాంటి బిరియానీ నేను ఇంతవరకూ తినలేదు అంటూ ఆతృతతో తింటున్నాడు . 

మరేమనుకున్నావురా అమ్మ అక్కయ్య కలిసి చేశారు , రిజల్ట్ ఇలానే ఉంటుంది . లవ్ యు అమ్మా అక్కయ్యా .......అని సంతోషంతో చెప్పాను .అమ్మ మురిసిపోయింది .

రేయ్ ఉదయం అమ్మ తినిపించడం చూసాను , ఇప్పుడు అక్క తినిపిస్తోంది అని కృష్ణగాడు అడిగాడు .

అక్కయ్య మొత్తం వివరించడంతో , sorry రా అంటూ నా చేతిని స్పృశించి బిరియానీని కుమ్ముతుంటే ,అక్కయ్యతోపాటు నవ్వుకున్నాను .

క్రికెట్ ఆడి చెమట చిందించడం వలన కడుపునిండా తిన్నాము . 

రేయ్ అమ్మ ఎదురుచూస్తుంటుంది మళ్లీ కలుద్దాము అని వెళ్ళిపోయాడు . 



తమ్ముడూ సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉండు , అమ్మ నేను తినేసి జాయిన్ అవుతాము అని చెప్పడంతో , 

సోఫాలో వచ్చి కూర్చుని టీవీ on చేసి స్ట్రెయిట్ స్పోర్ట్స్ ఛానెల్ వెతికిమరీ పెట్టుకుని ఓల్డ్ మ్యాచ్ చూస్తున్నాను .

అక్కయ్య ప్లేటులో వడ్డించుకొని వచ్చి నా ప్రక్కనే సోఫాలో కూర్చుని తింటుంటే , రెండు మ్యాచ్ లు ఆడటం , బిరియాని కుమ్మడాన్ వలన క్రికెట్ చూస్తూ చూస్తూ అక్కయ్య భుజం పై వాలిపోయి నిద్రలోకిజారుకున్నాను.



సాయంత్రం మళ్లీ కృష్ణగాడు వచ్చాడు అని అక్కయ్య నా బుగ్గలను ప్రేమతో స్పృశిస్తూ లేపింది .

పైకివెళ్లి స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని వచ్చేసరికి అక్కయ్య , అమ్మ మరియు కృష్ణగాడు మధ్యలో క్యారెమ్ బోర్డ్ పెట్టి మూడువైపులా కూర్చుని , తమ్ముడూ నీకోసమే ఎదురుచూస్తున్నాము వచ్చి కూర్చో మనిద్దరమూ ఒక జట్టు అనిచెప్పింది .

అక్కయ్యా ఈ ఆట కూడా నాకు రాదు ఒడిపోతాము అని బదులిచ్చాను .

నా తమ్ముడితో కలిసి ఆడితే చాలు నాకు ఆనందం ఓడిపోయినా పర్లేదు అని అక్కయ్య చెప్పింది .

అయినా మనం ఒడిపోయేది అమ్మతో వీడితోనే కదా అంటూ రాత్రివరకూ ఆపకుండా నవ్వుతూ ఎంజాయ్ చేసాము . 

రాత్రి కూడా కృష్ణగాడు నాతోపాటు భోజనం చేసి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు .

తమ్ముడూ ఉదయం కాలేజ్ గుర్తుందికదా ...........

మా అక్కయ్యతోపాటు అంటూ వెళ్లి అక్కయ్య ప్రక్కన కూర్చున్నాను . 

నన్ను కౌగిలిలో బిగించి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి తొందరగా లేవాలి కాబట్టి తొందరగా వెళ్లి పడుకుందాము అని చెప్పడంతో ........

అలాగే అక్కయ్యా అంటూ అమ్మకు గుడ్ నైట్ చెప్పి ముద్దు తీసుకుని పైకివెళ్లి పడుకున్నాము.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 25-12-2019, 10:05 AM



Users browsing this thread: 91 Guest(s)