Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బ్రహ్మ జ్ఞానం
"అమర్త్యాశ్చైవ మర్త్యాశ్చ యత్ర యత్ర మసంతిహి
తత్ వస్త్వితి మతం జ్ఞేయం తద్భేందంచ వదామ్యహమ్
భూమి ప్రాసాదయానాని శయనంచ చతుర్విధం" దేవతలకు కానీ మనుష్యులకు కానీ నివసించదగిన స్థలమే వస్తువు ఈ వస్తువు నాలుగు రకములు 1.భూమి 2.ప్రసాదము( గృహము) 3. యానము (వాహనము రధములు వగైరాలు ) 4. శయనం (మంచములు కుర్చీలు వగైరాలు)
వాస్తు అనగా ఒక స్థలంలోగాని, ఒక నిర్మాణములోగాని ఏర్పడే పంచభూతాల అమరిక. గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని ఈ ఐదింటిని పంచభూతాలు అంటారు. వాస్తు శాస్తములో పంచభూతాలకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఈ పంచభూతాలు ఖాళి స్థలములోకి మరియు నిర్మాణములలోకి ప్రవేశించి అక్కడ నివసించే వారి మీద ప్రభావాన్ని చూపుతాయి.
వాస్తు నియమాల ప్రకారం ఏదైనా నిర్మాణం చేస్తే ఈ పంచభూతాలు ఆ నిర్మాణంలో చక్కగా అమరి ఆ నిర్మాణంలో ఉండే వారికి శుభఫలితాలను కలిగిస్తూ వారి జీవితం సంతోషంగా గడిచిపోయేల చేస్తాయి. వాస్తు నియమాలకు విరుద్ధంగా నిర్మాణం చేస్తే ఈ పంచభూతాలు ఆ నిర్మాణంలో చక్కగా అమరక ఆ నిర్మాణంలో ఉండే వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తాయి.
పంచ భూతాలు - సమతుల్యత
పంచ భూతాల మద్య గల సృష్టి మరియు నియంత్రణ సిద్దాంతం పై ఆదారపడి వాస్తు పలితాలు వస్తాయి.
ప్రతి గృహానిర్మాణములోను.ప్రతీకట్టడంలోను. పంచభూతాల మద్య సమ తుల్యత దెబ్బతినకుండ నిర్మాణాలు/ నిత్య కృత్యాలు ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు రావు.

పంచ భూతాల సృష్టి - సిద్దాంతం ప్రకారం ఆకాశం నీటి ని, నీరు వాయవును, వాయువు అగ్ని ని, అగ్ని భూమిని, భూమి ఆకాశాని సృష్టిస్తుంది ఇది ఒక చక్రం ఒక ధానిపై మరి ఒకటి ఆదారపడి ఉండును. అలాగే
పంచ భూతాల నియంత్రణ సిద్దాంతం ప్రకారం ఆకాశము వాయువు ను, వాయువు భూమిని, భూమి నీటిని. నీరు అగ్ని ని, అగ్ని ఆకాశాన్ని నియంత్రిస్తాయి.

ఒక పద్దతి ప్రకారం పంచ భూతాల సృష్టి / నియంత్రణ నిరంతరం జరిగి విశ్వం లొ జీవం కొనసాగాడాని దొహద పడుతుంది. సహాజత్వానికి దగ్గరగా జీవించే వారు మంచి ఆరొగ్యవంతులుగా ఆనందకరమైన జీవితాన్ని అనుబవిస్తారు

మానవాళి తనకు అనుకూలంగ ప్రకృతికి విరుద్దంగ / తమ అవసరాలకు అనుగునంగ నివాసాలను ఎర్పాటు చేసుకోవడం వలన పంచ భూతాల ప్రభావం / సహాకారం లో సమతుల్యత లోపించి ఆరోగ్య/ఆర్దిక/సంసారిక/సామాజిక సమస్యలను ఎదుర్కోంటున్నారు

మహాభారతం కేవలం కట్టుకధ కాదు అని చెప్పటానికి పురావస్తు ఆధారాలు, శాసనాలు దొరికాయి. వాటిలో ప్రధానమైనది ద్వారక. శ్రీ కృష్ణపరమాత్ముడి అద్భుత నగరం, 5000 ఏళ్ళ క్రితం భారత్‌లో ఉన్న నైపుణ్యానికి, సాంకేతికపరిజ్ఞానానికి నిలువుటద్దం.

1980వ దశకంలో గుజరాత్‌ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలు భారతీయ చారిత్రక నిర్మాణంలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించాయి, కుట్రపూరిత బ్రిటీష్ చరిత్రకు సవాల్ విసిరాయి. శ్రీ కృష్ణుడి ఉనికి అబద్దమంటూ వస్తున్న ప్రచారాలకు గట్టి సమాధానం ఇచ్చాయి. భారత పురావస్తు పరిశోధనా సంస్థ, జాతీయ సముద్రగర్భ శాస్త్ర సంస్థల సంయుక్త పరిశోధన జరపాలని జడ్.డి.అన్సారీ, ఎమ్.ఎస్.మతే ప్రతిపాదించారు. దీని ద్వారా డాక్టర్ ఎస్.ఆర్.రావు ఆధ్వర్యంలో చెప్పుకోదగిన కృషిజరిగింది. ఆ పరిశోధనల్లో భాగాంగా గుజరాత్ పశ్చిమాన గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో సాగర గర్భంలో ఒక మహానగరం బయటపడింది.. మహాభారత కాలాన్ని, శ్రీకృష్ణుడి ఉనికిని ఈ నగరం బయటి ప్రపంచానికి చాటి చెప్పింది.. ఇదే ఇవాళ మనం చెప్పుకుంటున్న ద్వారక.. .కృష్ణుడి ద్వారక.. విశ్వకర్మ నిర్మించిన ద్వారక..

192 కిలోమీటర్ల పొడవు …
192 కిలోమీటర్ల వెడల్పు..
36864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం..
బారులు తీరిన వీధులు..
వీధుల వెంట బారులు తీరిన చెట్లు..
రాయల్‌ ప్యాలెస్‌లు..
రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లు..
కమర్షియల్‌ మాల్స్‌..
కమ్యూనిటీ హాల్స్‌..
వాటర్ ఫౌంటేయిన్లు ....
క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరాల నాడే
అపూర్వ మహానగరం..
రత్నస్తంభాలు..
వజ్ర తోరణాలు..
సాటిలేని వాస్తు/శిల్ప కళా నైపుణ్యం..
సముద్రం మధ్యలో మహా నిర్మాణం..
జగన్నాథుడి జగదేక సృష్టి..
క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాటి
లెజెండ్‌ సిటీ…
ద్వారక..
ఇప్పుడు సాగర గర్భంలో..
మన నాగరికత..
మన సంస్కృతి..
మన హిందూ ప్రతిభకు పట్టం కట్టిన నాటి కాస్మోపాలిటన్‌ సిటీ..
ద్వారక

1983 నుంచి 1992 వరకు 12 సార్లు సాగరాన్ని మధించారు. ఫలితంగా నాటి ద్వారకకు చెందిన వస్తువులు సేకరించి ఫిజికల్ రిసెర్చి లేబొరేటరీకి పంపారు. అక్కడ థెర్మోలూమినెసెన్స్, కార్బన్ డేటింగ్ వంటి అత్యాధునికపరీక్షలు జరిగాయి. అవన్నీ ద్వారాకలో దొరికిన వస్తువులు ఖగోళశాస్త్రవేత్తలు లెక్కకట్టిన మహాభారత సమయానికి సరిగ్గా సరిపోతున్నాయి. ఏవో రెండు, మూడు వస్తువులు దొరికితే ఫర్వాలేదు, ఏకంగా ఒక మహానగరమే సాగర గర్భంలో దొరికింది.
[+] 1 user Likes dev369's post
Like Reply


Messages In This Thread
బ్రహ్మ జ్ఞానం - by dev369 - 08-11-2019, 02:35 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:43 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 05:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:44 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:46 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:50 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 02:52 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:00 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:02 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:03 PM
RE: Astrology Books - by karthikeya7 - 19-05-2023, 06:48 PM
RE: Astrology Books - by dev369 - 08-11-2019, 03:04 PM
RE: Astrology Books - by k3vv3 - 09-11-2019, 01:57 PM
RE: Astrology Books - by kamal kishan - 09-11-2019, 04:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:20 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:23 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:38 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:40 PM
RE: Astrology Books - by dev369 - 09-11-2019, 10:48 PM
RE: Astrology Books - by kamal kishan - 10-11-2019, 06:02 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:01 AM
RE: Astrology Books - by Greenlove143 - 27-12-2021, 05:17 PM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:05 AM
RE: Astrology Books - by dev369 - 11-11-2019, 11:35 AM
RE: Astrology Books - by k3vv3 - 12-11-2019, 07:25 AM
RE: బ్రహ్మ జ్ఞానం - by dev369 - 18-12-2019, 06:11 PM



Users browsing this thread: 5 Guest(s)