25-12-2019, 10:04 AM
రాత్రంతా తమ్ముడుని గుంటూరుకు తీసుకెళ్లి ఎలా సంతోషం పంచాలో అని ఆలోచిస్తూనే పడుకున్నట్లు తెల్లవారకముందే లేచి నా నుదుటిపై వెచ్చని ముద్దుపెట్టి , నెమ్మదిగా బెడ్ దిగి కింద అమ్మ రూంలోకివెళ్లి లేపిమరీ విషయం చెప్పి రెడీ అవ్వమని చెప్పింది .
చాలా సంతోషం తల్లి స్నానం చేసి వంట చేస్తాను తిని వెళదాము అనిచెప్పడంతో ,
లవ్ యు అమ్మా అంటూ కౌగిలించుకుని బస్ 8 గంటలకు వచ్చేస్తుంది అంతలోపు టిఫిన్ తినేసి బస్ స్టాప్ లో ఉండాలి అంటూ ఉత్సాహంతో పైకివచ్చి , నేను ఇంకా హాయిగా నిద్రపోతుండటం చూసి , లేచేలోపు స్నానం చేసి రెడీ అవుదాము అని డ్రెస్ టవల్ తీసుకుని బాత్రూమ్లోకి వెళ్ళింది .
అక్కయ్య రెడీ అయ్యి రావడం , నేను మేల్కొని వొళ్ళువిరిచి కళ్ళుతెరవడం ఒకేసారి జరిగింది .
గుడ్ మార్నింగ్ తమ్ముడూ ............
పెదాలపై చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ అక్కయ్యా ........, అప్పుడే స్నానం కూడా అయిపోయిందా , నేనే అన్నమాట దున్నపోతులా నిద్రపోయాను అని లేచి బాత్రూం వైపు నిద్రమత్తులోనే వెళుతుంటే అక్కయ్య ముసిముసినవ్వులు నవ్వుకుని , నా నుదుటిపై ముద్దుపెట్టి టవల్ అందించింది .
అర గంటలో తల స్నానం చేసి వచ్చాను .
తమ్ముడూ బూస్ట్ అంటూ టేబుల్ పై ఉంచి మరొక టవల్ అందుకొని నా తడి వెంట్రుకలను తుడిచి డ్రెస్ అందించింది .
అక్కయ్యా ..........అటువైపు తిరుగు అంటూ సైగచేసాను .
సరే సరే ..........అంటూ ముసిముసినవ్వులతో అటువైపు తిరిగి , తమ్ముడూ అయ్యిందా ........
లేదు అక్కయ్యా .........
అయ్యిందా ..........నవ్వుకుంటూ,
ఇంకా లేదు , తిరగొద్దు ..........
ఇప్పుడు .........మరింత నవ్వుతూ వెనక్కు తొంగిచూసి ప్యాంటు వేసుకున్నావా .......
అక్కయ్యా ..........చూస్తున్నావుకదూ ......
లేదు తమ్ముడూ ప్రామిస్ ఇప్పుడే చూసాను , అప్పటికే ప్యాంటు వేసేసుకున్నావు అంటూ తనలోతాను గుసగుసలాడి నవ్వుకుంటూ నా బుగ్గలను గిల్లింది .
షర్ట్ వేసుకోగానే నాకు బూస్ట్ అందించి , దువ్వెన అందుకుని దువ్వి , ముఖానికి పొడర్ పట్టించి రెడీ చేసి కిందకు పిలుచుకొనివచ్చింది .
హాల్ లో పేపర్ చదువుతున్న నాన్నకు గుడ్ మార్నింగ్ చెప్పాను .
పట్టించుకోకుండా పేపర్ వదిలేసి బయటకు వెళ్లిపోయారు .
నేనెక్కడ బాధపడతానో అని , నాన్నకు వినపడినట్లు లేదు ముందు వంటగదిలో ఉన్న అమ్మకు చెప్పుపో అని పంపించి , బయట వెళుతున్న నాన్నవైపు కోపంతో చూసింది .
అమ్మా .........గుడ్ మార్నింగ్ అనిచెప్పాను .
బుజ్జి రాత్రి బాగా నిద్రపట్టిందా ..............అంటూ హత్తుకొని వొంగి నుదుటిపై ముద్దుపెట్టింది .
అక్కయ్య జోకొడుతుంటే లాలిపాడినట్లు అనిపించింది అమ్మా , కొత్త చీర కట్టుకున్నారు ఎక్కడికైనా వెళుతున్నారా ............అని బాధతో అడిగాను .
వెళతారా కాదు వెళుతున్నాము గుంటూరుకు వెళుతున్నాము . నా బుజ్జి నాన్నకు కొత్త కొత్త బట్టలు తీసుకుని సాయంత్రం వరకూ సరదాగా గడిపబోతున్నాము .
అవునా అమ్మా .........లవ్ యు అంటూ సంతోషంతో గట్టిగా కౌగిలించుకున్నాను .
ఇలా కూర్చో తొందరగా వంట చెయ్యాలి లేకపోతే మీ అక్కయ్య నన్ను తిట్టేస్తుంది . అంతలో అక్కయ్య లోపలకువచ్చి అమ్మా ఇంకా కాలేదా బస్ వచ్చే సమయం అయ్యింది అని కొప్పుడుతుంటే ,
చెప్పానా ........అంటూ అమ్మ నవ్వింది .
అమ్మతోపాటు ముసిముసినవ్వులు నవ్వుతుంటే , కట్టపై కూర్చున్న నాముందుకువచ్చి నా చేతులను తన తుజాలపై వేసుకుని , ఏమిటి అమ్మా కొడుకులు సంతోషంతో నవ్వుతున్నారు అని నా బుగ్గలను స్పృశిస్తూ అడిగింది .
ఇంట్లో ఎంతమంది ఉన్నా మా అక్కయ్యే యువరాణి , తను చెప్పిందే శాసనం అని అమ్మ చెబుతుంటే ఆనందంతో నవ్వుతున్నాము అక్కయ్యా .........
నా తమ్ముడు యువరాజు అంటూ హత్తుకొని నుదుటిపై పెదాలను తాకించింది .
ఇదిగో తల్లి , బుజ్జి .........టిఫిన్ రెడీ వెళ్లి డైనింగ్ టేబుల్ పై కూర్చోండి అని చెప్పింది .
తమ్ముడుకి తినిపించాలి మరిచిపోయావా అమ్మా , మేము సోఫాలో కూర్చుంటాము ఒక్క ప్లేట్ లోనే వడ్డించుకునివచ్చెయ్ ముగ్గురూ తిందాము అని నా చేతినిపట్టుకొని వెళ్లి సోఫాలో కూర్చోబెట్టి ప్రక్కనే కూర్చుంది .
అమ్మ ప్లేట్ లో వడ్డించుకొనివచ్చి మా ఇద్దరికీ తినిపించి తానూ తినింది .
అమ్మా సమయం లేదు అంటూ ఒక బ్యాగులో టవల్ తోపాటు అవసరమైనవి తీసుకుని ముగ్గురమూ మెయిన్ గేట్ దగ్గరకు వచ్చామో లేదో బస్ స్టాప్ నుండి బస్ గుంటూరు వైపు వెళ్ళిపోయింది .
అంతే అక్కయ్య కోపంతో అమ్మవైపు చూస్తుంటే ............
Sorry తల్లి కళ్ళుమూసుకుని 10 కౌంట్ చెయ్యి కోపం తగ్గిపోతుంది అని నవ్వుతూ ముందుకువచ్చింది .
నేను చేస్తాను అంటూ నాకళ్ళు మూసుకుని 1 2 3 .........చెబుతుంటే , అక్కయ్య నవ్వుకుని కళ్ళుమూసి నాతోపాటు కౌంట్ చేస్తూ 10 అంటూ కళ్ళుతెరిచాము .
సడెన్ గా ఇంటిముందు కారు వచ్చి ఆగింది . అక్కయ్య ఆశ్చర్యపోతుంటే .......
మనకోసమే , నా ప్రాణమైన బుజ్జిని మొదటిసారి ఎంజాయ్ చెయ్యడానికి తీసుకెళుతున్నాము , బస్ లో పిలుచుకునివెళతాను అని ఎలా అనుకున్నావు , తల్లి ఇప్పుడెకదా అన్నావు నీ తమ్ముడు ఈ ఇంటి యువరాజు అని అని మాట్లాడుతుంటే ,
లవ్ యు అమ్మా అంటూ అమాంతం సంతోషంతో కౌగిలించుకుని , తమవైపు కళ్ళల్లో చెమ్మతో ఆరాధనతో చూస్తున్న నాదగ్గరకువచ్చి , ఏమైంది తమ్ముడూ అని అడిగారు.
లవ్ యు అమ్మా , అక్కయ్యా ..........అంటూ ఇద్దరినీ ఒకేసారి కౌగికించుకొని , ఆనందబాస్పాలు అక్కయ్యా అని ఉద్వేగంతో చెప్పాను .
అమ్మా ఈ క్రెడిట్ మొత్తం నీదే , కారు మన సర్పంచి గారిది కదా ......
అవును తల్లి నువ్వు ఉదయం విషయం చెప్పగానే సోమయ్యకు డబ్బులిచ్చి పంపి ఈరోజు మొత్తం మనతో ఉండేలా సెట్ చేసాను . మన ఇష్టం ఎక్కడికీ వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లొచ్చు , మనమిక సమయాన్ని వృధా చెయ్యకూడదు ప్రతి క్షణం మనకు ముఖ్యం , నా బుజ్జి పూర్తి ఎంజాయ్ చెయ్యాలి అని కారులో నాకు చెరొకవైపు అమ్మ అక్క కూర్చుని పోనివ్వమని డ్రైవర్ కు చెప్పి నా తలపై బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెడుతూ దారిలో తోటను మనదే అని చూపించి తొందరలోనే ఎక్కడకూ వెళదాము అని చెప్పి , ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో నాకు చూపిస్తూ అర గంటలో గుంటూరు చేరుకున్నాము.
బాబు ముందు భ్రమరాంబ మల్లికార్జున గుడికి వెళ్ళమని అమ్మ చెప్పింది .15 నిమిషాలలో తీసుకెళ్లాడు .
అమ్మ అమ్మే ........అంటూ అక్కయ్య నన్ను సంతోషంతో ముద్దుపెట్టి , ముగ్గురమూ కిందకు దిగి బయట పూలు టెంకాయ తీసుకుని లోపలకువెళ్లి నా పేరు మీద మరియు అక్క పేరుమీద పూజ జరిపించింది అమ్మ . తల్లి ఒకే ఒక కోరిక నా పిల్లలిద్దరూ ఎప్పుడూ సంతోషంతో ఉండాలి అని ప్రార్థించింది .
అక్కయ్య ........నా తమ్ముడు , అమ్మ సంతోషంతో ఉండాలని ,
నేను నా ప్రాణమైన అక్కయ్య , అమ్మ సంతోషంతో ఉండాలని ప్రార్థించి ....... ముగ్గురమూ ఒకేసారి కళ్ళుతెరిచి మిగిలిన ఇద్దరూ ఏమి కోరుకున్నారో మనసుకు తెలుసు అన్నట్లు ప్రాణంలా చూసుకుని ఆనందించాము .
కాసేపు ప్రశాంతమైన వాతావరణం గల గుడిలో కూర్చుని ప్రసాదం తిని మరొకసారి ప్రార్థించి బయటకువచ్చి కారులో కూర్చున్నాము .
అమ్మగారు ఎక్కడకు పోనివ్వమంటారు అని డ్రైవర్ అడిగాడు .
ఇక వీళ్ళ ఇష్టం అని అమ్మ నవ్వి చెప్పడంతో ,
లవ్ యు అమ్మా ఇస్కాన్ టెంపుల్ కు కూడా వెళదాము అని చెప్పి డ్రైవర్ ను పోనివ్వమంది .
అక్కడ కూడా ప్రార్థించి , అక్కయ్య ఒక కాలేజ్ దగ్గరకు వెళ్ళమని చెప్పింది .
10 గంటలు అవుతుండటంతో అందరూ కాలేజ్ కు వస్తున్నారు .
తమ్ముడూ ఇదే మా కాలేజ్ అని చూపించి , మా కోతులు ఎవరైనా మనతోపాటు వేస్తారేమో చూద్దాము అని 5 మందికి కాల్ చేసింది .
ఐదుగురిలో ఇద్దరే కాలేజ్ కు వచ్చారు , ఆ ఇద్దరు కూడా క్లాస్ లో ఉన్నామే గంట పడుతుంది , ఈ సోదిగాడి గురించి తెలుసుకదా అని క్లాస్ జరుగుతున్నట్లు గుసగుసలాడారు .
వీళ్లంతా కాదు తమ్ముడూ నీ బుగ్గలను గిల్లి గిల్లి పెట్టే నా క్లోజ్ ఫ్రెండ్ కు కాల్ చేస్తాను అని చేసి , బయట వైట్ కలర్ కారులో ఉన్నాము అని చెప్పి మెయిన్ గేట్ వైపు చూస్తుంటే .........
వెనుక నుండి వచ్చి విండో తట్టింది . ఒసేయ్ సునీతా అంటూ కారు దిగి స్కూటీ మీద ఉన్న తన ఫ్రెండ్ ను అక్కయ్య కౌగిలించుకుంది .
రెండు నిమిషాలు ఇక్కడే ఉండు స్కూటీ పార్క్ చేసి వస్తాను అని లోపలకు వెళ్లి వచ్చి ,ఇంతకీ నా హీరో ఎక్కడ అని అడిగింది .
ఇదిగో అంటూ అక్కయ్య డోర్ తెరిచి అమ్మతో మాట్లాడుతున్న నన్ను చూపించగానే .........
క్షణంలో లోపాలలు దూరిపోయి కూర్చుని హీరో ..........అంటూ నన్ను రెండుచేతులతో చుట్టేసి , ఇంటికి వెళ్లిన దగ్గర నుండి నీ క్యూట్ ఫేస్ , బ్యూటిఫుల్ స్మైల్ , ముద్దుముద్దు మాటలు ............అన్నీ నీ ఆలోచనలే నా బుర్రన్తా నిండిపోయాయి , ముఖ్యన్గా ఈ నోరూరించే బుగ్గలు ఉన్నాయి చూడు నావల్ల కాదు అంటూ గిల్లేసింది.
స్స్స్...........అక్కయ్యా ........అని కేకవేశాను .
ఒసేయ్ అంటూ వెనుక నుండి తలపై ఒక దెబ్బ వేసి కిందకు దిగు అది నా ప్లేస్ అని చిరుకోపంతో చెప్పింది .
అమ్మా .........ముందే చెప్పాను కదా , ఎలాంటి ఛాన్స్ వదులుకోను అని నువ్వే ముందువెళ్లి కూర్చో అని అక్కయ్యను తోసేసి డోర్ వేసి నవ్వుతూ , sorry హీరో ఇప్పటి నుండి నెమ్మదిగా గిల్లుతాను . మరి ఏమి చెయ్యమంటావు వాటిని చూస్తే నా చేతులు అస్సలు ఊరుకోవు . Sorry sorry ............అంటూ నన్ను చుట్టేసి ఆప్యాయతతో తలపై ముద్దుపెట్టింది .
అక్కయ్య నవ్వుకుని వెళ్లి ముందర కూర్చోవడానికి అటువైపు వచ్చింది .
అమ్మ కారు దిగి తల్లి నీ తమ్ముడి ప్రక్కన కూర్చో నేను ముందు కూర్చుంటాను అని చెప్పడంతో ఎక్కి కూర్చున్నారు .
ఒసేయ్ సునీతా .........ఇలా అయితే ok , అలాకాదని మరొకసారి గిల్లావో ఆ వేళ్ళను ఇరిచేస్తాను అని అక్కయ్య నవ్వుతూ వార్నింగ్ ఇచ్చింది .
ఒసేయ్ నా హీరోకి sorry చెప్పేసాను , అదంతా మా understanding అంతేకదా హీరో అంటూ గిల్లిన చోట ముద్దుపెట్టింది .
నీ ఇష్టం సునీతక్కా .........కానీ మీరు మాత్రం అక్కయ్యతో ఎప్పుడూ ఇలా సరదా సరదాతో కలిసే ఉండాలి , మీరంటే అక్కయ్యకు చాలా ఇష్టం అనుకుంటాను అని చెప్పాను .
ఇద్దరూ అమితానందంతో నన్ను చెరొకవైపు నుండి హత్తుకొని నుదుటిపై ముద్దులుపెట్టారు .
తల్లి ఎక్కడికీ అని అమ్మ అడిగింది .
అమ్మా తమ్ముడిని మా కాలేజ్ ప్రక్కనే ఉన్న కాలేజ్ లో చేర్పించాలి . తమ్ముడూ నీకు ఇష్టమే కదా అని అక్కయ్య అడిగింది .
సోమవారం నుండి మా అక్కయ్య కాలేజ్ కు వెళుతుంది , నేను ఇంట్లో ఒంటరిగా మా అక్కయ్యను వదిలి ఉండటం వల్ల అవుతుందా అని ఆలోచిస్తున్నాను . ఇప్పుడు అక్కయ్యతోపాటు నేను కూడా ఇక్కడకు రావచ్చు కాబట్టి నాకు ఇష్టమే అక్కయ్యా అంటూ అని సంతోషంతో బదులిచ్చాను .
అవును తమ్ముడూ నేను ఈ విషయం గురించి ఆలోచించనే లేదు నా బుజ్జి తమ్ముణ్ణి విడిచి నేను కాలేజ్ కు వచ్చేదాన్ని కాదేమో , ఇప్పుడు ఇద్దరమూ హ్యాపీ అంటూ నన్ను చుట్టేసి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
కాలేజ్ కు అనుకున్న కాలేజ్ లోపలికి వెళ్ళాము . పెద్ద గ్రౌండ్ , తోట , పిల్లలు ఆడుకోవడానికి అన్నిరకాలు ఉండటం చూసి ఆనందిస్తుంటే .........
తల్లి బుజ్జికి కాలేజ్ నచ్చినట్లుంది అని అమ్మ చెప్పింది .
అంటీ ఈ కాలేజ్ , మా కాలేజ్ ఒక్కరిదే ..........హీరో ఇక్కడి నుండి కాలేజ్ లోకి దారి కూడా ఉంది అని సునీతక్క మాట్లాడుతుంటే ..........
ఆతృతతో ఎక్కడ సునీతక్కా అని అడిగాను .
హీరో ముందు జాయిన్ అయ్యి వచ్చి అన్నీ చూపిస్తాను అంటూ మెయిన్ బిల్డింగ్ లోపలికి ఆఫీస్ రూంలోకి వెళ్లి న్యూ జాయినింగ్ అనిచెప్పడంతో ఒకదగ్గరికి పంపారు.
అక్కడున్న మేడం అక్కయ్యలను చూసి మీరు మన కాలేజ్ స్టూడెంట్స్ కదా అని అడిగారు . అవును మేడం అంటూ చేతులు కలిపి , నా తమ్ముడు మహేష్ ని కాలేజ్ లో జాయిన్ చేయించాలి అని చూపించింది .
క్యూట్ బాయ్ అంటూ మేడం నా బుగ్గలను గిళ్లడంతో .........,
సునీతక్క చేతిని అడ్డుపెట్టుకుని ముసిముసినవ్వులు నవ్వింది . ఒసేయ్ ఆపు అంటూ అక్కయ్య తలపై కొట్టింది .
ఏమైంది అని మేడం అడగడంతో ..........
ఏమీ లేదు మేడం దీనికి కాస్త తిక్క , మీరు చెప్పండి అని అక్కయ్య అడిగింది .
మహేష్ ఇంతకు ముందు ఏ కాలేజ్ లో చదివేవాడివి , ఏ క్లాస్ అని అడిగింది .
నేను అక్కయ్యవైపు చూస్తుంటే , మేడం అంటూ నా గురించి మొత్తం వివరించింది .
చాలా సంతోషం వాసంతి , మనం ఇప్పుడు ఏమిచేద్దామంటే మామూలుగా మహేష్ వయసు ప్రకారం 3rd క్లాస్ ఉండాలి , కానీ మహేష్ కు అంత knowledge ఉందొ లేదో టెస్ట్ చెయ్యాలి లేకపోతే క్లాస్ లో ఏమీ అర్థం కాదు అని ల్యాండ్ లైన్ నుండి థర్డ్ క్లాస్ మిస్ ను పిలిపించి , నన్ను చూపించి మొత్తం వివరించారు .
మిస్ నన్ను మాత్రమే ప్రక్కనున్న రూంలోకి పిలుచుకొనివెళ్లి 15 నిమిషాల తరువాత వచ్చి , మేడం 4th క్లాస్ లో జాయిన్ చెయ్యొచ్చు అనిచెప్పి నవ్వుతూ నా తల నిమిరి వెళ్లిపోయారు .
మేడం తో పాటు మేమంతా ఆశ్చర్యపోయాము .
వాసంతి నిజం చెప్పు మహేష్ ఇప్పటివరకూ చదువుకోలేదా ..........
లేదు మేడం కాలేజ్ లో ఎంటర్ అవ్వడం ఇదే తొలిసారి .
ఇంత మంచి స్టూడెంట్ ను మాకు అందించినందుకు చాలా థాంక్స్ అంటూ 15 నిమిషాలలో జాయినింగ్ చేసుకున్నట్లు ఫారం ఇచ్చి క్యాష్ కౌంటర్లో కట్టి మర్నాడు Monday నుండి కాలేజ్ కి రావచ్చు , ఏమేమి తీసుకురావాలో అక్కడ లిస్ట్ ఇస్తారు అని మళ్ళీ ఇంటెలిజెంట్ బాయ్ అంటూ బుగ్గలను గిల్లింది .
స్స్స్..........అంటూ నా బుగ్గలను పట్టుకున్నాను .
సునీతక్క నవ్వు ఆగడం లేదు . మనకే కాదు హీరో బుగ్గలంటే మరొకరికి కూడా ఇష్టం అంటూ సంతోషంతో నవ్వుతూ అక్కయ్య బుగ్గలను ప్రేమతో స్పృశించి అమౌంట్ కట్టి లిస్ట్ తీసుకుని బయటకువచ్చి అన్నీ చూపించారు .
కారు ఎక్కి నెక్స్ట్ అని అడగడంతో ,
అమ్మా నా తమ్ముడి కోసం వాటర్ పార్క్ అని అక్కయ్య చెప్పగానే , డ్రైవర్ పోనిచ్చాడు .
15 నిమిషాలలో చేరుకున్నాము . నాలుగు టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళగానే వాటర్ రైడ్స్ , ఫౌంటెన్ , మినీ ట్రైన్ , స్విమ్మింగ్ పూల్ చూసి ఆనందం పట్టలేక అక్కయ్య చేతిని బిగిపెట్టాను .
తమ్ముడూ నీఇష్టమొచ్చినంతవరకూ ఎంజాయ్ చెయ్యి వెళ్లు వాటర్ రైడ్స్ దగ్గర వదిలి పూల్ దగ్గర వచ్చి కూర్చున్నారు .
పైకెక్కి జీవితంలో ఇలా చుట్టూ పిల్లలతో సరదాగా గడుపుతానని అనుకోలేదు , లవ్ యు అక్కయ్యా..........అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ , పైనుండి అక్కయ్యా .........అంటూ ప్రేమతో పిలిచి కిందకు జారాను .
నా ఆనందం చూసి అమ్మ , అక్కయ్యలు పరవశించిపోతున్నారు . నీళ్ళల్లో పూర్తి తడిచి పైకివచ్చి అక్కయ్య దగ్గరకువెళ్లి లవ్ యు అక్కయ్యా ..........చాలా ఆనందంగా ఉంది అంటూ బుగ్గపై ముద్దుపెట్టి , తుర్రుమంటూ ఈసారి రౌండ్స్ రైడ్ పైకి చేరి చుట్టూ తిరుగుతూ కిందకు జారుతూ వచ్చి నీళ్ళల్లో పడ్డాను . మళ్లీ పైకెక్కి లవ్ యు అక్కయ్యా .......అంటూ మరొక బుగ్గపై ముద్దుపెట్టి పైకి పరిగెత్తాను .
ఏంటే అలా చూస్తున్నావు అని అక్కయ్య సునీతక్కయ్యను ఆడిగింది .
ఆలస్యం అయినా నువ్వు చాలా చాలా అదృష్టవంతురాలివే వాసంతి , నువ్వంటే ప్రాణమే వాడికి అంటూ సంతోషంతో చెప్పింది .
అవును నా తమ్ముడు ఒక్క క్షణం కనపడకపోతే ఈ హృదయం కూడా తట్టుకోలేదు . అక్కయ్యా అని ప్రాణంలా ఒక్కొక్క ముద్దు పెడుతుంటే ఇన్ని సంవత్సరాలు ఏమి మిస్ అయ్యానో అర్థమైంది అంటూ నావైపు చేతిని ఊపి ఆనందబాస్పాలతో మురిసిపోతొంది .
నా తమ్ముడి సంతోషమే నా సంతోషం అంటూ నీళ్ల దగ్గరికి వచ్చి , నేను పైకి రాగానే లవ్ యు తమ్ముడు అంటూ నుదుటిపై ముద్దుపెట్టి , వెళ్లు తనివితీరేంతవరకూ ఆడు అని అక్కడే నిలబడింది .
అలా అర గంటవరకూ రైడ్స్ మరియు నీళ్ళల్లో ఎంజాయ్ చేసి , మరికొద్దిసేపు చాలామంది పిల్లలతో రైన్ డాన్స్ లో గెంతులేసి పైకివచ్చి చలికి వణుకుతూ .........అక్క..... య్యా చా. .....లు అని తడబడుతున్న మాటలతో చెప్పాను .
అమ్మా బ్యాగులో నుండి టవల్ అందుకొని నన్ను బెంచ్ పై కూర్చోబెట్టి , అమ్మ వీపుపై , సునీతక్క చేతులను రాస్తూ , అక్కయ్య టవల్ తో తల తుడిచి నా బాత్రాలు తీసుకుని changing రూమ్ దగ్గరకు తీసుకెళ్లి లోపలకు పంపింది .
తడి బట్టలను విడిచి డ్రై అయ్యి అక్కయ్య అందించిన బట్టలను వేసుకుని ఉత్సాహంతో బయటకు వచ్చాను .
తమ్ముడూ ఇప్పుడెలా ఉంది అని బుగ్గలపై చేతులతో నుదుటిపై వెచ్చని ముద్దుపెట్టింది .
ఇప్పుడు వెచ్చగా ఉంది అక్కయ్యా ......... నీళ్ళల్లో చాలా ఎంజాయ్ చేసాను లవ్ యు అంటూ అక్కయ్య చేతిని రెండు చేతులతో పట్టుకుని అమ్మదగ్గరికి చేరుకున్నాము .
అక్కడి నుండి బంపింగ్ కార్స్ దగ్గరకు వెళ్లి రెండుసార్లు ఆడి ఎంజాయ్ చేసాను . మధ్యాహ్నం ఒంటి గంటవరకూ నేను ఏది చూపిస్తే అది , అన్నిచోట్లా తిరిగి ఎంజాయ్ చేసి అలసిపోయి అక్కయ్యా .........ఆకలి అని చెప్పాను .
ఓకేరోజులోనే ఇంత ఎంజాయ్ చేస్తే అలసిపోక ఏమవుతావు హీరో అంటూ బుగ్గలను కసిగా గిళ్లబోయి , వెనుక అక్కయ్య చెయ్యి తన వీపుపై పడుతుందని గుర్తుకొచ్చి అక్కడితో ఆగిపోయి నా కురులను ఆప్యాయంగా నిమిరింది .
అమ్మ నీళ్లు తాగించి తల్లి మాంచి స్టార్ హోటల్ కు వెళదాము అని బయటకువచ్చి కారులో హోటల్ చేరుకున్నాము .
డ్రైవర్ ను కూడా భోజనానికి పిలిచి మేము నలుగురూ ఒక టేబుల్ ఆక్రమించేసాము. తమ్ముడూ బిరియాని అని అడిగింది .
పెదాలను తడుముకుని ఊ ఊ ...........అంటూ తల ఊపాను . మెనూ కార్డ్ అందుకొని ముందు నాకు ఐస్ క్రీమ్ ముగ్గురికీ కూల్ డ్రింక్స్ తెమ్మనిచెప్పి , బిరియానీతోపాటు చాలా ఐటమ్స్ ఆర్డర్ చేసింది . ఆ ఐటమ్స్ పేర్లు వినడం అదే తొలిసారి .
ముందు ఐస్ క్రీమ్ , డ్రింక్స్ తీసుకురావడంతో క్షణాల్లో తినేసాను . ముగ్గురూ ఆశ్చర్యపోయి తమ్ముడూ ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా అని సునీతక్క అడిగింది .
చల్లగా , తియ్యగా చాలా బాగుంది అక్కయ్యా ..........., ఫస్ట్ టైం తినడం అందుకే అలా ............,
అక్కయ్య కళ్ళల్లో చెమ్మతో ఒకేసారి మూడు flavours తెమ్మని చెప్పి , తమ్ముడూ ఒక పెద్ద ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకెళ్లి మన ఇంటి ఫ్రిడ్జ్ లో పెడతాను నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వెళ్లి తిను అని చెప్పి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి , మూడు పిల్లాడికే ఇవ్వండి అని అక్కయ్య చెప్పింది .
లవ్ యు అక్కయ్యా ...........అంటూ ఇష్టంతో రెండు తినేసి మరొకటి బిరియానీ తిన్న తరువాత తింటాను అని చెప్పడంతో ........
నీ ఇష్టం తమ్ముడూ అని ముద్దుపెట్టింది . ఇంతలో ఆర్డర్ చేసినవన్నింటినీ టేబుల్ పై ఉంచడంతో , ఫస్ట్ టైం చూస్తున్నట్లు కుమ్మేయాలన్నంతలా అలా చూస్తుండిపోయాను.
అన్నీ నా తమ్ముడి కోసమే అంటూ తన ప్లేటులో వడ్డించి నాకు తినిపించి తానూ తినింది .
లవ్ యు అక్కా ...........అంటూ ఆవురావురుమంటూ కడుపునిండా తిని , కప్పులో కరిగిపోయిన ఐస్ క్రీమ్ తాగి అక్కయ్యా .............కడుపు నిండిపోయింది అంటూ పొట్ట చూపించాను .
అక్కయ్యలు అమ్మ సంతోషంతో నవ్వుకున్నారు . డ్రైవర్ తిన్నదానికి కూడా బిల్ కట్టేసి కారులోకి చేరాము.