27-01-2019, 10:02 AM
ఉదయ్, మహీని మీటవ్వటానికి ఒప్పుకున్నాడని సునంద ఫోన్ చేయటంతో అందరకి ఆనందంగా ఉంది. ఆ రోజు రాత్రికి అందరూ బయల్దేరుతున్నామని సునంద చెప్పటంతో అందరూ ఇక మహీని కన్విన్స్ చెయ్యటం మొదలుపెట్టారు. పెళ్ళికొచ్చిన చుట్టాలందరు వెళ్లిపోయినా పెదనాన్న, పెద్దమ్మా, శేఖర్ ఎందుకుండిపోయారో అప్పుడే మహీకర్దమైంది.
"అన్నయ్యా! వదిన ఆడిగినప్పుడే నో చెప్పాను. ఇక ఆ టాపిక్ వదిలెయ్యండి ప్లీజ్" అసహనంగా చెప్పింది మహీ.
"మహీ! మేం ఫోర్స్ చెయ్యటంలేదు. ఓన్లీ ఒక్కసారి ఉదయ్ ని మీటవ్వు. ఆ తర్వాత మీ ఇష్టం" సునంద చెప్పామన్నట్లే చెప్పాడు శేఖర్.
"నాకలాంటి థాటేలేనప్పుడు.మీటవటం.మాత్రమెందుకు?" చిరాగ్గా చెప్పిన మహిమని వారించారు పెదనాన్న.
"మహీ! మీ వదిన అక్కడ ఆ అబ్బాయిని ఇలాగే ఒప్పించి తీసుకొస్తుంది. ఆల్రెడీ వాళ్ళు బయల్దేరిపోయారు. మర్యాద కన్నా, మీ వదిన సంతృప్తి కోసం ఒక్కసారి ఆ అబ్బాయిని కలువు. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్లే చేద్దురుగాని" ఆయన నచ్చజెప్పారు.
"అవునమ్మా! వాళ్లంత దూరం నుంచోస్తే కనీసం చూడకపోతే మనకే అమర్యాదగా ఉంటుంది. పాపం వదిన అందర్నీ వెంటబెట్టుకొచ్చి అవమానపడదా?" అందరూ మెల్లిగా కన్విన్స్ చేస్తున్నారు.
"ఇదంతా ముందే నాకు చెప్పొచ్చుగా" మహికి కోపమొచ్చినా ఇంకేం చెయ్యలేక చివరికి సునంద తృప్తి కోసం ఉదయ్ ని మీటవటానికి ఒప్పుకుంది.
* * * *

