27-01-2019, 09:59 AM
ఆ రాత్రి ఉదయ్, వైష్ణవిని పొడుకోపెట్టటానికి పైకి తీసుకెళుతుంటే సునందా వెనకాలే వెళ్ళింది. ఉదయ్, వైష్ణవిని గుండెలమీద వేసుకొని జో కొడుతున్నాడు.
"నేను పొడుకోపెడతాను ఉదయ్. దాన్ని నాకివ్వు" అడిగింది.
"అదంతా ఈజీగా పొడుకోదక్కా తర్వాత ఎదుకడిగానా అనుకుంటావు"
ఉదయ్ గాఢంగా వైష్ణవిని హత్తుకొని అపురూపంగా చూసుకుంటుంటే సునంద గుండె కరిగిపోయింది. "నాన్నా! ఎన్నాళ్ళురా ఇలా" జాలిగా అడిగింది.
"అక్కా! ప్లీజ్ అలా జాలి చూపించకు. నాకేం నేను బానే వున్నాను" ఉదయ్ తన మీద జాలి చూపిస్తే భరించలేడు.
"ఉదయ్! మొన్న పెళ్ళిలో అచ్చం నీలాగే ఫీలయ్యే అమ్మాయిని చూశాన్రా. మా పినమావగారమ్మాయి. పేరు మహిమ" సునంద మెల్లిగా మొదలెట్టింది.
అప్పటికే ఉదయ్ కేదో అనుమానం వచ్చి నుదురు చిట్లించాడు.
"అక్కా! నువ్వే టాపిక్ మాట్లాడుతున్నావ్?" అసహనంగా అడిగాడు.
"ఉదయ్! నాకన్నా ఏదేనిమిదేళ్లు చిన్నవాడివి నువ్వు. నా పిల్లలెంతో నువ్వు నాకంతేరా. నాకు నీ గురించి, వైషూ గురించి బెంగా, చింతా ఉండవా చెప్పు? మొన్న పెళ్ళిలో మహీని చూసాక ఆ అమ్మాయి పట్ల కూడా నేనీలాగే ఫీలయ్యాను.
ఉదయ్, మహిమ గురించి చెప్తే నువ్వు నమ్మవు. జస్ట్ ఇరవైరెండు నిండి ఇరవైమూడు నడుస్తోంది. చాలామంది అమ్మాయిలకి ఆ వయసులో ఇంకా పెళ్లి కాదు. కానీ, మహిమకి పెళ్ళయి నాలుగేళ్ళ కొడుకున్నాడు. పెళ్లయిన ఆరునెలలకే హుస్బెండ్ని పోగొట్టుకున్న ఆమె కండిషన్ నాకన్నా నువ్వే ఎక్కువ ఇమాజిన్ చెయ్యగలవు" మహిమ గురించి చెప్పటం మొదలుపెట్టింది సునంద.
"అక్కా! నీ ఉద్దేశం నాకర్ధమైంది కానీ నాకు మాత్రం ఆ ఆలోచనే లేదు. సారి" ఉదయ్ మధ్యలోనే అడ్డుపడ్డాడు.
"నీకా ఆలోచన ఎందుకులోదో నాకు తెలియదనుకున్నావా? వైషూకి సవతితల్లి చేతిలో పెట్టటానికి భయం, బెంగా, బాధ. ఏరా మాకు మాత్రం ఆ భయం లేదనుకున్నావా? అందుకే మహిమైతే..."
"అక్కా! డోంట్ వర్రీ. వైషూకి చూసుకోటానికి అమ్మ ఉంది, నేనున్నాను. నో ప్రాబ్లెమ్" ఉదయ్ తేలిగ్గా చెప్పేసాడు.
"అవును. అమ్మ ఉంది. ఎన్నాళ్లుండగలదు. ఉదయ్, వైషూ ఆడపిల్లరా. దానికి అమ్మ అవసరం ఎంతుంటుందో నీకూ బాగా తెలుసు. నువ్వున్నాసరే దానికో అమ్మ కావాలి. ఒక ఫ్యామిలీ కావాలి. అలాగే అక్కడ మహీ కొడుక్కైన అంతే. వాడు కళ్ళు తెరిచి సరికే వాళ్ళ నాన్న కన్నుమూశాడు. అందరికి ఉన్న నాన్న తనకొక్కడికే ఎందుకు లేడో ఆ పసిమనసుకు.తెలీదు. అమ్మానాన్నల కోసం పరితపించే ఆ పసిమనసుల కోసం మీరిద్దరూ అమ్మానాన్నలు ఎందుకవకూడదు?"
"ఫర్ గాడ్ సేక్ అక్కా! ప్లీస్ ఇక ఆ టాపిక్ వదిలేయ్. ఐనా నా గురించి, అర్చూ గురించి అంతా తెలిసీ ఇలా ఎలా ఆడగ్గలుగుతున్నావ్?" ఉదయ్ కి కొద్దిగా కోపమొచ్చింది.
"తెలుసు. అర్చూ అంటే నీకెంత ఇష్టమో తెలుసు. అమ్మ పెళ్లి కొప్పుకోకపోతే అప్పుడు నేనేకదారా అమ్మని కన్విన్ చేసి మీ పెళ్లి చేసాను. అదే నేను, ఇప్పుడింతగా ఎందుకు ఫోర్స్ చేస్తున్నానో తెలుసా? అర్జున్, వైషూ ఇద్దరు ఇంకా ఊహాతెలీని పసివాళ్ళు. ఇప్పుడైతే ఆ పసిమనసులకి ఏ సందేహాలు రావు. మహీ తనకి అమ్మకాదని, అర్జున్ కి నువ్వు నాన్నవి కాదని తెలియని ఆ లేతమనసులు మిమ్మల్ని వెంటనే యాక్సెప్ట్ చేస్తాయి. అలాగే వాళ్లిద్దరూ సొంత అన్నాచెల్లెళ్ళలా కలిసిపోతారు. అదే ఇంకో రేండుమూడేళ్లయితే వాళ్ళకి లేనిపోని అనుమానాలొస్తాయి. అప్పుడిక కష్టం నాన్నా! అందుకే ఇంత తొందరపడుతున్నాను" సునంద ఎలాగైనా ఉదయ్ ని కన్విన్స్ చెయ్యాలని ట్రై చేస్తోంది.
"అక్కా! ఇది డెలికెట్ మ్యాటర్. చాలా కష్టమైన సిట్యుయేషన్. ఫేస్ చేసేవాళ్ళకే అందులో ప్రోబ్లేమ్స్ తెలుస్తాయి" ఉదయ్ క్షణం కూడా ఆగకుండా చెప్పేసాడు..
"అవును డెలికెట్ మ్యాటరే. అందుకే ఒకసారి మహీని మీటవ్వు. ఆమెలో నీ పాపకి అమ్మ తప్పకుండా కనిపిస్తుంది. నువ్వు వెల్ ఎడ్యుకేటెడ్ వి. పెద్ద మనసుతో అర్జున్, మహిలని యాక్సెప్ట్ చెయ్యి. మీరిద్దరూ కలిసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టండి. ఉదయ్! నువ్వెలా ఉండేవాడివిరా. ఆ అల్లరి, చాలాకితనం అన్నిపోయి డల్ గా తయారైతే మేము చూడలేకపోతున్నాం రా" సునందకి దుఃఖం ఆగటం లేదు.
ఉదయ్ అసహయంగా చూస్తున్నాడు. లాలితైతే రోజుకి పదిసార్లన్నా కొళాయి విప్పుతుంది. అతనికది అలవాటే. కానీ, సునంద అంత త్వరగా తన ఫిలింగ్స్ బయటపడనివ్వదు. ఎప్పుడూ తనకి ధైర్యం చెప్పే అక్క ఇవాళ ఇలా బాధపడుతుంటే చూడలేక "ఇట్స్ ఒకే అక్కా! ఆ అమ్మాయిని మీటవుతాను. కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం నాదే. అప్పుడిక ఫోర్స్ చెయ్యకూడదు" ముందే మెలికపెట్టాడు.
"థాంక్స్ రా" సునంద మొహం సంతోషంతో విప్పారింది.
* * * *
Vishu99