Poll: నా కథల్లో ఏది కొనసాగించాలి అనుకుంటున్నారు?
You do not have permission to vote in this poll.
దూలగాడు
13.85%
9 13.85%
బుతుబంగ్లా
15.38%
10 15.38%
ఖర్కోటకుడు
70.77%
46 70.77%
Total 65 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy WBC { వరల్డ్స్ బెస్ట్ క్రికెటర్ }
#38
పీఎం కాన్ఫరెన్స్ హాల్


పీఎం సహా దేశ హోం మంత్రి, సీబీఐ చీఫ్, రక్షణ శాఖ మంత్రి, బీసీసీఐ అధ్యక్షుడు, RAW చీఫ్ ఇంకా మిగిలిన ముఖ్య అధికారులతో భేటీ అయ్యారు.

"న్యూస్ చూసారా?" అడిగారు పీఎం.

"యెస్ సర్" అన్నారు అక్కడివారు.
"ఇది ఎలా జరిగి ఉంటుందని మీ అభిప్రాయం?" అడిగాడు పీఎం RAW చీఫ్ ని.

"పాకిస్తాన్ లో మన ఏజెంట్స్ ఆ పని మీదే ఉన్నారు సర్"
"ఏమైనా కొత్త న్యూస్ బయటకు వచ్చిందా?"

"ఇంకా ఏమీ రిపోర్ట్ అందలేదు సర్. ఫోరెన్సిక్ అండ్ లాబ్ రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది అంటున్నారు"

"మరి పోస్టుమార్టం సంభందించి?"

"ఇంకా తెలీలేదు కానీ ప్రాధమిక దర్యాప్తులో మాత్రం డ్రగ్ డోసేజ్ మోతాదుకు మించడం వల్ల చనిపోయాడు అనుకుంటున్నారు" చెప్పాడు RAW చీఫ్.

"something is suspecious.. వాళ్ళు చాలా తెలివిగా దీన్ని మన మీదకు నెట్టాలని చూస్తున్నట్టు నా అనుమానం. ఈ కేసు దర్యాప్తులో మనం కూడా ఉండటం చాలా అవసరం." అన్నాడు సాలోచనగా మోడీ.

"కానీ మనకు పాకిస్తాన్ కు అస్సలు పడదు. ఇప్పుడు వాళ్లకు మనకు ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో ఒకరినొకరు దూషించుకున్నారు కూడా.. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో మనం అక్కడికి వెళ్ళడం అసాధ్యం." బదులిచ్చాడు డిఫెన్స్ మినిస్టర్.

" నేనే స్వయంగా ఇమ్రాన్ ఖాన్ ని కలిసి అడుగుతాను" అన్నాడు మోడీ.

"వద్దు పీఎం గారూ. మనమే తేనెతుట్టెని కదపడం మన దేశానికే మంచిది కాదు. దీనికి వేరే మార్గం నేను చెప్తాను." అన్నాడు అమిత్ షా.

వ్యూహరచన లో అమిత్ షా నైపుణ్యం తెలుసు కనుక అక్కడున్న వారంతా మిన్నకుండిపోయారు.

" మిస్టర్ గంగూలీ. నేను మిమ్మల్నేమి అడగను. మాకు ఏమాత్రం ఉపయోగపడే విషయం మీ దగ్గరున్నా మాకు చెప్పండి. లేకపోతే you are free to go" ముగించాడు అమిత్ షా.

"ఈ వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ మీ అండదండలతోనే ఘనంగా నిర్వహించాను. మొదట్నుంచీ మిగిలిన జట్లు పాకిస్తాన్ మీద గెలవలేకపోవడానికి అతనొక్కడే అడ్డంకిగా మారాడు. అతని బ్యాట్, ఎక్విప్మెంట్ అంతా పరిశీలించాం. ఎక్కడా ఏ విధమైన తేడా కనపడలేదు. కానీ అతను చాలా చాలా స్పెషల్ గా ఉండేవాడు." చెప్పాడు గంగూలీ.

అతను లేచి వెళ్లబోతుంటే షా అడిగాడు.

"ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అంత డ్రగ్ తీసుకున్నాడంటే మీ అభిప్రాయం ఏంటి?"

ఆయనలా అడగ్గానే గంగూలీ ఏదో స్ఫూరణకు వచ్చిన వాడిలా గంగూలీ తిరిగి తన కుర్చీలో కూర్చుంటూ "అతనికి డోప్ టెస్ట్ చేద్దామనుకుంటే అతను కేవలం సాంప్రదయమైన క్రికెట్ షాట్లు మాత్రమే ఆడేవాడు. అతని బ్యాట్ కూడా 1950ల్లో ఉన్నట్టు చాలా ఫ్లాట్ గా ఉండేది. అతను ఈ టోర్నమెంట్ లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేదంటే నమ్ముతారా? కానీ ఫోర్లు మాత్రం చాలా అలవోకగా కొట్టాడు. అతను కొట్టిన ఫోర్లు మొత్తం సర్కిల్ లోపల ఉన్న ఫీల్డర్ల మధ్యలో నుంచి మాత్రమే బౌండరీ దగ్గర ఎవరూ లేని వైపే కొట్టేవాడు" అన్నాడు.

"ఇంట్రెస్టింగ్.. ఇంకా ఏమైనా తెలుసేమో గుర్తు తెచ్చుకోండి. ఐసీసీ పరిథిలో కానీ ఇంకా ఏమైనా తెలుసా? వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ కదా? ఒక్కసారి" అన్నాడు షా.
" యెస్ సర్. అతను ఇంకొక నాలుగు రోజుల్లో వాడా ( ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ) ముందుకు పరీక్షల నిమిత్తం హాజరు కావాలి. ఈ లోపే ఇలా జరిగింది"

" here is the tail" బల్ల చరుస్తూ లేచి నిలబడ్డాడు అమిత్ 
షా.

అందరూ విచిత్రంగా ఆయన మొహంలోకి చూసారు.

"ఏంటి అందరూ నన్ను చూస్తున్నారు? మీకింకా అర్ధం కాలేదా? So sad" అంటూ ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసాడు.
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
[+] 8 users Like naresh2706's post
Like Reply


Messages In This Thread
RE: WBC { వరల్డ్స్ బెస్ట్ క్రికెటర్ } - by naresh2706 - 15-12-2019, 10:51 PM



Users browsing this thread: 7 Guest(s)