20-11-2018, 12:00 PM
"నిన్న ఎక్కడికి వెళ్లావు?" మౌనిక ప్రశ్నించింది. "ఇంట్లోనే ఉన్నాను" చెప్పాడు. ఎందుకు అబద్ధం చెప్తున్నాడో అర్ధం కాలేదు మౌనికకి. ఆమెకు చాలా బాధ అనిపించింది. "నిన్న అంజలిని కలిసావు కదూ?" మరో ప్రశ్న అడిగింది. "అబ్బే, లేదు. ఎందుకు?" అని మళ్ళీ అబద్ధం చెప్పాడు. "అబద్దం చెప్పకు అరవింద్. నేను చూసాను. అంజలి నువ్వు బైక్ పై వెళ్ళడం నేను చూసాను" అంది. షాక్అయ్యాడు. "అదీ.. అదీ.. అంటూనీళ్ళునమిలాడు. "చెప్పు.." అంది. ఇంత ఇరుకున పడతానుకోలేదు. నిజం చెప్పేద్దామని అనుకున్నాడు. అప్పుడే అంజలి వచ్చి "బయటకు వెళ్ళాలి అరవింద్. కాస్త నన్ను గోపాలపట్నం తీసుకువెళ్ళాలి" అని మౌనికని పట్టించుకోకుండా "పదా, ఇంకా నిలబడ్డావేంటి" అంటూ చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోయింది. మౌనికకు పట్టరానంత కోపం వచ్చింది. అరవింద్ ఎందుకిలా ఉంటున్నాడు అని అనుకుంది. బండిపై వెళ్తూ "ఏంటిది?" అనడిగాడు. "తనకు నీకు మద్యన గ్యాప్ ఫామ్ అయితే తనే నిన్ను వదిలేస్తుంది. నువ్వు కూడా తనని పట్టించుకొనట్టు ప్రవర్తించు." అంది అంజలి.
* * *
ప్రమోద ఇంటి దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళింది. అదే గుడికి మౌనిక కూడా వచ్చింది. ప్రమోద దర్శనం చేసుకుని బయట మెట్లపై కూర్చుంది. మౌనిక కూడా అలానే ఏదో ఆలోచిస్తూ ఉంది. ప్రమోద ప్రసాదం కొంచెం ఇచ్చింది. మౌనిక తీసుకుని "థాంక్స్ " అంది. "ఏం చేస్తుంటారు?" అనడిగింది ప్రమోద. "చదువుకుంటున్నాను " చెప్పింది మౌనిక "ఓ..అలాగా!!" "మీరు?" "పెళ్లైంది. ఇంట్లోనే...." అంది. "ఓ...." మళ్ళీ ఆలోచనలో మునిగింది మౌనిక. "మీరు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు?" ప్రశ్నించింది ప్రమోద స్నేహపూర్వకంగా. "ఏమి లేదండి." అంది మౌనిక "సర్లెండి. గుడికొచ్చేది ప్రశాంతత కోసం. కాని మనుషులు కష్టాలను మోసుకుని వచ్చి దేవుడితో చెప్పుకుంటూ ఉంటారు" అంది ప్రమోద "కష్టాలు ఎవరికీ లేవు చెప్పండి " అంది మౌనిక "అవును..." నిట్టూర్చింది ప్రమోద "ఏంటండి మరీ అంత డల్ అయిపోయారు. మీ భర్త వల్ల ఏమైనా సమస్యా?" "అబ్బే, అదేమి లేదు. నా భర్త చాలా మంచివాడు. ఆ రాముడి మాదిరి. కాని అతనేదో మనసులో పెట్టుకుని బాధపడుతున్నాడని అనిపిస్తోంది" "అంటే?" "పెళ్లై ఆరు నెలలవుతోంది. ఆయన నాతో సరిగా మాట్లాడటం లేదు. ఎప్పుడు ఎలా ఉంటాడో అర్ధం కావడం లేదు" "ఎందుకలాగ?" "ఏమో! అది తెలిస్తే ఇంకెందుకు చెప్పండి " అంది ప్రమోద. "ఏంటో నాది అలాంటి సమస్యే. నేను ఒకతన్ని ప్రేమించాను. ఈ మధ్యన ఎందుకో సరిగా ఉండటం లేదు" చెప్పింది మౌనిక. అదేసమయానికి అంజలితో పాటు బయట గడపకు దండం పెట్టుకుంటూ గుడిలోకి అడుగుపెట్టాడు అరవింద్. ఆ గడపను దాటుతూ మెట్లపై ఉన్న ఇద్దరినీ చూసి ధ్వజ స్థంభం వెనకగా వెళ్లి దాక్కోవడానికి ప్రయత్నించాడు. "ఏమైంది ?" అంటూ అటు చూసింది అంజలి. అప్పటికే మౌనిక వాళ్ళిద్దరిని గమనిన్చేసింది. లేచి నిలబడి "అరవింద్ " అని పిలిచింది. కాదు దాదాపు అరిచింది. కూర్చుని ఉన్న ప్రమోద తలెత్తి మౌనికని చూసి ధ్వజ స్థంబం వైపు తిరిగింది. చేసేది లేక బయటకి వస్తున్న అరవింద్ ని చూసి తానూ నిలబడింది. అరవింద్ కి ముళ్ళపై నుంచున్నట్టుంది. ఇద్దరు మెట్లు దిగి నడుచుకుంటూ వచ్చారు. "నాపై మోజు పోయిందంటే చెప్పు. ఇలా ప్రేమ అనే పేరుతో మోసం చేయడానికి సిగ్గుగా లేదు" అని అడిగేసింది. "మాటలు జాగ్రత్తగా రానీ మౌనిక" అంది అంజలి. "ఏంటి? నువ్వు సపోర్ట్ చేస్తున్నావ్? ప్రేమా?" అని అడిగింది మౌనిక ప్రమోద అరవింద్ దగ్గరకు వెళ్లి "ఏమైంది అరవింద్? " అని ప్రశ్నించింది. "నీకు అరవింద్ తెలుసా?" అనడిగింది మౌనిక. "నా భర్త" సమాధానమిచ్చింది ప్రమోద. అదిరిపడింది మౌనిక. ఉలిక్కిపడింది అంజలి. ఇప్పుడు అంజలికి పరిస్థితి పూర్తిగా అర్ధమైంది. "మౌనిక నీతో ఒక విషయం మాట్లాడాలి. " అంది అంజలి. "నాతో ఎవరూ మాట్లాడద్దు. నన్ను ఏమార్చింది చాలు. నేను ఎవరి మాటా వినదల్చుకోలేదు." అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది మౌనిక. "క్షమించండి" అంది అంజలి ప్రమోదతో. "అసలేం జరిగింది అరవింద్. ఇప్పటికైనా చెప్పు" అనడిగింది ప్రమోద. మౌనిక అరవింద్ లు ప్రేమించుకున్న విషయం, ఆ తరువాత అనివార్య కారణాల వల్ల పెళ్లి జరిగిన విషయం అంతా చెప్పింది అంజలి. అంతా విన్నాక ప్రమోద "ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు అరవింద్?" అని ప్రశ్నించింది. "నాకు నీకంటే ఏమి ముఖ్యం కాదు" అన్నాడు. "మరీ మౌనిక?" మౌనం వహించాడు. కాసేపాగి, "జరగాలనుకుంది ఒకటి. జరిగింది ఒకటి. నిజంగా మౌనికను ప్రేమించాను. కాని అక్కడితోనే ఆగిపోయింది. ఎంతమంది ప్రేమలు పెళ్ళిళ్ళ వరకు వెళ్తున్నాయి. అలా వెళ్ళని జాబితాలో నాది ఒకటి. ఇందుకు నేనేమి బాధపడటం లేదు. ఏమి జరిగినా యాక్సెప్ట్ చేయాలి. కష్టమైనా! సుఖమైనా! ఈ విషయం గురించి చాలా ఆలోచించాను. నాకు నువ్వే ఇంపార్టెంట్ అనిపించింది. అందుకే ఈ విషయం చెపుదామని చాలా ప్రయత్నించాను. ధైర్యం చాలాలేదు. ఏదో ఒకరోజు బయట పడే విషయం. కాని ఎలా చెప్పాలి? నాకు నువ్వు దూరమైపోతే ఇంకెవరు దిక్కు అందుకే చెప్పలేదు. నన్ను నమ్ము ప్రమోద, నేను చెడ్డవాడిని కాదు . పిరికివాడిని. " అన్నాడు అరవింద్. మౌనిక ఇంటికెళ్ళి చాలా ఏడ్చింది. సుధీర్ కి విషయం చెప్పింది. "నిన్ను మోసం చేస్తాడా? చంపేస్తాను" అన్న అన్నతో వదిలేయ్ అన్నయ్య అంది. ఊరుకున్నాడు. కొన్ని రోజుల తరువాత అంజలి మౌనికని పర్సనల్ గా మీట్ అయ్యి అసలు అరవింద్ ఎలాంటి పరిస్థితులో చేసుకోవాల్సి వచ్చిందో, అతను ఎంత నలిగిపోయాడో వివరించింది. "అరవింద్ నిన్ను దూరం చేయాలనుకుంది అతనికి పెళ్లై పోయిందనే కారణమే తప్ప వేరే దురుద్దేశ్యం ఏమి లేదు. అప్పుడు అరవింద్ ఉన్న స్థితిలో ఎవరు ఉన్న ఏమి చేయలేని స్థితి. అంత జరిగినా నీవేనకే తిరిగి ఆఖరి నిమిషంలో నీకు తెలిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. అందుకే అరవింద్ అలా ప్రవర్తించేవాడు" అని చెప్పింది. రెండు రోజుల తరువాత మౌనిక అరవింద్ ని కలిసింది. "నన్ను క్షమిస్తావా?" అనడిగాడు. "ఎందుకు?" అనడిగింది. అరవింద్ ఏమి మాట్లాడలేదు. "నేను అర్ధం చేసుకోగలను. జరిగినదంతా అంజలి నాకు చెప్పింది. ఆ పరిస్థితుల్లో నేనున్నా అదే చేస్తానేమో! "అది కూడా అవసరం లేదు. వుయ్ ఆర్ ఫ్రెండ్స్ " అంది. తేలికగా నవ్వేడు. "సరే, మీ వైఫ్ ని ఎప్పుడు పరిచయం చేస్తావు అఫీషియల్ గా " అనడిగింది నవ్వుతూ. నిరంజన్ మానసలు పెళ్లి చేసుకున్నారు. అందరు ఆ పెళ్ళికి హాజరు అయ్యారు. స్వాతిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నారు ఆమె చివరి క్షణం దాకా!! రాజీవ్ నవ్యాలు కూడా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అచ్యుత్ మంచి జాబు తెచ్చుకుని సెటిల్ అయిపోయాడు.
* * *
రెండు సంవత్సరాల తరువాత..... . .
నలుగురు స్నేహితులు కలిసారు. " ఆ రోజు చెప్పాను కదరా, మన కధకి మంచి ముగింపు ఉంటుందని" అన్నాడు అచ్యుత్. "అవునురా. ఇప్పుడు అందరం హ్యాపీగా సెటిల్ అయిపోయాము" అన్నాడు రాజీవ్ "మనందరికీ ఉపకారం చేసింది అంజలినేరా. ఆమెకు అందరం ఋణపడిపోయున్నాం" అన్నాడు అచ్యుత్. "అవునురా, ఒకసారి అంజలి ఇంటికెళ్దామా?" అని అడిగాడు నిరంజన్. "వెళ్దాం" అని అందరు అప్పటికప్పుడే బయలుదేరారు. అచ్యుత్ తన బండిపై, రాజీవ్ నవ్యాలు ఒక బండిపై, నిరంజన్ మానసలు ఒక బండిపై, అరవింద్ ప్రమోదలు కలిసి వారి బండిపై అంజలి ఇంటికెళ్ళారు. అంజలి తలుపు తీయగానే " సర్ప్రైజ్ " అన్నాడు అచ్యుత్. "ఏంటి సడెన్ గా అందరు కలిసి వచ్చారు" అంది నవ్వుతూ లోపలికి ఆహ్వానిస్తూ " కూర్చోండి , కూల్ డ్రింక్స్" అంది. "ఓకే" అన్నారు. ఆమె వేసిన పెయింటింగ్స్ చూస్తూ కూర్చున్నారు. మాటల మద్యలో "అన్నట్టు చెప్పడం మర్చిపోయాను అరవింద్. నేను వేసిన పెయింటింగ్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది." అంది అంజలి. "ఓ! కంగ్రాట్స్" అన్నాడు అరవింద్. "అసలు నీకు థాంక్స్ చెప్పుకుందామని వచ్చాము. మా అందరి జీవితాలలో నువ్వు చాలా కీలకపాత్ర పోషించావు. నీకు మేమందరం ఋణపడిపోయాము" అన్నాడు అచ్యుత్. "చాలు. ఋణాలు , గిణాలు అనకు. నాకు తోచింది నేను చేశానంతే " అంది అంజలి. కాసేపు కబుర్లు అయ్యాక "ఓకే. ఇక బయలుదేరుతాము" అన్నాడు రాజీవ్. "అప్పుడేనా, భోజనం చేసి వెళ్ళండి" ఆర్డర్ చేసింది అంజలి. అందరు అక్కడే భోజనాలు చేసారు. ప్రమోద, నవ్య, మానసలు వంటకి సాయం చేసారు. అందరు వెళ్ళిపోయాక, అంజలి తన పెయింటింగ్ రూములోకి వెళ్ళింది. కర్టెన్ వేసి ఉన్న ఒక పెయింటింగ్ ని ఓపెన్ చేసింది. ఆ పెయింటింగ్ కింద " ఐ మిస్ యు ...అ ర విం ద్ " అని వ్రాసి ఉంది. అది అరవింద్ చిత్రపటం.!!!!! ' మనసు పలికింది ఈ మాట ' తాను కూడా అరవింద్ ని ప్రేమించింది. కాని తాను బయట పడలేదు. "ప్రేమ మౌనంలో మాటలను పలికిస్తుంది"

***అయిపోయింది***