Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనసు పలికింది ఈ మాట BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#18
నిరంజన్ మానసతో మాట్లాడటానికి ఆమె ఇంటికెళ్ళాడు. ఇంట్లో అంతా సందడిగా ఉంది. లోపలికి వెళ్లి "మానస ఉందాండి?" అని అడిగాడు అక్కడున్న ఒక పెద్దమనిషిని.  "ఉంది బాబు" అన్నాడాయన.  "ఒకసారి మాట్లాడాలండి" అన్నాడు.  "ఈరోజు అవదు బాబు. వేరే ఎప్పుడైనా మాట్లాడు. ఈరోజు మానస పెళ్లి చూపులు కదా, " చెప్పాడాయన.నుంచున్న చోటనే భూమి బీటలు వారింది.అప్పుడే అందంగా అలంకరించుకుని నడుచుకుంటూ వస్తున్నా మానసను చూసి "మానసా..." అని పిలిచాడు గట్టిగా. తలెత్తి చూసింది. అందరు నిరంజన్ వైపు చూసి కూర్చున్న వాళ్ళల్లో కొంతమంది లేచి నుంచున్నారు. మానస తండ్రి దగ్గరకు గబగబా వెళ్లి "సార్, నా పేరు నిరంజన్. పిహెచ్.డి చేస్తున్నాను. నేను మీ అమ్మాయి ప్రేమించుకుంటున్నాము. పెళ్లి చేసుకోవాలనుకున్నాము." అని అన్నాడు.  "ఎవడ్రా నువ్వు?" అరిచాడు అక్కడున్నో వ్యక్తి.  "కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది వినండి సార్, మీ అమ్మాయి మీకు భయపడో, మీపై గౌరవంతోనో, ఈ పెళ్లి చూపులకు ఒప్పుకుని ఉండవచ్చు సార్. కాని ఇష్టంతో కాదు. ఆమె లేకుండా నేను బ్రతకలేను సార్. అంత పిచ్చి ప్రేమ ఉంది నాకు" అన్నాడు వివరణ ఇస్తూ.  "బయటకు పోరా ....." విసురుగా దగ్గరికి వస్తూ అరిచాడు ఆ వ్యక్తి.  "మీరెవరు?" అని అడిగాడు.  "నేనెవరైతే నీకెందుకు రా??" అంటూ ఇంకా ముందుకు అడుగువేసి కోపంతో నిరంజన్ గుండెలపై తన్నాడు.  వెన్నక్కి పడబోయి ఆపుకుని " మానస నా సొంతం. కాదని ఎవడైనా అడ్డు వస్తే ప్రాణాలు తీసేస్తాను" కసిగా అని మానసవైపు చూసి "ఏమి మాట్లాడవేం?" అని అడిగాడు.  "మానస ఇష్టప్రకారమే ఈ పెళ్లి చూపులు జరుగుతున్నాయి" చెప్పాడు మానస తండ్రి నెమ్మదిగా.వెన్నక్కి పడబోయి ఆపుకుని " మానస నా సొంతం. కాదని ఎవడైనా అడ్డు వస్తే ప్రాణాలు తీసేస్తాను" కసిగా అని మానసవైపు చూసి "ఏమి మాట్లాడవేం?" అని అడిగాడు.  "మానస ఇష్టప్రకారమే ఈ పెళ్లి చూపులు జరుగుతున్నాయి" చెప్పాడు మానస తండ్రి నెమ్మదిగా.  "లేదు సార్" అన్నాడు నిరంజన్  "మానస చెప్పమ్మా" అన్నాడు తండ్రి.  మానస నడుచుకుంటూ వచ్చి నిరంజన్ కేసి చూసి చెంప చెళ్ళుమనిపించింది. అదిరి పడ్డాడు నిరంజన్. కాసేపు గుండు సూది పడితే వినపడేంత నిశబ్ధం. చెంపపై చేయి ఉంచి మానసను చూస్తూ ఉండిపోయాడు. నిరంజన్ కాలర్ పట్టుకుని " ఎందుకు ఆ రోజు పొమ్మన్నావు? ఎందుకు ఆ రోజు ప్రేమలొద్దు అన్నావు? నన్ను అంతగా ప్రేమించి ఎందుకు నాపై అరిచావు. నువ్వు లేకుండా నేను బ్రతకలేనని తెలిసికూడా ఎందుకు నా చెయ్యి విడిచావు?" అంటూ ఏడ్చింది. గడ్డం కింద చేయి పెట్టి తల పైకి ఎత్తి కన్నీళ్ళు తుడిచి " సారిర, తప్పు చేసాను. నువ్వు లేకుండా బ్రతకలేను. నన్ను క్షమించవా ప్లీజ్ " అన్నాడు అనురాగంగా. అలానే కౌగలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.  "ప్లీజ్ సార్,మమ్మల్ని విడదీయకండి " అన్నాడు వేడుకోలుగా. ఆ పెద్దమనిషి " ఏంటిరా నువ్వు నా ఇంటికి వచ్చి ...." అంటూ మానసను వెనక్కి లాగి మళ్ళి గుండెలపై తన్నాడు. నిరంజన్ వెనక్కి పడిపోయాడు. వెంటనే లేచి నిలబడి " జంధ్యం వేసుకున్నాడు. జాతకాలు చెప్పుకుంటూ ఉంటాడు అనుకుంటున్నారేమో, నా మానసను నాకు కాకుండా చేయాలని చూస్తే మీ జాతకాలు మారిపోతాయి. మీ తలరాతలు తిరగబడిపోతాయి" అంటూ అరుచుకుంటూ ముందుకు అడుగేసి గట్టిగా రెండు చేతులతో ఆ పెద్దమనిషి కాలర్ పట్టుకుని ముందుకు గుంజి కళ్ళల్లో కళ్ళు పెట్టి కన్నెర్ర చేస్తూ చూసాడు. బెదిరిపోయాడా మనిషి. కాలర్ వదిలేసి గుమ్మందాకా నడిచి " మానసకోసం ఎంతకైనా తెగిస్తాను. నాకు మానసకు పెళ్లి జరిగి తీరితుంది. ఆపాలని చూస్తే ఆయుష్షు అంతమైపోతుంది. జాగ్రత్త " అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. పెళ్లి వారు కూడా వెళ్ళిపోయారు. మానస తల్లిదండ్రులు తలపట్టుకున్నారు. మానస తల్లైతే "పరువు తీసావు కదటే" అంటూ కొట్టింది. ఏది ఏమైనా నిరంజన్ తిరిగి వచ్చి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పడం మానసకు సంతోషానిచ్చింది.   నిరంజన్ అక్కడినుండి నేరుగా అంజలి ఇంటికి వెళ్ళాడు. బయట కూర్చుని ఉన్న స్వాతిని చూసి ఎదురుగా నుంచున్నాడు. అన్నయ్యను చూసేసరికి బాధ తన్నుకొచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్లి అన్నయ్యను పట్టుకుని ఏడ్చింది. "పద వెళ్దాం మనింటికి " అన్నాడు తల నిమురుతూ.  "నన్ను క్షమించు అన్నయ్య , నా వల్లే నాన్న చనిపోయారు" అంటూ ఏడ్చింది.  "జరిగిందేదో జరిగిపోయింది. నాన్నకు అలా జరిగేసరికి నీ పరిస్థితి అర్ధం చేసుకోకుండా ఇంట్లోంచి పొమ్మన్నాను. క్షమించు " అన్నాడు తడిసిన కళ్ళతో. అప్పుడే అంజలి వస్తూ" నీకోసమే ఎదురుచూస్తోంది నిరంజన్. నిన్ను చాలా మిస్ అయింది. పాపం అందరు ఉండి ఇలా పరాయింట్లో ఉండాల్సివచ్చింది." అంది.  "అదేం లేదులే నువ్వు పరాయిదానివి ఎలా అవుతావు. నువ్వు నాకు చెల్లెలులాంటిదానివే. కారణాలు ఏమైనా నా చెల్లెలుని జాగ్రత్తగా చూసుకున్నందుకు థాంక్స్ " అన్నాడు. స్వాతిని తనతోపాటు ఇంటికి తీసుకెళ్ళాడు.  "ఉదయం బాక్స్ మర్చిపోయి వెళ్ళిపోయావు " అంది ప్రమోద.  "మర్చిపోలేదు. కావాలనే వదిలేసాను."చొక్కా విప్పుతూ సమాధానం ఇచ్చాడు అరవింద్. ఆమె ఏమి మాట్లాడలేదు. "నువ్వు నా కోసం ఏమి వండాల్సిన అవసరం లేదు. నా పనులు నేను చేసుకుంటాను." చెప్పాడు తువ్వాలు భుజంపై వేసుకుని బాత్ రూంవైపు నడుస్తూ. స్నానం చేసి వచ్చి వంట గదిలోకి వెళ్లి అన్నం వండుకుందామని బియ్యం కదిగాడు.  "అన్నం రెడీగా ఉంది" అంది  "చెప్పానుగా, నా వంట నేను చేసుకుంటాను"  "ఈరోజుకి తినేసేయ్, రేపటినుండి నీ ఇష్టం "  వచ్చి కంచం పెట్టుకుని వడ్డించుకుని తిన్నాడు. భోజనం చాలా రుచిగా ఉంది. కడుపునిండా తిని "థాంక్స్" అన్నాడు. నిజానికి మానస అరవింద్ కోసం ఎదురు చూసింది కలిసి తిందామని, తాను తినేసి బయట గదిలో మంచం వాల్చుకుని పడుకున్నాడు. ఆమె ఏమి తినకుండా పడుకుంది. కనీసం"నువ్వు తిన్నావా?" అని కూడా అడగలేదు. చాలా బాధతో పడుకుంది.  ఉదయం లేచి స్నానం చేసి పాలు కాచుకుని టీ పెట్టుకుని తాగాడు. ప్రమోద కనిపించలేదు. ఇల్లంతా వెతికాడు. కనిపించలేదు. చాలా కంగారు పడ్డాడు. ఇంతలో ప్రమోద లోపలి రావడం చూసి కాస్త కుదుటపడ్డాడు.అరవింద్ ని చూసి విషయం అర్ధం చేసుకుని "గుడికెళ్ళాను" అని చెప్పి "ప్రసాదం" అని ఇవ్వబోయింది. అది అందుకోకుండా నేను యూనివర్సిటీకి వెళ్తున్నాను అని చెప్పిబయలుదేరిపోయాడు.  అరవింద్ సరిగా మాట్లాడకపోయేసరికి ప్రమోదకు నరకంలా తోచింది. తాను చేసిన తప్పేంటి అని నిలదీయాలనిపించింది. కాని ధైర్యం చాలాలేదు. చివరికి ప్రాణ స్నేహితుడికి భయపడాల్సి వస్తుందనుకోలేదు, ఇలాంటి విషయాన్ని రోడ్డుకీడ్చి తన తండ్రిని బాధ పెట్టడం అస్సలిష్టం లేదు. కాని సమస్యను ఎలా అయినా పరిష్కరించుకోవాలి. అరవింద్ తనతో కాపురం చేయకపోయినా పరవాలేదు. కనీసం ఎప్పటిలాగా మామూలు స్నేహితుడిలా ఉంటే చాలు అని అనుకుంది. ఆమె మనసు చాలా వ్యాకులతగా ఉంది.  యూనివర్సిటీ కి వెళ్ళకుండా కైలాసగిరికి వెళ్ళాడు. అక్కడే ఒంటరిగా మెట్లదారిలో కూర్చున్నాడు. ఆ దారిలో చాలా మంది ప్రేమికులు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. కొంతమంది ఒకరి ఒళ్లో ఒకరు పడుకుని ఎంజాయ్ చేస్తున్నారు. మరికొంతమంది చెట్టు చాటున ఎవరికీ కనపడని ఏకాంతంలో గడుపుతున్నారు. కొంతమందిని చూస్తే అరవింద్ కి జుగుప్స కలిగింది. అక్కడ ప్రశాంతత లేదు. "నిజమైన ప్రేమ చెట్టు చాటున ఉండదు" అక్కడి నుండి లేచి పైకి నడవడం ప్రారంభించాడు. పైకి ఎక్కేసరికి ఆయాసం అనిపించి అక్కడో షాప్ లో వాటర్ బాటిల్ తీసుకుని తాగాడు. ముందు నడుచుకుంటూ వెళ్లి అక్కడే ఉన్న పార్వతి పరమేశ్వరుల విగ్రహాలను చూస్తూ నుంచున్నాడు. ఇంతలో ఎవరో వచ్చి భుజం తట్టినట్టైంది. వెనక్కి తిరిగి చూసాడు.  అంజలి "హాయ్ అరవింద్" అంది.  "హాయ్ అంజలి" అన్నాడు  " నువ్వేంటి ఇక్కడ?" అనడిగింది.  "ఏమి లేదు మామూలుగా"  "మౌనిక రాలేదా నీతోపాటు?"  "రాలేదు"  "ఒక్కడివే వచ్చావా?"  "అవును"  "అదేంటి? ఏమైంది?"  "ఏమి అవలేదు అంజలి. అంతా మామూలే"  "ఆర్ యు ష్యూర్"  "ఆఫ్ కోర్స్"  "నాకలా అనిపించడం లేదు"  "మరెలా అనిపిస్తోంది"  "ఏదో బాధలో ఉన్నావనిపిస్తోంది"  "నీకు ఫేస్ రీడింగ్ తెలుసా?"  "తెలిదు. కాని నీ కళ్ళు చెపుతున్నాయి."  "ఓ! ఐ రీడింగ్ తెలుసా ?"  "కాదు. నిజం చెప్పు ఏమైంది?"  "చెప్పాను కదా. ఏమి అవలేదు అదే నిజం"  "సరే, సరే, రా! ఏమైనా తిందాం. నేను ఒక్కద్దాన్నే వచ్చాను"  "ఏం? ఒక్కద్దానివే రావడం దేనికి?"  "నాకు ఈ ప్లేస్ అంటే ఇష్టం. అందుకే వచ్చాను. సో ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేస్తాను"  ఇద్దరు తినడానికి ఆర్డర్ ఇచ్చి అక్కడే ఉన్న చైర్స్ లో కూర్చున్నారు ఎదురెదురుగా.  "ఈ దేవుళ్ళని మెచ్చుకోవాలి. ఎలా ఇద్దరు భార్యలతో జీవించారో!!" అన్నాడు  "దేవుళ్ళు కనుక ఏమి చేసినా చెల్లింది. కాని మనకలా కుదరదు. అయినా నీకిలాంటి డౌట్ ఎందుకొచ్చింది?"  "మామూలుగానే అడిగాను. ఆ శివుడిని చూసాక అడగాలనిపించింది."  "ఓ!! అలాగా, అంతే కదా"  "అది సరేగాని, నువ్వు ఎవరినైనా ప్రేమించావా?"  "నిజం చెప్పనా? అబద్దం చెప్పనా?"  "నీ ఇష్టం"  "మ్... అయితే ఈ రెండు వేళ్ళలో ఒకటి పట్టుకో " అంటూ వెళ్ళు చూపించింది.  చూపుడు వేలు ముట్టుకున్నాడు. "సారి, అబద్దం చెప్పాలి నీతో" అంది  "చెప్పు" అన్నాడు.  " తెలీదు" అంది  "మరి నిజం ఏమిటి?"  "మ్.. ప్రేమించానేమో!!?"  "అంటే?"  "నాకే క్లారిటీ లేదు"  "అదేంటి?"  "ఏమో?..."  "నువ్వు నన్ను కన్ఫ్యూస్ చేస్తున్నావు"  "లేదు. నాకే క్లారిటీ లేదు అంటున్నాను"  "ఇంతకీ ఎవరతను?"  "చెప్పను పర్సనల్"  "సరే, అతనికా విషయం తెలుసా?"  "అబ్బా! నాకే క్లారిటీ లేనపుడు అతనికేలా తెలుస్తుంది" అది నిజమే అన్నట్టుగా తల పరికించి, ఇద్దరు అక్కడి నుండి కదిలారు.
[+] 5 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మనసు పలికింది ఈ మాట BY పునర్కథన�... - by LUKYYRUS - 20-11-2018, 11:58 AM



Users browsing this thread: 2 Guest(s)