Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనసు పలికింది ఈ మాట BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#15
ఆ తరవాత రోజు అచ్యుత్ అరవింద్ ని పలకరిస్తూ " హాయ్ అరవింద్, యు నొ వాట్ రేపు చైతన్య పుట్టిన రోజు" అన్నాడు ఆనందంతో.  ", గుడ్, గుడ్. ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా?"  "అలాంటిదేమీ లేదుగాని, తనని ప్రేమిస్తున్నప్పటినుండి ప్రతి సంవత్సరం తన పుట్టిన రోజు తెల్లవారుజామునే తన ఇంటికెళ్ళి ఒక గులాబి మొక్క, గ్రీటింగ్ కార్డు, చాక్లెట్ పెట్టడం అలవాటు. ఈసారి కూడా అదే చేయబోతున్నాను" చెప్పాడు అచ్యుత్.  "ఇంటరెస్టింగ్" అన్నాడు అరవింద్ నవ్వుతూ.  "కాని రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళింటి దగ్గరకు వెళ్లి చూస్తాను. అక్కడ గులాబి మొక్క ఉండదు. తనా గ్రీటింగ్ తీసుకుంటుందో లేదో కూడా నాకు తెలీదు." అన్నాడు దిగులుగా.  "అంతేకదా.. ఈ విషయం తననే అడుగు" అన్నాడు అరవింద్  "ఎవరిని? చైతన్యనా? నీకెలా తెలుసు ఇవన్ని అంటే?"  "అబ్బా, అలా డైరెక్ట్ గా అడగమనలేదు. ఇన్ డైరెక్ట్ గా అడుగు "  "ఎలా?"  "ఆలోచించుకో. నేను చెప్పను "  "అదేంటి అరవింద్ , ప్లీజ్ చెప్పు" బ్రతిమాలినట్టుగా అడిగాడు అచ్యుత్.  "లేదు చెప్పను. బట్ నీకో ఇంటరెస్టింగ్ విషయం చెప్పనా! నేను మౌనిక ప్రేమించుకుంటున్నాం" అన్నాడు అరవింద్.  "అవునా? ఆశ్చర్యంతో ఇది ఎప్పటినుండి? నువ్వు మామూలు వాడివి కాదు అరవింద్ యు అర్ గ్రేట్ " అన్నాడు అచ్యుత్.  "నథింగ్ గ్రేట్ ఇన్ ఇట్. తను నాకు నచ్చింది ప్రోపోస్ చేసాను. ఒప్పుకుంది."  "ఎనీవే కంగ్రాట్స్. నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పు అరవింద్, నా లవ్ కూడా సక్సెస్ అవ్వాలని " అన్నాడు.  "ఆల్ ది బెస్ట్ " అన్నాడు అరవింద్ నవ్వుతూ.  ఆ రోజు తెల్లవారుజామునే లేచి చైతన్య ఇంటికెళ్ళి గుమ్మం దగ్గర గులాబీ మొక్క, గ్రీటింగ్ కార్డు, టెడ్డి బేర్, చాక్లెట్ అన్ని పెట్టేసి వచ్చాడు అచ్యుత్. ఏమి ఎరగనట్టు మాములుగా యూనివర్సిటీకి వెళ్ళాడు. ఆరోజు చైతన్య లేటుగా వచ్చింది. ఎందుకో డల్ గా ఉంది. తన దగ్గరకు నడుచుకుంటూ వస్తున్న చైతన్యని చూసిఅచ్యుత్ ఆనందంతో "హేయ్, ఏంటి కొత్త బట్టలా?" అడిగాడు ఏమి తెలియనట్టు.  "అవును. ఈ రోజు నా బర్త్ డే" చెప్పింది.  "అవునా? అంత నీరసంగా చెప్తావేంటి. విష్ యు మెనీ మెనీ మెనీ మెనీ మెనీ ఇన్ఫినిటీ మెనీ హాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే " అన్నాడు నవ్వుతూ విప్పారిన మొహంతో.  "థాంక్ యు " అంది ముభావంగా.  "ఏంటి అంత డల్ గా ఉన్నావ్? ఒంట్లో బాగోలేదా?" అని అడిగాడు ఆందోళనగా.  "అలాంటిదేమీ లేదు. ఐ యామ్ ఫైన్ " అంది  "మరి?"  "ఏమి లేదులే"  "నాకు చెప్పకూడదు అంటే వద్దులే"  "అదేమీ లేదు అచ్యుత్, ప్రతి సంవత్సరం నా పుట్టిన రోజుకి ఎవరో గులాబీ మొక్క, గ్రీటింగ్ కార్డు, చాక్లెట్ పెట్టి వెళ్తున్నారు. ఈసారి కూడా అలానే పెట్టి వెళ్ళారు. వాటితో పాటు ఈసారి టెడ్డి బేర్ కూడా ఉంది. నిశ్చితార్ధం అయిన నేను ఎందుకు ఈ విషయాన్ని తనతో చెప్పలేదని, ఎందుకు దీన్ని సీరియస్ గా తీసుకోలేదని మా బావ నన్ను తిట్టాడు. అప్పటికి నేను చెప్పాను ఆ మొక్కని ఆ గ్రీటింగ్ కార్డు ని నేను ఇగ్నోర్ చేస్తున్నాను అని. అయిన నాకు ముందు చెప్పి ఉండాల్సింది అని నాపై కోప్పడ్డాడు. నాకు నా బావ అంటే చాలా ఇష్టం అచ్యుత్. చిన్నప్పటి నుండి అన్ని తనే. అతను ఏమన్నా అంటే నేను తట్టుకోలేను. బహుసా ఆ వ్యక్తి ఎవరో నన్నుఇష్టపడుతున్నాడు అనుకుంట. నాకిలా పెళ్లి కుదిరిందని తెలిస్తే అతను ఈ పనులన్నీ మానుకుంటాడు కదా!! ఎందుకు చెప్పు అందని వాటికోసం ఆరాటపడటం. చూడు అచ్యుత్ , ప్లీజ్ నువ్వు నాకు మంచి ఫ్రెండ్ వి, అందుకే చెపుతున్నాను. నాపై అలాంటి ఆలోచనలు ఉంటే తుడిచేయ్. నీ స్నేహం పాడు చేసుకోవడం నాకిష్టం లేదు. నువ్వు ఆ మొక్కను పెట్టి వెళ్ళడం నేను చూసాను." చివరగా అచ్యుత్ కి చెప్పాల్సింది చెప్పేసింది.అచ్యుత్ గుండె పగిలిపోయింది. అతని కళ్ళల్లో నీళ్ళు చెంపలను తాకాయి. గొంతు డిక్కట్టేసింది. ముక్కు ఎర్రబడింది.  "నేనంటే నీకు ఇష్టం లేదా చైతన్యా?" అని అడిగాడు గద్గదమైన గొంతుతో.  "ప్లీజ్ అచ్యుత్ ఫ్రెండ్స్ గా ఉందాం" అంది. అంతే, అటువైపు తిరిగి పరిగెత్తాడు. రొమ్ములెగసేంత ఆయాసంతో రోడ్ పైకి వచ్చాడు. అలానే పరిగెత్తుకుంటూ రాజీవ్ దగ్గరకు వెళ్ళాడు. అరవింద్ కూడా అక్కడే ఉన్నాడు. పరిగెత్తుకొస్తున్న అచ్యుత్ ని చూసి కంగారుపడ్డారు ఇద్దరు. "ఏంటిరా ఏమైందిరా?" అని అడిగారు.  "ఐ లాస్ట్ మై లైఫ్ " అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు పిచ్చివాడిలా. "ఏమైందిరా ?" అని అడిగాడు అరవింద్ పక్కన కూర్చుంటూ. ఏడ్చి ఏడ్చి కందిపోయిన మొహంతో ఎర్రబడ్డ కళ్ళతో “చైతన్యకు నిజం తెలిసిపోయింది. రాత్రి నన్ను చూసేసింది. నా ప్రేమను ఒప్పుకోవడం లేదు” అంటూ జరిగిన విషయం చెప్పాడు.  "ఏంటిరా ఇది చిన్నపిల్లాడిలాగా?" అంటూ కళ్ళు తుడిచాడు అరవింద్. అచ్యుత్ లేచి నిలబడి రెండు చేతులతో కళ్ళు తుడుచుకుని " కొంతకాలం నన్ను వదిలేయండిరా..." అని వెళ్ళిపోబోయాడు. రాజీవ్ కంగారుగా "ఒరేయ్ ఆగు, ఎక్కడికెళ్తావ్?" అని ఆపాడు.  వెళ్తున్న వాడు ఆగి వెనక్కి తిరిగి " చచ్చిపోనులేరా! ప్రేమించాను అని చెప్పేంత ధైర్యం లేదు. ఇక చచ్చేంత ధైర్యం అసలే లేదు. మీరు కంగారు పడకండి" అని చెప్పి వెళ్ళిపోయాడు.అరవింద్ గుమ్మం దాక వచ్చి వెళ్ళిపోతున్న అచ్యుత్ ని చూసాడు. ఇంతలో అరవింద్ మొబైల్ రింగ్ అయింది. మౌనిక కాల్ చేసింది. "నీతో మాట్లాడాలి ఈవినింగ్ కలుద్దాం" అంది. సరే అని సాయంత్రం బీచ్ లో కలిసారు.  చాలా సేపు ఏమి మాట్లాడుకోలేదు. "ఏంటి ఈ మౌనం?" అనడిగాడు.  అరవింద్ వైపు తిరిగి " మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. " అంది.  "ఏంటి సడన్ గా ?"  "ఎవడో ఎమ్.పి కొడుకు నన్ను చూసాడట. వాడికిచ్చి చేసేద్దామని చూస్తున్నారు" అంది. ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.  "ఏంటి మాట్లాడవు?" అని అడిగింది భుజం నెట్టుతూ.  "ఆలోచిస్తున్నాను, వచ్చేవారం మా ఊరు వెళ్తున్నాను. మా ఫ్రెండ్ ప్రమోద పెళ్లి. అప్పుడు అమ్మతో మన గురించి మాట్లాడుతాను. అమ్మ తప్పకుండా ఒప్పుకుంటుంది. నిన్ను చూస్తే అస్సలు వదులుకోదు. ప్రమోద పెళ్లి అవగానే మనం రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుందాం. నాకు అమ్మ సంతకం పెడుతుంది. అంజలి, అచ్యుత్, రాజీవ్ వీళ్ళు కూడా సాక్షి సంతకాలు చేస్తారు. నువ్వేం దిగులు పడకు" అంటూ మౌనిక చేయిని పట్టుకున్నాడు ధైర్యం చెపుతున్నట్టుగా.  మౌనిక అరవింద్ భుజంపై వాలి " నాకు ఎందుకో భయంగా ఉంది. నిన్ను మిస్ అవుతానేమో అని " అంది.  "అలాంటిది ఏమి జరగదు. నన్ను నమ్ము సరేనా" అన్నాడు. కాని తాను ఒకటి తలిచాడు విధాత మరొకటి రచించాడు...వారం తర్వాత ఊరు వెళ్ళాడు అరవింద్. ఇంటికి వెళ్లి బాగ్ పెట్టేసి డైరెక్ట్ గా ప్రమోద దగ్గరకు వెళ్ళాడు. ఆమె చేతికి గోరింటాకు పెట్టుకుని ఉంది.  "ఓయ్! ఎలా ఉన్నావ్?" అని అడిగాడు. అరవింద్ ని చూసి చూడనట్టు ప్రవర్తించింది. "ఓయ్! ఏంటి కోపమే?" అని అడిగాడు.  "నాతో మాట్లాడకు, పంది. ఇంతకాలం తర్వాత గుర్తుకు వచ్చానా?" అంది  "నిన్ను మర్చిపోయాను అని ఎలా అనుకుంటున్నావ్?"  "ఈ మాటలకేం తక్కువ లేదు. ఒక్కసారైనా ఫోన్ చేశావా?, మీ అమ్మకు చేసేవాడివికాని"  "అవును. అప్పుడు నీ గురించి అడిగేవాడిని. అప్పుడు నువ్వు అందుబాటులో లేకపోతే అది నాదా తప్పు"  "పోరా!!!"  "ఎందుకంత కోపం? పెళ్లి అయిపోతోంది. ఆ తర్వాత కలుస్తామో కలవమో"  "ఏం, కలవమని అనుకుంటున్నావా?"  "చెప్పలేము కదా, అత్తారింటికి వెళ్ళాక నువ్వెంత గుర్తు పెట్టుకుంటావో??"  "నేను నీలా కాదురా "  "సరే ఇంతకి పెళ్ళికొడుకు ఏమి చేస్తాడు?"  "సాఫ్ట్ వేర్ "  "అబ్బో! టీచర్ కి సాఫ్ట్ వేర్, బాగుంది"  "సర్లే గాని , నీ సంగతులేంటి? "  "నాదో పెద్ద కధ. ఇప్పుడు కాదుగాని తర్వాత తీరికగా చెప్పుకుందాం"  "సరే, అమ్మని కలిసావా?"  "అదేం ప్రశ్న, ఇంటికెళ్ళాకనే ఇక్కడికి వచ్చాను. పెళ్లి ఎప్పుడు 18 న కదా, అంటే 18వ తారీఖు ఉదయం 4:32 నిమిషాలకు నీ ఇంటి పేరు మారిపోబోతోందన్నమాట!" నవ్వేడు.  పెళ్లి రోజు రానే వచ్చింది. ప్రమోద తండ్రి ఉన్నంతలో అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాడు. అరవింద్ ఆ రోజంతా ప్రమోద దగ్గరే ఉన్నాడు.ప్రమోదతో క్లోజ్ గా మూవ్ అవడం చుసిన పెళ్ళికొడుకు ప్రమోదని "ఎవరతను?" అని అడిగాడు.  "ఫ్రెండ్" అని చెప్పింది.  "ఫ్రెండ్ అంటే ??" ఆరా తీస్తున్నట్టుగా అడిగాడు. సూటిగా అతనివైపు చూసింది.  "ఏమైనా అడగాలని ఉంటే డైరెక్ట్ గా అడుగు" అంది కోపాని నిగ్రహించుకుంటూ.  "రిలేషన్ ఏంటి?" అని అడుగుతున్నాను అన్నాడు.  "అనుమానిస్తున్నావా?" అంది.  "లేదు , జస్ట్ కన్ఫర్మేషన్ కోసం. అంతే " అన్నాడు.  ఇంతలో అరవింద్ అటుగా వచ్చి " ఇదిగో, అంటూ చీర చేతిలో పెడుతూ అమ్మ ఇచ్చింది. పెళ్ళికి కట్టుకో. బాగుంటావు" అని పెళ్ళికొడుకు వైపు తిరిగి "హాయ్ సర్, నా పేరు అరవింద్. ప్రమోద ఫ్రెండ్ ని. తను చాలా మంచిదండి. అమాయకురాలు. జాగ్రత్తగా చూసుకోండి" అని చెప్పాడు చనువుగా.  "కెన్ ఐ ఆస్క్ యు ఎ క్వశ్చన్?" అన్నాడు ఆ పెళ్ళికొడుకు.  "అడగండి సర్ " అన్నాడు అరవింద్ నవ్వుతూ.  "నీకు ప్రమోదకు సంబంధం ఏంటి? నాముందు కూడా ఈ క్లోజ్ నెస్ ఏంటి? నేను ముక్కు సూటి మనిషిని. ఇంతకు ముందు రెండు మూడుసార్లు చూసాను. నువ్వు తనను ముట్టుకుంటున్నావ్. మీద చేతులు వేస్తున్నావ్. ఎందుకలాగా? దీనిని ఏమంటారు ?" అని ప్రశ్నించాడు.  "అయ్యో, మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారు" అన్నాడు .  "నాకు సమాధానం కావాలి. సముదాయించడం కాదు" చెప్పాడా పెళ్ళికొడుకు.  "మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు. ఒకవేళ నేనే మీ సమస్య అయితే నేను ఇక్కడినుండి వెళ్ళిపోతాను " అన్నాడు అరవింద్.  "థెన్ లీవ్ , పో " అన్నాడు ఆ పెళ్ళికొడుకు. ప్రమోద వైపు చూసి తలదించుకుని వెళ్ళిపోయాడు. ప్రమోద చాలా బాధ పడింది. ఏడ్చింది. కాని తండ్రి మాటను కాదనడం తనకిష్టం లేదు. కూతురు పెళ్లి చేస్తున్నాడనే ఆనందంలో ఉన్నాడాయన. ఇలాంటి వాటిని సమాజం స్నేహం అంటే నమ్మదు. అలాంటి సమాజంలోని వాడే ఆ పెళ్ళికొడుకు. స్నేహానికి కామానికి ఒకే అర్ధం తీసే సాధారణ మగాడు. అమ్మాయి అబ్బాయిల స్నేహాన్ని ఎవరు సరిగ్గా అర్ధం చేసుకోలేరు. అది తరతరాలుగా వస్తున్నా సమాజ నీతి. ఎదురు మాట్లాడలేకపోయింది. తనకే కనక అవకాశం ఉంటే ఆ పెళ్ళికొడుకుని చెప్పుతో కొట్టి కోపం చల్లార్చుకోవాలనేంత ఆవేశం తనలో ఉంది. కాని దిగమింగుకుంది....తెల్లారింది. పెళ్లి జరుగుతోంది. ఎక్కడో దూరంగా నిలబడి చూస్తున్నాడు అరవింద్. ముహూర్తానికి ఇంకా పావుగంట ఉందనగా పెళ్లి కొడుకు తండ్రి కట్నం గొడవ లేవనెత్తాడు. తానూ అంతా ఇచ్చేసానని చెప్పుకొచ్చాడు ప్రమోద తండ్రి. ఇంతలో అరవింద్ తల్లి కలగజేసుకుని "మీరిలా చేయడం ఏమి బాగోలేదండి" అంది పెళ్ళికొడుకు తండ్రితో. "నువ్వెవరమ్మా ఈ విషయం చెప్పడానికి? నీకు వీళ్ళకు సంబంధం ఏంటి?" అని అడిగాడు ఆ పెద్దమనిషి.  అరవింద్ తల్లి సూటిగా "అయితే ఇప్పుడు కట్నం ఇవ్వకపోతే పెళ్లి జరగదంటావ్.. అంతేనా?"  "అవును " అన్నాడు.  చాచి పెట్టి ఆ పెద్దాయన చెంప చెళ్ళుమనిపించింది. పెద్ద పెద్ద అంగాలు వేస్తూ పెళ్లి కొడుకు మెడలో ఉన్న తుండు పట్టుకుని పీటలమీంచి బయటకు లాగి, "పొండిరా అయితే" అంది. అమాయకుడయిన ప్రమోద తండ్రి అంతా చూసి కంగారు పడుతూ "ఏమిటమ్మ నువ్వు చేస్తున్నది" అని అడిగాడు.  "ఎందుకన్నయ్యా ఇలాంటివాడి కోసం ఊగిసలాడతావు. ఇందాక నేను చూసాను. వీడికి అనుమానం. ప్రమోదకు అరవింద్ కు ఏంటి సంబంధం అని అడిగాడు. ఇదిగో వీడికి డబ్బు పిచ్చి. ఇలాంటి మూర్ఖులు వెధవలు ఉన్న చోట మన పిల్ల ఎలా సుఖంగా ఉంటుందన్నయ్య. నువ్వేం కంగారు పడకు. నీ కూతురు పెళ్లి ఇక్కడే ఇప్పుడే ఈ ముహుర్తానికే జరుగుతుంది నా కొడుకుతో…." మాట ఇచ్చేసింది. రామ బాణం విడిచిపెట్టేసింది. అరవింద్ ఒక్కసారిగా అదిరిపడ్డాడు.  "అమ్మా! నువ్వేం చేస్తున్నావో నీకు అర్ధం అవుతోందా?" అని అడిగాడు కంగారుపడుతూ.  "నువ్వేం మాట్లాడకు. నా మాట కాదంటే నా మీద ఒట్టే " అంది  "అమ్మ, అది కాదు అమ్మ నేను చెప్పేది విను " అన్నాడు. తల్లి కోపంతో చూసి " వెళ్లి తాళి కట్టు" అంది ఆజ్ఞాపిస్తున్నట్టుగా. " అమ్మ, ప్లీజ్" అన్నాడు బ్రతిమాలుతూ..  "వెళ్ళమన్నానా.... ఇది ప్రమోద జీవిత సమస్య ..." అంది ఆ పెళ్లి మండపం హోరెత్తేలాగా. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. పెళ్లి పీటలపై కన్నీళ్ళతో కూర్చుని ఉన్న ప్రమోదవైపు చూస్తూ మౌనంగా పెళ్లి పీటలెక్కాడు. "పంతులుగారు మీరు మంత్రాలు చదవండి" అని గర్వంతో ఆజ్ఞాపించింది అరవింద్ తల్లి.  'మాంగల్యం తంతు......" మంత్రం చదవడం ప్రారంభించారు పంతులుగారు. భజంత్రీలు శబ్దాలు ఆ మంత్రాలతో పాటు శ్రుతి కలిపాయి. ....మాంగల్యధారణ సుముహుర్తోమస్తు" తాళి కట్టాడు అరవింద్.  ప్రమోద అరవింద్ భార్య అయింది. కానీ అరవింద్ ప్రమోదకు........????  ఊళ్ళో కొందరు అరవింద్ తల్లి చేసిన పనికి హర్షించారు. కొందరు తిట్టుకున్నారు. అది వారి వారి మనస్తత్వాలను బట్టి ఏర్పడిన అబిప్రాయం. ఏది ఏమైనా ప్రమోద తండ్రి మాత్రం చాలా సంతోషించాడు. ప్రమోద అరవింద్ తల్లిని పట్టుకుని ఏడ్చింది. కాలం ఎప్పుడు ఏది నిర్ణయిస్తుందో ఎవరికీ తెలియదు. నిర్ణయం తీసుకున్నాక అది మారేది లేదు. మార్చేది లేదు. అదే దైవ నిర్ణయం....అనుకున్నట్టుగా అరవింద్ ప్రమోదల శోభనం ఏర్పాట్లు మొదలెట్టింది అరవింద్ తల్లి.  "అమ్మ! ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమి పెట్టకు" చాలా ఇబ్బంది పడుతూ చెప్పాడు అరవింద్.  "ఏరా, ప్రమోద అంటే నీకిష్టమే కదా" అంది నవ్వుతు.  "ఆ ఇష్టం వేరు. ఈ ఇష్టం వేరు. నాకిష్టం లేదు ఇప్పుడు" అన్నాడు మాటలు కూడగట్టుకుని.  "ఏమి ఇష్టం లేదు?" కొంచెం గొంతు పెంచుతూ అడిగింది.  "శోభనం" టూకీగా చెప్పాడు.  "నోర్ముసుకో !!!" అని అక్కడినుండి వెళ్ళిపోయింది. తల్లి మూర్ఖత్వానికి కోపం తన్నుకొచ్చింది. కాని ఏమి అనలేకపోయాడు. చిన్నప్పటినుండి అన్ని తానై అంతా తానై పెంచింది.  అరవింద్ మంచం దగ్గర నుంచున్నాడు. శోభనం గది చాలా అందంగా అలంకరించబడి ఉంది. ప్రమోద గదిలోపలికి వచ్చి తలుపు గడియ వేసింది. నిజానికి ప్రమోదకు అరవింద్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే. చిన్నప్పటినుండి ఉన్న స్నేహం "ఏరా" అని పిలిచేంత చనువు. లైఫ్ ఇంత హ్యాపీగా మారుతుందని అనుకోలేదు. కాని మౌనిక గురించి తెలిస్తే ఇంత ట్రాజెడీ ఉంటుందని ఆమె ఉహించలేదు. పాల గ్లాస్ అరవింద్ కి ఇవ్వబోయింది. అరవింద్ అస్సలు కంఫోర్టబుల్ గా లేడు. అసలు అలాంటి సన్నివేశాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. చాలా ఇబ్బందిగా తోచింది. గ్లాస్ అందుకోకుండా నెమ్మదిగా కిటికీవైపు నడిచాడు. ప్రమోద కూడా మాట్లాడకుండా అరవింద్ వైపు చూస్తూ నుంచుంది.  "నీకు ఈ పెళ్లి ఇష్టమేనా?" అని అడిగాడు చాలాసేపు తర్వాత మౌనాన్ని విరమిస్తూ.  "నీకు ఇష్టం లేదా?" ఎదురు ప్రశ్న అడిగింది.  "నా ప్రశ్నకు నీ ప్రశ్న సమాధానం కాదు" అన్నాడు.  "ఇష్టమే...." అంది. ప్రమోద వైపు తిరిగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ "కాని నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను నిన్ను ఎప్పుడు అలా చూడలేదు " అన్నాడు.ప్రమోద వైపు తిరిగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ "కాని నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను నిన్ను ఎప్పుడు అలా చూడలేదు " అన్నాడు.  నిజమే తను కూడా అరవింద్ ని ఎప్పుడు అలా చూడలేదు. పరిస్థితులు అతన్ని తన భర్తని చేసాయి. ఇప్పుడు తన మనసులో అరవింద్ భర్త స్థానంలో ఉన్నాడు. కాని అతను స్నేహితుడు. ఆడుకుంటున్నప్పుడు, పోట్లాడుకుంటున్నప్పుడు, అన్నం తింటున్నప్పుడు , అనారోగ్యం చేసినపుడు, ఆనందిన్చినపుడు, దుఖిన్చినపుడు, ఇలా అన్ని విషయాలలో తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఇలా జీవిత భాగస్వామి అయ్యాడు. భర్త హోదాలో నిలబడి ఉన్న స్నేహితుడు.  పాల గ్లాస్ బల్లపై పెట్టి "ఇప్పుడేం చేద్దాం?" అని అడిగింది.  వెంటనే సమాధానం ఇవ్వకుండా తన దిండు తీసుకుని సోఫా దగ్గరకి నడిచాడు. సోఫాలో పక్క సద్దుతూ "నువ్వు నా భార్యవి కావు. నేనలా అనుకోవడం లేదు" అన్నాడు. ఆమె కన్నీరు చెంప మీంచి జారి కాలి మెట్టెలపై పడింది. ఆమె ఆనందం నీరుగారిపోయింది. సంతోషం పటాపంచలైపోయింది. అరవింద్ తో సంబంధం ఏమిటో నిజంగా తెలియని పరిస్థితి ఏర్పడింది.  ఆ సోఫాలో పడుకుని కళ్ళుమూసుకుని నువ్వే ఆ రోజు అన్నావుగా "దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా నా స్థానం నాదే అని. నేను నీ స్నేహితుడు అని.." గుర్తుచేసాడు. ప్రమోద బదులివ్వలేదు. అటు తిరిగి పడుకుంటూ "నాకీ పెళ్లి ఇష్టం లేదని అమ్మకు తెలియనివ్వకు " చివరి మాటగా చెప్పి నిద్రకు ఉపక్రమించాడు. ప్రమోదకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. 
* * *
[+] 5 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మనసు పలికింది ఈ మాట BY పునర్కథన�... - by LUKYYRUS - 20-11-2018, 11:56 AM



Users browsing this thread: 1 Guest(s)