Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనసు పలికింది ఈ మాట BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#13
కార్యక్రమాలన్నీ జరిపించాడు. విషయం తెలుసుకుని నిరంజన్ దగ్గరకు మానస వచ్చింది. పక్కన కూర్చుని నిరంజన్ భుజంపై చేయి వేసింది. ఒక్కాసారిగా ఉలిక్కిపడి లేచి "పో! ఇక్కడి నుండి" అరిచాడు పెంకులెగిరిపోయేలా. నిర్ఘాంతపోయింది మానస. "పో! నువ్వూ వద్దు నీ ప్రేమా వద్దు. అసలీ ప్రేమలే వద్దు. స్వాతి ప్రేమ వల్ల నా తండ్రి ప్రాణం పోయింది. నా ప్రేమ వల్ల నా తల్లికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. నాకు ఎవ్వరూ వద్దు, ఏమీవద్దు." అన్నాడు. "ఏమి మాట్లాడుతున్నావో అర్ధం అవుతోందా? పాపం మానస ఏమి చేసిందిరా?" అని అడిగాడు అచ్యుత్. "తనేం చేయలేదు, కాని తన వల్ల నా తల్లికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. నా ప్రేమ నా తండ్రితోనే సమాధి అయిపోయింది." అన్నాడు నిరంజన్. అచ్యుత్ మళ్ళీ ఏదో చెప్పబోయాడు, చూపుడు వేలు చూపిస్తూ "మరో మాట మాట్లాడకుండా దాన్ని ఇక్కడినుండి పొమ్మను" అన్నాడు నిరంజన్. నిరంజన్ అలా అనేసరికి మానస క్రుంగిపోయింది. కళ్ళు జలదారలైయ్యాయి. గుండె బరువెక్కిపోయింది. నిల్చున్న చోట నిప్పులున్నాయా? .. ప్రేమ ఉన్న చోట ప్రాణం లేదు. ప్రాణం ఉన్న చోట ప్రేమ లేదు. తన ప్రాణం పోయినంత బాధతో ఏడ్చుకుంటూ బయటకు పరిగెత్తింది. అరవింద్ మానసను చూసుకుంటూ లోపలికి ప్రవేశించాడు. జరిగిన విషయం అంతా అచ్యుత్ అరవింద్ కి చెప్పాడు. అది తగిన సమయం కాదని అరవింద్ ఏమి మాట్లాడకుండా ఊరుకున్నాడు. రెండు రోజుల తర్వాత స్వాతి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. తల్లి ఇంకా హాస్పిటల్లోనే ఉంది. "నాన్నా!... నాన్నా!..." అంటూ ఇంట్లోకి వెళ్తున్న స్వాతిని విసురుగా నడుచుకుంటూ వచ్చి గుమ్మానికి అడ్డంగా నిలబడ్డాడు నిరంజన్. "ఇంకెక్కడి నాన్న? నాన్న బ్రతికుండగానే నువ్వు రాసిన డెత్ సర్టిఫికేట్ తీసుకుని అందరిని వదిలేసి వెళ్ళిపోయారు, దరిద్రం....! " అనరాని మాట అన్నాడు. నీ వల్ల అమ్మ పరిస్థితి కూడా రేపో మాపో అన్నట్టుగా ఉంది. పోవే... పో.. వద్దనుకుని పోయావుగా! ఇంకెన్ని ప్రాణాలు తీస్తావు? ఇంకెన్ని గుండెలు బద్దలు కొడతావు? ఛి! ఛి! నువ్వు నా చెల్లివి అని చెప్పుకోవడానికే సిగ్గేస్తోంది. ఇంకా నిలబడ్డావేంటి? పో!!!! " అని అరుస్తూ మెడ పట్టుకుని వీధిలోకి నెట్టేసాడు. అప్పుడే హాస్పిటల్ నుండి వచ్చిన అరవింద్ కింద పడిన స్వాతిని లేపుతూ "ఒరేయ్! నువ్వేం చేస్తున్నావో తెలుస్తోందా? స్వాతి నీ ....." అని చెప్పబోతుంటే, "ఇది నా కుంటుంబ సమస్య. నీకనవసరం" అని తెగేసి చెప్పాడు నిరంజన్. మరో మాట లేదు అరవింద్ కి. ఆ మాట కొరడా దెబ్బలా తగిలింది. నిరంజన్ తలుపులు మూసేసాడు.  స్వాతిని తీసుకుని అక్కడినుండి తన రూం కి వెళ్ళాడు. రాజీవ్ ని అచ్యుత్ ని తన రూం కి రమ్మని పిలిచాడు. అందరు తన ఇంటికి రావడం మేఘన గమనించింది. స్వాతికి మంచి నీళ్ళు ఇచ్చాడు అరవింద్. అచ్యుత్ రాజీవ్ లు మౌనంగా నిలబడ్డారు. తలొంచుకుని కూర్చున్న స్వాతిని "ఎందుకిలా చేసావు స్వాతి? ఒకమాటైన నిరంజన్ కి చెప్పాల్సింది. వాడు నిన్ను అర్ధం చేసుకునే వాడు కదా! ఇంతకి అశోక్ ఏడి? " అని ప్రశ్నించాడు అరవింద్. "అన్నయ్యను అర్ధం చేసుకోకుండా నేనే తొందరపడ్డాను" అంటూ ఏడ్చింది. అశోక్ ఏడి?" మళ్ళీ ప్రశ్నించాడు అరవింద్. "మా పెళ్లి అవలేదు" అంది. ఆకాశం బద్ధలైనంతగా అదిరిపడ్డాడు. రాజీవ్ అచ్యుత్ లు స్థాణువులయ్యారు. అందరి ఊపిరి బిగిసింది. "ఏం మాట్లాడుతున్నావ్ స్వాతి?" అని అడిగాడు అరవింద్. "మా పెళ్లి అవలేదు" అంది. ఆకాశం బద్ధలైనంతగా అదిరిపడ్డాడు. రాజీవ్ అచ్యుత్ లు స్థాణువులయ్యారు. అందరి ఊపిరి బిగిసింది. "ఏం మాట్లాడుతున్నావ్ స్వాతి?" అని అడిగాడు అరవింద్.... "అవును అరవింద్ అన్నయ్యా, తాను కూడా ఏవో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని నాలానే చెప్పకుండా బయటకు వచ్చేసాడు. కాని మా పెళ్లి జరిగే సమయంలో వాళ్ల బంధువులంతా వచ్చి అశోక్ ని కొట్టి సిగ్గులేని పని చేస్తున్నావ్ అంటూ లాక్కెళ్లిపోయారు. నన్ను ఒంటరిగా వదిలేసారు. దిక్కు తోచని స్థితిలో ఎటు వెళ్ళాలో తెలియక, తిరిగి ఇంటికి వచ్చేస్తుంటే అందరూ చీదరించుకుంటూ చూడటం, తండ్రిని పొట్టన పెట్టుకుంది అంటుంటే చాలా భయం వేసింది. నాన్నకేమైనదో అని పరిగెత్తుకుంటూ వచ్చాను. నాన్న చనిపోయారని అన్నయ్య చెప్తేగాని నాకు తెలీదు. నాన్న ఆఖరి చూపుకు కూడా నోచుకోలేకపోయాను. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదన్నయ్యా. ఇప్పుడు నాకు ఎవరు దిక్కు?" అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.  జరిగిన పరిణామాలు విని అరవింద్ తనని అక్కడే ఉండమని చెపుదామనుకున్నాడు. స్వాతి చాలా బాధలో ఉంది. అటు పెళ్లి జరగక, ఇటు తండ్రిని కోల్పోయి, మరోపక్క కుటుంబానికి దూరమయి, అందరూ ఉండి ఎవరికీ ఏమి కాని ఏకాకిలా మిగిలిపోయిన స్వాతిని చూస్తే జాలేసింది. తనకు ఇప్పుడు ఓదార్పు కావాలి. ఓ అన్నగా ధైర్యం చెప్పి, అండగా ఉండాలనుకుని అరవింద్ " ఇప్పుడు నిరంజన్ చాలా కోపంతో ఉన్నాడు. ఎవరేమి చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు. అంతా సద్దుకున్నాక నేనే వెళ్లి వాడితో మాట్లాడుతాను. కచ్చితంగా వాడు ఒప్పుకుంటాడు. అంతవరకు నువ్వు ఇక్కడే......" మాట్లాడుతుండగా అక్కడే ఉండి అంతా వింటున్న మేఘన " అరవింద్...." అంటూ పిలిచింది. అందరు బయటకు చూసారు.  "ఒకసారి..." అంది. అచ్యుత్ వెళ్లి స్వాతి పక్కన కూర్చున్నాడు. అరవింద్ బయటకు వచ్చాడు. రాజీవ్ కూడా అరవింద్ తో పాటు బయటకు వచ్చి అరవింద్ వెనకాల నుంచున్నాడు.  "మీ మాటలైపోతే తొందరగా స్వాతిని వెళ్లిపొమ్మను" అంది మేఘన.  చేతులు కట్టుకుని చూస్తున్న రాజీవ్ అవి విప్పుతూ కోపంతో మేఘనవైపు చూసాడు.  " ఏం? ఎందుకు మేఘన? తను ఇప్పుడు చాలా కష్టంలో ఉంది. అర్ధం చేసుకో మేఘన, ప్లీజ్.. ఇప్పుడు మనం తప్ప తనకెవరున్నారు చెప్పు ? అన్నాడు బ్రతిమాలుతూ.  "వాళ్ళ నాన్న పోయి రెండు రోజులైంది. మైలు మనుషులు ఇంట్లో పెట్టుకుంటే ఇంటికి మంచిది కాదు" అంది.  రాజీవ్ పట్టరాని కోపంతో " చదువుకున్నదానివేనా నువ్వు? అందరు కాదని గెంటేస్తే మంచి మనసుతో వాడు ఆదుకుంటాను అంటే అడ్డుకుంటున్నావు?" అన్నాడు.  "అవన్నీ అనవసరం. ఆదుకోవడానికి ఇదేమి అరవింద్ ఇల్లు కాదు. నీ ఇల్లు అంతకన్నా కాదు. నా ఇల్లు. ఇంక మాటలు అనవసరం తొందరగా వెళ్తే పసుపు నీళ్ళు జల్లుకుంటాను" అంది.  "ఛి! నువ్వసలు మనిషివేనా?" అన్నాడు రాజీవ్ అసహ్యించుకుంటూ.  "నీకంత జాలిగా ఉంటే వెళ్లి నీ ఇంట్లో పెట్టుకో" అంది.  "తనకు నేను షెల్టర్ ఇస్తాను. అది మా ఇంట్లోనా వేరే ఇంట్లోనా అనేది వేరే విషయం. అసలు ఇలాంటి ఆలోచనలతో ఈ ఇల్లే మైలు పడిపోయింది. పసుపునీళ్లు కాదు కదా అగ్గిపుల్ల వేసి తగలేట్టేసినా ఆ మైలు పోదు. నువ్వు నాతోరా స్వాతి నీకు మేము ఉన్నాము." అని స్వాతిని తీసుకెళ్ళిపోయారు. అరవింద్ కి కూడా మేఘనపై అసహ్యం వేసింది.  వైజాగ్ ఆర్.కె బీచ్ లో కూర్చున్నారు ముగ్గురు. స్వాతి కొంచెం దూరంలో కూర్చుని సముద్రాన్ని చూస్తోంది. అందరి మెదడులు మొద్దుబారిపోయాయి. అచ్యుత్ ఆ నిశబ్దాన్ని చేదిస్తూ " మేఘన మనస్తత్వం మనకు తెలుసు. అలాగే మన ఇళ్ళల్లో కూడా ఆలోచిస్తార్రా. సెంటిమెంట్లు, మూడనమ్మకాలు, దోషాలు అన్నీ ఒకేసారి కనిపిస్తాయిరా ఎదుటివాడి కష్టం, బాధ కన్నా!" అని అన్నాడు స్వాతివైపు చూస్తూనే.  "ఏమంటున్నావురా?" అని అడిగాడు రాజీవ్.  "మేఘన అన్నట్లుగానే మన ఇంట్లో కూడా అనరని నమ్మకం ఏంటిరా?" అని అడిగాడు అచ్యుత్. మౌనం వహించాడు రాజీవ్. ]తనకి తెలుసు మనిషి ఎంత ఆధునిక యుగంలోకి వెళ్ళిన తానూ నమ్ముకున్న కొన్ని విషయాలను చచ్చేవరకు పట్టించుకుంటాడు. చచ్చినా పట్టించుకుంటాడు. అది ఒక ప్రోటోకాల్ లాగ ప్రతి మనిషి జీవితాలలో ఫాలో అవుతూ వస్తున్న పధ్ధతి. దానికి అడ్డుకట్ట వేయాలంటే మరో సంఘసంస్కర్త ఆజన్మాంతం పోరాడితేనే సాధ్యం అవుతుంది. అది కూడా పూర్తిగా సమసిపోతుంది అని చెప్పలేము. కందుకూరివారు బాల్య వివాహాలను అరికట్టారు అని పుస్తకాలలో చదువుకుంటాము. కానీ 'పూర్తిగా' అరికట్టారు అని కాదు. ఇప్పటికి ఏదో ఒకమూల బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. పరిష్కారం తోచలేదు ముగ్గురికి. " చీకటి పడుతోందిరా " అన్నాడు రాజీవ్. ఇంతలో ఓ చిన్న కుర్రాడు అటుగా వచ్చి "అన్నా! ఒక రూపాయి ఉంటే ఇవ్వన్నా. ఆకలేస్తోందన్నా. పొద్దున్నించి ఏం తినలేదన్నా" అంటూ బిక్షం ఎత్తుకుంటున్నాడు. ఆ కుర్రాడు వైపు చూసాడు అరవింద్. చిరిగిపోయిన చొక్కా, మాసిపోయిన జుట్టు, అరిగిపోయిన చెప్పులతో చాలా దీన స్థితిలో ఉన్నాడు. అరవింద్ తన దగ్గరున్న డబ్బులు తీసి అతనికి ఇచ్చాడు. ఆ కుర్రాడు దండం పెట్టి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన మరుక్షణంలో అరవింద్ కి మెరుపులాంటి ఆలోచన మెదిలింది., వెంటనే "అంజలి" అన్నాడు. ఆ కుర్రాడిని చూసాక ఎప్పుడో నిరంజన్ వీధిబాలల బొమ్మగురించి, అంజలి ప్రతిభ గురించి చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. మళ్ళీ "అంజలి" అన్నాడు సమస్యకు పరిష్కారంగా.  "అవునురా, అంజలి హాస్టల్ లో ఉంటోంది. తన దగ్గర ఉంచుదాం స్వాతిని" అన్నాడు రాజీవ్ పట్టుదొరికినట్టు.  "కాదురా, ఈ మద్యనే వాళ్ళ అమ్మగారు వచ్చేసారు. ఇద్దరు కలిసి వేరేగా ఇల్లు తీసుకుని ఉంటున్నారు" అన్నాడు అచ్యుత్. కొంచెం నిరాశపడ్డారు, " కాని ప్రయత్నం చేద్దాంరా, తను ఒప్పుకోవచ్చు" అన్నాడు అరవింద్ ఆశతో. స్వాతిని తీసుకుని అంజలి ఇంటికి వెళ్ళారు. ఇంటి తలుపు కొట్టి బయట నుంచున్నారు. వైజాగ్ ఆర్.కె బీచ్ లో కూర్చున్నారు ముగ్గురు. స్వాతి కొంచెం దూరంలో కూర్చుని సముద్రాన్ని చూస్తోంది. అందరి మెదడులు మొద్దుబారిపోయాయి. అచ్యుత్ ఆ నిశబ్దాన్ని చేదిస్తూ " మేఘన మనస్తత్వం మనకు తెలుసు. అలాగే మన ఇళ్ళల్లో కూడా ఆలోచిస్తార్రా. సెంటిమెంట్లు, మూడనమ్మకాలు, దోషాలు అన్నీ ఒకేసారి కనిపిస్తాయిరా ఎదుటివాడి కష్టం, బాధ కన్నా!" అని అన్నాడు స్వాతివైపు చూస్తూనే.  "ఏమంటున్నావురా?" అని అడిగాడు రాజీవ్.  "మేఘన అన్నట్లుగానే మన ఇంట్లో కూడా అనరని నమ్మకం ఏంటిరా?" అని అడిగాడు అచ్యుత్. మౌనం వహించాడు రాజీవ్.  తనకి తెలుసు మనిషి ఎంత ఆధునిక యుగంలోకి వెళ్ళిన తానూ నమ్ముకున్న కొన్ని విషయాలను చచ్చేవరకు పట్టించుకుంటాడు. చచ్చినా పట్టించుకుంటాడు. అది ఒక ప్రోటోకాల్ లాగ ప్రతి మనిషి జీవితాలలో ఫాలో అవుతూ వస్తున్న పధ్ధతి. దానికి అడ్డుకట్ట వేయాలంటే మరో సంఘసంస్కర్త ఆజన్మాంతం పోరాడితేనే సాధ్యం అవుతుంది. అది కూడా పూర్తిగా సమసిపోతుంది అని చెప్పలేము. కందుకూరివారు బాల్య వివాహాలను అరికట్టారు అని పుస్తకాలలో చదువుకుంటాము. కానీ 'పూర్తిగా' అరికట్టారు అని కాదు. ఇప్పటికి ఏదో ఒకమూల బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. పరిష్కారం తోచలేదు ముగ్గురికి. " చీకటి పడుతోందిరా " అన్నాడు రాజీవ్. ఇంతలో ఓ చిన్న కుర్రాడు అటుగా వచ్చి "అన్నా! ఒక రూపాయి ఉంటే ఇవ్వన్నా. ఆకలేస్తోందన్నా. పొద్దున్నించి ఏం తినలేదన్నా" అంటూ బిక్షం ఎత్తుకుంటున్నాడు. ఆ కుర్రాడు వైపు చూసాడు అరవింద్. చిరిగిపోయిన చొక్కా, మాసిపోయిన జుట్టు, అరిగిపోయిన చెప్పులతో చాలా దీన స్థితిలో ఉన్నాడు. అరవింద్ తన దగ్గరున్న డబ్బులు తీసి అతనికి ఇచ్చాడు. ఆ కుర్రాడు దండం పెట్టి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన మరుక్షణంలో అరవింద్ కి మెరుపులాంటి ఆలోచన మెదిలింది., వెంటనే "అంజలి" అన్నాడు. ఆ కుర్రాడిని చూసాక ఎప్పుడో నిరంజన్ వీధిబాలల బొమ్మగురించి, అంజలి ప్రతిభ గురించి చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. మళ్ళీ "అంజలి" అన్నాడు సమస్యకు పరిష్కారంగా.  "అవునురా, అంజలి హాస్టల్ లో ఉంటోంది. తన దగ్గర ఉంచుదాం స్వాతిని" అన్నాడు రాజీవ్ పట్టుదొరికినట్టు.  "కాదురా, ఈ మద్యనే వాళ్ళ అమ్మగారు వచ్చేసారు. ఇద్దరు కలిసి వేరేగా ఇల్లు తీసుకుని ఉంటున్నారు" అన్నాడు అచ్యుత్. కొంచెం నిరాశపడ్డారు, " కాని ప్రయత్నం చేద్దాంరా, తను ఒప్పుకోవచ్చు" అన్నాడు అరవింద్ ఆశతో. స్వాతిని తీసుకుని అంజలి ఇంటికి వెళ్ళారు. ఇంటి తలుపు కొట్టి బయట నుంచున్నారు.  అంజలి తలుపు తీసి "హాయ్, ఏంటి ముగ్గురు సడన్ గా? ఇలా..?" అంది నవ్వుతూ.  "మాకో సహాయం చేయాలి" అన్నాడు అరవింద్. వాళ్ళందరి వెనకన ఉన్న స్వాతిని చూసింది అంజలి. "ఏమైంది స్వాతి?" అంది దగ్గరకు వెళ్లి భుజంపై చేయి వేస్తూ. అంజలి అలా అడగగానే అప్పటివరకు గొంతులో నొక్కిపెట్టిన బాధనంతా బయటపెట్టేసింది. అచ్యుత్ జరిగిన విషయం అంతా చెప్పి " ఇప్పుడు మా దగ్గర ఉంచుదాం అంటే కొంచెం ప్రాబ్లం, అందుకనే నువ్వేమైనా సాయం చేస్తావని..." అన్నాడు.  అంజలి అందరి వైపు చూసి, "మరి ఇంతలా అడగాలా? తను నా దగ్గరే ఉంటుంది. నిరంజన్ ఇలా రియాక్ట్ అవుతాడని అస్సలు ఊహించలేదు. కానీ అతని కోపంలోను న్యాయం ఉంది. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. స్వాతి నా దగ్గర క్షేమంగా ఉంటుంది" అని భరోసా ఇచ్చింది.  ముగ్గురు ఆనందపడ్డారు. అందరి కళ్ళు తడిసాయి."థాంక్స్ అంజలి, చాలా థాంక్స్, నీ ఋణం ఎలా తీర్చుకోవాలో" అన్నాడు రాజీవ్ కన్నీళ్ళతో. "అంత పెద్ద మాటలెందుకు? నిరంజన్, స్వాతిలు నాకు ఫ్రెండ్స్ . ఒక ఫ్రెండ్ చెల్లెలి కోసం మీరు ఇంత తాపత్రయ పడుతున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది" అంది. స్వాతికి బాయ్ చెప్పి అక్కడి నుండి ముగ్గురు బయలుదేరారు.

* * *





[+] 4 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మనసు పలికింది ఈ మాట BY పునర్కథన�... - by LUKYYRUS - 20-11-2018, 11:55 AM



Users browsing this thread: 1 Guest(s)