20-11-2018, 11:54 AM
"హుర్రే !!! గట్టిగా అరిచాడు అచ్యుత్. "నమ్మలేకపోతున్నాను. నేను చైతన్యతో టైం స్పెండ్ చేయబోతున్నాను. చైతన్యతో రోజు ఉంటాను. చైతన్య చైతన్య అంటూ పిలుస్తుంటాను. దగ్గరగా చూస్తూ ఉంటాను. ఏమో అనుకున్నాను కాని కొద్దో గొప్పో నేను అదృష్టవంతుడినే. నాపై నాకెప్పుడు నమ్మకం లేదు అరవింద్. అలాంటింది నిన్ను నమ్మాను. నాకు అదృష్టం కలగజేసింది నువ్వే. నా ప్రేమను చైతన్యకి ఎలా చెప్పాలా అని అనుకునేవాడిని. ఇప్పుడు అవకాశంవచ్చింది. ప్రాజెక్ట్ చేసేంత కాలం తనకి మంచి ఫ్రెండ్ లా ఉంటాను. తన ఇష్టాఅయిష్టాలన్నీ తెలుసుకుంటాను. ప్రాజెక్ట్ ఆఖరి రోజు నా ప్రేమ గురించి చెప్తాను. ఆ తర్వాత నా తలరాత ఎలా ఉంటే అలా..." అంటూ ఆనందంతో ఊగిపోతున్నాడు. "సరే సరే, జాగ్రత్త. ప్రేమించిన అమ్మాయిని ఇంప్రెస్స్ చేయడం కన్నా ఆమెకు నీపై నమ్మకం కలిగించడం ఇంపార్టెంట్" అన్నాడు నిరంజన్. "తప్పకుండా" అన్నాడు అచ్యుత్ నవ్వుతు. ఆ రోజు సాయంత్రం ఇంటికెళ్ళాక మేఘన అడిగింది "అంతా బాగానే ఉంది కాని , మౌనిక పేరు చదవలేదేంటి?" అని. "తను నాతో ప్రాజెక్ట్స్ చేస్తుంది నా గైడెన్స్ లో " చెప్పాడు అరవింద్. "దేవాంతకుడివే!!" అంది మళ్ళి "కాని ముగ్గురు స్టూడెంట్స్ అన్నావుగా?" అని అడిగింది. "అవును, అందరిని గ్రూప్స్ కింద విడగొట్టగా ఇద్దరు మిగిలారు. ఒకరు మౌనిక, ఇంకొకడు పేరు మాధవ్. ఇర్రెగ్యులర్ స్టూడెంట్ అని విన్నాను" అని చెప్పాడు. "ఓ ఐడియా బాగుంది" అంది "సరే, రేపు మౌనిక యూనివర్సిటీ వస్తే నన్ను కలవమని చెప్పు" అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. ఆ తరవాత రోజు మౌనిక యూనివర్సిటీ కి వచ్చి నోటీసు బోర్డు లో తనతో పాటు ప్రాజెక్ట్ చేసేవాడి పేరు చూసి మేఘనతో "మాధవ్ ఎవరే?" అని అడిగింది. "బయోటెక్నాలజీ స్టూడెంట్ ఇర్రెగ్యులర్ అని వినికిడి." చెప్పింది మేఘన. "మరి ఎలా?" అంది "నిన్ను అరవింద్ ఒకసారి కలవమన్నాడు. వెళ్లి కలు" అని చెప్పింది మేఘన. సరే అని చెప్పి అరవింద్ ని కలవడానికి డిపార్ట్మెంట్ కి వెళ్ళింది. ల్యాబ్ వర్క్ చేసుకుంటూ బిజీ గా అరవింద్ ని పిలిచి "ఇక్కడ అరవింద్ అంటే?" అని అడగబోయింది. "నేనే చెప్పండి" అన్నాడు ఏమి తెలియనట్లు."నా పేరు మౌనిక. ప్రాజెక్ట్ కోసం కలవమన్నారట.” అంది. "ఓకే, ఓకే . మీతోపాటు ఇంకో స్టూడెంట్ ఉండాలే అతనేడి?" ప్రశ్నించాడు. "ఏమో అతనెవరో నాకు తెలిదు. ఇర్రెగ్యులర్ స్టూడెంట్ అని మా ఫ్రెండ్ చెప్పింది" అని చెప్పింది. "ఓ అలాగా. డోంట్ వర్రీ, ఐ విల్ హెల్ప్ యు" అన్నాడు. థాంక్యు అని చెప్పి నిష్క్రమించింది. కాసేపయ్యాక ఒక వ్యక్తి అరవింద్ దగ్గరకి వచ్చి "అరవింద్ అంటే...."అన్నాడు. "నేనే అన్నాడు" అరవింద్. అతను పొట్టిగా ఉన్నాడు. గడ్డం ఒత్తుగా ఉంది. కళ్ళు తీక్షణంగా చూస్తున్నాయ్. మనిషి నల్లగా ఉన్నా కళగా ఉన్నాడు."నా పేరు మాధవ్" అన్నాడు. నిర్ఘాంతపోయాడు అరవింద్. తమాయిన్చుకుంటూ "ఓ నువ్వేనా. నువ్వు ఇర్రెగ్యులర్ అని విన్నాను. ప్రాజెక్ట్ చేసేటపుడు కూడా అలా వస్తే ఒప్పుకోను" మొదటిలోనే అతనిపై అధికారం చేలయిద్దాం అన్నట్టుగా అన్నాడు అరవింద్. చిరునవ్వుతో "సరే , వస్తాను మానకుండా?" చెప్పాడతను "నీ బ్యాచ్ మేట్ ఎవరో తెలుసా" అని అడిగాడు “తెలుసు. మౌనిక " అన్నాడు కూల్ గా. "ఓకే ఫైన్. రేపు షార్ప్ 10 కి వచ్చేసేయ్. " ఆర్డర్ వేసాడు. "సరే, తప్పకుండా" చెప్పి వెళ్ళిపోయాడతను. "వీడేంటిరా సడన్ ఎంట్రీ ఇచ్చాడు అని అనుకున్నాడు మనసులో. కాని అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది. కాని ఎక్కడ చుసాడనేది గుర్తుకురాలేదు. ఆ తర్వాత ఆ విషయం మర్చిపోయాడు. ఇంటికెళ్ళాక మేఘన అడిగింది "కలిసావా మౌనికని "అని. "కలిసాను ఆ మాధవ్ కూడా వచ్చాడు. అవునా మరీ అంత నిరాశగా పలుకుతున్నావ్ ఏంటి అతను వచ్చాడని?" అని అడిగింది. "అదేం లేదు కాని అతన్ని ఎక్కడో చూసాను , కాని గుర్తుకు రావడం లేదు, ఎంత ఆలోచించినా" అని అన్నాడు. "ముందు పందెం గురించి ఆలోచించు" అంది "ఏంటి నేను నెగ్గాలని కోరుకుంటున్నావా?" ఎదురు ప్రశ్న వేసాడు. "అబ్బే లేదు. డైవెర్ట్ అవుతున్నావేమో అని" అంది ఏదో సందేహం బయలుదేరింది అరవింద్కి. తను గెలవాలని మేఘన కోరుకోవడం ఏంటి అని....కాని దానికి అంతగా పట్టించుకోకుండా " డైవర్ట్ అవడం లేదు. కొంచెం క్లారిటీ కావాలి" అన్నాడు. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. అతన్ని ఎక్కడ చూసానా అని. నిజానికి మేఘనకి మౌనికపై ఈర్ష్య ఉంది. ఆమె తనకంటే అందంగా ఉంటుందని అసూయ. అందుకనే అరవింద్ ద్వారా తన అహం శాంతపరుచుకోవడం కోసం ప్రయత్నిస్తోంది. ఇద్దరిని కలిపి ఓ టైములో విడగొట్టేస్తే మౌనిక కృంగిపోతుంది. అప్పుడుమౌనికని ఓదార్చి తన విలువను ప్రకటించుకునే ప్రయత్నం చేయదలచుకుంది. ఆ బాధలో మౌనిక ఎవరో ఒకరితో ఎడ్జస్ట్ అయిపోయే స్టేజి కి తీసుకెళ్ళిపోయి, ఆమె కంటే తాను పైస్థాయిలో ఉండడం కోసం తన ముందే మరో మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అలా తన అహాన్ని పూర్తిగా శాంతపరచుకుని ఆనందిద్దాం అని అనుకుంది.అందం విషయంలో అమ్మాయిలకు, అధికారం కోసం అబ్బాయిలకు కోల్డ్ వార్స్ జరుగుతూనే ఉంటాయి.కాని తన ప్రయత్నం దెబ్బ కొడుతుందని మేఘన ఊహించలేదు. ఇంకా ఆలోచనలో ఉన్న అరవింద్ తో "ఏంటి ఆలోచిస్తున్నావ్?" అని అడిగింది మేఘన. "ఏమి లేదు కాని , నాకు మౌనికగురించి చెప్పు " అని అన్నాడు. మేఘన చెప్పడం ప్రారంభించింది." మేఘన అందరిలాంటి అమ్మాయి కాదు. చాలా డబ్బు ఉన్న అమ్మాయి. వాళ్ళ నాన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారు. తల్లి మహిళా మండలి అధ్యక్షురాలు. తనకు ఈ డబ్బు మీద, అధికారాల మీద ఎటువంటి ఇష్టం లేదు. వాళ్ళింట్లో తాను పూర్తిగా విరుద్ధం.పంజరంలో చిలుక లాంటిది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అభిప్రాయలన్ని పాపం దానిపై రుద్దుతూ ఉంటారు. అందుకే తనపై అధికారం చేసే వాళ్ళన్న, అజమాయిషీ చేసే వాళ్ళన్న తాను అస్సలు ఇష్టపడదు.జీవితంలో ప్రతీది కొత్తగా ఉండాలి అని అంటూ ఉంటుంది. అంత ఈజీగా ఎవరిని నమ్మదు." ముగించింది. ఆరోజు ప్రశాంతంగా గడిచింది. పెనుతుఫానులకు ముందు ఆకాశం నిశబ్దంలా........ఏదో సందేహం బయలుదేరింది అరవింద్కి. తను గెలవాలని మేఘన కోరుకోవడం ఏంటి అని,.. కాని దానికి అంతగా పట్టించుకోకుండా " డైవర్ట్ అవడం లేదు. కొంచెం క్లారిటీ కావాలి" అన్నాడు. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. అతన్ని ఎక్కడ చూసానా అని. నిజానికి మేఘనకి మౌనికపై ఈర్ష్య ఉంది. ఆమె తనకంటే అందంగా ఉంటుందని అసూయ. అందుకనే అరవింద్ ద్వారా తన అహం శాంతపరుచుకోవడం కోసం ప్రయత్నిస్తోంది. ఇద్దరిని కలిపి ఓ టైములో విడగొట్టేస్తే మౌనిక కృంగిపోతుంది. అప్పుడుమౌనికని ఓదార్చి తన విలువను ప్రకటించుకునే ప్రయత్నం చేయదలచుకుంది. ఆ బాధలో మౌనిక ఎవరో ఒకరితో ఎడ్జస్ట్ అయిపోయే స్టేజి కి తీసుకెళ్ళిపోయి, ఆమె కంటే తాను పైస్థాయిలో ఉండడం కోసం తన ముందే మరో మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అలా తన అహాన్ని పూర్తిగా శాంతపరచుకుని ఆనందిద్దాం అని అనుకుంది.అందం విషయంలో అమ్మాయిలకు, అధికారం కోసం అబ్బాయిలకు కోల్డ్ వార్స్ జరుగుతూనే ఉంటాయి.కాని తన ప్రయత్నం దెబ్బ కొడుతుందని మేఘన ఊహించలేదు. ఇంకా ఆలోచనలో ఉన్న అరవింద్ తో "ఏంటి ఆలోచిస్తున్నావ్?" అని అడిగింది మేఘన. "ఏమి లేదు కాని , నాకు మౌనికగురించి చెప్పు " అని అన్నాడు. మేఘన చెప్పడం ప్రారంభించింది." మేఘన అందరిలాంటి అమ్మాయి కాదు. చాలా డబ్బు ఉన్న అమ్మాయి. వాళ్ళ నాన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారు. తల్లి మహిళా మండలి అధ్యక్షురాలు. తనకు ఈ డబ్బు మీద, అధికారాల మీద ఎటువంటి ఇష్టం లేదు. వాళ్ళింట్లో తాను పూర్తిగా విరుద్ధం.పంజరంలో చిలుక లాంటిది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అభిప్రాయలన్ని పాపం దానిపై రుద్దుతూ ఉంటారు. అందుకే తనపై అధికారం చేసే వాళ్ళన్న, అజమాయిషీ చేసే వాళ్ళన్న తాను అస్సలు ఇష్టపడదు.జీవితంలో ప్రతీది కొత్తగా ఉండాలి అని అంటూ ఉంటుంది. అంత ఈజీగా ఎవరిని నమ్మదు." ముగించింది. ఆరోజు ప్రశాంతంగా గడిచింది. పెనుతుఫానులకు ముందు ఆకాశం నిశబ్దంలా.... మౌనిక , మాధవ్లు ఇద్దరు వచ్చారు. అరవింద్ ప్రాజెక్ట్స్ గురించి పూర్తిగా వివరించి చెప్పాడు. మాధవేమి అనుకున్నాట్టుగా అంత అడ్డం ఏమి రాలేదు. కాని రెగ్యులర్గా మాత్రం వచ్చేవాడు. కాలం గడిచేకొద్ది మౌనిక అరవింద్లు మంచి స్నేహితులు అయ్యారు. పేర్లు పెట్టి పిలుచుకునేత స్నేహం ఏర్పడింది. అందరు చెప్పినట్లు తనేమి అందగత్తె అని ఏమి ఫీల్ అవదు. చూసేవాడు అలా అనుకుంటాడు అంతే !! కాని తాను కూడా సగటు అమ్మాయిలా ఉంటుంది. మాట్లాడుతుంది. అలుగుతుంది. నవ్వుతుంది. సెన్సిటివ్ గా ఉంటుంది. ఎందుకో అరవింద్ కి మౌనిక పై నిజంగా ప్రేమ కలిగింది. మాటల్లో అప్పుడప్పుడు ఆమె ఇంట్లో తననేలా ట్రీట్ చేస్తారో చెప్పుకొచ్చేది కుడా.. ఓ రోజు మౌనికతో "నేను ఒకటి అడుగుతాను , ఏమనుకోవుగా" అన్నాడు. "అడుగు" అంది "నువ్వు నిజంగా హ్యాపీగా ఉన్నావా?" "ఎందుకలా అడిగావు?" "ఏమో అడగాలనిపించింది" "ఉన్నాను అంటే ఉన్నాను లేను అంటే లేను" అంది. "అంటే..." "అంటే.... అంతే.. " రెండు సెకెన్ల తరవాత "ఐ లవ్ యు " అన్నాడు. మౌనిక ముఖం కంద గడ్డలా మారిపోయింది. "వాట్ ???" అరిచింది. "ఎస్ , నేను నిన్ను ప్రేమిస్తున్నాను.పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. ఆలోచించుకుని నీ నిర్ణయం చెప్పు" అన్నాడు కూర్చున్న వాడు లేస్తూ. "ఆలోచించుకోవడానికేమి లేదు. ఐ యామ్ సారీ" తానూ కూడా లేచి మాట్లాడకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న మౌనికని చూస్తూ ఉండిపోయాడు. అరవింద్ ప్రోపోస్ చేసిన విషయం మౌనిక అన్నయ్య సుధీర్ కి తెలిసింది. తన ఫ్రెండ్స్ తో కలిసి వచ్చి అరవింద్ ని కొట్టాడు. చేయి విరిగింది. అందరికి మెట్లమీంచి పడ్డానని చెప్పాడు. రెండు రోజుల తర్వాత మౌనికకు విషయం తెలిసింది. వెళ్లి అన్నయ్యను నిలదీసింది, "నీకేమైనా పిచ్చా అన్నయా?? ఎవరిని పడితే వాళ్ళని అలానే కొట్టేస్తావా? మొన్న ఈ మద్యన కూడా ఎవరో నాకు లవ్ లెటర్ ఇచ్చారని విని నిజానిజాలు తెలుసుకోకుండా కొట్టేయడానికి వెళ్లావు. అది నాకు వచ్చిన లెటర్ కాదు అని తెలుసుకున్నాక ఊరుకున్నావ్.. అరవింద్ నాకు గైడ్ లాంటివాడు. ఫ్రెండ్ లాంటి వాడు. అంతే." అంది ఆవేశంగా. "లాంటివాడు ... లాంటివాడు.. ఏంటి?, నిజం చెప్పు ఎలాంటివాడో?" అని అడిగాడు. "ఫ్రెండ్ అన్నానుగా" అంది గట్టిగా. ఆ తరువాత మౌనిక వచ్చి పలకరించినా అరవింద్ ఏమి మాట్లాడలేదు. మాములుగా ప్రాజెక్ట్ లో హెల్ప్ చేసి వెళ్ళిపోయేవాడు. ఇలా వారం రోజులు గడిచాక... ఓ రోజు "నీతో మాట్లాడాలి అరవింద్" అంది వెళ్తున్నవాడికి అడ్డం పడుతూ. "నాకు లేదు" అన్నాడు దారి చూసుకుంటూ. "అరవింద్, ప్లీజ్, నా మాట విను. నేనేమి మా అన్నతో చెప్పలేదు. ఎవరో చెప్పారు. నాకసలు ఏమి తెలిదు" అంది అరుస్తూ. ఆగి వెనక్కి తిరిగి "నాకు దెబ్బలు తగిలినందుకు నేనేమి బాధపడటం లేదు. నీకోసం ఎన్ని దెబ్బలైనా తింటాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను మౌనికా. నేను నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వు కనీసం నాగురించి ఒక్కసారైనా ఆలోచించి అప్పుడు నీ నిర్ణయం చెప్పు. అప్పుడు కూడా నీకు ఇష్టం లేదంటే నేనేమి అడగను...నీకోసం ఎంతకాలమైనా ఎదురుచూస్తాను. నువ్వు తప్ప నా భార్యగా వేరొకరిని ఊహించుకోలేను." అని చెప్పి వెళ్ళిపోయాడు. మౌనిక మౌనంగా ఉండిపోయింది. ఆమెకు అరవింద్ పై ఆలోచనలు మరింత ఎక్కువయ్యాయి. రాత్రి పది అవుతుండగా మేఘనకు ఫోన్ చేసింది. మేఘన ఫోన్ లిఫ్ట్ చేసి "హలో, ఏంటే ఈ టైం లో" అనడిగింది. "ఏమి లేదు...అరవింద్ వచ్చాడా?" అడిగింది మౌనిక "అతని గురించి అడుగుతున్నావేంటే? ఇంకా ఇంటికే రాలేదు" "రాలేదా? ఇంతసేపు ఏం చేస్తుంటాడు?" "ఏమో? నాకెలా తెలుస్తుందే? " "సరే ఉంటాను" ఫోన్ పెట్టేసి, మళ్ళి గంట తరువాత ఫోన్ చేసింది "అరవింద్ వచ్చాడా?" అంటూ.. మేఘన నిద్ర మత్తుతోనే "లేదు. ఇంకా రాలేదు. ఏమైందే?" అని అడిగింది. "ఏమి లేదు. ఓకే . ఉంటాను. గుడ్ నైట్ .” కట్ చేసేసింది మౌనిక. అరవింద్ కోసం ఆరాత్రి అంతా ఆలోచిస్తూ ఉండిపోయింది. ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలీదు. ఉదయం 5 గంటలకు మెలకువ వచ్చింది. వెంటనే లేచి మేఘనకు ఫోన్ చేసింది. పొద్దున్నే ఎవవరురా అనుకుంటూ లిఫ్ట్ చేసింది మేఘన. "నేను మౌనికని. అరవింద్ వచ్చాడా?" "ఇప్పుడేమిటి రాత్రే వచ్చాడు" "ఇప్పుడెం చేస్తున్నాడు? రాత్రి ఏమైనా తిన్నాడో లేదో అడిగావా?" "ఏమో నేను అడగలేదు. ఇప్పుడు ఏమి చేస్తుంటాడో కూడా నాకు తెలీదు, చూసొచ్చి చెప్పానా?" "వద్దులే" ఫోన్ పెట్టేసింది. మేఘన బద్ధకం తీర్చుకుని మేడపైకి వెళ్ళింది. అరవింద్ బయట కుర్చీని చదువుకుంటున్నాడు. "ఏంటి మేఘనా? పొద్దున్నే" అన్నాడు అరవింద్ "నీకేమి చెప్పాను నువ్వేమి చేస్తున్నావ్? అనిదిగింది. "దేనిగురించి" "పందెం" "ఓ.. ఏమైందని ఇంకా మూడు రోజులుంది కదా" "నీకోసం రాత్రి మౌనిక రెండు సార్లు ఫోన్ చేసింది. ఇప్పుడు కూడా" "ఎందుకు?" "తన మాటల బట్టి చూస్తుంటే రాత్రంతా నీగురించే ఆలోచించింది అని అనిపిస్తోంది.