Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనసు పలికింది ఈ మాట BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#9
లేకపోతే తరవాత పరిణామాలకు భాద్యత వహించాల్సొస్తుంది."  "సరే పద వెళ్దాం " అని అక్కడినుండి కదిలారు. దారిలో అంజలి ఎదురైంది.  "హాయ్ అంజలి" పలకరించాడు నిరంజన్.  "హాయ్ నీర్ .. ఎలా ఉన్నావ్?"  "బాగున్నాను" చెప్పాడు.  "హాయ్" అని విష్ చేసాడు అరవింద్. గుర్తు తెచ్చుకున్నట్టుగా "మీరూ...!!"అంది..  "అదేంటి, అప్పుడే మర్చిపోయారా? ఇదిగో నువ్వు ఇచ్చిన గిఫ్ట్" అంటూ అరచేయి చూపించాడు.  "ఓ సారీ సారీ అరవింద్ మర్చిపోయాను" అంది నవ్వుతు.  "ఈ దెబ్బే లేకపోతే సాక్ష్యం లేకపోయేది నాకు" అన్నాడు.  "అదేం లేదులే ఈ సారి మర్చిపోను. చిన్న పని ఉంది వస్తాను, పెయింటింగ్ కాంపిటిషన్ గురించి ప్రిన్సిపాల్తో మాట్లాడాలి" అని చెప్పి వెళ్ళిపోయింది. ఇద్దరు తనకి దారి ఇచ్చారు.  "నీకు అంజలి తెలుసా? అనడిగాడు అరవింద్ .  "ఎందుకు తెలీదు. తను ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ స్టూడెంట్. బొమ్మలు బాగా వేస్తుంది. మన బయాలజీ డయాగ్రామ్ చార్ట్స్ కొన్నింటిని తనతోనే వేయిన్చుకుంటూ ఉంటాను. మంచి పెయింటర్ " చెప్పాడు నిరంజన్.  మళ్ళి తనే కొనసాగించాడు" తనకి చాలా ప్రైజెస్ కూడా వచ్చాయి. ఒకసారి వీధి బాలల కష్టాలను చూపిస్తూ ఒక పెయింటింగ్ వేసింది. అది చూడగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయంటే నమ్ము. అంత అద్భుతంగా గీస్తుంది." అన్నాడు.  "అయితే ఈమెను కూడా మన ప్రాజెక్ట్స్ లోకి తీసుకుందామా?" అన్నాడు అరవింద్.  "సైన్సు ప్రాజెక్ట్స్ కి ఆర్ట్స్ అమ్మాయా? నిజం చెప్పు నీ ఉద్దేశ్యం ఏంటి?" అని అడిగాడు భుజం తడుతూ.  "అబ్బే! అలాంటిదేమీ లేదు. సరదాగా అన్నాను" అన్నాడు  "సరే పద కాంటీన్ కి వెళ్దాం" అని అనుకుని కాంటీన్ కి వెళ్తుంటే మానస ఎదురైంది.  నిరంజన్ తో "ఏంటి బాస్ ప్రిన్సిపాల్ తో పనా?” అని అడిగింది.  "అవును" అన్నాడు.  "ఎప్పుడు చదువులేనా? ఎంజాయ్ చేయాలని ఉండదా? నీలంటివాడిని ప్రేమించాను చూడు నాది తప్పు" అంది. నిరంజన్ నవ్వుతూ "ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులో చేయాలి. ఇప్పుడే చదువుకోవాలి. తరువాత చదువుదామన్నా ఇంట్రస్ట్ ఉండదు" చెప్పాడు.  "అదే నేను చెపుతున్నాను ఇప్పుడే ఎంజాయ్ చేయాలి ఆ తర్వాత ఇంటరెస్ట్ ఉండదు అని" అంది.  దానికి అరవింద్ "పోనీ మాథ్స్ వాళ్ళని కుడా మన ప్రాజెక్ట్స్ లోకి చేర్చుకున్దామా?" అని అడిగాడు సరదాగా.  ",, హ...ఇంకా ప్రాజెక్ట్స్ ఏమి కదలవు" అని నవ్వుకున్నాడు నిరంజన్. అరవింద్ కూడా నవ్వేడు.  "ఏంటి?" అని అడిగింది మానస. అరవింద్ ప్రాజెక్ట్ ఐడియా చెప్పాడు. అది విని "వద్దు బాబు, మాములుగానే చదువు చదువు అని చంపుతాడు. మీతో కలిస్తే ఇతన్ని భరించడం నా వల్ల కాదు" అంది నిరంజన్ వైపు చూసి. ముగ్గురు నవ్వుకున్నారు. 
* * *
"ఒరేయ్ ఈ రోజు ఎలా అయినా చైతన్యకు నా ప్రేమ విషయం చెప్పేస్తాను. ముహూర్తం పెట్టు" అని అచ్యుత్ మళ్ళి అడిగాడు.  "చంపేస్తున్నావురా బాబు... నీయంకమ్మ ఇంకోసారి ఆ డైలాగ్ అంటే చంపేస్తాను" అన్నాడు రాజీవ్.  కనుబొమ్మలు పైకి ఎత్తి కళ్ళు రెప్పలేయకుండా సీరియస్ గా రాజీవ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ "ఈ రోజు చెప్పేస్తే నాకేంటి ఇస్తావ్?" అని అడిగాడు అచ్యుత్.  "ఏమి కావాలంటే అది ఇచ్చేస్తాను. ఆఆ..ఆ…. నా పేరు మీద హైదరాబాద్ లో ఫ్లాట్ ఉంది అది రాసిచ్చేస్తాను" అన్నాడు ఎలాగో అచ్యుత్ చెప్పాలేడన్న ధీమాతో, జీవితంలో అచ్యుత్ ఆ పని చేయేదన్న నమ్మకంతో. అచ్యుత్ లేచి నిలబడి"అయితే సరే, రెడీగా ఉండు. రాసిచ్చేయడానికి" అన్నాడు.  రాజీవ్ "వీడేంటి ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాడు. కొంపతీసి చెప్పేస్తాడా? వెధవ గోల!! అనవసరంగా మాట ఇచ్చేసానా? ఇల్లు నా పేరు మీద కుడా లేదు ఏదో ఫ్లోలో అలా అనేసాను కాని అది మా నాన్న పేరుమీద ఉంది. ఈ విషయం మా నాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తాడు అని అనుకున్నాడు మనసులో. అయినా ధైర్యం నటిస్తూ "అదిగో చైతన్య వస్తోంది వెళ్లి ప్రేమిస్తున్నాను అని చెప్పు" అన్నాడు చైతన్యను చూపిస్తూ.  అచ్యుత్ వెనక్కి తిరిగి చూసాడు. అందమైన నెమలిలా నెమ్మదిగా అటు ఇటు చూసుకుంటూ నడుచుకుంటూ వస్తున్న చైతన్యని చూస్తూ ఉండిపోయాడు. కాలం ఆగిపోయినట్టింది..... అంతే అలా చూస్తూనే ఉండిపోయాడు. ఇంకేమి చేయలేదు."ఏరా చెప్పేస్తాను పొడిచేస్తాను అని బిల్డప్ ఇచ్చావ్" అని వెక్కిరిస్తూ అడిగాడు రాజీవ్ కొంత విజయ గర్వంతో. రాజీవ్ వైపు చూసి "నాకు పరాయివాళ్ళ ఆస్తులు ఊరికనే తీసుకోవడం ఇష్టం లేదు. ఏదైనా స్వయంకృషితోనే సంపాదించాలి. అది ఆస్తులయినా సరే ప్రేమైనా సరే" అన్నాడు అచ్యుత్.  "ఈ కబుర్లకేమి తక్కువ లేదు" అన్నాడు రాజీవ్.  "ముందు పరీక్షల మీద దృష్టి పెట్టండి" అన్నాడు నిరంజన్. అరవింద్ అక్కడ జరిగేదంతా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.  "వీడొకడు .. చదువు.. చదువు.. నీకేంటి బాబు! నీకు మానస ఉంది. నా బాధ ఎవడికి చెప్పుకోను?" అన్నాడు అచ్యుత్. నిరంజన్ పక్కనే ఉన్న మానస "ఎందుకు నేను ఉన్నానంతే! అంతకంటే ఏమి లేదు. నీకు లేక బాధ. నాకు ఉండి బాధ" అంది. పక్కున నవ్వేడు అరవింద్. అరవింద్ తో పాటు అందరు కలిసి నవ్వారు. నిరంజన్ నవ్వకురా ప్లీజ్ అన్నా కూడా పగలబడి నవ్వుకున్నారు. అప్పడే నవ్య అక్కడికి వచ్చి నవ్వుతు "హాయ్ అరవింద్ అన్నయా" అని అరవింద్ ని పలకరించింది. నవ్యని చూసి రాజీవ్ అక్కడినుండి వెళ్ళిపోబోయాడు. వెంటనే నవ్య రాజీవ్ తో "హలో నేనేం నీకోసం రాలేదు. అరవింద్ అన్నయ్య కోసం వచ్చాను" అని అంది. సౌండ్ లేదు రాజీవ్ కి. మౌనంగా నవ్య కళ్ళలోకి చూసాడు. నవ్య కుడా రాజీవ్ కళ్ళలోకి క్షణం పాటు చూసి అరవింద్ వైపు తిరిగి నవ్వింది పెదాలు సాగదీస్తూ. రాజీవ్ అరవింద్ వైపు చూసి "నాకు పని ఉంది, ఐ యమ లీవింగ్" అని చెప్పి వెళ్ళిపోయాడు కోపంగా.  "హేయ్! నవ్య , నువ్వేనా.. సూపర్ డైలాగ్ సౌండ్ లేదు వేస్ట్ గాడికి" అన్నాడు అచ్యుత్ వెళ్ళిపోతున్న రాజీవ్ వైపు చూస్తూ.  "వేస్ట్ గాడు ఏంటి?" అంది చాలా కోపంతో. ఈసారి అచ్యుత్ కి సౌండ్ లేదు. "మైండ్ యువర్ లాంగ్వేజ్ " అంది మళ్ళి.  "హేయ్, కూల్. మేమందరం ఫ్రెండ్స్" అన్నాడు అరవింద్.  "అయినా సరే నా ముందు రాజీవ్ ని ఏమైనా అంటే నేను ఒప్పుకోను" అంది కొంచెం ఫీల్ అవుతూ.  "సరే సరే ఏమనంలే అన్నాడు అరవింద్. మానస నిరంజన్ లు ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు. నవ్య తన తొందరపాటు తెలుసుకుని అచ్యుత్ కి సారి చెప్పింది. పరవాలేదులే అన్నాడు నవ్వుతు.  అరవింద్ పెట్టిన ప్రపోసల్ ని ప్రొఫెసర్స్ముందు ఉంచాడు ప్రిన్సిపాల్. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు, మంచి ఆలోచన అని నిరంజన్ ని అరవింద్ ని మెచ్చుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే భారం అంతా వాళ్ళపై వదిలేసారు. మీటింగ్ కి అందరు స్టూడెంట్స్ తప్పకుండా హాజరు కావాలని అన్ని డిపార్ట్మెంట్లకి నోటిసులు వెళ్ళాయి. ఆ రోజు స్టూడెంట్స్ అందరు అటెండ్ అయ్యారు. మూడు డిపార్టమెంట్లు కలిపి 120 మంది వరకు స్టూడెంట్స్ వచ్చి కూర్చున్నారు. అరవింద్ ఆ గుంపులో మౌనిక కోసం వెతికాడు. అలా చూస్తూ ఉండగా మేఘన కనిపించింది. మాట రాకుండా పెదాలు కదుపుతూ 'మౌనిక' అన్నాడు. 'ఇంటికి వెళ్ళింది' అన్నాట్టుగా రెండు చేతులతో సైగ చేస్తూ చెప్పింది. 'ఎందుకు' అన్నాట్టుగా బొటనవేలు చూపించాడు. 'ఏమో' అన్నాట్టుగా కింద పెదవి విరిచింది. మళ్ళి స్టూడెంట్స్ అందరి వైపు తిరిగి నవ్వుతు మీటింగ్ స్టార్ట్ చేసాడు.  డియర్ స్టూడెంట్స్,  మనమందరం ఇక్కడ మీట్ అవడానికి ఒక కారణం ఉంది. మీ ప్రాజెక్ట్స్ గురించి యూనివర్సిటీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. మీరు మీ ప్రాజెక్ట్స్ కోసం బయటకు వెళ్ళనక్కర లేదు. మన యూనివర్సిటీలోనే మీరు పూర్తిచేసుకోవచ్చు. ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా ఫీజు కూడా లేదు. కాకపోతే కెమికల్స్ కి కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదేమంత ఎక్కువ ఖర్చు కాదు అని నా అబిప్రాయం. మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని ఒక వారంలోగా ఏవిషయం అనేది చెప్పండి. మీరందరూ దీనికి ఒప్పుకుంటారనే ఆశిస్తున్నాను. మనమందరం కలిసి ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తే మన యూనివర్సిటీకి, మన యూనిటీకి మంచి పేరు వస్తుంది. ప్రాజెక్ట్ వివరాలు నిరంజన్ చెప్తాడు” అని ముగించాడు.  నిరంజన్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ చెప్పాడు. ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
[+] 5 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మనసు పలికింది ఈ మాట BY పునర్కథన�... - by LUKYYRUS - 20-11-2018, 11:52 AM



Users browsing this thread: