Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనసు పలికింది ఈ మాట BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#6
సూర్యోదయం అవుతోంది."బ్రహ్మ స్వరూపముదయో మద్యాహ్నేతు మహేశ్వరం  సాయంధ్యాయేత్సదే విష్ణుం త్రిమూర్తించ దివాకరం" అంటు ఉదయాన్నే సూర్య నమస్కారం చేసుకుంటున్నాడు నిరంజన్.  నిరంజన్ సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. రోజు గాయత్రి పూజ చేసుకుంటాడు. ప్రతి పని నియమ నిబద్దలతో చేస్తుంటాడు.  తరతరాలుగా వస్తున్న ఆచారాలను, సాంప్రదాయాలను మోడరన్ యుగంలో కూడా క్రమం తప్పకుండ పాటిస్తాడు.మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు.ముక్కి సూటిగా మాట్లాడడం అతనికి అలవాటు. తన మతం ఎంత గొప్పదో ఇతరుల మతాలు కూడా అంతే అని భావిస్తాడు.మతం అంటే మనుషులు మంచి మార్గంలో ఎలా బ్రతకాలో తెలిపే విషయమే అని భావిస్తాడు. మనిషిని మనిషిగానే గుర్తిస్తాడు. మతంతో పోల్చడు. ప్రతి మతాన్ని గౌరవించే నిరంజన్ అంటే ఇరుగు పొరుగు వాళ్లకు ఎనలేని అభిమానం. క్రిస్టమస్ పండుగ వేడుకలలోను, రంజాన్ పర్వదినాలలోను వారితోపాటు ఎంజాయ్ చేస్తాడు. దేవుడు ఒక్కడే ధర్మం ఒక్కటే అని నమ్మే మనస్తత్వం కలవాడు.  నిజానికి నిరంజన్ కరకుగా కనిపించే ఆత్మీయుడు. ప్రతి మాటలోనూ ఎంతో అంతర్లీనమైన విశ్లేషణ, అనుభవం లేకపోవు. ఆచితూచి అడుగు వేసే నిరంజన్ అంటే ఇంట్లో కూడా గౌరవం ఉంది. తల్లి, తండ్రి,చెల్లెలు స్వాతి తో కలిసి అ0ద్దె ఇంట్లో ఉంటున్నాడు, తండ్రి పౌరాహిత్యం చేస్తూ ఉంటాడు. పిల్లల ఇష్టానుసారమే వాళ్ళను పై చదువులు చదివిస్తున్నాడు.  "స్వాతి, టిఫిన్ పట్టుకురామ్మ?" చెల్లెల్ని పిలిచాడు.  "వస్తున్నాను అన్నయ్య" అంటు టిఫిన్ తెచ్చి ఇచ్చింది.  "బాగా చదువుతున్నావా?" ప్రశ్నించాడు.  "చదువుతున్నాను అన్నయ్య"  "పరీక్షలు ఎప్పుడు?"  వచ్చే నెలలో, ఐనా అవేమంత ముఖ్యం కాదు" అంది మాములుగా.  చెల్లెలు వైపు చూసి "మరెందుకు కండక్ట్ చేస్తున్నారు?" అనడిగాడు.  "ఏదో ఫార్మాలిటీ కోసం" అంది చెట్నీ వడ్డిస్తూ.  "ఎవరలా ఫార్మాలిటీ కోసం కండక్ట్ చేస్తోంది? నేనొచ్చి మాట్లాడాలా?" కొంచెం సీరియస్ గానే అడిగాడు.  స్వాతి కంగారు పడింది. "అది కాదు అన్నయ్య, మిడ్ ఎగ్జామ్స్ కదా అని అలా అన్నాను" అంది.  "ప్రతి పరీక్ష ఫైనల్ పరీక్ష అనుకుని చదవాలి. వ్రాయాలి. అప్పుడే చదివిన దానికి ఫలితం ఉంటుంది" చెప్పాడు.  "అలాగే అన్నయ్య" అంది .  "అమ్మా! ఎదురురా, యూనివర్సిటీ కి వెళ్లి వస్తాను" అని తల్లిని పిలిచాడు.  తల్లి ఎదురు వచ్చింది. యూనివర్సిటీ కి బయలుదేరాడు. నిరంజన్ మైక్రోబయాలజీలో పిహెచ్.డి చేస్తున్నాడు.నిరంజన్ మొబైల్ కి మెసేజ్ వచ్చింది" బస్ స్టాప్ దగ్గర ఉండు , వస్తున్నాను." అని . ఆ మెసేజ్ మానస పంపించింది. మానస నిరంజన్ లు ప్రేమించుకుంటున్నారు.  దాదాపు 15 నిమిషాలు వెయిట్ చేసాడు "ఇంకా ఎంతసేపు?" మెసేజ్ పంపాడు.  "ఆన్ ది వే " రిప్లై ఇచ్చింది.  "నేను ఎంత టైం పడుతుంది అని అడిగాను" అని రిప్లై ఇచ్చాడు.  "వెనక్కి తిరిగి చూడు" రిప్లై ఇచ్చింది.  ఆరంజ్ కలర్ డ్రెస్ లో మానస చాలా అందంగా నడుచుకుంటూ వస్తోంది. బండి స్టార్ట్ చేసి "ఎక్కు,ఇప్పటికే లేట్ చేసావ్." అన్నాడు. మానస నిరంజన్ భుజంపై చేయి వేసి ఎక్కి కూర్చుంది.  "నీ బండి ఏమైంది ఈరోజు?" అనడిగాడు.  "కావాలనే తేలేదు. నీతో పాటు వెళ్దామని " అంది  "ఈ రోజు ఏమి క్లాసెస్ నీకు?" అనడిగాడు.  "అడిగావా? ఇంకా చదువు గురించి అడగలేదేంటా అనుకున్నాను. మాథ్స్ క్లాసు " చెప్పింది  "ఆ తర్వాత?" అన్నాడు.  "అబ్బ! నా టైం టేబుల్ నేకు రాసి ఇస్తాను.నన్ను అడగకు ప్లీజ్, చిరాగ్గా ఉంటుంది నాకు. కాస్త ప్రేమగా మాట్లాడుదాం అని ఏంలేదు నీకు? కనీసం ఏమైనా తిన్నావా అని అడుగుతవేమో అని చూస్తాను" అంది కొంచెం అలిగినట్లుగా. మానసను మాథ్స్ క్లాసు దగ్గర దించేసి తన డిపార్ట్మెంట్ కి తను వెళ్ళిపోయాడు. తన క్లాసు ముగించుకుని బయటకు వచ్చేసరికి అచ్యుత్ సంజీవులు అక్కడ కనిపించారు.  వాళ్ళ దగ్గరకు వెళ్తూ "ఏరా, క్లాసుకి వెళ్ళలేదా?" అనడిగాడు నిరంజన్.  "వెళ్లాం బాబు. ఇప్పుడు ఖాళి" అన్నాడు అచ్యుత్.  "మరిక్కడెం చేస్తున్నారు?" ప్రశ్నించాడు  "మనవాడి ఫాన్స్ కోసం వెయిటింగ్" చెప్పాడు రాజీవ్.  "ఓ చైతన్య కోసమా?" అన్నాడు నిరంజన్. అవునన్నట్టు తలూపాడు అచ్యుత్.  చైతన్య మళ్ళీ అరవింద్ తో పాటు నడుచుకుంటూ వస్తోంది. "వీడెవడురబాబు. చైతన్య ఎక్కడ ఉంటే అక్కడే ఉంటున్నాడు" అన్నాడు అచ్యుత్ కొంచెం భయంతో. అరవింద్ కేసి చూసారు ముగ్గురు.  "ఏమైందిరా?" అనడిగాడు నిరంజన్. జరిగిన విషయం అంతా చెప్పాడు రాజీవ్. అంతా విని "అయితే ఇతను చైతన్య బావ కాకపోవచ్చు" అన్నాడు నిరంజన్.  "నిజంగానా?" వెర్రి ఆనందంతో అడిగాడు అచ్యుత్.  "వాడు కాకపోవచ్చు అన్నాడు. పూ...ర్తి...గా... కాదు అని అనలేదు" ఫీజు పీకేసాడు రాజీవ్.  "ఉండు నేను కనుక్కుంటాను" అని అడుగు ముందుకు వేసాడు నిరంజన్.  లాటరీ టికెట్ నెంబర్ రేడియోలో వింటున్నంత టెన్షన్ పడ్డాడు అచ్యుత్.  "ఏం అవదురా.. కంగారుపడకు" అన్నాడు రాజీవ్.  నిరంజన్ అరవింద్ వైపుగా నడవడం ప్రారంభించాడు...అప్పుడే అరవింద్ కి ఇంటి ఓనర్ కూతురు కనిపించింది. చైతన్యకు బాయ్ చెప్పేసి "హలో, ఏమండి?" అని పిలిచాడు ఆ అమ్మాయిని. ఆమె వెనక్కి తిరిగి చూసింది.  "ఒక్క నిమిషం.." అంటూ ఆమె వైపుగా అడుగులు వేసాడు అరవింద్. నిరంజన్ వీరిద్దరికేసి చూసాడు. తన పనిని విరమించుకుని వెనక్కి వచ్చేసాడు.  "ఏరా ఏదో వీరుడిలా వెళ్ళావ్. మడమ తిప్పావేంటి?" అన్నాడు అచ్యుత్  "ఛ! అంతలేదు. 99.9% వాడు చైతన్య బావ అయితే కాదు. నా అంచనా నిజమైతే అతను యూనివర్సిటీకి కొత్త స్టూడెంట్ అయి ఉంటాడు. మేఘనను పిలుస్తూ అటు వెళ్ళాడు" చెప్పాడు నిరంజన్.  "మేఘననా?" అన్నారు ఇద్దరు ఒక్కసారిగా వాయిస్ లో వాల్యూం పెంచుతూ."పాపం ఏ జన్మలో ఏ పాపం చేసాడో ?" అనుకున్నారు ముగ్గురు నవ్వుకుంటూ .అరవింద్ మేఘన దగ్గరకు వెళ్ళాడు."హాయ్ అండి. ఏంటండి మీరు అసలు ఎవ్వరితోను మాట్లాడరా?" అనడిగాడు. ఏమి మాట్లాడకుండా అలానే చూస్తూ నుంచుంది. అరవింద్ కుడా ఏమి మాట్లాడకుండా అలానే చూస్తూ ఉండిపోయాడు. అస్సలు చూపు తిప్పలేదు."ఏంటి అలా చూస్తున్నావ్?" కళ్ళు పెద్దవి చేస్తూ వచ్చాయామాటలు మేఘన నుండి."హమ్మయ్య, మాట్లాడారా. థాంక్స్. నా పేరు అరవింద్. మీ పేరు?" అనడిగాడు.సమాధానం లేదు మేఘన నుండి. " చెప్పండి" అన్నాడు నవ్వుతు."మేఘన" అని చెప్పింది.మేఘన తనలో తానే అనుకుంటూ "చాలా బాగుంది మీ పేరు" అన్నాడు " మీరెంటండి ఇక్కడ?" అని అడిగాడు మళ్ళీ."నాకు క్లాసుకి టైం అయింది.నేను వెళ్ళాలి" అని చెప్పి వెళ్ళిపోయింది. తను చెప్పదలచుకున్నది డైరెక్ట్ గా చెప్పదని, ఈమెది టిపికల్ మెంటాలిటీ అని "తను ఇక్కడ చదువుకుంటున్న విషయం, ఇక నన్ను వదులుతావ అన్న మాటను కలిపి ఒకే మాటలో "నాకు క్లాసుకి టైం అయింది.నేను వెళ్ళాలి" అని చెప్పిందని అర్ధం చేసుకున్నాడు. వెళ్తున్న ఆమెకు దారి ఇచ్చాడు ..ఆలోచనలను ఆపు చేస్తూ!! అలానే ఆమె వైపు చూస్తూ!!కొంతకాలం అందరి జీవితాలు మాములుగానే గడిచిపోయాయి. అందరికంటే అరవింద్ జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుందని అరవింద్ కి తెలియదు."భవిష్యత్తు తెలిసిపోతే అది జీవితం కాదు. గతం మరిచిపోతే భవిష్యత్తుకి పునాది లేదు"ఓ రోజు ఉదయం కళ్ళు తెరుస్తూ పిల్లి పాలు తాగేయడం చూసాడు అరవింద్. ఉష్ ఉష్ అని పిల్లిని తరిమాడు. అది దాదాపుగా అన్ని పాలు తాగేసి మూతి నాకుకుంటూ వెళ్ళిపోయింది. ఇదేం కర్మరా బాబు అని అనుకున్నాడు. కిందకు వెళ్లి "ఏమండి మేఘనగారు" పిలిచాడు. తను బయటకు వచ్చింది."పిల్లి పాలు తాగేసిందండి" అని చెప్పాడు.కోపంతో చూసింది 'దానికి నన్నేం చేయమంటావ్' అన్నట్టుగా. మేఘన కళ్ళల్లో అంతరార్ధం అర్ధమయి "అంటే మీ ఇంట్లో పాల ప్యాకెట్ ఉంటే ఇవ్వండి. సాయంత్రం కొనేసి ఇస్తాను" అన్నాడు."లేవు" అని చెప్పి లోపలి వెళ్ళిపోయింది. తిరిగి మేడ మీదకు నడిచాడు."అదేంటమ్మ, పాల ప్యాకెట్ ఇవ్వచ్చుగా" అంది తల్లి."ఈ రోజు పాల ప్యాకెట్, రేపు టిఫిన్, ఎల్లుండి భోజనం అంటాడు. కందిపప్పు నుండి జీడి పప్పుదాక అరువులు ఇవ్వాలి. ఇదో కిరణా దుకాణం అయిపోతుంది."అంది మేఘన. కూతురి మనస్తత్వం తెలిసిన తల్లి ఏమి మాట్లాడకుండా తలూపి ఊరుకుంది. మేఘన మాటలు విని నవ్వుకున్నాడు అరవింద్. ఆశ్చర్యపోయాడు కుడా!!ఒకసారి ఇలానే ప్రమోద పాలు లేవని వెళ్తే కాఫీ పెట్టి ఇచ్చింది. వేరేగా పాలు కాచి తోడు చుక్క వేసి ఉంచింది. సాయంత్రం కాలేజీ నుండి వచ్చాక ఆ పెరుగు ఇచ్చింది. ఆ విషయాన్నీ తలచుకుంటూ ఆ ఆలోచనలతో ఇంటి నుండి బయట పడ్డాడు.యూనివర్సిటీ లో సెంట్రల్ కాంటీన్ ఉంది. అక్కడకు వెళ్లి టీ ఆర్డర్ ఇచ్చి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. "ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ సార్" అరిచాడు టోకెన్ ఇచ్చేవాడు. వెళ్లి టీ తెచ్చుకుని అదే కుర్చీలో కూర్చున్నాడు. ఇంకా మూడు కుర్చీలు ఖాళీగా ఉన్నాయ్. అరవింద్ టీ తాగుతుండగా నిరంజన్, రాజీవ్, అచ్యుత్ లు ముగ్గురు అక్కడకి వచ్చి ఆ మూడు కుర్చీల్లో కూర్చున్నారు. ఏమి మాట్లాడకుండా అలానే అరవింద్ వైపు ఎగాదిగా చూసారు. వాళ్ళ వైపు చూసి "ఎవరు మీరు ? ఏమి కావలి?" అనడిగాడు అరవింద్."చైతుకు నీకు సంబంధం ఏంటి?" అడిగాడు అచ్యుత్."చైతు ఎవరు? " ప్రశ్నించాడు."నాటకాలా? మొన్న కూడా నిన్ను చైతన్యతో చూసాం" అన్నాడు రాజీవ్."ఓ తనా? మంచి అమ్మాయి. నాకు తెలుసు" అన్నాడు అరవింద్."ఏం తెలుసు?" చాలా చిరాగ్గా అడిగాడు అచ్యుత్."అబ్బ, ఎందుకండీ కంగారు పడుతున్నారు. మీరేమైనా బ్రిడ్జి కడుతున్నారా. అదే ప్రేమ వంతెన" అనడిగాడు అరవింద్."అవును" అన్నాడు అచ్యుత్ కొరకొర చూస్తూ."అలా అయితే కంగారుపడకు బావ" అన్నాడు అరవింద్ నవ్వుతూ. అరవింద్ అలా బావ అని పిలిచేసరికి అచ్యుత్ కి పట్టరాని ఆనందం వచ్చేసింది. లాటరీ టికెట్ తగిలేసినంత ఉత్సాహం, గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టేసినంత సంతోషం అనిపించింది. "థాంక్స్ బాస్ అని షేక్ హ్యాండ్ ఇస్తూ "అచ్యుత్" అని పరిచయం చేసుకున్నాడు. రాజీవ్ నిరంజన్ లు కూడా తమని తాము పరిచయం చేసుకున్నారు. అందరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.నలుగురు నవ్వుతూ లేవబోతుండగా ఒకడు కంగారుగా పరిగెత్తుకుంటూ కాంటీన్ లోకి వచ్చి వీళ్ళ నలుగురి వెనకాల నుంచున్నాడు. సుధీర్ హాకి స్టిక్ పట్టుకుని ఇంకో నలుగురు కుర్రాళ్ళతో కలిసి కాంటీన్ లోపలి ప్రవేశించి "ఒరేయ్!ఎక్కడ దాక్కున్నావ్ ర? దమ్ముంటే బయటకు రారా. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెలికి లవ్ లెటర్ ఇస్తావురా? చంపేస్తానుర నిన్ను." అని అరుస్తూ వీళ్ళ వైపు తిరిగి "ఇప్పుడే ఒకడు ఇటుగా పరిగెత్తుకొచ్చాడు నువ్వేమైన చూసావా?" అని అరవింద్ ని అడిగాడు."అన్న ప్లీజ్ అన్న ఎలా అయిన నన్ను కాపాడు అన్నా" అని వెనకన ఉన్నవాడు బ్రతిమాలాడు.అరవింద్ ముందుకు అడుగు వేయబోయాడు. నిరంజన్ అరవింద్ భుజం పట్టుకుని ఆపి వద్దు అన్నట్టుగా తలూపి " వాడు ఇక్కడ పెద్ద రౌడి, గొడవలొద్దు" అని హెచ్చరిస్తున్నట్టుగా చెప్పాడు. అరవింద్ నిరంజన్ వైపు చూసి "నాకు క్లాసు కి టైం అయిందిరా" అన్నాడు. ముగ్గురు నిర్ఘాంతపోయారు. సుధీర్ మనుషులందరినీ పరికించి చూసి వాళ్ళ దగ్గరకు వెళ్లి అతను అలా బోటనీ డిపార్ట్మెంట్ వైపుకి వెళ్ళిపోయాడు అంటూ తప్పుదారి పట్టించాడు. వాళ్ళందరూ అటువైపుగా వెళ్ళిపోయారు. వెనక్కి తిరిగి నవ్వేడు. వాళ్ళు కూడా నవ్వుకున్నారు ఆశ్చర్యంలోంచి తేరుకుంటూ.సాయంత్రం అందరు అదే కాంటీన్ లో కలుసుకున్నారు. నిరంజన్ మానసను పరిచయం చేసాడు. "కాని ఉదయం నీ బిల్డ్ అప్ చూసి యాక్షన్ సీన్ ఎక్స్పెక్ట్ చేసాను" అన్నాడు రాజీవ్. అరవింద్ "అవునా" అన్నాడు నవ్వుతు. "ఇంతకి ఎవరా సుధీర్?" అడిగాడు టీ గ్లాస్ అందుకుంటూ."వాడో వేస్ట్ గాడు . స్టూడెంట్ లీడర్. వాడికో చెల్లెలు ఉంది.అదంటే వాడికి ప్రాణం. ఆమెకు ఏమైనా అయినా, ఎవరైన ఆమెను ఏమైనా అన్నా చావగొట్టడం వాడికి అలవాటు" చెప్పాడు అచ్యుత్ ప్లేట్ లో బిస్కెట్ తీసుకుంటూ ."చెల్లెలుపై ఆ మాత్రం ప్రేమ ఉండటం మంచిదేగా" అన్నాడు అరవింద్."మంచిదే కాని ఆమె సరిగ్గా ఉండాలి కదా. ప్రపంచంలోకెల్లా తనే అందగత్తేనని ఆమె ఫీలింగ్" అంది మానస."ఆడవాళ్ళ మనస్తత్వం అంతేగా మరి" అన్నాడు టీ తాగుతూ."అయిన ఇప్పుడు నీకు చెప్పిన అర్ధం కాదులే. ముందు ముందు నీకే తెలుస్తుంది" అంది మానస."సరేలే , ఇంతకి ఆమె పేరు ఏంటి?" "మౌనిక….." చెప్పాడు నిరంజన్.
* * *
[+] 4 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మనసు పలికింది ఈ మాట BY పునర్కథన�... - by LUKYYRUS - 20-11-2018, 11:49 AM



Users browsing this thread: 1 Guest(s)