Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనసు పలికింది ఈ మాట BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#5
యూనివర్సిటీ మెయిన్ గేటులోకి అడుగుపెట్టాడు అరవింద్. గట్టిగా గాలి పీల్చి అంతా పరికించి చూసాడు. అక్కడ ఎప్పుడు గాలి వీస్తూ పచ్చని చెట్లు మధ్యన రోడ్ ఉంది. కార్లు, మోటార్ వెహికల్స్ ఎప్పుడు అటుఇటు వెళ్తూ ఉన్నాయి. ప్రోఫేసేర్స్ అందరు దాదాపుగా కార్లలో వస్తున్నారు. స్టూడెంట్స్ బస్ మీదుగా వస్తున్నారు. కొంతమంది బైక్ ఫై వస్తున్నారు. అరవింద్ కి ఒక చిన్న ఊరిలా అనిపించింది. అరవింద్ బయోకెమిస్ట్రీ లో పి.జి చేసాడు. పిహెచ్.డి కోసం యూనివర్సిటీలో సీట్ సంపాదించాడు. తను బయోకెమిస్ట్రీ డిపార్టుమెంటుకి వెళ్ళాలి. అక్కడే ఉన్న రూట్ మ్యాప్ ని చూసాడు. అదెప్పుడో పెయింటింగ్ వేయిన్చినదేమో సరిగా అర్ధం కాలేదు. చాలా నిశితంగా పరిశీలించిన అర్ధం చేసుకోవడం అరవింద్ వల్ల కాలేదు.  అటుగా వెళ్తున్న ఓ అమ్మాయితో "ఎక్స్ క్యూస్ మి" అని పిలిచాడు. ఆమె ఆగి అరవింద్ వైపు చూసింది.  "నేను బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలి. కొంచెం దారి చెప్తారా?"అనడిగాడు.  "నేను అటే వెళ్తున్నాను.నాతోపాటు రండి" అని ముందుకి నడిచింది...  "ఏరా ఫోన్ చేసావా? ఏమైంది?" అడిగాడు రాజీవ్.  "చేశాను, కానీ ఫెయిల్ అయింది"అన్నాడు అచ్యుత్.  "ఏం ఫెయిల్ అయింది?"  "పెళ్లి చూపులు. మన ప్లాన్ కుడా. రెండు అట్టర్ ఫ్లాప్"  "అదేంటిరా?"  "ఏం చేయమంటావ్? నాకు దరిద్రం దారుణంగా పట్టేసింది. నా మీద నాకే జాలేసేస్తోంది. ప్రపంచంలో ప్రేమించిన అమ్మాయిలకు అన్నయ్యలు ఉండచ్చు కానీ బావలు ఉండకూడదు"  "అంటే...."  "అవునుర వాడు చైతన్య బావట. ఏదో పేరుకు పెళ్లి చూపులు పెట్టారంతే. ఆ డెత్ బెడ్ ఫై ఉన్న ముసల్ది ఎప్పుడో డిసైడ్ చేసేసింది అంట, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడవు అని,, అది బ్రహ్మ ముడి కాదని ఈ ముసల్దాని ముడని డిసైడ్ చేసేసిందిర" అన్నాడు అచ్యుత్ ఇరిటేటింగ్ ఫీల్ అవుతూ.  "మరిప్పుడెలా?"  "ఎలా ఏంటి ? నా బొంద. నాకేం తెలుసు ప్రేమించడం తప్ప" అన్నాడు.  "అందుకే చెప్పాను. ప్రేమలు గీమలు వద్దని. అనవసరమైన టెన్షన్స్. ఎందుకు చెప్పు మనకివన్నీ?" అన్నాడు రాజీవ్  "బాబు... .."అంటు దండం పెడుతూ "ప్రేమ నాది. టెన్షన్ నాది. ఆపుతావా ఇంకా?" అంటు తలెత్తి చూసాడు.  కొంచెం దూరం నుండి చైతన్య రావడం గమనించాడు. అచ్యుత్ వైపు చూసి వెనక్కి తిరిగాడు రాజీవ్."వీడెవడురా చైతన్యతో పాటు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాడు" అనడిగాడు చైతన్య పక్కనే ఉన్న అరవింద్ వైపు చూస్తూ.  "చైతన్య బావేమోర" అన్నాడు రాజీవ్  పొలమారినంత పని అయింది అచ్యుత్ కి "భయపెట్టకుర" అంటు వాళ్ళ వైపు చూసాడు.  అరవింద్ వైపు చూస్తూ"బావున్నాడు కదరా" అన్నాడు రాజీవ్. ముఖం మాడ్చేసిన మూకుడులా పెట్టి, కొంచెం కోపంతో రాజీవ్ వైపు చూసి, మళ్ళి అరవింద్ వైపు చూసాడు.  "అవునురా నా కంటే బాగున్నాడు." అన్నాడు అరవింద్ వైపు చూస్తూ.  "అయినా నువ్వేం కంగారుపడకు. అందం ముఖ్యం కాదు. గుణం, మంచితనం ముఖ్యం."అన్నాడు ధైర్యం చెపుతున్నట్టుగా  "ఓ! అవునా! అలా అయితే వాడికి అందం+మంచితనం+గుణం ఉన్నాయనుకో అప్పుడు?"  "అంతే, నువ్వు సింగల్ ఇడ్లీగా మిగిలిపోతావ్"  "ఒరేయ్, వాడు ఎవరో తెలుసుకోవాలిరా" అన్నాడు అచ్యుత్ ఏడుపుకొట్టు ముఖంతో.  అరవింద్, చైతన్యలిద్దరు బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కి వెళ్లారు. దారిలో అరవింద్ తాను పిహెచ్.డి కోసం వచ్చానని చెప్పాడు. కాస్త పరిచయంతోనే అరవింద్ ని అన్నయ్య అని పిలిచింది. చైతన్య పి.జి చేస్తున్నట్టు అరవింద్ కి చెప్పింది. చైతన్య స్వతహాగా మంచి సంస్కారవంతురాలు,గుణవంతురాలు,నెమ్మదస్తురాలు అవడం చేత అబ్బాయిలను అంతగా పట్టించుకోదు. తన చదువు తన ఇల్లు తప్ప వేరే లోకం లేదు తనకి. సింపుల్ గా చెప్పాలంటే చైతన్య తెలుగింటి ఆడపడుచు.అరవింద్ వెళ్లి ప్రొఫెసర్ ని కలిసాడు. సాధారణంగా ప్రొఫెసర్స్ పి.హెచ్.డి కోసం వచ్చిన స్టూడెంట్స్ చేత నానా చాకిరి చేయించుకుంటారని నానుడి. కానీ అది చాలా వరకు తప్పు. అరవింద్ కి అలాట్ చేసిన ప్రొఫెసర్ మాత్రం మంచివాడు. మితభాషి. కానీ కొంచెం మూడిస్ట్. మూడ్ బాగుంటే మంచు ముక్క లేకపోతే నిప్పు కణిక. అరవింద్ అదృష్టం కొద్ది ఆ రోజు ఆయన మూడ్ బాగుంది.  "వారం రోజుల తర్వాత నీ కోర్స్ స్టార్ట్ చేస్తాను. నేను నేకు గైడ్ లైన్స్ మాత్రమే ఇస్తాను. మిగిలినవన్నీ నువ్వే చూసుకోవాలి" చెప్పాడాయన.  "ఓకే సార్. థాంక్ యు సార్" చెప్పి బయటకు వచ్చాడు.  రాజీవ్, అచ్యుత్ లు అరవింద్ కోసం బయట కాపు కాసారు. బయటకు వచ్చిన అరవింద్ ని చూస్తూ "ఒరేయ్ వీడు చైతన్య బావో కాదో? అసలీడెవాడో? ఇక్కడేం పనో? ఎలా అయినా తెలుసుకోవాలి" అన్నాడు అచ్యుత్.  రాజీవ్ "అలాగే" అని రెండడుగులు ముందుకు వేసి వెనక్కి తిరిగి వచ్చేసి "ఇప్పడు కాదు. తర్వాత కనుక్కుందాం" అంటు బండి స్టార్ట్ చేసాడు.  "అదేంటిరా?" అనడిగాడు అచ్యుత్.  "వెనక్కి చూడు" అన్నాడు, నవ్య నడుచుకుంటూ వస్తోంది "రాజీవ్...... "అని పిలుస్తోంది.  "ఏరా పాపం నిన్ను తను ప్రేమిస్తోంది కదరా " అన్నాడు అచ్యుత్.  "బాబు, నాకిష్టంలేదు. పెద్ద నసలా తయారైంది. నాతో మాట్లాడాలి. నాతో టైం స్పెండ్ చేయాలి అంటు. నేను వెళ్తున్నాను" బయలుదేరి వెళ్ళిపోయాడు.  రాజీవ్ వెళ్ళిపోవడం గమనించింది నవ్య. వీడి భాద వీడిది అని అనుకున్నాడు అచ్యుత్. 
* * *
[+] 5 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మనసు పలికింది ఈ మాట BY పునర్కథన�... - by LUKYYRUS - 20-11-2018, 11:48 AM



Users browsing this thread: